ప్రపంచ పుస్తక దినోత్సవం

ప్రపంచ పుస్తక దినోత్సవం ