మక్కా

21°25′00″N 39°49′00″E / 21.41667°N 39.81667°E / 21.41667; 39.81667

కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ముస్లిం సమూహం.
మక్కతుల్ ముకర్రమాహ్ /
مكّة المكرمة
మక్కా నగరం /
మక్కాహ్ అల్ ముకర్రమా
మక్కాకు కేంద్రబిందువు, దాని ప్రాధాన్యతకు కారణమైన మస్జిద్-అల్-హరామ్
మక్కాకు కేంద్రబిందువు, దాని ప్రాధాన్యతకు కారణమైన మస్జిద్-అల్-హరామ్
మక్కాకు కేంద్రబిందువు, దాని ప్రాధాన్యతకు కారణమైన మస్జిద్-అల్-హరామ్
Flag of మక్కతుల్ ముకర్రమాహ్ / مكّة المكرمة మక్కా నగరం / మక్కాహ్ అల్ ముకర్రమా
Flag
Coat of arms of మక్కతుల్ ముకర్రమాహ్ / مكّة المكرمة మక్కా నగరం / మక్కాహ్ అల్ ముకర్రమా
Coat of arms
ముద్దు పేరు: ఉమ్మ్-అల్-ఖురా (గ్రామలన్నింటికీ తల్లి వంటిది)
మక్కా ప్రదేశం
మక్కా ప్రదేశం
మక్కా ప్రదేశం
దేశం సౌదీ అరేబియా
ప్రాంతము మక్కా ప్రాంతము
కాబా నిర్మాణము+2000 క్రీ.పూ
స్థాపనతెలియదు
సౌదీ అరేబియాలో చేరటం1924
ప్రభుత్వం
 - Type{{{government_type}}}
 - అమీర్ఒసామా అల్-బార్
 - ప్రాంతపు గవర్నర్ఖలీద్ అల్ ఫైసల్
వైశాల్యము మక్కా పురపాలకసంఘం
 - పట్టణ850 km² (328.2 sq mi)
 - మెట్రో1,200 km² (463.3 sq mi)
జనాభా (2007)
 - City1,700,000
 - సాంద్రత4,200/km2 (2,625/sq mi)
 - పట్టణ2,053,912
 - మెట్రో2,500,000
 మక్కా పురపాలకసంఘ అంచనా
కాలాంశంEAT (UTC+3)
 - Summer (DST)EAT (UTC+3)
తపాలా కోడ్ (5 అంకెలు)
Area code(s)+966-2
వెబ్‌సైటు: మక్కా పురపాలకసంఘం

మక్కా లేదా మక్కాహ్ (అరబ్బీ : مكّة المكرمة) 'మక్కతుల్-ముకర్రమా' ఇస్లామీయ పవిత్ర నగరం. ఇది సౌదీ అరేబియా మక్కా క్షేత్రంలో, చారిత్రాత్మక హిజాజ్ ప్రాంతంలో గలదు. ఈనగరంలోనే ముస్లింలకు పరమ పవిత్రమైన మస్జిద్-అల్-హరామ్ (పవిత్ర మసీదు) గలదు. ఈ మసీదులోనే పరమ పవిత్రమైన కాబా గృహం గలదు. హజ్ యాత్రలో ముస్లింలందరూ ఇచటనే చేరి హజ్ సాంప్రదాయం లోని 'కాబా గృహం చుట్టూ ఏడు తవాఫ్ (ప్రదక్షిణ) లు' చేస్తారు.

జనాభా 1,294,167 (2004 గణాంకాలు). జెద్దా నుండి 73 కి.మీ. ఎర్ర సముద్రము నుండి 80 కి.మీ. ఇరుకైన లోయప్రాంతంలో గలదు. సముద్రానికి 910 అడుగల ఎత్తునగలదు. ముస్లింలు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా హజ్ యాత్ర కొరకు ఈ నగరానికి విచ్చేస్తారు. ఈ నగరంలో వేలాది ముస్లిమేతర కుటుంబాలు కుడా నివసిస్తున్నాయి. కానీ, నగరంలోని కాబాలో ప్రవేశం మాత్రం ముస్లిమేతరులకు నిషిద్ధం.

భౌగోళికం

మక్కా నగరం సముద్రమట్టానికి 910 అడుగుల ఎత్తులో "ఫారాన్ పర్వతపంక్తు"ల మధ్యలో గలదు. ఈ నగరపు నడిబొడ్డున మస్జిద్-అల్-హరామ్ గలదు. ఈ మస్జిద్ చుట్టూ నగరం వ్యాపించినట్టుగా కనిపిస్తుంది. ఈ మసీదు సమీపానగల ప్రాంతం పాత మక్కా నగరం. ఈ మసీదుకు ఉత్తరాన అల్-ముద్దాహ్, సుఖ్-అల్-లైల్ వీధులు గలవు. దక్షిణాన అస్-సుఘ్-అస్-సఘీర్ వీధులు గలవు. నవీన రోడ్లన్నీ ప్రాచీనకట్టడాలను తొలగించి ఏర్పరచినవే. ప్రాచీన గృహాలన్నీ ప్రాంతీయ శైలిలోని రెండు లేక మూడు అంతస్తుల రాతికట్టడాలు.

