శ్రీహరి (నటుడు)

నటీనటులు మహానటుడు నటుడు

శ్రీహరి (ఆగష్టు 15, 1964 - అక్టోబరు 9, 2013) తెలుగు సినిమా నటుడు. ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత నాయకుడిగా పదోన్నతి పొందిన నటుడు.

శ్రీహరి

శ్రీహరి ఛాయాచిత్రం
జననం(1964-08-15)1964 ఆగస్టు 15 [1]
యలమర్రు, భారతదేశం India
ఇతర పేర్లురియల్ స్టార్
భార్య/భర్తశాంతి
ప్రముఖ పాత్రలుపోలీస్
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
మగధీర షేర్ ఖాన్
భద్రాచలం

జీవితసంగ్రహం

శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు, సాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి.[2] శ్రీహరి తాత రఘుముద్రి అప్పలస్వామికి ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామానికి వలస వచ్చారు. వీరిలో నాలుగవ కుమారుడు శ్రీహరి తండ్రి సత్యన్నారాయణ, తల్లి సత్యవతి. యలమర్రులో రోడ్డు పక్కన చిన్న పాక వేసుకొని సైకిలు షాపు, సోడాలు అమ్మి జీవనం సాగించారు. శ్రీహరికి శ్రీనివాసరావు, శ్రీధర్ అన్నదమ్ములు. 1977 లో యలమర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీహరి ఏడవ తరగతి పాసయ్యారు. తరువాత గ్రామంలోని అరెకరం భూమిని అమ్ముకొని హైదరాబాదుకు మకాం మార్చారు. ఏటా యలమర్రు గంగానమ్మ జాతరకు శ్రీహరి తప్పనిసరిగా వెళ్ళేవాడు.

యుక్తవయసు నుండే శారీరక ధారుడ్యంపై ఎంతో ఆసక్తి కలిగివుండేవాడు. ఉదయం చదువుకుంటూ, సాయంత్రం శోభన థియేటర్ ఎదురుగా ఉన్న అన్న శ్రీనివాసరావు షెడ్డులో మెకానిక్ గా పనిచేస్తూ ఖాళీ దొరికిన సమయంలో సినిమాలు శోభన థియేటర్ లో చూసేవాడు. హైదరాబాద్ లో నిర్వహించిన అనేక శారీరక ధారుడ్య పోటిల్లో పాల్లొని ‘మిస్టర్ హైదరాబాద్’గా ఏడుసార్లు అవార్డును సొంతం చేసుకున్నారు. విశ్వవిద్యాలయం తరపున రెండుసార్లు జాతీయస్థాయి పోటీలలో పాల్గొని, బహుమతులు గెలుచుకున్నారు. ఏషియన్ గేమ్స్ లో భారతదేశం తరపున ఆడాలనే కోరిక ఉన్నా అది తీరలేదు.

సినీ జీవితం

1986లో సినిమాలోకి స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీహరి...అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు. 1989లో తమిళ సినిమా మా పిళ్ళై, తెలుగు 'ధర్మక్షేత్రం' చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా వివిధ రకాలుగా రాణించారు.

పోలీస్ చిత్రంతో హీరోగా ఆయనకు మంచి పేరు లభించింది. హీరోగా చేసిన మొదటి చిత్రం 'పోలీస్' అయితే.. హీరోగా చేసిన చివరి చిత్రం 'పోలీస్ గేమ్' కావడం విశేషం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చివరి చిత్రం తుఫాన్.ఇప్పటి వరకు 28 చిత్రాల్లో హీరోగా నటించారు. రియల్ స్టార్‌గా ఖ్యాతి గడించారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు వంద చిత్రాల్లో నటించారు.

జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర స్థాయి చాంపియన్ అయిన శ్రీహరి అథ్లెట్ అవ్వాలనుకున్నారు. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనాల్సి ఉన్నా....సినిమాలపై మక్కువతో ఈ రంగంవైపు అడుగులు వేసారు. దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘బ్రహ్మనాయుడు’లో ఆయనకు తెలుగు సినిమాలో నటుడిగా అవకాశం దక్కింది. తాజ్ మహల్ చిత్రంలో పూర్తిస్థాయి విలన్ పాత్రలో కనిపించారు.

