1824

1824 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు:1821 1822 1823 - 1824 - 1825 1826 1827
దశాబ్దాలు:1800లు 1810లు - 1820లు - 1830లు 1840లు
శతాబ్దాలు:18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

  • జనవరి 8: మైకెల్ ఫారడే రాయల్ సొసైటీ సభ్యుడయ్యాడు.
  • మార్చి 17: ఆంగ్లో డచ్చి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారమే భారతదేశం లోని డచ్చి స్థావరాలన్నీ బ్రిటిషు వారి వశమైపోయాయి.
  • మార్చి 29: కైరోలో జరిగిన అగ్నిప్రమాదంలో 4,000 మంది చనిపోయారు.[1]
  • మే 24: మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం మొదలైంది
  • అక్టోబరు 21: జోసెఫ్ ఆస్పిడిన్ పోర్ట్‌ల్యాండ్ సిమెంటుకు పేటెంటు పొందాడు
  • నవంబరు 19: రష్యా, సెంట్ పీటర్స్ బర్గ్ నగరంలో వచ్చిన వరదల్లో నీరు మామూలు మట్టం కంటే 421 సెం.మీ.ఎత్తుకు చేరింది
  • తేదీ తెలియదు: అవనిగడ్డ లోని 1000 సంవత్సరాల నాటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు
  • తేదీ తెలియదు: లక్ష రూపాయల ఖర్చుతో చార్మినారు ఉపరితలాన్ని ప్లాస్టరింగు చేసారు .[2]
  • తేదీ తెలియదు: న్యూ హాలండ్ పేరుతో ఉన్న దేశానికి ఆస్ట్రేలియా అని అధికారికంగా నామకరణం చేసారు.ఈ పేరును మాథ్యూ ఫ్లిండర్స్ 1804 లో సూచించాడు.

జననాలు

దయానంద సరస్వతి చిత్రం

మరణాలు

  • ఏప్రిల్ 19: లార్డ్ బైరన్, ఇంగ్లీషు కవి. (జ.1788)
  • డిసెంబరు 21: జేమ్స్ పార్కిన్సన్, బ్రిటిషు సర్జన్. ఇతడి పేరు మీదనే పార్కిన్సన్ జబ్బు పేరు వచ్చింది. (జ. 1755)
  • తేదీ తెలియదు: అమృత రావు మరాఠా నేత, పేష్వా రఘునాథ రావు దత్తపుత్రుడు. (జ. 1770)

పురస్కారాలు

మూలాలు

"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=1824&oldid=3613278" నుండి వెలికితీశారు