సోడియం హైడ్రాక్సైడ్

సోడియం హైడ్రాక్సైడ్, సాధారణంగా క్షారజలం (lye), కాస్టిక్ సోడాగా మనకు సుపరిచితం [1][2] ఇది అకర్బన సమ్మేళనం. దీని ఫార్ములా NaOH. ఇది ఘన రూపంలో ఉన్న అయానిక్ సమ్మేళనం. దీనిలో సోడియం Na+
కాటయాన్లు, హైడ్రాక్సైడ్ OH
ఆనయాన్లు ఉంటాయి. సోడియం హైడ్రాక్సైడ్ అత్యంత దాహక క్షారం, క్షార ద్రావణం. ఇది సాధారణ పరిసర ఉష్ణోగ్రతలలో ప్రోటీన్లను కుళ్ళిపోయేటట్లు చేస్తుంది. ఇది తీవ్రమైన రసాయన కాలిన గాయాలకు కారణం కావచ్చు. ఇది నీటిలో కరుగుతుంది. గాలిలో ఉన్న నీటి ఆవిరి, కార్బన్‌ డై ఆక్సైడ్ లను శోషించుకుంటుంది. ఇది హైడ్రేట్ NaOH·nH
2
O
శ్రేణిని ఏర్పరచగలదు[3]. 12.3 నుండి 61.8 °C వరకు ఉష్ణోగ్రత వద్ద నీటితో స్పటికీకరణం చెంది NaOH·H
2
O
అనే మోనో హైడ్రైడ్ ఏర్పరుస్తుంది. వాణిజ్య పరంగా లభ్యమవుతున్న "సోడియం హైడ్రాక్సైడ్" సాధారణంగా మోనో హైడ్రేట్. ప్రచురించిన సమాచారం ప్రకారం దీనికి బదులుగా అన్‌హైడ్రస్ సమ్మేళనము (నీటి అణువులను తొలగించిన సమ్మేళనం) NaOH ను ఉపయోగిస్తున్నారు. సరళమైన హైడ్రాక్సైడ్లలో ఒకటిగా, రసాయన శాస్త్రం అభ్యసించే విద్యార్థులకు పిహెచ్ స్కేల్‌ను ప్రదర్శించడానికి తటస్థ నీరు, ఆమ్ల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో పాటు దీనిని తరచుగా ఉపయోగిస్తారు[4].

సోడియం హైడ్రాక్సైడ్
Sample of sodium hydroxide monohydrate as pellets in a watchglass
Unit cell, spacefill model of sodium hydroxide
పేర్లు
IUPAC నామము
Sodium hydroxide
Systematic IUPAC name
Sodium oxidanide
ఇతర పేర్లు
Caustic soda
Lye
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య[1310-73-2]
పబ్ కెమ్14798
యూరోపియన్ కమిషన్ సంఖ్య215-185-5
కెగ్C12569
వైద్య విషయ శీర్షికSodium+hydroxide
సి.హెచ్.ఇ.బి.ఐCHEBI:32145
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య WB4900000
SMILES[OH-].[Na+]
జి.మెలిన్ సూచిక68430
ధర్మములు
NaOH
మోలార్ ద్రవ్యరాశి39.997 g/mol
స్వరూపంWhite opaque crystals
సాంద్రత2.13 g cm−3
ద్రవీభవన స్థానం 318 °C (604 °F; 591 K)
బాష్పీభవన స్థానం 1,388 °C (2,530 °F; 1,661 K)
నీటిలో ద్రావణీయత
1110 g/L (at 20 °C)
ద్రావణీయత in methanol238 g/L
ద్రావణీయత in ethanol<<139 g/L
బాష్ప పీడనం<18 mmHg (at 20 °C)
ఆమ్లత్వం (pKa)13
వక్రీభవన గుణకం (nD)1.412
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ{{{value}}}
R-పదబంధాలుR35
S-పదబంధాలు(S1/2), S26, మూస:S37/39, S45
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు{{{value}}}
ఇతర కాటయాన్లు
Caesium hydroxide

Lithium hydroxide
Potassium hydroxide
Rubidium hydroxide

Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

సోడియం హైడ్రాక్సైడ్ అనేక పరిశ్రమలలో ఉపయోగించబడుతుంది. దీనిని కర్ర గుజ్జు, కాగితం, వస్త్రాలు, తాగునీరు, సబ్బులు, డిటర్జెంట్ల తయారీలో, డ్రెయిన్ క్లీనర్‌గా ఉపయోగిస్తారు. 2004 లో ప్రపంచవ్యాప్త ఉత్పత్తి సుమారు 60 మిలియన్ టన్నులు కాగా, డిమాండ్ 51 మిలియన్ టన్నులు[5].

ధర్మములు

భౌతిక ధర్మాలు

స్వచ్ఛమైన సోడియం హైడ్రాక్సైడ్ రంగులేని స్ఫటిక ఘనపదార్థం. ఇది 318 °C (604 °F) వద్ద వియోగం చెందకుండా ద్రవీభవనం చెందుతుంది. దాని మరుగుస్థానం 1,388 °C (2,530 °F). ఇది ఎక్కువగా నీటిలో కరుగుతుంది. ఇథనాల్, మిథనాల్ వంటి ధ్రువ ద్రావణులలో తక్కువగా ద్రావణీయత కలిగి ఉంటుంది[6]. NaOH ఈథర్, ఇతర అధ్రువ ద్రావణులలో కరుగదు. సల్ఫ్యూరిక్ ఆమ్లం ఆర్ద్రీకరణ మాదిరిగానే, నీటిలో ఘన సోడియం హైడ్రాక్సైడ్ కరిగిపోవడం అనేది అధిక ఉష్ణమోచక చర్య[7]. ఇక్కడ పెద్ద మొత్తంలోఉష్ణం విడుదల అవుతుంది. స్ప్లాషింగ్ అవకాశం ద్వారా భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. చెదిరిపోయే అవకాశం ఉన్నందున భద్రతకు ముప్పు కలిగిస్తుంది. ఫలిత ద్రావణం సాధారణంగా రంగులేనిది, వాసన లేనిది. ఇతర క్షార ద్రావణాల మాదిరిగానే, NaOH, సహజ చర్మ నూనెల మధ్య సంభవించే సాపోనిఫికేషన్ ప్రక్రియ కారణంగా ఇది చర్మంతో జారేలా అనిపిస్తుంది.