2000వ సంవత్సరంలో వచ్చిన ‘పోలీస్' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. గణపతి, ఆయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతు, విజయరామరాజు చిత్రాల్లో హీరోగా నటించారు. హీరోగా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బృందావనం, ఢీ, కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

పృధ్వీపుత్రుడు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన శ్రీహరి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీరలో షేర్ ఖాన్ పాత్రతో అందరినీ ఆకట్టుకున్న శ్రీహరి, ఇటీవల రామ్ చరణ్ హీరోగా నటించిన తుఫాన్‌,రఫ్‌ (2014) సినిమాల్లో నటించారు.

తెలంగాణ యాసకు గౌరవం

సినిమాల్లో తెలంగాణ యాసకు గొప్ప గౌరవాన్ని తీసుకువచ్చిన నటుడు శ్రీహరి. ఢీ, కింగ్, డాన్ శీను, బృందావనం, తుఫాన్ వంటి చిత్రాలలో ఆయన పలికించిన సంభాషణలు తెలంగాణ యాసలోఉన్న సౌందర్యాన్ని ఆవిష్కరించాయి. నిజజీవితంలో హైదరాబాదీ తెలంగాణయాసలో ఆయన సంభాషణ అందరినీ ఆకట్టుకునేలా సాగేది.

వ్యక్తిగత జీవితం

శ్రీహరి శాంతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె అక్షర.

నాలుగు నెలలకే కుమార్తె అకాల మరణం చెందగా, తన కూతురు అక్షర పేరుతో ఫౌండేషన్ నెలకొల్పి, మేడ్చల్ పరిధిలోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి ప్రజలకు మినరల్ వాటర్ ను అందించడంతోపాటు గ్రామంలో అనేక మౌలిక సదుపాయాల సాదనకు కృషిచేశారు.

తమ గ్రామానికి చెందిన శ్రీహరి రాష్ట్రస్థాయికి ఎదిగి గ్రామం పేరును నలుదిశలా చాటినందుకు గర్వంగా యలమర్రు గ్రామ ప్రముఖులు 1989 సంవత్సరంలో శ్రీహరిని హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు.

ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాంబో రాజ్‌కుమార్ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన శ్రీహరి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే అతన్ని లీలావతి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్టోబరు 9, 2013 న కాలేయ సంబంధ వ్యాధివలన ముంబై లో కన్నుమూసారు.

