ఆగష్టు 15

తేదీ

ఆగష్టు 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 227వ రోజు (లీపు సంవత్సరములో 228వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 138 రోజులు మిగిలినవి.


<<ఆగస్టు>>
ఆదిసోమమంగళబుధగురుశుక్రశని
123
45678910
11121314151617
18192021222324
25262728293031
2024


సంఘటనలు

  • 1519: పనామా దేశంలోని, పనామా సిటీ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం.
  • 1535: పరాగ్వే దేశపు రాజధాని నగరం, అసున్సియన్ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం.
  • 1540: పెరూ దేశంలోని, అరెక్విప నగరం స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం.
  • 1822: 1822 జనాభా లెక్కలు ప్రకారం అప్పర్ కెనడాలో 1,20,000 మంది, లోయర్ కెనడా లో,500,000 మంది ప్రజలు నివసించేవారు.
  • 1834: 1834 లో బ్రిటన్ పార్లమెంట్, చేసిన "సౌత్ ఆస్ట్రేలియా చట్టము" ప్రకారము, అక్కడ వలస (కోలనీ) ఏర్పాటు చేసుకోవటానికి అనుమతి లభించింది.
  • 1858: పసిఫిక్ సముద్రతీరప్రాంతానికి, ప్రతీ రోజూ ఉత్తరాల పంపిణీ జరగటం మొదలు అయ్యింది.
  • 1889: ఆసియా లోనే, అతి పురాతనమైన, మోహన్ బాగన్ ఎ.సి. కలకత్తాలో స్థాపించబడింది.
  • 1870: ట్రాన్స్ కాంటినెంటల్ రైల్వే మార్గము పూర్తి అయ్యింది.
  • 1889: 15 ఆగష్ట్ నుంచి 16 సెప్టెంబరు వరకు జరిగిన ది గ్రేట్ లండన్ డాక్ స్ట్రైక్ వలన, బ్రిటిష్ ట్రేడ్ యూనియనిజం, నిపుణులైన కార్మికుల నుంచి, తక్కువ నిపుణత ఉన్న కార్మికులకు పాకింది.
  • 1901: కాడిలాక్ మోటార్ కంపెనీ డెట్రాయిట్లో స్థాపించబడింది.
  • 1914: అంకన్ అనే పేరుగల సరుకుల ఓడ (రవాణా ఓడ), అట్లాంటిక్ మహాసముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం లోకి, పనామా కాలువ ద్వారా, ప్రయాణించటంతో, పనామా కాలువ ప్రారంభమైంది.
  • 1944: ఫ్రాన్స్ దక్షిణాన, మిత్ర దేశాల దళాలు దిగి, మార్సీల్స్ పట్టణాన్ని, తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.
  • 1938: ఆంధ్రప్రభ దినపత్రిక చెన్నై (నాటి మద్రాసు) లో, పారిశ్రామిక వేత్త రామనాధ్ గోయెంకా మొదలు పెట్టాడు.
  • 1945: కొరియా తనంతట తానే, ఒక గణతంత్రదేశంగా ప్రకటించుకుంది.
  • 1947: భారత దేశానికి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం లభించింది.
  • 1947: స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌గా లూయీ మౌంట్‌బాటెన్ నియామకం.
  • 1947 : పాకిస్తాన్ స్థాపకుడు ముహమ్మద్ ఆలీ జిన్నా మొదటి పాకిస్తాన్ గవర్నర్ జనరల్ గా, కరాచీలో పదవిని స్వీకరించాడు.
  • 1950: విశాఖపట్నం జిల్లా నుంచి 1950 ఆగష్టు 15 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడిన రోజు.
  • 1950: అస్సాంలో భూకంపం 8.6 రెక్టర్ స్కేల్ మీద. 1,000 మందికి పైగా మరణించారు.
  • 1960: రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (బ్రజ్జావిల్లె), ఫ్రాన్స్ నుంచి స్వతంత్రం ప్రకటించుకుంది.
  • 1960: ముగ్గురు కాలిఫోర్నియా కాపలాదారులు, ఎగిరే పళ్ళాలు (గుర్తుపట్టలేని ఫ్లైయింగ్ వస్తువులు) చూసామని చెప్పారు.