స్నిగ్థత

ప్రవాహి ద్రావణంగా సోడియం హైడ్రాక్సైడ్ NaOH గది ఉష్ణోగ్రత వద్ద 78 mPa స్నిగ్థతనుప్రదర్శిస్తుంది. ఇది నీటి స్నిగ్థత (1.0 mPa·s) కంటే చాలా ఎక్కువ, ఆలివ్ నూన స్నిగ్థత (85 mPa·s) కు ఇంచుమించు సమానంగా ఉంటుంది. NaOH స్నిగ్ధత, ఏదైనా రసాయనంతో పోలిస్తే, దాని ఉష్ణోగ్రతకి విలోమ సంబంధం కలిగి ఉంటుంది; అనగా ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ స్నిగ్ధత తగ్గుతుంది. సోడియం హైడ్రాక్సైడ్ స్నిగ్ధత దాని అనువర్తనంలో, దాని నిల్వలో ప్రత్యక్ష పాత్ర పోషిస్తుంది[6].

హైడ్రేట్లు

సోడియం హైడ్రాక్సైడ్ అనేక హైడ్రేట్లను NaOH·nH
2
O
ఏర్పరుస్తుంది. దీని సంక్లిష్ట ద్రావణీయ రేఖాచిత్రం 1893 లో ఎస్.యు.పికరింగ్ చేత వివరంగా వివరించబడింది[8]. తెలిసిన హైడ్రేట్లు, వాటి సంతృప్త జల ద్రావణాల ఉష్ణోగ్రత, గాఢత (NaOH యొక్క ద్రవ్యరాశి శాతం) ల సుమారు విలువలు[3]:

  • హెప్టాహైడ్రేట్, NaOH·7H
    2
    O
    : −28 °C (18.8%) నుండి −24 °C (22.2%) వరకు.[8]
  • పెంటాహైడ్రేట్, NaOH·5H
    2
    O
    : −24 °C (22.2%) నుండి −17.7 (24.8%) వరకు.[8]
  • టెట్రాహైడ్రేట్, NaOH·4H
    2
    O
    , α రకం: −17.7 (24.8%) నుండి +5.4 °C (32.5%) వరకు.[8][9]
  • టెట్రాహైడ్రేట్, NaOH·4H
    2
    O
    , β రకం: తక్కువ స్థిరం.[8][9]
  • ట్రైహెమిహైడ్రేట్, NaOH·3.5H
    2
    O
    : +5.4 °C (32.5%) నుండి +15.38 °C (38.8%) వరకు, తరువాత +5.0 °C (45.7%).[3][8]
  • ట్రైహైడ్రేట్, NaOH·3H
    2
    O
    : తక్కువ స్థిరం.[8]
  • డై హైడ్రేట్, NaOH·2H
    2
    O
    : +5.0 °C (45.7%) నుండి +12.3 °C (51%) వరకు.[3][8]
  • మోనో హైడ్రేట్, NaOH·H
    2
    O
    : +12.3 °C (51%) నుండి 65.10 °C (69%) వరకు, తరువాత 62.63 °C (73.1%) వరకు.[8][10]

స్ఫటిక నిర్మాణం

సోడియం హైడ్రాక్సైడ్, దాని మోనోహైడ్రేట్ వరుసగా Cmcm (oS8), Pbca (oP24) అనే ఖాళీ సమూహాలతో ఆర్థోరాంబిక్ స్ఫటికాలను ఏర్పరుస్తాయి. మోనోహైడ్రేట్ అణు కొలతలు a = 1.1825, b = 0.6213, c = 0.6069 nmగా ఉంటాయి.

అణువులను హైడ్రార్గిలైట్ లాంటి పొర నిర్మాణం / O Na O O Na O / ...లో అమర్చారు. ప్రతి సోడియం పరమాణువు చుట్టూ ఆరు ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. అందులో మూడు హైడ్రాక్సిల్ అయాన్ల HO
నుండి, మూడు నీటి అణువుల నుండి బంధించబడి ఉంటాయి. హైడ్రాక్సిల్స్ లో హైడ్రోజన్ ప్రతి O పొరలో ఆక్సిజన్ పరమాణువులతో బలమైన బంధాలను ఏర్పరుస్తాయి[11].

రసాయన ధర్మాలు

ఆమ్లాలతో చర్య

సోడియం హైడ్రాక్సైడ్ ప్రోటిక్ ఆమ్లాలతో చర్యజరిపునపుడు నీరు, దానిని సంబంధమైన లవణాన్ని ఏర్పరుస్తుంది. ఉదాహరణకు సోడియం హైడ్రాక్సైడ్ హైడ్రోక్లోరికామ్లంతో చర్య జరిపినపుడు సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది.

