సన్ డూంగ్ కేవ్

సన్ డూంగ్ కేవ్ ([[వియత్నాం లోని హేంగ్ సన్ డూంగ్, "మౌంటెన్ రివర్ కేవ్" )[1] ప్రపంచంలోనే అతి పొడవైన గుహ. దీనిలో నదులు , కొండలు, చెట్లు జీవరాశులు వంటివి ఉంటాయి.[1][2][3] ఇది వియత్నాం సరిహద్దులో లావోస్ ప్రాంతంలో గలదు. దీనిలో పెద్దదైన భూగర్భ నది కలిగి ఉన్నది.ఇది సున్నపురాతితో తయారైనది.[4]

Sơn Đoòng Cave
Hang Sơn Đòng (Mountain River Cave)
Sơn Đoòng Nha Cave
Map showing the location of Sơn Đoòng Cave
Map showing the location of Sơn Đoòng Cave
ప్రదేశంQuảng Bình Province, Vietnam
లోతుMax 150m / 490ft
పొడవుApprox 9,000m / 30,000ft
పరిశోధన1991 [AD] by Hồ-Khanh
రాళ్ళ స్వభావంLimestone
ప్రవేశాలుApprox 2
సంక్లిష్టత6 (Advanced)
ప్రమాదాలుUnderground river
గుహ సర్వే2009 British/Vietnamese

ఆవిష్కరణ

సన్ డూగ్ కేవ్ 1991 లో స్థానిక వ్యక్తి అయిన "హో ఖాన్న్" చే కనుగొనబడినది. గాలి యొక్క భయంకర శబ్దాలు, నదీ ప్రవాహాల గర్జనల తో కూడుకున్నదైనందున ఈ గుహ లోనికి వెళ్ళుటకు స్థానికులు వెనుకడుగు వేసేవారు. 2009 లో బ్రిటిష్ కేవ్ రీసెర్చ్ అసోసియేషన్ నుండి వచ్చిన శాస్త్రవేత్తల బృందం సందర్శనతో ఈ గుహ అంతర్జాతీయ ఖ్యాతినార్జించింది. ఈ సంస్థకు "హోవర్డ్, డెబ్ లింబెర్ట్" లు నాయకత్వం వహించారు. 2009 ఏప్రిల్ 10 నుండి 14 ల మధ్య ఫోంగ్ న్హా-కె బేంగ్ లో ఒక సర్వే నిర్వహించారు.[1] వారు 60 metres (200 ft) ఎత్తు గల కాల్సైట్ గోడను చూసారు.[1] ఈ గోడను "గ్రేట్ వాల్ ఆఫ్ వియాత్నాం" గా పిలుస్తారు.

వీరు చేసిన సర్వేలో ఇది 5 కిలోమీటర్ల పొడవు, 650 అడుగుల ఎత్తు, 490 అడుగుల వెడల్పు ఉందని తేలింది. ఇప్పటివరకు పొడవైన గుహగా పేరున్న మలేషియా లోని "డీర్ కేప్" ను ప్రక్కకు నెట్టి ప్రపంచ ప్రసిద్ధి గాంచింది.

వర్ణన

ఈ గుహ వియత్నాంలో గల అతిపెద్ద గుహగా గుర్తింపబడిన "ఫోంగ్ న్హా గుహ" కన్న ఐదు రెట్లు పెద్దదిగా గుర్తించారు. ఈ గుహలో అతి పెద్ద ఛాంబర్ 5 కి.మీ పొడవు,200 మీ. ఎత్తు 150 మీటర్ల వెడల్పు కలిగి యుంటుంది. ఈ కొలతలతో ఇది మలేసియాలో గల అతి పెద్ద గుహగా గుర్తింపబడిన డీర్ కేవ్ను అధిగమించి ప్రపంచంలో అతి పెద్ద గుహగా నిలిచింది.[5][6] ఈ గుహ 2009 నుండి దేశ దేశాల వారు అధ్యయనం చేస్తూనే ఉన్నారు.ఇంకా మొత్తం ఎంత పొడవుందో కచ్చితంగా తెలియరాలేదు. దీంట్లోకి దిగడం మామూలు విషయం కాదు. సూర్యకాంతి ముందు భాగంలోనే పడుతుంది. తర్వాతంతా చిమ్మ చీకటి. లోపల పెద్ద పెద్ద కొండలు 40 అడుగుల ఎత్తుండేవి ఉంటాయి.అడుగు భాగం మొత్తం ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. అందులోజలచరాలుంటాయి. ప్రాణాలకు తెగించే సాహసికులు తాళ్ళు, టార్చెలైట్లతో లోపలికి వెళ్తారు. ఈ గుహలో 70 అడుగుల ఎత్తైన స్టాల్గమైట్ లతో కూడిన గోడ ఉంది.[7]

పర్యాటక కార్యక్రమాలు

2013 మొదట్లో మొదటిసారి పర్యాటకుల బృందం అధ్యయనం కోసం ప్రతి ఒక్కరు US$3,000 ఖర్చుతో వెళ్లారు.[8][9] తర్వాత పర్యాటక అధ్యయనాల కోసం పథకాలు రచించబడినవి.[10]

ఇవి కూడా చూడండి

  • List of caves

మూలాలు

ఇతర లింకులు