రవాణా సౌకర్యాలు

మక్కాలో విమానాశ్రయం లేదు. జెద్దాలో గల 'కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం' ఇక్కడికి సమీపములో ఉన్న ప్రధాన విమానాశ్రయం.హజ్, ఉమ్రా కొరకు గల ఇతర రవాణాసౌకర్యాలు అధికంగా కానవస్తాయి.

ప్రజలు

తక్కిన దేశమంతటితో పోల్చితే, మక్కాలో జనసాంద్రత ఎక్కువ. అతి ప్రాచీన జనావాసం పాతబస్తీలోగలదు. ఎక్కువమంది హజ్ పరిశ్రమ లో పనిచేసేవారే. వీరెప్పుడూ హజ్ కొరకు తయారుగా వుంటారు. ప్రతియేటా దాదాపు 40 లక్షలమంది ముస్లింలు హజ్ కొరకు మక్కాను సందర్శిస్తారు.[1]

ప్రభుత్వం

ఇస్లాం ప్రకారం అధినేతను ప్రజలు ఎన్నుకోవాలి. కానీ సౌదీ రాచరికంలో,మక్కా నగరపాలిక చే పాలింపబడుచున్నది. దీని అధినేత మేయర్. ఇతన్ని అమీన్ అని పిలుస్తారు. అమీన్ అనగా విశ్వాసంగలవాడు, నమ్మదగినవాడు. ఈ అమీన్ను సౌదీ అరేబియా ప్రభుత్వం నియమిస్తుంది. ప్రస్తుత మక్కానగరమేయర్ ఒసామా అల్-బర్ర్ 14మంది ఎన్నుకోబడ్డ సభ్యులుగల నగరపాలిక పరిపాలిస్తుంది.

మక్కా రాష్ట్రం యొక్క రాజధాని మక్కానగరం. ఈప్రాంతంలోనే 'జెద్దా' నగరంగూడాగలదు. అబ్దుల్ మజీద్ బిన్ అబ్దుల్ అజీజ్ 2000 నుండి 2007 వరకు గవర్నర్ గావున్నాడు.[2] మే 16, 2007 నుండి ప్రిన్స్ ఖాలిద్ అల్-ఫైసల్ గవర్నర్ గా నియమింపబడ్డాడు.[3]

చరిత్ర

1787 - టర్కిష్ కళాశైలిలో పవిత్ర మస్జిద్, సంబంధిత ధార్మిక ప్రదేశాలు (జబల్ ఎ నూర్)

అరేబియా ద్వీపకల్పం లోని అతిముఖ్య నగరాలలో మక్కా కు 1800 సంవత్సరాల చరిత్ర వున్నది

ప్రాచీన చరిత్ర

ఈ నగర ఆవిర్పావo నాలుగువేల నంవత్సరాల క్రితం జరిగినది . కొండల నడుము నిర్థలంగా ఏ వనరులూ లేక నిర్థవంగా వన్న బంజరుభూమిలో మహనీయుడు ఇబ్రాహీం తన భార్య హజిరాను కుమారుడు ఇస్మాయిల్ను వది లేసి వెళ్ళిపోతాడు "నిర్థవమైన నిర్జలమైన నిరామయంగా వున్న ఈ ప్రదేశంలో మమ్మల్ని వదిలివెళతారా." అని భార్య హజిరా ఆడిగితే "అవును. ఇది దైవాజ్ఞ" అని మహనీయుడు ఇబ్రహీం చెప్పాడట. కొడుకు ఇస్మాయిల్ దాహం అని అడిగితే ఆ తల్లికి చుట్టుపక్కల ఎక్కడా వీరు కనవడలేదు. నీటికోసం ఆదుర్ధాగా ఆటూ యిటూ ఆ తల్లి పరిగెడుతుంటే దైవికంగా ఆక్కడో జలాశయం ఏర్పడింది. జమ్ జమ్ ఆనే పేరుగల పవిత్రమైన ఆ బావి నీటితో దాహం తీర్చుకున్నారు, తర్వాత దైవాజ్ఞ మేరకు ఇబ్రహీం తిరిగి మక్కాకు వచ్చి తనయుడు ఇస్మాయిల్ సహాయంతో "కాబాగృహం"ను నిర్మించాడు. తర్వాత అక్కడో గ్రామం వెలచి వృద్ధిచెంది అదే నేటి మక్కా నగరంగా రూపదిద్దుకొంది6వ శతాబ్దపు మధ్యకాలంలో ఉత్తర అరేబియాలో మూడు ప్రధాన నివాస ప్రాంతాలుండేవి. అవన్నియూ నైఋతీ దిశయందు ముఖ్యంగా ఎర్ర సముద్ర తీరప్రాంతంలోనూ, ఎర్ర సముద్రానికీ, తూర్పునగల అరేబియా ఎడారికీ మధ్యనగల నివాసయోగ్య ప్రాంతంలోనూ గలవు. ఈప్రాంతాన్నే హిజాజ్ అంటారు. ఈ హిజాజ్ ప్రాంతం నీటి సౌకర్యాలు గల ఒయాసిస్ ప్రాంతం. ఈ హిజాజ్ మధ్య ప్రాంతంలో యస్రిబ్ పట్టణం (ప్రస్తుతం దీని పేరు మదీనా) గలదు. ఈ పట్టణానికి 250 కి.మీ. దక్షిణాన, పర్వత ఫంక్తులలో తాయిఫ్ పట్టణం గలదు. తాయిఫ్‌కు వాయవ్యాన మక్కా పట్టణం గలదు. మక్కా చుట్టూగల నేల సారవంతమైనది గాకున్నా ధనిక ప్రాంతంగా వర్థిల్లుతూనేవున్నది. మక్కా ప్రముఖ వ్యాపారకేంద్రం కూడా అభివృద్ధి చెందింది. అరేబియాలోని మూడు నివాసయోగ్యప్రాంతాలలో మక్కా ఒకటి. మక్కా పట్టణానికి ఆనుకొనే జమ్ జమ్ బావి గలదు. మక్కా, పరిసర ప్రాంతాలకంతటికీ ఈ బావినీరే ప్రధానం. ఇస్లాంలో పరమ పవిత్రమయిన క్షేత్రం కాబా, మక్కా నగరంలోనే గలదు. కాబాగృహం మొదట బహు విగ్రహారాధనా కేంద్రం. ముహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతాన్ని ప్రకటించిన తరువాత ఈ కాబాగృహం ఏకేశ్వరోపాసనా కేంద్రంగా ఖ్యాతినొందింది. మక్కానగరం నుండి సిరియా వరకు ఒకే కారవాన్ నడపబడుచుండేది.