సాధారణంగా ఈ తటస్థీకరణ చర్యలను సాధారణంగా ఫలిత అయానిక్ సమీకరణంతో సూచిస్తారు:

ఈ రకమైన చర్య గాఢ ఆమ్లంతో జరిగితే ఉష్ణం వెలువడుతుంది. కనుక ఇది ఉష్ణమోచక చర్య. అటువంటి ఆమ్ల-క్షార చర్యలు ద్రవయోగ విశ్లేషణం (టైట్రేషన్) లో ఉపయోగిస్తారు.

ఆమ్ల ఆక్సైడ్లతో చర్య

సోడియం హైడ్రాక్సైడ్ సల్ఫర్ డై ఆక్సైడ్ వంటి ఆమ్ల ఆక్సైడ్లతో కూడా చర్య జరుపుతుంది. బొగ్గును మండించడంలో ఉత్పత్తి అయ్యే "తక్కువ" హానికరమైన ఆమ్ల వాయువులను (SO2, H2S వంటివి) చేయడానికి ఇటువంటి చర్యలు తరచుగా ఉపయోగించబడతాయి. తద్వారా అవి వాతావరణంలోకి విడుదలవుతాయి. ఉదాహరణకు:

లోహాలు, ఆక్సైడ్లతో చర్య

గాజు పరిసర ఉష్ణోగ్రతలలో సజల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాలతో నెమ్మదిగా చర్యజరిపి ద్రావణీయ సిలికేట్లను ఏర్పరుస్తుంది. ఈ కారణంగా, గాజు సంధానాలు, స్టాప్‌కాక్ లు సోడియం హైడ్రాక్సైడ్‌కు కలిస్తే "ఘనీభవన" ధోరణిని కలిగి ఉంటుంది. వేడి సోడియం హైడ్రాక్సైడ్‌తో ఎక్కువసేపు గురికావడం వల్ల ఫ్లాస్క్‌లు, గాజుతో చేయబడిన రసాయన రియాక్టర్లు దెబ్బతింటాయి, ఇది గాజును కూడా మంచుగా చేస్తుంది. గది ఉష్ణోగ్రత వద్ద సోడియం హైడ్రాక్సైడ్ ఇనుముపై చర్య జరపదు.ఎందుకంటే ఇనుముకి ద్విశ్వభావయుత లక్షణాలు లేవు (అనగా, ఇది ఆమ్లంలో మాత్రమే కరుగుతుంది, క్షారంతో కాదు). అయినప్పటికీ, అధిక ఉష్ణోగ్రతల వద్ద (ఉదా. 5500 °C కంటే ఎక్కువ), ఇనుము సోడియం హైడ్రాక్సైడ్‌తో ఉష్ణగ్రాహక చర్యగా చర్య జరిపి ఐరన్ (III) ఆక్సైడ్, సోడియం లోహం, హైడ్రోజన్ వాయువును ఏర్పరుస్తుంది[12]. సోడియం హైడ్రాక్సైడ్ (-500kJ / mol) తో పోలిస్తే ఇనుము (III) ఆక్సైడ్ (−824.2kJ / mol) ఏర్పడటానికి తక్కువ ఎంథాల్పీ కారణమవుతుంది. అందువల్ల చర్య ఉష్ణగతికశాస్త్రపరంగా అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ దాని ఉష్ణమోచక స్వభావం యాదృచ్ఛికతను సూచిస్తుంది. గలన సోడియం హైడ్రాక్సైడ్, ఇనుప రజము మధ్య జరిగిన రసాయన చర్య ఈ క్రింది విధంగా ఉంటుంది.

కొన్ని పరివర్తన లోహాలు సోడియం హైడ్రాక్సైడ్‌తో తీవ్రంగా చర్యజరపవచ్చు.

1986 లో, UK లోని అల్యూమినియం రోడ్ ట్యాంకర్‌ను 25% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని పొరబాటున రవాణా చేయడానికి ఉపయోగించబడింది.[13] దీని ఫలితంగా ట్యాంకర్‌కు తీవ్ర ఒత్తిడి కలిగి నష్టం వాటిల్లింది.

ఈ ఒత్తిడి సోడియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం ల మధ్య జరిగిన రసాయన చర్యవలన వెలువడిన హైడ్రోజన్ వాయువు వల్ల ఏర్పడుతుంది.

అవక్షేపం

కరిగే సోడియం హైడ్రాక్సైడ్ వలె కాకుండా అనేక పరివర్తన మూలకాల హైడ్రాక్సైడ్లు కరుగవు. అందువలన అందువల్ల పరివర్తన లోహ హైడ్రాక్సైడ్లను అవక్షేపించడానికి సోడియం హైడ్రాక్సైడ్ను ఉపయోగించవచ్చు.ఈ క్రింది రంగులను గమనించవచ్చు: నీలి-కాపర్, ఆకుపచ్చ-ఇనుము (II), పసుపు/గోధుమ-iron (III). జింకు, లెడ్ లవణాలు అధిక సోడియం హైడ్రాక్సైడ్ లో కరిగి స్వచ్ఛమైన ద్రావణం Na2ZnO2 లేదా Na2PbO2 లను ఏర్పరుస్తాయి.

నీటి చికిత్సలో పదార్థాలను ఫిల్టర్ చేయడానికి అల్యూమినియం హైడ్రాక్సైడ్‌ను జెలటినస్ ఫ్లోక్యులెంట్‌గా ఉపయోగిస్తారు. సోడియం హైడ్రాక్సైడ్ లేదా బైకార్బోనేట్‌తో చర్య ద్వారా అల్యూమినియం సల్ఫేట్ నుండి అల్యూమినియం హైడ్రాక్సైడ్‌ను ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో తయారు చేస్తారు.

