చంద్రికా కుమరతుంగా

శ్రీలంక మాజీ రాష్ట్రపతి

చంద్రికా బండారునాయకే కుమారతుంగా  (జననం 29 జూన్ 1945), శ్రీలంకకు చెందిన రాజకీయ నాయకురాలు. 12 నవంబరు 1994 నుంచి 19 నవంబరు 2005 వరకు శ్రీలంక రాష్ట్రపతిగా  పనిచేశారు. శ్రీలంకకు 5వ రాష్ట్రపతిగా పనిచేయడమే కాక, ఇప్పటివరకు ఆ దేశానికి రాష్ట్రపతిగా పని చేసిన ఏకైక మహిళగా చరిత్ర సృష్టించారు చంద్రికా. ఆమె తల్లిదండ్రులిద్దరూ శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్.ఎల్.ఎఫ్.పి) నుంచి ఆ దేశ ప్రధాన మంత్రులుగా పనిచేయడం మరో విశేషం. ఆ పార్టీకి 2005 వరకు చంద్రికా నాయకురాలిగా కూడా  వ్యవహరించారు.[1][2][3]

Chandrika Bandaranaike Kumaratunga As The President of Sri Lanka.jpg
చంద్రికా కుమరతుంగా

తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం

చంద్రికా కుటుంబం శ్రీలంక చరిత్రలో మొదట్నుంచీ రాజకీయాల్లో ఉన్న కుటుంబం. ఆమె తండ్రి సోలోమన్ బండారునాయకే ఆ దేశానికి ప్రధాన మంత్రిగా పనిచేశారు. చంద్రికా పుట్టే సమయానికి ప్రభుత్వంలో ఆయన ఒక మంత్రిగా చేస్తున్నారు. 1959లో చంద్రికా 14 ఏళ్ళ వయసులో ఆయన చనిపోయారు. ఆమె తల్లి సిరిమావో బండారు నాయకే  1960లో  ప్రధాన మంత్రి అయ్యారు. సిరిమావో ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. చంద్రికా తమ్ముడు అనురా బండారునాయకే శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ గా పనిచేశారు. ఆయన మార్చి 2008న చనిపోయారు. ఆమె అక్క సునెత్రా బండారునాయకే ప్రముఖ దాత, సునెరా ట్రస్టు నడుపుతుంటారు. సిలోనులో బ్రిటీష్ ప్రభుత్వం ఉండేటప్పుడు చంద్రికా తాతగారు సర్ సలోమన్ డియాస్ బండారునాయకే సిలోను ప్రతినిధి, సలహాదారు మహా ముదలియారుగా పనిచేసేవారు.[4]

కొలంబోలోని సెయింట్ బ్రిడ్జెట్స్ కాన్వెంట్ లో విద్యాభ్యాసం చేశారు చంద్రికా. ఆక్వినస్ యూనివర్శిటీ కాలేజ్ కొలొంబోలో లా లో బాచిలర్ డిగ్రీ  చదివారు ఆమె. పారిస్ విశ్వవిద్యాలయంలో స్కాలర్ షిప్ పై 1970లో రాజకీయ శాస్త్రం, అంతర్జాతీయ సంబంధాలపై చదువుకున్నారు. పారిస్ లో ఆమె ఐదేళ్ళ పాటు ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడే అదే విశ్వవిద్యాలయంలో సమూహ నాయకత్వంపై డిప్లమో కోర్స్ చేశారు. పారిస్ లోని లీ మొండే అనే పత్రికలో రాజకీయ విభాగంలో విలేకరిగా కూడా పనిచేశారు చంద్రికా. 1970-73లో ఆర్ధికాభివృద్ధి శాస్త్రంలో డాక్టరేట్ చేస్తుండగా, ఆమె తల్లి ప్రభుత్వం శ్రీలంకలో సామ్యవాద సంస్కరణలు, అభివృద్ధికి విస్తృత కార్యక్రమం మొదలుపెట్టిన కారణంగా, మధ్యలో ఆపి ఆమె రాజకీయాలలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది.[5]   చంద్రికా ఫ్రాన్స్ లో ఉండగా 1968 విద్యార్ధి విప్లవంలో క్రియాశీలకంగా  పనిచేశారు.[6] ఆమె సింహళఇంగ్లీష్ఫ్రెంచి భాషలు అనర్గళంగా  మాట్లాడగలరు.[7]

1978లో శ్రీలంక రాజకీయ నాయకురాలు, సినిమా నటుడు విజయ కుమారతుంగాను పెళ్ళి చేసుకున్నారు చంద్రికా.

మూలాలు