కాబాగృహం చతురస్రాకారపు నిర్మాణం, దీనిచుట్టూ మస్జిద్-అల్-హరామ్ గలదు. ఖురాన్ ప్రకారం ఈ కాబా గృహం ఇబ్రాహీం ప్రవక్త (ابراهيم) నిర్మించారు. ఈ నిర్మాణంలో ఇబ్రాహీంతో పాటు అతని కుమారుడు ఇస్మాయీల్ పాల్గొన్నారు. ఈ నిర్మాణం దాదాపు హిజ్రీ పూర్వం 3000 జరిగింది. మహమ్మదు ప్రవక్తకు పూర్వం కాబా గృహంలో దాదాపు 360 విగ్రహాలుండేవి. ఈ విగ్రహాలలో లాత్, మనాత్, హుబల్, దులిల్లు ప్రసిద్ధమైనవి. మక్కా, సౌదీ అరేబియాలోగల సంచార జాతులన్నీ ఈ విగ్రహారాధన చేసేవి. 360 విగ్రహాలలో ఈసా (యేసుక్రీస్తు), మరియం (మేరీ) ల విగ్రహాలు కూడా ఉండేవని ప్రతీతి.[4]

ప్రాచీన అరేబియా తన కాలంలో నిరక్షరాస్యత, దాస్యసృంఖలనం, మూఢనమ్మకాలు, ఆడపిల్లల హత్యలు, స్త్రీపురుష అసమానత్వాలు, తెగల మధ్య వైషమ్యాలు, ఒకే ప్రాంతంలో ఉంటూ కూడా ప్రజల, తెగల జాతుల మధ్య వైరుధ్యాలు, పోరాటాల పుట్టగా మసక చరిత్రగల గుట్టగా వుండేది. ఇన్ని వైరుధ్యాలలో గూడా ఒక ప్రత్యేకత ఏమనగా సంవత్సరానికోసారి కాబాగృహం యొక్క దర్శనానికి, జాతరకు, వర్తకం కొరకు మక్కా నగరానికి తండోపతండాలుగా ప్రజలు వచ్చేవారు. ఇచట చేరిన తరువాత సాంవత్సరిక లావాదేవీలు, తెగలమధ్య తీర్పులు జరిగేవి. అరేబియా వాసులకు తమకంటూ ఒక గుర్తింపునిచ్చే ప్రదేశంగా మక్కాకు భావించేవారు. ఈ విధంగా ద్వీపకల్పంలోనే మక్కాకు ప్రత్యేకత వుండేది.[5]