సఫోనిఫికేషన్

ఎస్టర్స్ (సాపోనిఫికేషన్ మాదిరిగా), అమైడ్స్, ఆల్కైల్ హాలైడ్ల బేస్-డ్రైవ్ జలవిశ్లేషణకు సోడియం హైడ్రాక్సైడ్‌ను ఉపయోగించవచ్చు[6]. అయినప్పటికీ, సేంద్రీయ ద్రావణులలో సోడియం హైడ్రాక్సైడ్ పరిమిత ద్రావణీయత కలిగి ఉంటుంది. అనగా మరింత కరిగే పొటాషియం హైడ్రాక్సైడ్ (KOH) ను ఎక్కువగా వాడటానికి ఇష్టపడతారు. సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని చేతులతో తాకడం, సిఫారసు చేయకపోయినా, జారే అనుభూతిని కలిగిస్తుంది. సెబమ్ వంటి చర్మంపై నూనెలు సబ్బుగా మార్చడం వల్ల ఇది జరుగుతుంది. ప్రొపైలిన్ గ్లైకాల్‌లో కరిగే సామర్థ్యం ఉన్నప్పటికీ, సోడియం హైడ్రాక్సైడ్, కొవ్వు మధ్య చర్యకు ముందు కొవ్వుతో ప్రొపైలిన్ గ్లైకాల్ ప్రాథమిక చర్య కారణంగా సపోనిఫికేషన్‌లో నీటిని భర్తీ చేసే అవకాశం లేదు.

ఉత్పత్తి

సోడియం హైడ్రాక్సైడ్ ను పారిశ్రామికంగా 50% ద్రావణంగా విద్యుద్విశ్లేష్య "క్లోరో ఆల్కలీ ప్రక్రియ" ద్వరా తయారు చేస్తారు.[14]. ఈ ప్రక్రియలో క్లోరిన్ వాయువు వెలువడుతుంది[14]. నీరు ఆవిరిగా మారడం ద్వారా ఈ ద్రావనం నుండి ఘన సోడియం హైడ్రాక్సైడ్ ను పొందుతారు. ఘన సోడియం హైడ్రాక్సైడ్ సాధారణంగా పెచ్చులు (ప్లాక్స్), ప్రిల్స్, మూస దిమ్మలుగా అమ్మబడుతుంది[5].

2004 లో, 60 మిలియన్ టన్నుల సోడియం హైడ్రాక్సైడ్ ప్రపంచ ఉత్పత్తిగా అంచనా వేయబడింది. డిమాండ్ 51 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడింది[5]. 1998 లో, మొత్తం ప్రపంచ ఉత్పత్తి 45 మిలియన్ టన్నులు. ఉత్తర అమెరికా, ఆసియా ఒక్కొక్కటి 14 మిలియన్ టన్నులు, ఐరోపా 10 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసింది. యునైటెడ్ స్టేట్స్‌లో, సోడియం హైడ్రాక్సైడ్ ప్రధాన ఉత్పత్తిదారు డౌ కెమికల్ కంపెనీ, ఇది ఫ్రీపోర్ట్, టెక్సాస్, లూసియానాలోని ప్లాక్వెమైన్ స్థలం నుండి వార్షిక ఉత్పత్తి 3.7 మిలియన్ టన్నులు. ఇతర ప్రధాన US ఉత్పత్తిదారులు:ఆక్సిచెమ్, వెస్ట్‌లేక్, ఒలిన్, షింటెక్, ఫార్మోసా. ఈ కంపెనీలన్నీ క్లోరో ఆల్కలీ ప్రక్రియను ఉపయోగిస్తాయి[15].

చారిత్రాత్మకంగా, మెటాథెసిస్ చర్యలో కాల్షియం హైడ్రాక్సైడ్‌తో సోడియం కార్బోనేట్‌ చర్య జరపడం వలన సోడియం హైడ్రాక్సైడ్ ఉత్పత్తి చేయబడింది. ఈ ప్రక్రియను కాస్టిసైజింగ్ అంటారు[16].

ఈ ప్రక్రియను 19 వ శతాబ్దం చివరలో సోల్వే ప్రక్రియను అధిగమించింది, ఇది ఈ రోజు మనం ఉపయోగించే క్లోరో ఆల్కలి ప్రక్రియ ద్వారా భర్తీ చేయబడింది.

స్వచ్ఛమైన సోడియం లోహాన్ని నీటితో కలపడం ద్వారా సోడియం హైడ్రాక్సైడ్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఉప ఉత్పత్తులు హైడ్రోజన్ వాయువు, ఉష్ణం. ఈ ప్రయోగాన్ని తరచుగా క్షారలోహాలు సాధారణ పరిస్థితులలో జరిపే చర్యలను విద్యార్థులకు వివరించడానికి ఉపయోగిస్తారు. ఏది ఏమయినప్పటికీ, ఇది వాణిజ్యపరంగా లాభదాయకం కాదు. సోడియం లోహం వేరుచేయడం సాధారణంగా క్షయకరణం, సోడియం హైడ్రాక్సైడ్‌ఫో సహా సోడియం సమ్మేళనాల విద్యుద్విశ్లేషణ ద్వారా జరుగుతుంది.

