ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్

`ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ (అరబ్బీ, عمر بن الخطاب) (c. 581 సా.శ. – నవంబరు 7, 644), ఇతనికి ఉమర్ మహా ఘనుడు అనే మరో పేరు కూడా ఉంది. ఖురేష్ తెగలోని 'బనూ అది' వంశంలో ఇస్లాం స్వీకరించిన మొదటి వాడు ,[1] మహమ్మదు ప్రవక్త కు (శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) సహాబి(సహచరులు) అవుతారు. ఇతను అబూబక్ర్ మరణం తరువాత 634లో రెండవ ఖలీఫాగా నియమితుడయ్యాడు. సున్నీ ముస్లింలు ఇతనిని రాషిదూన్ ఖలీఫాగా గౌరవిస్తారు. ఇతని విజయాలు, రాజకీయ నైపుణ్యాలవలన ఇస్లామీయ చరిత్రలో ఇతనికి ప్రముఖ స్థానమున్నది.

ఉమర్
ముస్లింల ఖలీఫా
పరిపాలన634 సా.శ. – 644 సా.శ.
పూర్తి పేరు`ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్
మకుటాలుఅమీర్ అల్-మూమినీన్
అల్-ఫారూఖ్ (సత్య , అసత్యాల మధ్య తేడాను చూపువాడు)
జననం581 సా.శ.
జన్మస్థలంమక్కా, సౌదీ అరేబియా
మరణం644 నవంబరు 7
మరణస్థలంమదీనా, సౌదీ అరేబియా
సమాధిమస్జిద్-ఎ-నబవి, మదీనా
ఇంతకు ముందున్నవారుఅబూబక్ర్
తరువాతి వారుఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్
తండ్రిఖత్తాబ్ ఇబ్న్ నుఫేల్
తల్లిహన్తమాహ్ బిన్త్ హిషామ్
ఖలీఫ్ ఉమర్ సమాధి. ఆల్ మస్జిద్ ఆల్ నబావి లోని గ్రీన్ డోం వద్ద ఈ సమాధి ఉంది.

ఇవీ చూడండి

మూలాలు