సా.శ. 5వ శతాబ్దంలో ఖురేషీలు మక్కాను తమ ఆధీనంలో తీసుకొన్నారు.[6] వీరు నైపుణ్యంగల వర్తకులుగానూ వ్యాపారప్రముఖులుగానూ అభివృధ్ది చెందారు. 6వ శతాబ్దంలో సుగంధద్రవ్యాల వర్తకంలో రాణించారు. యుధ్ధాలతో కూడిన ఆ కాలంలో, మక్కా వర్తకులు తమదారులను సముద్రమార్గాలనుండి భూమార్గాలకు మరల్చారు. బైజాంటియన్ సామ్రాజ్యం ఎర్రసముద్రాన్ని నియంత్రిస్తూ వుండేది. కాని సముద్రపుదొంగలను అరికట్టలేక పోయింది. ఇంకో పాతమార్గం పర్షియన్ అఖాతము నుండి టిగ్రిస్, యూఫ్రటీసు నదులద్వారా, ఇది కూడా ససానిద్ సామ్రాజ్యం ద్వారా భయాందోళనలకు గురిచేసింది. లక్మీడులు, ఘస్నవీడులు, రోమనుల పర్షియనుల యుధ్ధాలు వీరి వర్తకంపై తీవ్ర ప్రభావం చూపాయి. మక్కా యొక్క వర్తక ప్రాశస్తం పేత్రా, పామేరు వరకు మాత్రమే వ్యాపించగలిగినది.

ముహమ్మద్ ప్రవక్త ముత్తాత అబ్దుల్ ముత్తలిబ్ ప్రథమంగా ఒంటెల కారవాన్ సంప్రదాయాన్ని ప్రారంభించాడు, ఈ సాంప్రదాయం మక్కానగర విత్తాన్ని పెంచింది. మక్కాలో వర్తకుల, తెగల, సంచారజాతుల, సంచారతెగల మధ్య సంబంధబాంధ్యవ్యాలు ఏర్పడ్డాయి. మక్కాలో సరుకుల రవాణా ప్రారంభమయితే సిరియా, ఇరాక్ వరకూ సాగేది.[7] మక్కా, సౌదీ అరేబియాలోని ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలనుండి సరుకులు వచ్చి చేరేవి. అనగా వర్తక ప్రాపంచీకరణ (గ్లోబల్ ట్రేడ్) అపుడే అమలులో వుండేది. మక్కా వాసులు బైజాంటియనులు, బదూయిన్ లతో ఒడంబడికలు చేసుకొని తమ కారవాన్ ల దారిని ఏర్పరచుకొనేవారు. ఇలాంటి విషయాలతో మక్కా వాసుల ప్రాధాన్యతా ప్రాబల్యాలు పెరిగాయి. మక్కా వ్యాపార, రాజకీయ కేంద్రంగా ఓ కొత్తరూపాన్ని సంతరించుకొంది.[5]

1850 లో మక్కా

ముహమ్మద్

ముహమ్మద్ ప్రవక్త 570 మక్కాలో జన్మించారు. ఇతని జీవితం మక్కా నగరంతో ముడిపడియున్నది. అధికార ఖురైషీయుల తెగ యైన హాషిమీ వంశానికి చెందినవారు. అల్లాహ్ ప్రవచనాలు ప్రకటితమైన తరువాత, పాగన్ (అరేబియాకు చెందిన బహువిగ్రహారాధకులు) లకు వ్యతిరేకంగా తన మిషన్ ను ప్రారంభించారు. తరువాత మదీనాకు హిజ్రత్ (వలస) వెళ్ళారు. సా.శ. 622 లో కొందరు అనుచరగణంతో మక్కావాసులతో బద్ర్ యుద్ధం సాగించి విజయం సాధించి మక్కావాసులలోనూ బెదూయీన్ తెగలలోనూ కీర్తిపొందారు. దీని తరువాత అనేక యుద్ధాలు జరిగాయి, ఉదాహరణకు ఉహుద్ యుధ్ధం మరియ్ ఖందఖ్ యుద్ధం..[8]

