జంతు ప్రదర్శనశాల

జంతువులను సంరక్షణ చేస్తూ, ప్రజల ప్రదర్శనకోసం జంతువులన్నింటిని ఒకచోట ఉంచే ప్రదేశం.

జంతు ప్రదర్శనశాల, జంతువులను సంరక్షణ చేస్తూ, ప్రజల ప్రదర్శనకోసం జంతువులన్నింటిని ఒకచోట ఉంచే ప్రదేశం. కొన్ని సందర్భాల్లో జంతువుల పెంపకం చేయడం జరుగుతుంది.

"జూలాజికల్ గార్డెన్" అనే పదం జంతుశాస్త్రం, జంతువుల అధ్యయనాన్ని తెలియజేస్తుంది. ఈ పదాన్ని గ్రీకుభాషలోని జూన్ (జంతువు), లోజియా (అధ్యయనం) అనే పదాల నుండి తీసుకోబడింది. "జూ" అనే పదాన్ని మొదట లండన్ లోని జూలాజికల్ గార్డెన్స్ కోసం ఉపయోగించారు. 1828లో శాస్త్రీయ అధ్యయనం కోసం, 1847లో ప్రజల కోసం ఈ గార్డెన్స్ తెరవబడింది.[1] అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఏటా 181 మిలియన్ల మంది జంతు ప్రదర్శనశాలలను సందర్శిస్తారు.[2]

ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రదర్శనశాలలు, చిన్న జంతు ప్రదర్శనశాలు (interactive map)
ఫిన్‌లాండ్ లోని హెల్సింకిలోని కోర్కేసారీ జంతు ప్రదర్శనశాలలో వున్న సైబీరియన్ పులి

1828లో లండన్‌ జంతు ప్రదర్శనశాల ప్రారంభమైన తరువాత దీనిని జులాజికల్‌ గార్డెన్‌ అని పిలిచేవారు. 1847లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో మొదటిసారిగా ‘జూ’ అనే పదాన్ని ఉపయోగించి, క్లిఫ్టన్‌ జూ అనే పేరు పెట్టారు. ఇరవయ్యేళ్ల అనంతరం మ్యూజిక్ హాల్‌ కళాకారుడు ఆల్ఫ్రెడ్‌ వాన్స్‌ రూపొందించిన ‘వాకింగ్‌ ఇన్‌ ద జూ ఆన్‌ సన్‌డే’ గీతంలో ఈ 'జూ' అనే పదాన్ని వాడడం ద్వారా ఈ పదం ప్రాచుర్యం పొందింది.[3] 1891లో వాషింగ్టన్‌ డిసిలోనూ, 1899లో న్యూయార్క్‌లోని బ్రాంక్స్‌లోనూ ప్రారంభించబడిన పార్కు కోసం ‘జులాజికల్‌ పార్క్‌’ అనే పదం వాడబడింది.[4]

20వ శతాబ్దం చివరలో ‘అభయారణ్యాలు‌’ లేదా ‘జీవావరణాలు’ అనే పదాలు జంతు ప్రదర్శనశాలలకు పర్యాయ పదాలుగా ఉపయోగించడం ప్రారంభమైంది. 19వ శతాబ్దంలో కొంతమంది జూ నిపుణులు తమ సంస్థలను రోజువారీ మూస విధానం నుంచి దూరం చేయాలన్న ఆలోచనతో ఈ కొత్తపదాన్ని పుట్టించారు.[5] 1980 దశాబ్దం చివరలో వాషింగ్టన్‌ డిసిలోని నేషనల్‌ జూ యాజమాన్యం "జీవారణ్యం" అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది.[6] 1993లో న్యూయార్క్ జూలాజికల్ సొసైటీ పేరును వన్యప్రాణుల సంరక్షణ సొసైటీగా మార్చుకొని, దాని పరిధిలోని జంతు ప్రదర్శనశాలలను "వన్యప్రాణుల సంరక్షణ పార్కులు"గా మార్చింది.[7]

చరిత్ర

రాయల్ జంతు ప్రదర్శనశాలలు

అనేక శతాబ్దాలుగా ఇంగ్లాండు రాజ జంతు ప్రదర్శనశాలను కలిగివున్న లండన్ టవర్ (15వ శతాబ్దంలోని చిత్రం, బ్రిటిష్ లైబ్రరీ)

జంతు ప్రదర్శనశాలలకు ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 2009లో ఈజిప్టులోని హిరాకోన్‌పోలిస్‌లో పురాతన జంతుశాస్త్ర సేకరణ జరిగిన తవ్వకాలలో క్రీస్తుపూర్వం 3500కు చెందిన జంతు ప్రదర్శనశాల బయటపడింది. అందులో నీటిగుర్రాలు, ఏనుగులు, కొండముచ్చులు, నీటి ఏనుగులు, అడవిదున్నలు, గండుకోతులు, అడవి పిల్లులు వంటి అరుదైన జంతువులున్నాయి.[8] కింగ్ అఫ్ వెన్‌ ఆఫ్‌ జ్యూ గార్డెన్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌ అని పిలువబడే 1500 ఎకరాల జంతు ప్రదర్శనశాలను నిర్మించాడు. క్రీస్తుపూర్వం నాల్గవ శతాబ్దంలోనే గ్రీకు నగరాల్లో అనేక జంతు ప్రదర్శనశాలలుండేవి; అలెగ్జాండర్ తన సైనిక దండయాత్రలలో కనుగొన్న కొన్ని జంతువులను గ్రీస్‌ దేశానికి పంపినట్లు కూడా తెలుస్తుంది. కొందరు రోమన్‌ చక్రవర్తులు తమ అధ్యయనాల కోసం లేదా పోటీలో ఉపయోగించుకోవడం కోసం వ్యక్తిగతంగా జంతువులను సేకరించేవారు, తరువాత వాటిని క్రూరంగా హింసించేవారు.

