స్థూల దేశీయోత్పత్తి

ఒక దేశంలో ఉత్పత్తి చేసిన వస్తుసేవల మారక విలువ

స్థూల దేశీయోత్పత్తి (ఆంగ్లం: gross domestic product/GDP) అంటే ఒక నిర్ణీత కాలవ్యవధిలో ఒక దేశ సరిహద్దులో ఉత్పత్తి చేయబడ్డ పూర్తయిన వస్తువులు, సేవల మార్కెట్ విలువ.[2][3] స్థూలంగా దేశీయంగా ఉత్పత్తులను కొలిచే ఒక ప్రమాణంగా ఇది ఆ దేశపు ఆర్థిక పరిపుష్టతను సూచిస్తుంది. మామూలుగా ఇది సంవత్సరానికొకసారి గణించినా అప్పుడప్పుడు త్రైమాసికానికోసరి కూడా గణిస్తారు.

USD, ప్రపంచ బ్యాంక్, 2014 లో GDP (నామమాత్రపు) పరిమాణం ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల పటం [1]

భారతదేశంలో సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సిఎస్ఒ - కేంద్ర గణాంకాల శాఖ) ప్రతి సంవత్సరంలో మూడు నెలలకోసారి మొత్తం నాలుగు సార్లు స్థూల దేశీయోత్పత్తిని అంచనా వేస్తుంది. వీటిని త్రైమాసిక గణాంకాలు అంటారు. అలాగే ప్రతి సంవత్సరం వార్షిక వృద్ధి రేటును కూడా గణాంకాల శాఖ ప్రచురిస్తుంది. అల్పాదాయం, మధ్య ఆదాయం కలిగిన దేశాల్లో జిడిపి ఎంత వృద్ధిలో ఉంటే, వారి పెరుగుతున్న జనాభా అవసరాలు అంతగా తీరుతున్నట్లు లెక్క.[4]

జిడిపి (GDP), జిఎన్ఐ (GNI)

స్థూల జాతీయ ఉత్పత్తి (జిఎన్‌పి) లేక తరువాత వాడుకలోకి వచ్చిన (స్ధూల జాతీయ ఆదాయం (జిఎన్ఐ) కి జిడిపి కి తేడా లెక్కించే ఆదాయ స్థానం. ప్రపంచానికి అన్వయించేటప్పుడు, ప్రపంచ జిడిపి, ప్రపంచ జిఎన్ఐ ఒకటే.

జిడిపి అనేది దేశ సరిహద్దుల్లో ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి; జిఎన్ఐ అనేది ఒక దేశ పౌరుల యాజమాన్యంలోని సంస్థలచే ఎక్కడైనా ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి. ఒక దేశంలోని ఉత్పాదక సంస్థలన్నీ దాని స్వంత పౌరులకు చెందినవి అయితే, ఆ పౌరులు మరే దేశాలలోనూ ఉత్పాదక సంస్థలను కలిగి ఉండకపోతే ఈ రెండూ ఒకే విధంగా ఉంటాయి. అయితే, ఆచరణలో, విదేశీ యాజమాన్యం GDP, GNI లను ఒకేలా చేస్తుంది. ఒక దేశం యొక్క సరిహద్దులలో ఉత్పత్తి, దేశం వెలుపల యాజమాన్యంగల సంస్థ చేసినా, ఆ దేశ జిడిపిలో భాగంగా లెక్కించబడుతుంది, కాని జిఎన్ఐ లో అలాకాదు; మరోవైపు, దేశం వెలుపల ఉన్న ఒక సంస్థ ఉత్పత్తి, కానీ దేశ పౌరులలో ఒకరి స్వంతం అయినప్పుడు, దాని GNI లో భాగంగా లెక్కించబడుతుంది, కాని దాని జిడిపి లో కాదు.

ఉదాహరణకు, అమెరికా జిఎన్ఐ, అమెరికన్ యాజమాన్యంలోని సంస్థలు ఎక్కడైనా ఉత్పత్తి చేసే ఉత్పత్తి విలువ. ఒక దేశం అప్పులు ఎక్కువైనప్పుడు, తన ఆదాయాన్ని ఈ రుణం తీర్చడానికి ఖర్చు చేస్తే జిఎన్‌ఐ తగ్గుతుంది, కాని జిడిపి తగ్గదు. అలాగే ఒక దేశం తన వనరులను తమ దేశానికి వెలుపల ఉన్న సంస్థలకు విక్రయిస్తే, ఇది కాలక్రమేణా జిఎన్‌ఐ తక్కువలో ప్రతిబింబిస్తుంది, కాని జిడిపి తగ్గదు. అందువలన జాతీయ అప్పులు పెరిగి, ఆస్తులు తగ్గుతున్న దేశాలలోని రాజకీయ నాయకులు జిడిపి పదం వాడటానికి ఇష్టపడేటట్లు చేస్తుంది.

జిడిపికి ప్రపంచంలోని మిగతా ప్రాంతాలనుండి వచ్చే ఆదాయం కలిపి, ఇతరదేశాలకు రుణం తిరిగి చెల్లించడానికైన ఖర్చు తీసివేస్తే స్థూల జాతీయ ఆదాయం (జిఎన్‌ఐ) కు సమానం అవుతుంది. [5]

1991 లో, అమెరికా జిఎన్‌పి బదులు జిడిపిని ప్రాధమిక ఉత్పత్తి కొలతగా వాడటం ప్రారంభించింది. [6] అమెరికా జిడిపి, జిఎన్‌పి మధ్య సంబంధం జాతీయ ఆదాయ, ఉత్పత్తి ఖాతాల పట్టిక 1.7.5 లో చూపబడింది. [7]

మూలాలు