పబ్‌మెడ్ సెంట్రల్

 

పబ్‌మెడ్ సెంట్రల్
తయారీయునైటెడ్ స్టేట్స్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ (అమెరికా)
చరిత్ర2000 నుండీ
Access
ధరఉచితం
Coverage
రంగాలువైద్యరంగం
రికార్డు లోతుసూచిక, సారాంశం, పూర్తి పాఠ్యం
ఆకృతి కవరేజివైజ్ఞానిక పత్రికల్లోని వ్యాసాలు
రికార్డుల సంఖ్య97,00,000 Edit this on Wikidata

పబ్‌మెడ్ సెంట్రల్ ( PMC ) అనేది బయోమెడికల్, లైఫ్ సైన్సెస్ కు చెందిన శాస్త్ర పత్రికల్లో ప్రచురితమైన, స్వేచ్ఛగా అందుబాటులో ఉండే పూర్తి వ్యాసాలను ఆర్కైవు చేసే ఉచిత డిజిటల్ గ్రంథాలయం. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) అభివృద్ధి చేసిన ప్రధాన పరిశోధన డేటాబేస్‌లలో ఒకటైన పబ్‌మెడ్ సెంట్రల్, డాక్యుమెంట్ రిపోజిటరీ కంటే మించినది. PMCకి సమర్పించిన వ్యాసాలను ఇండెక్స్ చేసి, ఒక ఆకృతిలో పేరుస్తారు. తద్వారా మెరుగైన మెటాడేటా, మెడికల్ ఆంటాలజీ, XML ఆకృతి లోని డేటాను సుసంపన్నం చేసే ప్రత్యేక ఐడెంటిఫైయర్‌లు అందుబాటు లోకి వస్తాయి. [1] PMCలోని కంటెంటును ఇతర NCBI డేటాబేసులకు లింకు చేయవచ్చు. ఎంట్రెజ్ సెర్చ్, రిట్రీవల్ వ్యవస్థల ద్వారా ఆ దేటాను చూడవచ్చు. దానివలన బయోమెడికల్ విజ్ఞానాన్ని వెతకడం, చదవడం, మరింతగా అభివృద్ధి చెయ్యడం వంటి సామర్థ్యాలు మరింత మెరుగవుతాయి.[2]

పబ్మెడ్ సెంట్రల్ పబ్‌మెడ్ కంటే భిన్నమైనది. [3] పబ్‌మెడ్ సెంట్రల్ అనేది పూర్తి వ్యాసాల ఉచిత డిజిటల్ ఆర్కైవు. దీన్ని వెబ్ బ్రౌజర్ ద్వారా ఎక్కడి నుండైనా ఎవరైనా చూడవచ్చు (పునర్వినియోగం కోసం వివిధ ఏర్పాట్లతో). దీనికి విరుద్ధంగా, పబ్‌మెడ్ బయోమెడికల్ ఉల్లేఖనాలను, 0సారాంశాలను శోధించదగిన డేటాబేస్ అయినప్పటికీ, పూర్తి వ్యాసాలు అక్కడ ఉండవి, మరెక్కడో - ముద్రణలోనో లేదా ఆన్‌లైన్‌లోనో, ఉచితంగా గానీ లేదా చందాదారుల పేవాల్ వెనుక గానీ - ఉంటాయి.

2018 డిసెంబరు నాటికి, PMC ఆర్కైవ్‌లో 52 లక్షల వ్యాసాలు ఉన్నాయి. [4] ప్రచురణకర్తలు లేదా రచయితలు తమ మాన్యుస్క్రిప్ట్‌లను NIH పబ్లిక్ యాక్సెస్ పాలసీ ప్రకారం రిపోజిటరీలో జమ చేస్తారు. మునుపటి డేటాను పరిశీలిస్తే, 2013 జనవరి నుండి 2014 జనవరి వరకు రచయితలే ప్రారంభించిన డిపాజిట్లు ఈ 12 నెలల కాలంలో 1,03,000 పేపర్‌లను మించిపోయాయి. [5]PMC రిపోజిటరీలో డిపాజిట్ చేస్తున్న జర్నల్‌లు సుమారు 4,000 ఉన్నట్లు PMC గుర్తించింది. [6] కొంతమంది ప్రచురణకర్తలు పబ్‌మెడ్ సెంట్రల్‌లో తమ కథనాలను ప్రచురించిన తర్వాత, ఒక నిర్ణీత సమయం తరువాతనే విడుదల చేస్తారు, దీనిని "నిషేధ కాలం"గా సూచిస్తారు. పత్రికను బట్టి ఇది కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. (ఆరు నుండి పన్నెండు నెలల నిషేధాలు సర్వసాధారణం.) పబ్మెడ్ సెంట్రల్ అనేది "మూడవ పక్షం ద్వారా క్రమబద్ధమైన పంపిణీ"కి ఒక ముఖ్య ఉదాహరణ. [7] చాలా మంది ప్రచురణకర్తల సహకార ఒప్పందాలలో ఈ పద్ధతిపై ఇంకా నిషేధం ఉంది.

