622

సా.శ. 622 : గ్రెగోరియన్ కేలెండరు సాధారణ సంవత్సరం.

సంఘటనలు

మదీనాలో మహమ్మదు ప్రవక్త సమాధి
  • బైజాంటైన్-సాసానియన్ యుద్ధం : హెరాక్లియస్ చక్రవర్తి కాన్స్టాంటినోపుల్ నుండి సైన్యంతో (బహుశా 50,000 మంది) ప్రయాణించి, పెర్షియన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎదురుదాడిని ప్రారంభిస్తాడు (అతని కుమారుడు కాన్స్టాంటైన్ III ని, కాన్స్టాంటినోపుల్ కు పెద్దయైన సెర్గియస్ I రక్షణలో విడిచి వెళ్ళాడు). అతను కొన్ని రోజుల తరువాత సిలిసియా, సిరియా జంక్షన్ వద్ద, అలెగ్జాండ్రెట్టా, పురాతన ఇస్సస్ సమీపంలో కాలూనాడు.
  • ఇస్సస్ యుద్ధం : హెరాక్లియస్ కప్పడోసియాలో షహర్‌బరాజ్ ఆధ్వర్యం లోని పర్షియన్ దళాలను ఓడించాడు. అనటోలియాను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. కాని అతని బాల్కన్ డొమైన్‌లకు అవర్స్ ఎదుర్కొన్న ముప్పును ఎదుర్కోవటానికి కాన్స్టాంటినోపుల్‌కు తిరిగి వస్తాడు [1]
  • పశ్చిమ టర్కులు ఆక్సస్ లోయను ఆక్రమించుకున్నారు. పర్షియాకు వ్యతిరేకంగా వారు హేరక్లియుస్‌కు సహకరించి, ఖొరాసాన్ (ఆధునిక ఆఫ్ఘనిస్తాన్) ను పట్టుకున్నారు.
  • సెప్టెంబర్ 9 [2] లేదా జూన్ 17 [3] – ఇస్లామిక్ ప్రవక్త ముహమ్మద్, తనను హత్య చేయడానికి పన్నిన కుట్ర గురించి తెలిసిన తరువాత, తన సహచరుడు అబూబకర్తో పాటు మక్కాలోని తన ఇంటి నుండి రహస్యంగా బయలుదేరి, యాత్రిబ్ (తరువాత దాని పేరు మదీనా అని మార్చాడు) కు హెగిరా (వలస) వెళ్ళాడు. వారు మక్కాకు దక్షిణాన ఉన్న థావర్ గుహలో మూడు రోజులు ఆశ్రయం పొంది, తిరిగి సెప్టెంబర్ 13 న గాని, జూన్ 21 న గానీ బయలుదేరారు.
  • సెప్టెంబర్ 20 [2] లేదా జూన్ 28:[3] ముహమ్మద్ నేరుగా యాత్రిబ్‌లోకి ప్రవేశించడు, కానీ దాని శివార్లలో ఉన్న ఖుబా పరిసరాల్లో ఆగుతాడు. అతను ఇస్లాం మొట్టమొదటి మసీదు అయిన ఖుబా మసీదును ఇక్కడే స్థాపించాడు. జూలై 2 న (లేదా సెప్టెంబర్ 24 న) శుక్రవారం ప్రార్థనల కోసం యాత్రిబ్‌కు తన మొదటి సందర్శన చేస్తాడు.
  • అక్టోబర్ 4 [2] లేదా జూలై 13: ఖుబాలో పద్నాలుగు రోజుల బస తరువాత, ముహమ్మద్ చివరకు ఖుబా నుండి యాత్రిబ్‌కు వెళతాడు. ప్రజలు అతనికి హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. ఇక్కడ అతను మదీనా రాజ్యాంగాన్ని రచించాడు. నగరంలోని వివిధ ముస్లిం, యూదు, క్రైస్తవ, అన్యమత గిరిజన వర్గాల మధ్య ఒక ఒప్పందం అది. బహుళ-మత ఇస్లామిక్ రాజ్యానికి ఆధారభూతమైనది. అల్-మసీదు అన్-నబావి మసీదు నిర్మాణాన్ని ప్రారంభిస్తాడు. తరువాత 638 లో ఉమర్ కాలిఫేట్ సమయంలో, చాంద్ర మానం ప్రకారం మదీనాకు వలస వచ్చిన సంవత్సరం (622 జూలై 16 శుక్రవారం - 623 జూలై 4) కొత్త హిజ్రీ శకం ( అన్నో హెగిరే – ఎహెచ్) "మొదటి సంవత్సరం"గా పేర్కొనబడింది.
  • జువాన్జాంగ్ 20 సంవత్సరాల వయస్సులో బౌద్ధ సన్యాసిగా నియమితుడయ్యాడు.[4]

మూలాలు

"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=622&oldid=3846514" నుండి వెలికితీశారు