గూగుల్ క్రోమ్

అంతర్జాల విహరిణి

గూగుల్ క్రోమ్ అనేది గూగుల్ సంస్థ రూపొందిన ఒక జాల విహరిణి (వెబ్ బ్రౌజర్). ఇది వివిధ నిర్వహణ వ్యవస్థల్లో (ఆపరేటింగ్ సిస్టమ్స్) పని చేయగలదు. 2008లో దీన్ని మొట్టమొదటిసారిగా మైక్రోసాఫ్ట్ విండోస్ కోసం తయారు చేశారు. తర్వాత లినక్సు, మాక్ ఓఎస్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ లో కూడా పనిచేసేలా రూపొందించారు. దీన్ని ఆధారంగా చేసుకుని గూగుల్ క్రోం ఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టం ను తయారు చేశారు. వెబ్ అనువర్తనాల (అప్లికేషన్లు) దీని మీద పని చేస్తాయి.

గూగుల్ క్రోమ్

దీని చాలా భాగం సోర్సు కోడు గూగుల్ ఓపెన్ సోర్స్ లో విడుదల చేసిన క్రోమియం ప్రాజెక్టు లోనిది. గూగుల్ దీన్ని ప్రొప్రయిటరీ ఫ్రీవేర్ లాగా విడుదల చేసింది. మొదట్లో వెబ్ కిట్ ఇంజన్ ఆధారంగా అభివృద్ధి చేసినా తర్వాత గూగుల్ ఈ ప్రాజెక్టుకు సమాంతరంగా బ్లింక్ ఇంజన్ ని అభివృద్ధి చేసి, దాన్ని ఆధారం చేసుకున్నారు. ఐఓఎస్ మీద పనిచేసే క్రోం బ్రౌజరు తప్ప మిగతా వన్నీ బ్లింక్ ఇంజన్ ఆధారంగానే పనిచేస్తాయి.[1]

జులై 2019 నాటి గణాంకాల ప్రకారం బ్రౌజర్ మార్కెట్ లో ప్రపంచ వ్యాప్తంగా సాంప్రదాయిక కంప్యూటర్లలో గూగుల్ క్రోమ్ వాటా 71% గానూ, అన్ని రకాల కంప్యూటర్లలో 63% గానూ ఉంది.[2][3] ఇంత ఆదరణ పొందడం వల్లనే గూగుల్ క్రోమ్ బ్రాండును క్రోమ్ ఓ ఎస్, క్రోమ్ క్యాస్ట్, క్రోమ్ బుక్, క్రోమ్ బిట్, క్రోమ్ బాక్స్, క్రోమ్ బేస్ లాంటి ఇతర ఉత్పత్తులకు కూడా విస్తరించింది.

ఇవి కూడా చూడండి

గమనికలు

మూలాలు