పారిశ్రామికీకరణ

పారిశ్రామికీకరణ మానవ సమూహాలను వ్యావసాయిక సమాజం నుండి పారిశ్రామిక సమాజంగా మార్చిన సాంఘిక ఆర్ధిక మార్పుల కాలం. వస్తూత్పత్తి కోసం ఆర్థిక వ్యవస్థ విస్తృతమైన పునర్వ్యవస్థీకరణకు లోనైన కాలం ఇది. [2]

19 వ శతాబ్దంలో ఆదాయ స్థాయిలు పెరగడం ద్వారా పారిశ్రామికీకరణ ప్రభావం చూపబడింది. స్థూల దేశీయోత్పత్తి (వద్ద కొనుగోలు శక్తి తుల్యత ) తలసరి 1990 1750, 1900 మధ్య సంయుక్త డాలర్లు కోసం మొదటి ప్రపంచ దేశాలు (యూరోప్, యునైటెడ్ స్టేట్స్, కెనడా, జపాన్), మూడవ ప్రపంచ దేశాలు (ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ). [1]
2005 నాటి ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిని చూపించే మ్యాప్.

పారిశ్రామిక కార్మికుల ఆదాయాలు పెరిగేకొద్దీ, అన్ని రకాల వినియోగదారుల వస్తు, సేవల మార్కెట్లు విస్తరిస్తాయి. పారిశ్రామిక పెట్టుబడులకు, ఆర్థిక వృద్ధికీ మరింత చోదకశక్తిని అందిస్తాయి.

నేపథ్యం

తొలి-పారిశ్రామికీకరణ చివరి దశ తరువాత, వ్యవసాయంనుండి పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థకు జరిగిన మొదటి పరివర్తనను పారిశ్రామిక విప్లవం అని పిలుస్తారు. ఇది 18 వ శతాబ్దం మధ్య నుండి 19 వ శతాబ్దం ప్రారంభం వరకు ఐరోపా లోను, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలలోనూ జరిగింది. గ్రేట్ బ్రిటన్లో మొదలై, ఆ తరువాత బెల్జియం, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్సు లకు పాకింది. [3] సాంకేతిక పురోగతి, గ్రామీణ పనుల నుండి పారిశ్రామిక శ్రమకు మారడం, కొత్త పారిశ్రామిక వ్యవస్థలో ఆర్థిక పెట్టుబడులు, వర్గ స్పృహలో ప్రారంభ పరిణామాలు, తత్సంబంధిత సిద్ధాంతాలు మొదలైనవి ఈ ప్రారంభ పారిశ్రామికీకరణ లక్షణాలు. తరువాతి కాలంలో, వ్యాఖ్యాతలు దీన్ని మొదటి పారిశ్రామిక విప్లవం అన్నారు. [4]

19 వ శతాబ్దం మధ్యలో ఆవిరి యంత్రానికి మెరుగుపరచడం, అంతర్గత దహన యంత్రపు ఆవిష్కరణ, విద్యుత్తును ఉపయోగించడం, కాలువలు, రైల్వేలు, విద్యుత్-శక్తి నిర్మాణం తరువాత వచ్చిన మార్పులన్నిటినీ కలిపి "రెండవ పారిశ్రామిక విప్లవం" అని అంటారు. అసెంబ్లీ లైన్‌ను ప్రవేశపెట్టడం ఈ దశకు ఊపునిచ్చింది. ఇళ్ళ స్థానంలో బొగ్గు గనులు, ఉక్కు కర్మాగారాలు, వస్త్ర కర్మాగారాలు మొదలైనవి పని ప్రదేశంగా మారాయి. [5] [6] [7]

20 వ శతాబ్దం చివరి నాటికి, తూర్పు ఆసియా ప్రపంచంలోని సరికొత్త పారిశ్రామికీకరణ చెందిన ప్రాంతంగా మారింది. బ్రిక్స్ దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) పారిశ్రామికీకరణ ప్రక్రియలో సాగుతున్నాయి.

పారిశ్రామిక ఆధునీకరణకు, సంస్థ అభివృద్ధికీ దోహదపడే అంశాలపై గణనీయమైన సాహిత్యం ఉంది.

సామాజిక పరిణామాలు

పట్టణీకరణ

పారిశ్రామిక విప్లవం అంటే వ్యావసాయిక సమాజం నుండి తరలడమే. దీని కారణంగా ప్రజలు ఉద్యోగాల కోసం గ్రామాల నుండి కర్మాగారాలను నెలకొల్పిన ప్రదేశాలకు వలస వెళ్ళారు. గ్రామీణ ప్రజలు చేపట్టిన ఈ వలసలు పట్టణీకరణకూ, పట్టణ జనాభాలో పెరుగుదలకూ దారితీసాయి.

దోపిడీ

కుటుంబ నిర్మాణంలో మార్పులు

పారిశ్రామికీకరణతో కుటుంబ నిర్మాణం మారుతుంది. పారిశ్రామిక పూర్వ సమాజాలలో అనేక తరాల ప్రజలు కలిసి నివసించే సమష్టి కుటుంబ నిర్మాణం ఉందని సామాజిక శాస్త్రవేత్త టాల్కాట్ పార్సన్స్ గుర్తించాడు. వీరు తరతరాలుగా ఒకే చోట ఉంటారు. పారిశ్రామిక సమాజాలలో తల్లిదండ్రులు, వారి పెరుగుతున్న పిల్లలు మాత్రమే కలిగిన వ్యష్టి కుటుంబం ప్రధానంగా ఉంటుంది. యుక్తవయస్సు చేరుకున్న పిల్లలు ఇంటిని వదలి ఉద్యోగాలు ఉన్న చోటికి మకాం మారుస్తారు. కుటుంబ బంధాలు మరింతగా పలచబడి పోతాయి.

ప్రస్తుత పరిస్థితి

2006 నాటి జిడిపి లో రంగం వారీగా వాటా, వృత్తి, పరంగా కార్మిక శక్తి వాటా రంగులలో ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులు వరుసగా వ్యవసాయం, పరిశ్రమ, సేవల రంగాల శాతాన్ని సూచిస్తాయి.

ఆర్థిక వృద్ధి, ఉపాధి, పేదరికం తగ్గింపు మధ్య సంబంధాలు సంక్లిష్టంగా ఉంటాయి. అధిక ఉత్పాదకత, ఉపాధి అవకశాలు తగ్గడానికి దారితీయవచ్చు. ప్రపంచంలోని 40% కంటే ఎక్కువ మంది ఉద్యోగులు " పనిచేసే పేదలు". వారి సంపాదన వారిని రోజుకు 2 డాలర్ల దారిద్య్రరేఖకు ఎగువన ఉంచలేకపోతోంది. అపారిశ్రామికీకరణ అనే విషయం కూడా ఉంది. దీనివలన ఏర్పడే నిరుద్యోగులను వ్యవసాయ రంగం ఆదుకుంటోంది.

మూలాలు