ఉపయోగాలు

సోడియం హైడ్రాక్సైడ్ పరిశ్రమలో ఉపయోగించే ఒక బలమైన క్షారం. ఉత్పత్తి చేయబడిన సోడియం హైడ్రాక్సైడ్‌లో, 56% పరిశ్రమలకు, 25% కాగితం పరిశ్రమలో ఉపయోగపడుతుంది. సోడియం లవణాలు, డిటర్జెంట్లు, పిహెచ్ నియంత్రణ, సేంద్రీయ సంశ్లేషణ తయారీలో కూడా సోడియం హైడ్రాక్సైడ్ ఉపయోగించబడుతుంది. ఇది అల్యూమినియం ఉత్పత్తి కోసం చేసే బేయర్ ప్రక్రియలో ఉపయోగించబడుతుంది[5]. పెద్దమొత్తంలో, ఇది చాలా తరచుగా జల ద్రావణంగా[17] ఉపయోగిస్తారు. ఎందుకంటే ద్రావణాలు చౌకగా ఉండి ఉపయోగించడానికి సులువుగా ఉంటాయి. మిశ్రమం క్షారత్వాన్ని పెంచడం లేదా ఆమ్లాలను తటస్థం చేయడం వంటి అనేక సందర్భాల్లో సోడియం హైడ్రాక్సైడ్ ఉపయోగించబడుతుంది.

ఉదాహరణకు, పెట్రోలియం పరిశ్రమలో, బెంటోనైట్ బురద వ్యవస్థలలో క్షారత్వాన్ని పెంచడానికి, బురద స్నిగ్ధతను పెంచడానికి, ఏదైనా ఆమ్ల వాయువును (హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డయాక్సైడ్ వంటివి) తటస్థం చేయడానికి "డ్రిల్లింగ్ మడ్" ప్రక్రియలో సోడియం హైడ్రాక్సైడ్‌ను ఒక సంకలితంగా ఉపయోగించబడుతుంది.

సాల్ట్ స్ప్రే పరీక్షలో pH ని నియంత్రించడానికి సోడియం హైడ్రాక్సైడ్ ఉపయోగపడుతుంది. పిహెచ్‌ను సమతుల్యం చేయడానికి సోడియం హైడ్రాక్సైడ్‌ను హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో ఉపయోగిస్తారు. ఫలితంగా ఏర్పడే సోడియం క్లోరైడ్, క్షయీకృత కారకంగా సాల్ట్ స్ప్రే పరీక్షలో పి.హెచ్ ను తటస్థీకరించడానికి ఉపయోగపడుతుంది.

కాస్టిక్ వాషింగ్ అని పిలువబడే ఒక ప్రక్రియలో సల్ఫర్ మలినాలను తొలగించడానికి సోడియం హైడ్రాక్సైడ్‌తో తక్కువ నాణ్యత గల ముడి చమురును శుద్ధి చేయుదురు. పైన చెప్పినట్లుగా, సోడియం హైడ్రాక్సైడ్ హైడ్రోజన్ సల్ఫైడ్, మెర్కాప్టాన్స్ వంటి బలహీనమైన ఆమ్లాలతో చర్య జరిపి అస్థిరత లేని సోడియం లవణాలను ఇస్తుంది, వీటిని తొలగించవచ్చు. ఏర్పడిన వ్యర్థాలు విషపూరితమైనవి. వాటిని ఉపయోగించడం కష్టం. ఈ ప్రక్రియను చాలా దేశాలలో నిషేధించారు. 2006 లో, ట్రాఫిగురా ఈ ప్రక్రియను ఉపయోగించాడు. తరువాత ఆఫ్రికాలో వ్యర్థాలను పోశారు[18][19].

రసాయన గుజ్జు

కాగితం లేదా పునరుత్పత్తి చేసిన దారాల తయారీకి కలప గుజ్జును తయారు చేయడంలో సోడియం హైడ్రాక్సైడ్ విస్తృతంగా ఉపయోగించబడుతుంది. సోడియం సల్ఫైడ్‌తో పాటు, క్రాఫ్ట్ ప్రక్రియలో సెల్యులోజ్ ఫైబర్స్ నుండి లిగ్నిన్‌ను వేరు చేయడానికి ఉపయోగించే తెల్లని మద్యం ద్రావణంలో సోడియం హైడ్రాక్సైడ్ ఒక ముఖ్య భాగం. గుజ్జు ప్రక్రియ ఫలితంగా గోధుమ గుజ్జును బ్లీచింగ్ చేసే తరువాతి దశలలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ దశలలో ఆక్సిజన్ డీలినిఫికేషన్, ఆక్సీకరణ నిష్కర్షణ, సాధారణ నిష్కర్షణ ఉన్నాయి, ఇవన్నీ దశల చివరిలో pH> 10.5 తో బలమైన క్షారయుత వాతావరణం అవసరం.

కణజాల జీర్ణక్రియ

ఇదే పద్ధతిలో, కణజాలాలను జీర్ణం చేయడానికి సోడియం హైడ్రాక్సైడ్ ఉపయోగించబడుతుంది, ఒక సమయంలో ఈ ప్రక్రియ వ్యవసాయ జంతువులతో ఉపయోగించబడుతుంది. ఈ ప్రక్రియలో మృతదేహాన్ని మూసివేసిన గదిలో ఉంచడం, తరువాత సోడియం హైడ్రాక్సైడ్, నీటి మిశ్రమాన్ని జోడించడం (ఇది మాంసాన్ని చెక్కుచెదరకుండా ఉంచే రసాయన బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది) జరుగుతుంది. ఇది చివరికి శరీరాన్ని కాఫీ లాంటి రూపంతో[20][21] ద్రవంగా మారుస్తుంది. మిగిలి ఉన్న ఏకైక ఘనము ఎముక పొట్టు. ఇది ఒకరి చేతివేళ్ల మధ్య చూర్ణం చేయవచ్చు[22]. జంతువులను తొలగించడానికి ఉన్న కాంట్రాక్టర్లు పల్లపు ప్రదేశాలలో వేయబడిన రోడ్డు ప్రమాదంలో మరణించిన జంతువులు కుళ్ళిపోయే ప్రక్రియలో సోడియం హైడ్రాక్సైడ్ తరచుగా ఉపయోగించబడుతుంది[21]. దాని లభ్యత, తక్కువ ఖర్చు కారణంగా ఇది నేరస్థుల శవాలను పారవేసేందుకు ఉపయోగించబడుతుంది. ఇటాలియన్ నరహంతకుడు లిఒనార్డా సియాన్‌సియుల్లి దీనిని మృతదేహాలను సబ్బులుగా మార్చడానికి ఉపయోగించాడు[23]. మెక్సికోలో, మాదకద్రవ్యాల కోసం పనిచేసిన ఒక వ్యక్తి సోడియం హైడ్రాక్సైడ్‌తో 300 మృతదేహాలను కుళ్లబెట్టినట్లు ఒప్పుకున్నాడు[24]. సోడియం హైడ్రాక్సైడ్ ప్రోటీన్‌ను హైడ్రోలైజ్ చేయగల సామర్థ్యం కారణంగా ప్రమాదకరమైన రసాయనం. ఒక విలీన ద్రావణం చర్మంపై పడితే, ఆ ప్రాంతాన్ని ప్రవహిస్తున్న నీటితో చాలా నిమిషాలు బాగా కడగకపోతే కాలిన గాయాలు సంభవించవచ్చు. దీని తుంపర్లు కళ్ళుమీద పడితే అంధత్వానికి దారితీస్తుంది[25].

