దేశభక్తి

దేశభక్తి ప్రజలకు వారు జన్మించిన దేశం (మాతృభూమి లేదా పితృభూమి) మీద గల మక్కువ. ఇది ఒక ప్రాంతం లేదా పట్టణం లేదా గ్రామం కూడా కావచ్చును. ఇలాంటి దేశభక్తులు వారి దేశం సాధించిన ప్రగతి, సంప్రదాయాలు మొదలైన వాటిని గర్వంగా భావిస్తారు. దేశభక్తి, జాతీయతా భావం ఒకటే. దేశభక్తిలో వ్యక్తికంటే దేశానికే ప్రాధాన్యత ఎక్కువ. ఇది ముఖ్యంగా జాతీయ రక్షణ వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాణాన్ని కూడా త్యాగం చేయడాన్ని వీరు గర్వంగా భావిస్తారు. దేశభక్తి నిర్వచిస్తూ దేశం పట్ల ప్రేమ, విధేయత అని చెప్పడం జరిగింది[1].

విద్యార్థులు మాతృభూమిని రక్షించడం:పారిస్ లోని శిల్పం.

అవలోకనం

దేశభక్తి అంటే దేశం, చరిత్ర, సంప్రదాయాల పట్ల ప్రేమ, గౌరవం భావన. దేశభక్తులు  తమ దేశ అభివృద్ధికి, దాని చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తారు,దేశ సంస్కృతి పట్ల ప్రేమను పెంపొందించడం. దేశ భక్తి కొరకు చరిత్రలో  చాలా మంది తమ దేశాలకు సేవ చేసి, ప్రాణాలను కూడా అర్పించారు. ఇప్పటికీ చాలా మంది అంతే భక్తి శ్రద్ధలతో తమ దేశానికి నిస్వార్థంగా సేవ చేస్తూనే ఉన్నారు. దీనికి ఉదాహరణగా  భారత స్వాతంత్ర్య సమరంలో ఎంతో మంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోవడం జరిగింది[2].

చరిత్ర

దేశభక్తి 19 వ శతాబ్దంలో జాతీయవాదం ఉద్భవించడానికి సుమారు 2,000 సంవత్సరాల ముందు మూలాలను కలిగి ఉంది.దేశభక్తి అనేది గ్రీకు పదమైన పత్రిస్ నుండి వచ్చింది, దీని అర్థం మాతృభూమి. గ్రీకు ముఖ్యంగా రోమన్ ప్రాచీనత ఒక రాజకీయ దేశభక్తికి మూలాలను అందిస్తుంది. దేశభక్తి అంటే దేశం పట్ల ప్రేమ, విధేయత అనే దానిని బట్టి ఈ నిర్వచనం జాతీయ విధేయత భావనను సూచిస్తుంది. దేశభక్తి అనేది గ్రీకు పదమైన పత్రిస్ నుండి వచ్చింది, దీని అర్థం మాతృభూమి. దేశభక్తి (ప్రేమ), జాతీయవాదం (విధేయత)  పర్యాయపదాలుగా పరిగణించబడతాయి. 

దేశభక్తి ని తెలుపుతూ

దేశభక్తి అనే భావన బహుముఖమైనది, వివిధ మార్గాల్లో వ్యక్తులకు ఉండటం జరుగుతుంది. దేశభక్తులు ప్రభుత్వ విధానాలకు మద్దతిచ్చే వ్యక్తులుగా వారిగా పేర్కొనవచ్చును. అందులో భాగంగా  ప్రజల కోసం అధికార ప్రతినిధిగా ఉండి వ్యక్తీకరణ ప్రభుత్వ  అన్యాయంగా చేసే చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడడం దేశభక్తుడి కర్తవ్యం అని ప్రజలు కోరుకుంటారు[3].

ఉదాహరణ

దేశభక్తి కి నిదర్శనంగా జాతీయ గీతం కోసం నిలబడటం, విధేయత ప్రతిజ్ఞను పఠించడం స్పష్టంగా కనిపిస్తాయి.దీనిని మనం  ప్రయోజనకరమైన దానిగా,  దేశాన్ని ఐకమత్యంగా, గౌరవించేవి, బలోపేతం చేసే చర్యలుగా ఉంటాయి. ఎన్నికలలో ఓటు వేయడానికి నమోదు చేసుకోవడం ద్వారా ప్రాతినిధ్య ప్రజాస్వా మ్యంలో పాల్గొంటారు. దేశం కోసం స్వచ్ఛందంగా పనిచేయడం లేదా ఎన్నుకోబడిన ప్రభుత్వ పదవికి పోటీ చేయడం, దేశ లోని అన్ని చట్టాలను గౌరవించి. పాటించి సహేతుకరమైన పన్నులు చెల్లిస్తున్నారు. దేశ  రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, స్వేచ్ఛలు, బాధ్యతలను అర్థం చేసుకోవడం వంటివి గా పేర్కొనవచ్చును [4].

మూలాలు