జాతీయ ప్రజాస్వామ్య కూటమి

భారతదేశం యొక్క రాజకీయ పార్టీ

జాతీయ ప్రజాస్వామ్య కూటమి భారతదేశానికి చెందిన రాజకీయ కూటమి, ఇది 1998లో అటల్ బిహారి వాజపేయి నాయకత్వంలో స్థాపించబడింది. ఈ కూటమికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తుంది.[1]

జాతీయ ప్రజాస్వామ్య కూటమి
Chairpersonఅమిత్ షా
లోక్‌సభ నాయకుడునరేంద్ర మోడీ
(భారతదేశ ప్రధానమంత్రి)
రాజ్యసభ నాయకుడుపీయూష్ గోయల్
మాజీ ప్రధానమంత్రులుఅటల్ బిహారి వాజపేయి (1998–2004)
స్థాపకులు
(భారతీయ జనతా పార్టీ)
స్థాపన తేదీ1998
కూటమి29 Parties
లోక్‌సభ స్థానాలు
334 / 543
రాజ్యసభ స్థానాలు
116 / 245
శాసన సభలో స్థానాలుSee § Strength in legislative assemblies

ఈ కూటమి ఇంతకు ముందు 1998 నుండి 2004 వరకు అధికారంలో ఉంది. ఆ తరువాత 2014 లోక్ సభ సాధారణ ఎన్నికల్లో 38.5శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చింది.[2] ఈ కూటమి ముఖ్య నాయకుల్లో ఒకడైన నరేంద్ర మోడీ 2014 మే 26న భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. 2019 సాధారణ ఎన్నికల్లో కూడా ఈ కూటమి 45.53శాతం ఓట్లతో మళ్ళి అధికారం చేజిక్కించుకుంది.[3]

చరిత్ర

జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) 1998 మే నెలలో జాతీయ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కూటమి అయిన ఐక్య ప్రగతిశీల కూటమి (UPA) ని ఓడించడానికి ఏర్పాటు చేయబడింది. ఈ కూటమికి భారతీయ జనతా పార్టీ (BJP) నాయకత్వం వహించింది. ఈ కూటమిలో బిజెపితో సహా సమతా పార్టీ, AIADMK పార్టీ ఇంకా శివసేన ఉన్నాయి, అయితే 2019లో కొన్ని కారణాలవల్ల శివసేన ఈ కూటమి నుండి వైదొలగి కాంగ్రెస్ కూటమిలో చేరింది.[4]

రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతుల జాబితా

గమనిక : ఇక్కడ సూచించిన రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు ఈ కూటమి మద్దతు పొంది ఆ పదవికి ఎన్నికైన వారు.

రాష్ట్రపతులు

No.చిత్రంపేరు
(జననం-మరణం)

పదవి కాలం

మునుపటి పదవిఉపరాష్ట్రపతిParty[5]
11
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్
(1931–2015)
2002 జూలై 252007 జూలై 24ప్రధానమంత్రికి శాస్త్ర పరిశోధన సలహాదారుకృష్ణ కాంత్ (2002)
భైరాన్‌సింగ్ షెకావత్

(2002–07)

స్వతంత్ర అభ్యర్థి 
2002
5 సంవత్సరాలు, 0 రోజులు
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబిదీన్ అబ్దుల్ కలామ్. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు. చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందాడు..[6][7][8]
14
రామ్‌నాథ్‌ కోవింద్‌(b.1945)2017 జూలై 25ప్రస్తుతంబీహార్ రాష్ట్ర గవర్నరుమహమ్మద్ హమీద్ అన్సారీ (2017)

ముప్పవరపు వెంకయ్య నాయుడు (2017–ప్రస్తుతం)

భారతీయ జనతా పార్టీ 
2017
6 సంవత్సరాలు, 269 రోజులు
[9]

ఉప రాష్ట్రపతులు

No.చిత్రంపేరు
(జననం-మరణం)[10]
సంవత్సరం
(% votes)
బాధ్యతలు చేపట్టినదివిరామ తేదీపదవి కాలంరాష్ట్రపతులుపార్టీ
11
భైరాన్‌సింగ్ షెకావత్
(1925–2010)
2002
(59.82)
2002 ఆగస్టు 192007 జూలై 214 సంవత్సరాల, 273 రోజులుఏ.పి.జె. అబ్దుల్ కలామ్భారతీయ జనతా పార్టీ 
13
ముప్పవరపు వెంకయ్య నాయుడు
(1948)
2017
(67.89)
2017ఆగస్టు 11ప్రస్తుతం6 సంవత్సరాలు, 252 రోజులురామ్‌నాథ్‌ కోవింద్‌భారతీయ జనతా పార్టీ 

ఇవి కూడా చూడండి

మూలాలు