ద్విస్వభావయుత లోహాలు, సమ్మేళనాలను కరిగించడం

బలమైన క్షారాలు అల్యూమినియంపై దాడి చేస్తాయి. సోడియం హైడ్రాక్సైడ్ అల్యూమినియం, నీటితో చర్య జరిపి హైడ్రోజన్ వాయువు విడుదల అవుతుంది. అల్యూమినియం సోడియం హైడ్రాక్సైడ్ నుండి ఆక్సిజన్ పరమాణువును తీసుకుంటుంది. ఇది నీటి నుండి ఆక్సిజన్ పరమాణువును తీసుకుని రెండు హైడ్రోజన్ పరమాణువులను విడుదల చేస్తుంది. ఈ చర్య హైడ్రోజన్ వాయువు, సోడియం అల్యూమినేట్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ చర్యలో అల్యూమినియం కరిగిపోయి సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని క్షారయుతం చేయడానికి ఒక కారకంగా పనిచేస్తుంది. ఈ చర్య చెక్కడం, యానోడైజింగ్ తొలగించడం, పాలిష్ చేసిన ఉపరితలాన్ని సిల్కులా మార్చడంలో ఉపయోగపడుతుంది. బేయర్ ప్రక్రియలో, అల్యూమినా (అల్యూమినియం ఆక్సైడ్) ను ఉత్పత్తి చేయడానికి ధాతువు (బాక్సైట్) కలిగి ఉన్న అల్యూమినాను శుద్ధి చేయడంలో సోడియం హైడ్రాక్సైడ్ ఉపయోగించబడుతుంది. ఇది ఎలెక్ట్రోలైటిక్ హాల్-హెరాల్ట్ ప్రక్రియ ద్వారా అల్యూమినియం లోహాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ముడి పదార్థం. అల్యూమినా ద్విశ్వభామైనది కనుక, ఇది సోడియం హైడ్రాక్సైడ్‌లో కరిగి, అధిక పిహెచ్ వద్ద మలినాలను తక్కువ కరిగేలా చేస్తుంది. ఈ చర్యలో ఐరన్ ఆక్సైడ్లు అధిక క్షారయుత ఎర్ర బురద రూపంలో ఉంటాయి.

ఇతర ద్విశ్వభావయుత లోహాలు జింక్, సీసం. ఇవి గాఢ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాలలో కరిగి, సోడియం జింకేట్, సోడియం ప్లంబేట్లను వరుసగా ఇస్తాయి.

శుభ్రతా కారకం (క్లీనింగ్ ఏజెంట్)

సోడియం హైడ్రాక్సైడ్‌ను తరచూ పారిశ్రామిక శుభ్రపరిచే కారకంగా ఉపయోగిస్తారు. దీనిని తరచుగా "కాస్టిక్" అని పిలుస్తారు. ఇది నీటిలో కలుపినందువల్ల ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. అందువల్ల పరికరాలు, నిల్వ ట్యాంకులు మొదలైనవాటిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. ఇది గ్రీజు, నూనెలు, కొవ్వులు, ప్రోటీన్ ఆధారిత నిక్షేపాలను కరిగించగలదు. గృహాలలో సింకులు, కాలువల క్రింద వ్యర్థాలను బయటకు పంపే గొట్టాలను శుభ్రం చేయడానికి కూడా ఇది ఉపయోగించబడుతుంది. కరిగిన పదార్థాలను స్థిరీకరించడానికి, తిరిగి నిక్షేపమును నివారించడానికి సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో సర్ఫాక్టెంట్లను చేర్చవచ్చు. సోడియం హైడ్రాక్సైడ్ నానబెట్టిన ద్రావణాన్ని స్టెయిన్‌లెస్ స్టీల్, గాజు బేక్‌వేర్లపై శక్తివంతమైన డీగ్రీజర్‌గా ఉపయోగిస్తారు. ఓవెన్ క్లీనర్లలో ఇది ఒక సాధారణ పదార్ధం.

