అమిస్ ప్రజలు

అమిస్ (చైనీస్: 阿美族; పిన్యిన్: āměi-zúpinyinచైనీస్: 阿美族; పిన్యిన్: āměi-zú; also Ami or Pangcah) తైవాన్లో జీవించే ఆస్ట్రోనేషియన్ జాతి ప్రజలు. వారు ఆస్ట్రోనేషియన్ భాష అయిన అమిస్ భాష మాట్లాడుతూంటారు, తైవాన్ లో అధికారికంగా గుర్తింపు కలిగిన 16 ఆదిమ జాతుల్లో అమిస్ ఒకటి. సాంప్రదాయికంగా నడిమి పర్వతాలకు, పసిఫిక్ కోస్తా మైదానంలోని కోస్తా పర్వతాలకూ మధ్య ఉన్న పొడవాటి, సన్నటి లోయ, కోస్తా ఓర్వతాలకు తూర్పున ఉన్న మైదాన ప్రాంతం, హెంగ్‌చున్ ద్వీపకల్పాలు అమిస్ జాతీయుల నివాస ప్రాంతాలు.

పంటల పండుగ

2014లో అమిస్ ప్రజలు 200,604 మంది ఉన్నారు.[1] తైవాన్ మొత్తం ఆదిమ జనాభాలో ఇది 37.1 శాతం. తద్వారా అమిస్ ప్రజలు తైవానీస్ ఆదిమ ప్రజల్లో అతిపెద్ద సంఖ్యలో ఉన్నారు.[2] తీర ప్రంతంలో ఉండడం చేత వారి ప్రధాన వృత్తి చేపలు పట్టడం. వాళ్ళు సాంప్రదాయికంగా మాతృవంశీకులుగా కొనసాగుటూంటారు. అంటే, వారి వారసత్వం, ఆస్తి సంక్రమణం తల్లి వైపు నుండి జరుగుతూంటుంది. పిల్లలను తల్లి తరపు వారిగా భావిస్తారు.[3]

సాంప్రదాయిక అమిస్ వారి గ్రామాలు ఆదిమ ఇతర జాతుల గ్రామాలతో పోలిస్తే పెద్దవిగా ఉంటాయి. ఒక్కో గ్రామంలో 500 నుండి 1000 మంది వరకూ ఉంటారు. వర్తమన తైవాన్‌లో అమిస్ ప్రజలు పట్టణ ప్రాంతాల్లో స్థిరపడ్డ ఆదిమ జాతుల్లో మెజారిటీగా ఉన్నారు. ఇటీవలి దశాబ్దాల్లో అమిస్ ప్రజలు హాన్ ప్రజలతోను, ఇతర తెగల వారి తోనూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు.[4]

మూలాలు