స్వీకారం

2000 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ రిపాజిటరీ, NIH పబ్లిక్ యాక్సెస్ పాలసీ నిధులు అందించే అన్ని పరిశోధనలను ఎవరికైనా ఉచితంగా అందుబాటులో ఉంచేలా రూపొందించడంతో వేగంగా అభివృద్ధి చెందింది. పైగా, చాలా మంది ప్రచురణకర్తలు తమ రచనలను ఉచితంగా అందించడానికి NIHతో కలిసి పనిచేస్తున్నారు. 2007 చివరలో, కన్సాలిడేటెడ్ అప్రాప్రియేషన్స్ యాక్ట్ ఆఫ్ 2008 (HR 2764) చట్టంపై సంతకం చేసారు. NIH-నిధులతో జరిగే పరిశోధనల్లో పరిశోధన ఫలితాల పూర్తి ఎలక్ట్రానిక్ కాపీలను PubMed సెంట్రల్‌లో చేర్చాలని కోరుతూ ఒక నిబంధనను చేర్చింది. ఈ వ్యాసాలను ప్రచురించిన 12 నెలలలోపు చేర్చాలి. తమ పరిశోధనలను బహిరంగంగా అందుబాటులో ఉంచాలని అమెరికా ప్రభుత్వం ఏదైనా ఏజెన్సీని కోరడం ఇదే మొదటిసారి. ఇది 2005 విధానమైన "స్వచ్ఛందంగా" పబ్‌మెడ్ సెంట్రల్‌కు జోడించడం నుండి చేసిన మార్పు. [8]

పబ్‌మెడ్ సెంట్రల్ సిస్టమ్ యొక్క UK వెర్షన్, UK పబ్‌మెడ్ సెంట్రల్ (UKPMC), వెల్‌కమ్ ట్రస్ట్, బ్రిటిష్ లైబ్రరీల ద్వారా UK పరిశోధనా నిధులతో కూడిన తొమ్మిది మంది బృందంలో భాగంగా అభివృద్ధి చేయబడింది. ఈ వ్యవస్థ 2007 జనవరిలో అందుబాటులోకి వచ్చింది. 2012 నవంబరు 1 న, ఇది యూరప్ పబ్‌మెడ్ సెంట్రల్‌గా మారింది. పబ్మెడ్ సెంట్రల్ ఇంటర్నేషనల్ నెట్‌వర్కు లోని కెనడియన్ సభ్యులైన, పబ్మెడ్ సెంట్రల్ కెనడాను 2009 అక్టోబరులో ప్రారంభించారు.

PMCID

PMCID (పబ్‌మెడ్ సెంట్రల్ ఐడెంటిఫైయర్), PubMed సెంట్రల్ ఓపెన్ యాక్సెస్ డేటాబేస్‌కు చెందిన ఒక ఐడెంటిఫైయరు. దీన్ని PMC రిఫరెన్స్ నంబర్ అని కూడా పిలుస్తారు. PubMed డేటాబేస్‌కు PMID ఎలాంటి బిబ్లియోగ్రాఫిక్ ఐడెంటిఫైయరో, PMC కి PMCID అలాగ. అయితే ఈ రెండు ఐడెంటిఫైయర్‌లు విభిన్నంగా ఉంటాయి. ఈ ఐడెంటిఫయరులో "PMC" అనే అక్షరాలతో పాటు ఏడు అంకెల సంఖ్య ఒకటి ఉంటుంది. ఇలా: [9]

  • PMCID: PMC1852221

NIH అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునే రచయితలు తప్పనిసరిగా తమ దరఖాస్తులో PMCIDని చేర్చాలి.

ఇవి కూడా చూడండి

  • PMID (పబ్‌మెడ్ ఐడెంటిఫైయర్)

మూలాలు