సోడియం హైడ్రాక్సైడ్‌ను హార్డ్వేర్ దుకాణాలు వ్యర్ధపు గొట్టాలను శుభ్రపరచుటకు వాడే పదార్ధాలుగా జమకడతారు
కాస్టిక్ సోడాతో రంగులను తొలగించడం

యంత్ర భాగాలను శుభ్రపరిచే డిటెర్జెంట్ల ఉత్పత్తిలో సోడియం హైడ్రాక్సైడ్‌ను సాధారణంగా ఉపయోగిస్తారు. సోడియం హైడ్రాక్సైడ్-ఆధారిత డిటర్జెంట్లలో సర్ఫాక్టెంట్లు, రస్ట్ ఇన్హిబిటర్స్, డీఫోమర్లు ఉన్నాయి. భాగాలు శుభ్రపరిచే యంత్రం మూసివేసిన క్యాబినెట్‌లో నీరు, డిటర్జెంట్‌ను కలిపి వేడి చేసి, ఆపై వేడిచేసిన సోడియం హైడ్రాక్సైడ్, వేడి నీటిని మురికి భాగాలకు వ్యతిరేకంగా ఒత్తిడితో స్ప్రే చేసి డీగ్రీజింగ్ చేస్తారు.

మన ఇండ్లలో మురికితో అడ్డుపడే కాలువలను అన్‌బ్లాక్ చేయడానికి సాధారణంగా పొడి స్ఫటికాలు లేదా ద్రవరూప జెల్ రూపంలో ఉన్న సోడియం హైడ్రాక్సైడ్‌ను డ్రెయిన్ ఓపెనర్‌గా ఉపయోగిస్తారు. క్షార ద్రావణం "నీటిలో కరిగే ఉత్పత్తులను" ఉత్పత్తి చేయడానికి గ్రీజులను కరిగిస్తుంది. ఇది జుట్టులో కనిపించే ప్రోటీన్లను కూడా హైడ్రోలైజ్ చేస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్, శుభ్రపరిచే ఇతర రసాయన పదార్థాలు నీటిలో కరిగినప్పుడు ఉత్పన్నమయ్యే వేడి ద్వారా ఈ చర్యలు జరుగుతాయి. ఇటువంటి "ఆల్కలీన్ డ్రెయిన్ క్లీనర్లు", వాటి ఆమ్ల పదార్థాలు చాలా క్షయం కలిగిస్తాయి. అందువలన వాటిని చాలా జాగ్రత్తగా నిర్వహించాలి.

జుట్టును నిటారుగా చేయడానికి సోడియం హైడ్రాక్సైడ్ కొన్ని రిలాక్సర్లలో ఉపయోగిస్తారు. అయినప్పటికీ, రసాయన కాలిన గాయాలు అధికంగా సంభవిస్తున్న కారణంగా, రసాయన సడలింపు కోసం తయారీదారులు సగటు వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఇతర క్షారయుత రసాయనాలను ఉపయోగిస్తారు. సోడియం హైడ్రాక్సైడ్ రిలాక్సర్లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి, కానీ అవి ఎక్కువగా నిపుణులచే ఉపయోగించబడతాయి. నీటిలో సోడియం హైడ్రాక్సైడ్ యొక్క ద్రావణం సాంప్రదాయకంగా చెక్క వస్తువులపై పెయింట్ స్ట్రిప్పర్‌గా ఉపయోగించబడుతుంది. దీనిని సాధారణంగా తక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది చెక్క ఉపరితలాన్ని దెబ్బతీస్తుంది. చెక్క ముతకదనాన్ని పెంచి, రంగు గల మరకలను చేస్తుంది.

నీటి చికిత్స

సరఫరా చేయబడుతున్న నీటి pH ని పెంచడానికి సోడియం హైడ్రాక్సైడ్ కొన్నిసార్లు నీటి శుద్ధీకరణ సమయంలో ఉపయోగిస్తారు. నీటికి పెరిగిన పిహెచ్ లోహ గొట్టాలకు తక్కువ క్షయాన్ని కలుగజేస్తుంది. త్రాగునీటిలో కరిగే సీసం, రాగి, ఇతర విష లోహాల పరిమాణాన్ని తగ్గిస్తుంది.[26][27]

చారిత్రక ఉపయోగాలు

కార్బన్ మోనాక్సైడ్ శరీరంలో విషాన్ని గుర్తించడానికి సోడియం హైడ్రాక్సైడ్ ఉపయోగించబడింది. రోగుల రక్త నమూనాలలో సోడియం హైడ్రాక్సైడ్ కొన్ని చుక్కలను కలిపిన తరువాత సింధూరం రంగులోకి మారుతాయి[28]. ఈ రోజు, కార్బన్ మోనాక్సైడ్ విషాన్ని CO ఆక్సిమెట్రీ ద్వారా కనుగొనవచ్చు.

సిమెంట్ మిశ్రమాలలో

సోడియం హైడ్రాక్సైడ్ కొన్ని సిమెంట్ మిక్స్ ప్లాస్టిసైజర్లలో ఉపయోగించబడుతుంది. ఇది సిమెంట్ మిశ్రమాలను సజాతీయపరచడానికి సహాయపడుతుంది, ఇసుక, సిమెంటును వేరు చేయడాన్ని నివారిస్తుంది. మిశ్రమంలో అవసరమైన నీటి పరిమాణాన్ని తగ్గిస్తుంది. సిమెంట్ ఉత్పత్తి పని సామర్థ్యాన్ని పెంచుతుంది.