నటించిన చిత్రాలు

సం.సంవత్సరంసినిమా పేరుపాత్రపేరుతోటి నటీనటులుదర్శకులుఇతర వివరాలు
12013శ్రీ జగత్ గురు ఆదిశంకరజె.కె. భారవి
22013తుఫాన్షేర్ ఖాన్రాం చరణ్ తేజఅపూర్వ లాఖియాహిందీలో జంజీర్
32012యమహో యమయముడుసాయిరాం శంకర్వై. జితేంద్ర
42012తిక్క
52011అహ నా పెళ్ళంటఅల్లరి నరేష్, సుబ్బరాజువీరభద్రం
52010బృందావనంజూ. ఎన్టీయార్వంశీ పైడిపల్లి
62010బ్రోకర్ధర్మతేజఆర్.పి. పట్నాయక్ఆర్.పి. పట్నాయక్
72010డాన్ శీనునర్సింగ్, డాన్రవితేజగోపిచంద్ మలినేని
92010ఉల్లాసం
102010భైరవఎ సి పి భైరవసింధు తులానీపోలూరి శ్రీనివాసరెడ్డి
112010దాసన్నాదాసన్నమీనాడి.ఎస్.పి
122009మగధీరషేర్ ఖాన్, సాల్మన్రాం చరణ్ తేజఎస్.ఎస్. రాజమౌళి
132009రోమియోసాయిరాం శంకర్గోపి గణేష్
142009శ్రీశైలంశ్రీశైలం, ఆర్మీ మేజర్సజితకె.ఎస్. నాగేశ్వరరావు
152009సామ్రాజ్యంమాళవిక, సమీక్షవీరు ద్వైత్
162009వెట్టాఇక్కరన్ (తమిళం)విజయ్, అనుష్కబాబు సివన్
172008కింగ్జ్ఞానేశ్వర్, డాన్, డాక్టర్నాగార్జునశ్రీను వైట్ల
182008మేస్త్రీహరిదాసరి నారాయణరావుదాసరి నారాయణరావు
192008సరోజవెంకటప్రభు
202008పోరుహరిఅమ్మ రాజశేఖర్
212008ప్రేమాభిషేకంహరి బాయ్, డాన్వేణుమాధవ్ఎస్.ఎస్.విక్రమ్ గాంధీ
212008భద్రాద్రి
222007ఢీశంకర్ గౌడ్, డాన్మంచు విష్ణుశ్రీను వైట్ల
232007వియ్యాళ వారి కయ్యాలుఉదయ్ కిరణ్ఇ. సత్తిబాబు
242006శ్రీమహాలక్ష్మిలాయర్ లక్ష్మి క్రిష్న దేవరాయషమ్నవిజయన్
252006హనుమంతుహనుమంతుమధుశర్మచంద్రమహేష్
262005నువ్వొస్తానంటే నేనొద్దంటానాశివరామ కృష్ణసిద్ధార్థ్ప్రభుదేవా
272005మహానందిస్వామి, ఫ్యాక్షన్ లీడర్సుమంత్సముద్ర
282005ఒక్కడేఎస్.పి. యుగంధర్సంతోషిచంద్రమహేష్
292004కేడి. నెం. 1రమ్యకృష్ణరవిరాజా పినిశెట్టి
302004గురిసంఘవిభరత్
312004శేషాద్రి నాయుడునాయుడు గారునందితసురేష్ వర్మ
322003సింహాచలంసింహాచలంమీనాఇంద్రకుమార్
332003కూలీరాశి
342003భధ్రాచలంభధ్రాచలంసింధూ మీనన్ఎన్. శంకర్
352002పరశురాంపరశురాంసంఘవిమోహన్ గాంధీ
362002పృథ్వీనారాయణపృథ్వీనారాయణమేఘనపి. వాసు
372002కుబుసంశివరాం, నక్సల్ లీడర్గిరి, స్వప్నఎల్. శ్రీనాథ్
382002ప్రేమ దొంగఆకాష్
392001అప్పారావుకి ఒక నెల తప్పిందిరాజేంద్రప్రసాద్రేలంగి నరసింహారావు
402001థాంక్యూ సుబ్బారావ్సుబ్బారావ్అభిరామిఇ.వి.వి. సత్యనారాయణ
412001ఎవడ్రా రౌడీదాన్విసంఘవిపోసాని కృష్ణమురళి
422001ఒరేయ్ తమ్ముడుశ్రీనివాస్ యాదవ్సంఘవిసాయి బాలాజీ
432001మా ఆయన సుందరయ్యమల్లేష్సంగీతహరిబాబు
442001చెలియా చెలియా చిరుకోపమాకె. సాయి శ్యామ్
452000బాగున్నారావడ్డే నవీన్ఫకృద్ధీన్
462000శివాజీశివాజిరాశిసాయి బాలాజీ
472000అయోధ్య రామయ్యఅయోద్య రామయ్య, ఎస్.పి.పట్నాయక్భానుప్రియచంద్రమహేష్
482000విజయరామరాజువిజయరామ రాజుఊర్వశీవీరశంకర్