సా.శ. 628 లో ముహమ్మద్ ప్రవక్త శాంతికాములతో, తన అనుయాయులతో మక్కాకు హజ్ కొరకు తీర్థయాత్ర ప్రారంభించారు. ఈ విధంగా ఇస్లాం మతములో హజ్ యాత్ర ఒక ముఖ్యమైన అంశమని విశదీకరించబడింది. మక్కా ప్రజలు, మదీనాలో ఉన్న ముస్లింల మధ్య ఘర్షణలను అంతమొందించడానికి ముహమ్మద్ ప్రవక్త, మక్కావాసులతో ఒక అంగీకారానికి వచ్చి హుదైబియా సంధి కుదుర్చుకున్నారు. ఈ అంగీకారం ప్రకారం ముస్లింలు హజ్ యాత్ర కొరకు సంవత్సరకాలం వేచి వుండవలసి వచ్చింది, ఎవరైనా మక్కావాసులు మదీనాకెళ్ళినా వారు తిరిగి మక్కాకు రావచ్చు, కాని ఎవరైనా మదీనావాసి మక్కాకెళ్ళిన మహమ్మదు ప్రవక్త పిలిచిననూ మదీనాకు తిరిగిరాకూడదు. హుదైబియా సంధి ఆ తరువాత పది సంవత్సరాల పాటు యుద్ధాలనుండి విశ్రాంతినిచ్చింది. కాని మక్కావాసులచే ఈ సంధి క్షేధించబడింది, కానీ యుధ్ధానికి బదులుగా మక్కా శాంతియుతంగా ముస్లిముల వశమయింది. ముహమ్మద్ ప్రవక్త తన అనుయాయులతో మరుసటి సంవత్సరం హజ్ యాత్రకు మక్కా బయలుదేరారు. మక్కావాసులు ముస్లిముల సంఖ్య, వారి విశ్వాసబలాన్ని చూసి వారిని ఆపలేకపోయారు. మక్కావాసులందరూ తలోదిక్కూ దాక్కొన్నారు. మక్కావాసులెవరికీ ఎలాంటి అపకారం కలుగకుండా క్షమాభిక్ష ప్రసాదింపబడింది. ఆవిధంగా మక్కా శాంతియుతంగా ముస్లిముల వశమయినది. మక్కావాసులందరూ లొంగిపోయారు, ముహమ్మద్ ప్రవక్త ఖురేషులకు తగిన బహుమానాలిచ్చారు, ప్రజలందరికీ శాంతిసందేశం ఇవ్వబడింది. కాబా గృహంలోని అసత్యదేవతల విగ్రహాలన్నీ తొలగించారు. సత్యమైనవాడు ఏకేశ్వరుడేనని అతడే సకలలోకాల ప్రభువనీ అతనికే అన్ని స్తోత్రములనీ నినదించి, కాబా గృహాన్ని పరమపవిత్ర గృహంగా ముస్లింల పవిత్రకేంద్రంగా ప్రకటించారు, హజ్ కార్యక్రమాలు పూర్తిచేశారు.[8]. మహమ్మదు ప్రవక్త, హజ్ తరువాత అత్తాబ్ బిన్ ఉసైద్ను మక్కా గవర్నరుగా నియమించి, మదీనా బయలుదేరారు. మక్కాయందు గల అనేక తెగలవారి మధ్య సమన్వయాన్ని కలుగజేసి ఏకేశ్వర సంపూర్ణవిశ్వాసాన్ని కలుగజేసి అరేబియా అంతటినీ ఏకత్రాటిపై తెచ్చాడు.

ముహమ్మద్ 632 లో మరణించారు, అతను స్థిరీకరించిన మతవిశ్వాసాలు, శాంతి సౌభ్రాతృత్వాలు, అరేబియా అంతటా వికసించినవి. ఇస్లాం త్వరగా వ్యాపించడం ప్రారంభించింది, కొన్ని వందల ఏళ్ళలోనే ఉత్తర ఆఫ్రికా, ఆసియా యందు వర్థిల్లింది. అరబ్, ఇస్లామీయ సామ్రాజ్యం పెరుగుతూ మక్కా తీర్థయాత్రికులను అరేబియానుండేగాక ప్రపంచ నలుమూలలనుండి ఆకర్షించసాగింది. ముస్లింల హజ్ కేంద్రమైనది.ఇంకో ముఖ్యమైన సంఘటన యేదంటే, సాధారణ ప్రార్థనలకు (నమాజుకు) ముస్లింలు జెరూసలేం (మొదటి ఖిబ్లా) వైపుకు తిరిగి ప్రార్థించేవారు, కాని అల్లాహ్ ఆజ్ఞ ప్రకారము మక్కాలోని కాబా గృహం (రెండవ, స్థిరమయిన) ఖిబ్లాగా ప్రకటించడము జరిగింది. దీని ప్రకారం ముస్లింలు సాధారణ ప్రార్థనలు సైతం కాబావైపు తిరిగి చేయడం ప్రారంభించారు.

1910 లో మక్కా

మక్కా సంవత్సరకాలమంతా ఉలేమాల, పండితుల, సంతుల, హజ్, ఉమ్రా యాత్రికుల కేంద్రమయ్యింది. వీరందరూ కాబాగృహం దగ్గరే తమ జీవితాలను గడపాలని అభిలషించారు. వీరందరికీ మక్కావాసులు సేవలు చేయడం ప్రారంభించారు.