భద్రత

సోడియం హైడ్రాక్సైడ్ రసాయనికం తగిలి కాలిన చర్మం( ఘటన జరిగిన 44 గంటల తర్వాత ఛాయాచిత్రం)

ఇతర క్షయం చేసే ఆమ్లాలు, క్షారాల మాదిరిగా, సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాల చుక్కలు అమైడ్ జలవిశ్లేషణ, ఈస్టర్ జలవిశ్లేషణ ద్వారా జీవన కణజాలాలలో ప్రోటీన్లు.యు లిపిడ్లుగా తక్షణమే వియోగం చెదుతాయి. తత్ఫలితంగా రసాయన కాలిన గాయాలకు కారణమవుతాయి. కళ్ళకు తగిలితే శాశ్వత అంధత్వాన్ని కలిగిస్తుంది.[29][30] నీటి ఆవిరి వంటి నీటి సమక్షంలో ఘన క్షారము కూడా క్షయం చేసే స్వభావాన్ని కనబరుస్తుంది. అందువల్ల, రబ్బరు చేతి తొడుగులు, భద్రతా దుస్తులు, కంటి రక్షణ వంటి రక్షణ పరికరాలు ఈ రసాయనాన్ని, దాని ద్రావణాలను ఉపయోగించినపుడు ఎల్లప్పుడూ ఉపయోగించాలి. చర్మంపై క్షార పడితే ప్రామాణిక ప్రథమ చికిత్స చర్యలు అవసరం. ఇతర క్షయంచేసే క్షారాల మాదిరిగా, పెద్ద మొత్తంలో నీటితో కడగాలి. కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు పాటు శుభ్రత కొనసాగించాలి. అంతేకాకుండా, సోడియం హైడ్రాక్సైడ్ విలీనం చాలా ఉష్ణమోచక చర్య. ఫలితంగా వచ్చే వేడి వల్ల కాలిన గాయాలకు కారణం కావచ్చు. అగ్ని ప్రమాదాలను కలిగించవచ్చు. ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు ఇది ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్ కూడా గాజుకు స్వల్పంగా క్షయం చేస్తుంది. ఇది మెరుగు పెట్టడానికి నష్టం కలిగిస్తుంది[31]. సోడియం హైడ్రాక్సైడ్ అల్యూమినియం వంటి అనేక లోహాలతో కలసి మండే హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. తత్ఫలితంగా ఆయా లోహాలకు క్షయంకలిగిద్తుంది[32].

నిల్వ

ముఖ్యంగా పెద్ద పరిమాణాలలో సోడియం హైడ్రాక్సైడ్‌ను ఉపయోగించేటప్పుడు, దానిని జాగ్రత్తగా నిల్వ చేయడం అవసరం. సరైన NaOH నిల్వ మార్గదర్శకాలను అనుసరించడం, రసాయన అగ్ని ప్రమాదం కారణంగా కార్మికుడు/పర్యావరణ భద్రతను పాటించడానికి సిఫార్సు చేయబడింది. సోడియం హైడ్రాక్సైడ్ తరచుగా చిన్న-స్థాయి ప్రయోగశాల ఉపయోగం కోసం, సరుకు నిర్వహణ, రవాణా కోసం మధ్యస్థ కంటైనర్లలో, సీసాలలో నిల్వ చేయబడుతుంది. తయారీ చేయునపుడు 100,000 గ్యాలన్ల వరకు ఘనపరిమాణం గల పెద్ద ట్యాంకుల్లో నిల్వ చేస్తారు.

సోడియం హైడ్రాక్సైడ్‌కు అనుకూలంగా ఉండే, తరచుగా NaOH నిల్వ కోసం ఉపయోగించే సాధారణ పదార్థాలు: పాలిథీన్, కార్బన్ స్టీల్, పాలీ వినైల్ క్లోరైడ్, స్టెయిన్‌లెస్ స్టీల్, ఫైబర్ గ్లాస్ రీయన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్[6].

వాతావరణం నుండి నీటిని పీల్చుకుంటుంది కాబట్టి సోడియం హైడ్రాక్సైడ్ దాని సాధారణతను కాపాడటానికి గాలి చొరబడని కంటైనర్లలో నిల్వ చేయాలి.

చరిత్ర

సోడియం హైడ్రాక్సైడ్‌ను మొదట సబ్బు తయారీదారులు తయారు చేశారు[33]: p45 . 13 వ శతాబ్దం చివరలో ఒక అరబ్ పుస్తకంలో సబ్బును తయారుచేసే విధానంలో భాగంగా సోడియం హైడ్రాక్సైడ్ తయారీకి ఒక విధానం కనిపించింది: ఆల్-ముక్తరా`ఫి ఫునన్ మిన్ అల్-సున` (వివిధ పారిశ్రామిక కళల నుండి ఆవిష్కరణలు). దీనిని యెమెన్ రాజు అల్-ముజాఫర్ యూసుఫ్ ఇబ్న్ `ఉమర్ ఇబ్న్` అలీ ఇబ్న్ రసూల్ (మ .1295) సంకలనం చేశారు[34]. క్షార ద్రావణం, క్విక్‌లైమ్ (కాల్షియం ఆక్సైడ్, CaO) మిశ్రమం ద్వారా పదేపదే నీటిని పంపించమని విధానం తెలిపింది.[35]. తద్వారా సోడియం హైడ్రాక్సైడ్ పొందవచ్చు. యూరోపియన్ సబ్బు తయారీదారులు కూడా ఈ విధానాన్ని అనుసరించారు. 1791 లో ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త, వైద్యుడు నికోలస్ లెబ్లాంక్ (1742-1806) "లెబ్లాంక్ విధానం" నకు పేటెంట్ పొందాదు[33]: p36 . సాధారణంగా వాడే "సోడా యాష్" స్థానంలో ఈ కృత్రిమ విధానం చేర్చబడింది.[33]: p46  అయినప్పటికీ, 20 వ శతాబ్దం నాటికి, సోడియం క్లోరైడ్ విద్యుద్విశ్లేషణ సోడియం హైడ్రాక్సైడ్ ఉత్పత్తికి ప్రాథమిక పద్ధతిగా మారింది.

మూలాలు

బాహ్య లంకెలు