492000బలరాంబలరాంరాశిరవిరాజా పినిశెట్టి
502000గణపతిగణపతిఅశ్వనీహరిబాబు
511999పోలీస్అశ్వనీ
521999సాంబయ్యరాధికా చౌదరికె.యస్. నాగేశ్వరరావు
531999తెలంగాణసురేష్, వినోద్, ఇంద్రజభరత్ నందన్
541999తమిళ్
551999సముద్రంజగపతిబాబుకృష్ణవంశీ
5630.07.1999రాజకుమారుడుమహేష్ బాబుకె. రాఘవేంద్రరావు
5706.08.1999బొబ్బిలి వంశండాక్టర్ రాజశేఖర్కె.యస్. అదియామన్
5806.08.1999ప్రేమకు వేళాయెరాజె. డి. చక్రవర్తియస్.వి. కృష్ణారెడ్డి
591999అల్లుడుగారు వచ్చారుజగపతిబాబురవిరాజా పినిశెట్టి
6019.11.1999ప్రేయసి రావేశ్రీకాంత్మహేష్ చంద్ర
6128.09.1999శ్రీరాములయ్యమోహన్ బాబుయన్. శంకర్
621998ఓ పనై పోతుంది బాబురవితేజశివ నాగేశ్వరరావు
6330.10.1998ప్రేమంటే ఇదేరామురళీధర్, పోలీస్ ఆఫీసర్అక్కినేని నాగార్జునజయంత్ సి. పరాన్జీ
6414.01.1998ఆవిడ మా ఆవిడేఅక్కినేని నాగార్జునఇ.వి.వి. సత్యనారాయణ
651998బావగారు బాగున్నారాచిరంజీవిజయంత్ సి. పరాన్జీ
661998సూర్యుడుడాక్టర్ రాజశేఖర్ముత్యాల సుబ్బయ్య
671998వైభవం
681998శుభవార్తఅర్జున్పి.యన్. రామచంద్రారావు
6901.07.1998రాయుడుమోహన్ బాబురవిరాజా పినిశెట్టి
701998పెళ్ళాడి చూపిస్తాబ్రహ్మానందంఓం సాయి ప్రకాష్
711997ప్రేమించుకుందాం రాఅక్కినేని నాగార్జునజయంత్ సి. పరాన్జీ
7225.04.1997ముద్దుల మొగుడునందమూరి బాలకృష్ణఎ.కోదండరామిరెడ్డి
731997బొబ్బిలి దొరఘట్టమనేని కృష్ణబోయపాటి కామేశ్వరరావు
741997గోకులంలో సీతహరిపవన్ కళ్యాణ్ముత్యాల సుబ్బయ్య
751997వీడెవడండీ బాబూమోహన్ బాబుఇ.వి.వి. సత్యనారాయణ
761997జై భజరంగబలిరాజేంద్రప్రసాద్టి. ప్రభాకర్
7725.04.1996రాముడొచ్చాడుఅక్కినేని నాగార్జునఎ.కోదండరామిరెడ్డి
7816.05.1996శ్రీ కృష్ణార్జున విజయందుర్యోధననందమూరి బాలకృష్ణసింగీతం శ్రీనివాసరావు
7909.02.1996సాహసవీరుడు - సాగరకన్య[3]రత్నాలుదగ్గుబాటి వెంకటేష్కె. రాఘవేంద్రరావు
801995అల్లుడా మజాకాచిరంజీవిఇ.వి.వి. సత్యనారాయణ
811995తాజ్ మహల్శ్రీకాంత్ముప్పలనేని శివ
8207.04.1994ఘరానా అల్లుడుఘట్టమనేని కృష్ణముప్పలనేని శివ
8320.04.1994హలో బ్రదర్సింగపూర్ సింహాచలంఅక్కినేని నాగార్జునఇ.వి.వి. సత్యనారాయణ
841995స్ట్రీట్ ఫైటర్ఆలీ, బ్రహ్మానందంబి. గోపాల్
851994దొరగారికి దొంగ పెళ్లాంఘట్టమనేని కృష్ణఎస్.ఎస్. రవిచంద్ర
861993మేజర్ చంద్రకాంత్ఎన్.టి.ఆర్, మోహన్ బాబుకె. రాఘవేంద్రరావు
8717.01.1993ముఠా మేస్త్రిచిరంజీవిఎ.కోదండరామిరెడ్డి
881993అల్లరి ప్రియుడుడాక్టర్ రాజశేఖర్కె. రాఘవేంద్రరావు
891993కుంతీపుత్రుడుమోహన్ బాబుదాసరి నారాయణరావు
901993ధర్మ క్షేత్రంనందమూరి బాలకృష్ణఎ.కోదండరామిరెడ్డి
911992భారతం
921989మాపిల్లయ్ (తమిళం)రజినీకాంత్రాజశేఖర్

పురస్కారాలు

ఫిల్మ్ ఫేర్ అవార్డులు

మూలములు

4. మంచి మనసున్న రియల్ హీరో