రాజకీయ చరిత్ర

మక్కా ఇటు ఖలీఫాల అటు ఉస్మానియా సామ్రాజ్యపు రాజధానిగా ఎన్నడునూ లేదు. మహమ్మదు ప్రవక్త మదీనాకు హిజ్రత్ (వలస) వెళ్ళి దానినే ముస్లింల రాజధానిగా స్థిరీకరించారు. నాలుగవ రాషిదూన్ ఖలీఫా అయిన అలీ రాజథానిని కూఫా నగరానికి మార్చాడు. ఉమయ్యద్ ఖలీఫాలు తమరాజధానిని డెమాస్కస్ (సిరియా) కు మార్చారు. అబ్బాసీ ఖలీఫాలు తమ రాజధానిని బాగ్దాదుకు మార్చారు. ఇరాక్ ముస్లింలకేంద్రంగా దాదాపు 500 సంవత్సరాలు వర్థిల్లినది. ఇది విద్యా వైజ్ఞానిక వ్యాపారరంగంగా వెలసిల్లింది. సా.శ. 1258 లో మంగోలుల దండయాత్రలో సిరియా ఇరాక్ తీవ్రవిధ్వంసానికి గురయ్యాయి. ఇస్లామీయ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక భాండాగారాలన్నీ నాశనమయ్యాయి. సాహిత్యరచనలూ, సకలశాస్త్రాల రచనలూ, గ్రంథాలయాలు, వర్తకకేంద్రాలూ చిన్నాభిన్నమయి వందలసంవత్సరాల అద్వితీయ సంపద నాశనమయింది. మంగోలులు సృష్టించిన ఆ ఘోరకలి ఇస్లామీయ సాంస్కృతిక, శాస్త్రీయ కేంద్రాలన్నింటినీ కోలుకోలేని దెబ్బ తీసింది. ఇస్లామీయ కేంద్రంగా కైరో (ఖాహెరా) జన్మించింది. దానితరువాత ఇస్లామీయ రాజధానిగా టర్కీ లోని 'కాన్స్టాంటినోపుల్' (ఖుస్తున్ తునియా) ఏర్పాటైంది. ఇన్ని పరిణామాలు జరిగిననూ మక్కా తన ప్రాశస్తాన్నీ, వైభవాన్నీ కోల్పోలేదు. హజ్ యాత్రీకుల పరంపర, వర్తకకేంద్ర అభివృధ్ధీ పెరుగుతూనే పోయింది.[9]

అబ్దుల్లా ఇబ్న్ అల్-జుబేర్ ఉమయ్యద్ ఖలీఫాలను తిరస్కరించినపుడు మక్కా తిరిగీ ఇస్లామీయ రాజకీయచరిత్రలో ప్రవేశించింది. ఖలీఫాయైన యజీద్ 1 మక్కాను 683లో వశపరచుకొన్నాడు.[10]

దీని తరువాత ఈ నగరం రాజకీయరంగంలో కొద్దిగానే కనిపించింది. మక్కా విశ్వాసుల, విశ్వాసాల కేంద్రంగానూ, విజ్ఞానాకాశంగానూ మెలిగింది. శతాబ్దాల తరబడీ 'హాషిమీయులైన' "మక్కా యొక్క షరీఫులచే" పాలింపబడినది, వీరు మహమ్మద్ మనుమడైన హసన్ ఇబ్న్ అలీ సంతతికి చెందినవారు. ఖలీఫాలెవరైననూ వీరు రెండు పవిత్రమస్జిద్ ల సంరక్షకులుగా కొనసాగుతూనే ఉన్నారు.[ఆధారం చూపాలి]

సా.శ. 930 లో తూర్పు అరేబియాలోని "ఖర్మతియన్"లు (ఇస్మాయీలీయులకు చెందిన అతివాదులు) మక్కాపై దురాక్రమణచేశారు.[11] 1349 లో మక్కా 'నల్ల మృతము' అనే రోగం (Black Death) (కొందరైతే మంగోలుల దండయాత్రనే 'నల్ల మృతము అంటారు) బారిన పడినది.[12] 1517లో 'మక్కా యొక్క షరీఫ్' ఉస్మానియా సామ్రాజ్యపు ఖలీఫాలను గుర్తిస్తూనే మక్కాను "స్వయంపరిపాలనాధికారా"లను పొందుతూవచ్చాడు.[13]

ఉస్మాన్ మక్కాకు తిరిగిరాక

షేక్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహాబ్, "దిరియా"లో స్థిరపడి, రాజకుమారుడైన ముహమ్మద్ ఇబ్న్ సాద్ సాయంతో సా.శ. 1744 హి.శ. 1157 లో ఇస్లామీయ విశ్వాసాల పునరుద్ధరణ పేరుతో మొట్టమొదటి సౌదీ రాజ్యం స్థాపించాడు. ఇస్లామీయ సాంప్రదాయాలు మంటగలుస్తున్నాయనీ, అనవసరపు సాంప్రదాయాలన్నీ ఇస్లామీకరింపబడుతున్నాయని భావించి ఈ రాజ్యమేర్పడింది.

