న్యాంజింగు ఊచకోత

రెండవ చైనా-జపాను యుద్ధంలో జపాను సైన్యంచేత చైనాలోని న్యాంజింగు ఊరి ప్రజలను పలురకాల వేధింపులకు గురి అయ్యారు. ఇళ్ళు, కొట్లు, చేలు తగలబెట్టబడ్డాయి, పెద్దా చిన్నా తేడా లేకుండా లక్షల మంది చంపబడ్డారు, వందల వేల అడవారు చెరచబడ్దారు. 1937 డిసెంబరు 13న మొదలైన ఊచకోత ఆరు వారాల వరకు ఆపులేకుండా సాగింది. యుద్ధం తరువాత జపాను ప్రభుత్వం చాలా సాక్ష్యాధారాలు చెరిపివేయడం వలన జరిగిన ప్రాణనష్టం సరిగా తెలియదు. కాని అంచనాల ప్రకారం రెండు మూడు లక్షల మందైనా చనిపోయారని చెప్పవచ్చు. ఈ ఘటన వలన నేటికీ చైనా-జపాను మధ్య సంబంధం కుదుటపడలేదు. ఇప్పటికీ జపానులో కొందరు రాజకీయ నాయకులునూ పాత సైనికులు ఇటువంటి ఘటన ఏదీ జరగలేదని, ఇవన్నీ జపానుకు చెడ్డపేరు తేవడానికి చైనా అల్లిన కథలని చెప్తారు.

న్యాంజింగు ఊచకోత
the Second Sino-Japanese Warలో భాగము

కింహువాయి ఒడ్డున చైనీయుల శవాలు. నిలబడి ఉన్నవాడు జపాను సైనికుడు.
తేదీడిదెంబరుr 13, 1937 – జ్యానువరీ 1938
ప్రదేశంNanjing, China
ఫలితం
  • 50,000–300,000 మంది చావు (ప్రాథమిక మూలాలు)[1][2]
  • 40,000–300,000 మంది చావు (చరిత్రకారుల అంచనా)[3]
  • 300,000 మంది చావు (చైనా ప్రభుతవం అంచనా)[4][5][6]

మొదలు

20వ శతాప్పతపు మొదటిలొ పరిశ్రమల పెరుగుదలతో జపానుకు సైనిక బలం, బలగం బాగా ఎక్కువయింది. జపానులో మైజీ పేరున నెలకొన్న సామ్రాజ్యానికి ప్రపంచానికే సార్వభౌమత్వం వహించాలన్న కోరిక కలిగింది. ఆ కోరిక నెరవేర్చుకునే క్రమంలో మొదటడుగుగా ఆగస్టు 1937లో శంఘైపై దాడి చేపట్టారు. చివరికి గెలిచినా, జపానుకు శంఘైపై గెలుపు అంత సులువుగా చిక్కలేదు. ఎందరో సైనికులు ప్రాణాలు కోలిపోయినందు వలన జపాను సైన్యం నిరాశా నిస్పృహలకు లోనయి, కొన్ని నాళ్ళ కోసం యుద్ధం నిలిపివేయాలని అనుకుంది. కాని డిసెంబరు ఒకటిన టోక్యోలోని సేనాధిపతి కార్యాలయం నుండి నాటి చైనా రాజధానైన న్యాంజింగుపై దండయాత్రకు బైలుదేరవలసినదిగాఆదేశాలు వచ్చాయి. శంఘైలో ఓటమిపాలైన చైనాకు, న్యాంజింగుపై పెద్దగా ఆశలు లేవు. చైనా పొలిమేరల దగ్గరున్న న్యాంజింగులో మెండైన సైనికులను కోల్పోకుండా, జపానును నడి-చైనాకు రప్పించి, అక్కడ దెబ్బతీద్దామని, నాటి చైనా అధినేత చియాంగ్-కై-శెక్ తలపెట్టాడు. ఆమేరకు న్యాంజింగు నుండి సైనికులను విరమించడం జరిగింది. న్యాంజింగు చైనాను కాపాడవలసిన ఎరగా మారింది.

మూలాలు