అమెరికాస్

ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా ఖండాల్లోని భూభాగం

]

అమెరిగో విస్పుక్సి స్మారకంగా అమెరికా అనే పేరు వచ్చింది

అమెరికాస్ లేదా అమెరికా అంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా కలిసిఉన్న భూభాగం.[1][2][3] ఇది భూమి పశ్చిమార్ధ గోళంలో సింహభాగాన్ని ఆక్రమిస్తుంది. దీన్నే కొత్త ప్రపంచం అని కూడా పిలుస్తారు.

అమెరికాస్ లో ఉన్న దీవులను కూడా కలుపుకుంటే భూమి మొత్తం ఉపరితలంలో 8 శాతాన్ని, నేల భాగంలో 28.4 శాతాన్ని ఆక్రమిస్తుంది. దీని స్థలాకృతిలో పశ్చిమ తీరం వెంబడి పొడవైన పర్వతాల శ్రేణి, తూర్పు వైపు అమెజాన్ నది, సెయింట్ లారెన్స్ నది, పెద్ద పెద్ద సరస్సుల, మిస్సిస్సిపి, లా ప్లేటా నదుల పరీవాహక ప్రాంతాలు ఉన్నాయి. అమెరికా ఉత్తరం నుంచి దక్షిణం దాకా 14000 కి.మీ విస్తరించి ఉన్నందున ఇక్కడి వాతావరణం, జీవావరణం వివిధ ప్రాంతాల్లో వైవిధ్యభరితంగా ఉంటాయి. ఉత్తర కెనడా, గ్రీన్ ల్యాండ్, అలస్కా లోని మంచుతో కూడిన టండ్రాలు నుంచి మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలలో ఉష్ణమండల అరణ్యాల దాకా ఉన్నాయి.

42 వేల సంవత్సరాల పూర్వం నుంచి 17 వేల సంవత్సరాల మధ్యలో ఆసియా నుంచి ఇక్కడికి వచ్చి ప్రజలు స్థిరపడ్డారు. తర్వాత నా-డెనీ మాట్లాడే మరికొంత మంది ప్రజలు ఆసియా నుంచే వలసవచ్చారు. సుమారు సా.పూ 3500 ప్రాంతంలో నియో ఆర్కిటిక్ ప్రాంతానికి వచ్చిన ఇన్యూట్ ప్రజల వలసతో అమెరికా దేశీయ ప్రజల స్థిర నివాసం ఏర్పడ్డట్టే.

అమెరికాలో యూరప్ నుంచి వలస వచ్చిన మొట్టమొదటి వాడు నార్స్ అన్వేషకుడు అయిన లీఫ్ ఎరిక్సన్.[4] కానీ వీరి నివాసం ఎంతో కాలం సాగలేదు. కొంతకాలానికి ఈ నివాసాలు పాడుబడిపోయాయి.

మూలాలు