1803, 1804లో వహాబీ తత్వము సాద్ ఇబ్న్ అబ్దుల్ అజీజ్ ఇబ్న్ ముహమ్మద్ ఇబ్న్ సాద్ ఆధ్వర్యంలో మక్కానగరాన్ని ముట్టడించి వశపరచుకొన్నది. రెండు ప్రధాన నగరాలైన మక్కా, మదీనాలలో గల పెక్కు నిర్మాణాలూ, పలు ధార్మికక్షేత్రాలూ, సమాధులూ నేలమట్టం చేయబడ్డాయి. మహమ్మదు ప్రవక్త కుమార్తె అయిన ఫాతిమా జెహ్రా సమాధిపైగల నిర్మాణాన్నీ కూలగొట్టారు, మహమ్మద్ ప్రవక్త సమాధిని సైతం పెకిలించాలని ప్రయత్నించారు.[14][15]

1803 నుండి 1813 వరకూ వహాబీలు మక్కాపై పట్టు బిగించారు. ఉస్మానియా సామ్రాజ్యానికి ఇది తీవ్రమైన చెంపదెబ్బ. 1517 నుండి పవిత్రనగరాల పరిరక్షణలో ఉన్న ఉస్మానీయులు కార్యరంగంలో దిగారు. ఈ వహాబీల పనిపట్టడానికి ఉస్మానీయులు తమ బలమైన వైస్రాయి, ఈజిప్టుకు చెందిన ముహమ్మద్ అలీ పాషా ను నియుక్తంచేశారు.The .[16] 1818 లో వహాబీలు ఓడిపోయారు, "మొదటి సౌదీ రాజ్యం" అంతమయినది. కాని వహాబీ ఉద్యమం కొనసాగి "రెండవ సౌదీ రాజ్యం" ఏర్పాటు చేసి 1891 వరకూ పరిపాలించారు, తరువాత "మూడవ సౌదీ రాజ్యం" సౌదీ అరేబియా నేటికినీ ఏలుబడిలోవుంది.

20వ శతాబ్దము

1916 జూన్‌లో మక్కాకు చెందిన షరీఫ్ హుసేన్ బిన్ అలి ఉస్మానియా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తన బలాలతో తిరుగుబాటుచేసి మక్కానగరాన్ని కైవసం చేసుకొన్నాడు. ఇతడికి, ఇతని దళాలకు ఇది మొదటి విజయం.

1926 లో మక్కా యొక్క షరీఫ్ కు పరాభవం ఎదురైంది, సౌదీలచే గద్దెదింపబడ్డాడు, మక్కా, సౌదీ అరేబియాలో కలుపబడింది. [ఆధారం చూపాలి]

1979 ఆక్రమణ

నవంబరు 20 1979 న 200 మంది ఆయుధాలు ధరించిన ఇస్లామిస్టులు ప్రధాన మసీదును ఆక్రమించారు. వీరు 'జుహైమన్ అల్-ఒతైబి' అనే సౌదీ మతప్రచారకుడి శిష్యులు. అల్-ఒతైబి శిష్యులు, సౌదీ రాజ కుటుంబం ఇస్లాంను తన గుత్తాధిపత్యంలో వుంచుకొనే ప్రయత్నం చేస్తున్నదని, రాజ కుటుంబపు ఆగడాలు మితిమీరుతున్నాయని, మక్కా, ప్రధాన మసీదు తమ స్వంతాస్తిలా మార్చుకొంటున్నారని ఆరోపించారు. అయితే ఈ ఆక్రమణను సౌదీ రాజకుటుంబం ఫ్రాన్సుకు చెందిన జీ.ఐ.జీ.ఎన్. కమెండోల సహాయంతో అణచివేసింది.[17]

1987 లో యాత్రికులపై మారణకాండ

జూలై 31, 1987 న యాత్రికులు అమెరికా వ్యతిరేక ప్రదర్శన చేశారు. అమెరికా మిత్రదేశమైన సౌదీ అరేబియా ప్రభుత్వం, తన పోలీసు దళంతో యాత్రికులపై కాల్పులు జరుపగా 402 మరణించారు, 649 మంది గాయపడ్డారు.

హజ్

నవీన కాలపు మక్కాలో ప్రధాన పరిశ్రమగా సాంవత్సరిక ధార్మిక పుణ్యయాత్ర హజ్ యొక్క తోడ్పాట్లు, నిర్వహణ అభివృధ్ధిచెందినది. హజ్ యాత్రికుల సౌకర్యాల ఏర్పాట్లు, వాటి నిర్వహణా కార్యక్రమాలు వేగం పుంజుకొన్నవి. హజ్ కొరకే గాక ఉమ్రా కొరకూ ఈ ఏర్పాట్లు నిత్యావసరంగా మారాయి. ఈ పుణ్యయాత్రలో భాగంగా క్రింది ప్రదేశాల సందర్శన సాధారణం.

కాబా

హజ్ (పుణ్యక్షేత్రం) మక్కా కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు.

కాబా ప్రాచీన రాతి కట్టడం. ముస్లింలదరూ దీనివైపే తిరిగి ప్రార్థనలు (నమాజ్) చేస్తారు. ఈ కాబాగృహం 3000 హిజ్రీపూర్వం ఇబ్రాహీం ప్రవక్తచేనిర్మింపబడింది. హజ్, ఉమ్రా చేయువారు దీని చుట్టూ గడియారపుముల్లు వ్యతిరేకదిశలో (అపసవ్య దిశలో) 7 సార్లు ప్రదక్షిణం చేస్తారు. ఈ ప్రదక్షిణను తవాఫ్ అంటారు.ఈ కాబా గోడలో అమర్చిన రాయిని పరలోకం నుండి వచ్చిన రాయిగా భావించి ముస్లిములు ముద్దు పెట్టుకుంటారు.