మధ్యయుగం

17 వ శతాబ్దంలో లూయిస్ XIV పాలనలో ప్యాలెస్ ఆఫ్ వెర్సైల్లెస్ జంతుప్రదర్శనశాల

ఆస్ట్రియాలోని వియన్నాలోని టైర్‌గార్టెన్ షాన్బ్రన్ అనేది ప్రపంచంలోని పురాతన జంతు ప్రదర్శనశాల. దీనిని 1752లో ఆస్ట్రియాకు చెందిన మరియా థెరిసా భర్త పవిత్ర రోమన్ చక్రవర్తి ఫ్రాన్సిస్ I ఆదేశాల మేరకు అడ్రియన్ వాన్ స్టెఖోవెన్ నిర్మించాడు. ఇది షున్‌బ్రన్ ప్యాలెస్‌లో భాగంగా ఒక రాజ్య జంతు ప్రదర్శనశాలగా పనిచేసింది. తొలిరోజుల్లో రాజ కుటుంబం ఆనందం కోసం రిజర్వు చేయబడిన ఈ జంతుప్రదర్శనశాల, 1765లో ప్రజలకు అందుబాటులో ఉంచబడింది. 1775లో మాడ్రిడ్‌లో ఒక జూ స్థాపించబడింది. 1795లో పారిస్‌లోని జార్డిన్ డెస్ ప్లాంటెస్ లోపల ఉన్న జూను జాక్వెస్-హెన్రీ బెర్నార్డిన్ స్థాపించాడు.

ఆధునిక కాలం

ఆస్ట్రియాలోని వియన్నా జూ అత్యంత పురాతనమైనది. వియన్నాలోని షాన్‌బోర్న్‌ ప్యాలెస్‌లోని రాచరిక మేనేజరీ నుంచి అభివృద్ధి చెందిన ఈ జూను 1752లో హాస్‌బర్గ్‌ రాజవంశీయులు స్థాపించారు. 1765లో ప్రజల సందర్శనకు అనుమతి ఇచ్చారు. 1775లో మాడ్రిడ్‌లో ఒక జూను స్థాపించారు, 1795లో జాక్వెస్‌ హెన్రీ బెర్నాడియన్‌ చే పారిస్‌లోని జార్డిన్‌ డీస్‌ ప్లాంట్స్ ‌లో వేర్సైల్స్ రాయల్‌ మేనేజరీ నుంచి తెచ్చిన జంతువులతో శాస్త్రీయ అధ్యయనం కోసం ఒక జంతు ప్రదర్శనశాలను ఏర్పాటుచేశారు. 1806లో రష్యాలోని మొట్టమొదటి జంతు ప్రదర్శనశాల కజాన్‌ జూ ను కజాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కర్ల్‌ ఫచెస్ స్థాపించారు. 1826లో స్టాంఫర్డ్‌ రఫెల్స్‌చే స్థాపించబడిన లండన్‌ జులాజికల్‌ సొసైటీ, 1828లో రీజెంట్స్‌ పార్క్‌లో లండన్‌ జూ ఏర్పాటు చేసే సమయంలో పారిస్‌ జూను స్ఫూర్తిగా తీసుకొని నిర్మించారు. 1847లో కొంత రుసుము చెల్లించే పద్ధతిలో సందర్శకులను అనుమతించారు. 1860ల ప్రారంభంలో ఈ జూ మైదానంలో 40 హెక్టార్లలో అనేక పూల, అలంకార చెట్లు, పిక్నిక్ ప్రాంతాలు, విగ్రహాలు, నడక మార్గాలు, పక్షిశాల, ఆక్వేరియం, జంతువుల, పక్షుల మ్యూజియం, చెరువు, జలపాతం మీద వంతెన, ఫౌంటెన్‌తో కృత్రిమ సరస్సు, కలపతో అలంకరించబడిన ఇల్లు, అడవి ప్రాంతం, భవనాలు ఏర్పాటు చేయబడ్డాయి.[9][10][11] 1860లో ఏర్పాటైన మెల్‌బోర్న్‌ జంతు ప్రదర్శనశాల ఆస్ట్రేలియాలోని తొలి జంతుప్రదర్శన. అదే సంవత్సరంలో, న్యూయార్క్‌లో ప్రారంభమైన సెంట్రల్‌పార్క్‌ జూ అమెరికాలోని మొదటి బహిరంగ జంతు ప్రదర్శనశాల. అంతకుముందు 1859లో ఫిలడెల్ఫియా జులాజికల్‌ సొసైటీ ఒక జంతుప్రదర్శనశాల స్థాపనకు కృషి చేసింది, కానీ అమెరికా పౌరయుద్ధం కారణంగా అది 1874వరకు ప్రారంభం కాలేదు.

లండన్ జూ, 1835
నెహ్రూ జంతుప్రదర్శనశాల, హైదరాబాదు

1853లో ప్రపంచంలోని మొట్టమొదటి పబ్లిక్ అక్వేరియంను ప్రారంభించబడింది. బతికున్న జంతువులపై అధ్యయనం చేయటానికి ఆసక్తి ఉన్న వైద్యబృందం 1831లో డబ్లిన్ జూను ప్రారంభించారు.[12]

ఇవికూడా చూడండి

  1. నెహ్రూ జంతుప్రదర్శనశాల (హైదరాబాదు)
  2. ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల (విశాఖపట్టణం)
  3. జాతీయ జంతుప్రదర్శనశాల (ఢిల్లీ)

మూలాలు

ఇతర లంకెలు