  • 1961: తూర్పు జర్మనీలో బెర్లిన్ గోడ కట్టటం మొదలైంది. జర్మనీ ప్రజలకు చీకటి రోజు
  • 1965: లాస్ ఏంజిల్స్ లోని, జాతి కలహాలు నివారించటానికి, అమెరికాకి చెందిన నేషనల్ గార్డ్ని పిలిచారు.
  • 1965: బీటిల్స్, న్యూయార్క్ లోని, షియా స్టేడియంలో పాటలు పాడారు.
  • 1969: వుడ్ స్టాక్ సంగీత ఉత్సవం మాక్స్ యాస్గర్ ఫార్మ్లో ప్రారంభించారు.
  • 1971: బహ్రెయిన్, బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.
  • 1971: అమెరికా అధ్యక్షుడు నిక్సన్, జీతాలు, ధరలు, అద్దెల మీద 90 రోజుల పాటు స్తంభింపచేసాడు.
  • 1974: దక్షిణ కొరియా స్వాతంత్ర్య దినోత్సవాలలో పాల్గొంటున్న, దక్షిణ కొరియా, అధ్యక్షుడు పార్క్ చంగ్ హీ మీద జరిగిన హత్యా ప్రయత్నంలో, దక్షిణ కొరియా, ప్రథమ మహిళ యూక్ యంగ్ సూ, మరణించింది.
  • 1975: బంగ్లాదేశ్లో సైనిక కుట్ర. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ముజిబుర్ రెహ్మాన్ ని, అతని కుటుంబసభ్యులను (హసీనా వజీద్ ని తప్ప) చంపారు.
  • 1977: ’ఓహియో రాష్ట్ర యూనివర్సిటీ' లో "సెటి" ప్రాజక్టులో భాగంగా, నెలకొల్పిన, ’ది బిగ్ ఇయర్, అనేపేరుగల రేడియో టెలిస్కోప్ కి విశ్వాంతరాళం లోతుల నుంచి ఒక రేడియో సిగ్నల్ అందింది. దానిని "వౌ సిగ్నల్" అనే పేరు పెట్టారు.
  • 1983: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా రామ్ లాల్ నియమితులయ్యాడు.
  • 2006: ఎయిడ్స్ సమావేశము : క్లింటన్, గేట్స్, అమెరికా అధ్యక్షుడి ప్రణాళికను సమర్ధించారు.
  • 2006: శీతలీకరించిన వీర్యం పై చేసిన పరిశోధన, అంతరించి పోయిన పాలిచ్చే జంతువులు (మమ్మాల్స్) తిరిగి పునఃసృష్టి చేయగలమనే ఆశలు కలిగిస్తున్నది
  • 2007: పసిఫిక్ మహాసముద్రం తీరంలోని ఇకా, పెరూ దేశంలోని పలుప్రాంతాలలో, భూకంపం, 8.0- (మేగ్నిట్యూడ్) రెక్టర్ స్కేల్ మీద వచ్చి, 514 మంది మరణించగా, 1,090 మంది గాయపడ్డారు. 

జననాలు

Jacques-Louis David 017

మరణాలు

పండుగలు , జాతీయ దినాలు

బయటి లింకులు


ఆగష్టు 14 - ఆగష్టు 16 - జూలై 15 - సెప్టెంబర్ 15 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి12345678910111213141516171819202122232425262728293031
ఫిబ్రవరి1234567891011121314151617181920212223242526272829
మార్చి12345678910111213141516171819202122232425262728293031
ఏప్రిల్123456789101112131415161718192021222324252627282930
మే12345678910111213141516171819202122232425262728293031
జూన్123456789101112131415161718192021222324252627282930
జూలై12345678910111213141516171819202122232425262728293031
ఆగష్టు12345678910111213141516171819202122232425262728293031
సెప్టెంబర్123456789101112131415161718192021222324252627282930
అక్టోబర్12345678910111213141516171819202122232425262728293031
నవంబర్123456789101112131415161718192021222324252627282930
డిసెంబర్12345678910111213141516171819202122232425262728293031