జమ్ జమ్ బావి

ఇస్లామీయ ధార్మిక గ్రంథాల ప్రకారం ఈ బావి ఇబ్రాహీం ప్రవక్త, హాజిరా ల తనయుడైన ఇస్మాయీల్ పై ప్రకటితమయినది. ఇస్మాయీల్ బాల్యంలో తీవ్రమయిన దప్పికగొన్నసయమంలో హాజిరా నీటికొరకు అన్వేషించింది. అల్లాహ్ ఇస్మాయీల్ పాదాలచెంతనే నీటినిప్రకటింపజేశాడు. మక్కా ప్రాంతం అతి తక్కువ నీటివనరులుగల ప్రాంతం. ఈ జమ్ జమ్ బావి మక్కా ప్రాంతీయవాసులకు అల్లాహ్ యొక్క వరం. హజ్ యాత్రికులు ఈనీటిని తమతోపాటు తీసుకువస్తారు. ఈనీటిని పరమపవిత్రంగా భావిస్తారు. ఈనీరు దప్పికనేగాక ఆకలినిగూడా తీరుస్తుందని ప్రతీతి. ఈనీరు సర్వరోగనివారిణి అని ముస్లింల ప్రగాఢవిశ్వాసం. ముస్లింలు మరణించినపుడు తమ కఫన్ లను ఈ నీటితో పవిత్రం చేయాలని కోరుకుంటారు. ఇలా చేయడంవలన తమ పరలోక యాత్ర శుభప్రథమౌతుందని నమ్ముతారు. హజ్ యాత్రికులు తమ ఇహ్రామ్ (హజ్ సమయంలో ధరించే వస్త్రాలు) లను ఈనీటితో తడిపి పవిత్రంచేసి తీసుకువస్తారు. ఈ వస్త్రాలను తమ కఫన్ లుగా ధరించాలని కోరుకొంటారు.

ప్రస్తుత స్థితి

ఉమ్మ్ అల్-ఖురా వీధి, నగరంలోని వాణిజ్యపువీధుల్లో ఒకటి

20 వ శతాబ్దంలో ఈ నగరం వేగంగా అభివృధ్ధి చెందింది. 21వ శతాబ్దంలో ఇంకనూ శరవేగంగా అభివృద్ధి చెందుచున్నది. ఇస్లాంలో పరమపవిత్రనగర ప్రాశస్తం పొందిన ఈనగరం ప్రముఖంగా హజ్, ఉమ్రా ల యాత్రలకు ప్రసిధ్ధి. వేలకొలది అరబ్బులు ఉద్యోగాలు పొందే ఈ హజ్ రవాణా, సౌకర్యాల రంగం ఒక ప్రముఖ వాణిజ్యరంగంగూడానూ.[18]

ముస్లిమేతరులు

సౌదీ అరేబియా చట్టాల ప్రకారం ముస్లిమేతరులకు ఈ నగరంలోని కాబాలో మాత్రం ప్రవేశం నిషిద్ధం. వాహనాలద్వారావచ్చేవారిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. విమానాశ్రయాలలోగూడా ఇదేవిధమయిన నిఘా వుంటుంది. వీరి సెక్యూరిటీ విధానం అలాంటిది.విశ్వాసులారా బహు దైవారాధకులు అపవిత్రులు, కావున ఈ సంవత్సరం తరువాత వారిని కాబాగృహం వైపు రానివ్వకండి.ఒకవేళ (మీ వ్యాపారం తగ్గి) మీరు పేదరికం పాలవుతామని భయపడుతున్నారా (భయపడకండి) అల్లాహ్ తలుచుకుంటే తన కృపతో మిమ్మల్ని ధనవంతులను చేస్తాడు, అల్లాహ్ అన్నీ తెలిసినవాడు మహా జ్ఞాని ఖురాన్, -- 9:28

"ముస్లిమేతరుల దారి" ముస్లిమేతరులకు మక్కాలో ప్రవేశం నిషేధం

విత్తము

మక్కానగర ఆర్థికవ్యవస్థ ముఖ్యంగా హజ్ యాత్రా వ్యాపారం పైనే ఆధారపడింది. హజ్ యాత్రాకాలంలోనే 10 కోట్ల అమెరికా డాలర్ల వ్యయం జరుగుతుంది. ఇందులో ప్రభుత్వమే 5 కోట్ల అమెరికా డాలర్లు ఖర్చు పెడుతుంది. సౌదీ అరేబియాలో ప్రముఖ పరిశ్రమ ఆయిల్ పరిశ్రమ. ఇంకనూ టెక్స్ టైల్స్, ఫర్నిచర్, వస్తుసామాగ్రి పరిశ్రమలు గలవు.

ఇవీ చూడండి

మూలాలు

సమాచార సేకరణ

బయటి లింకులు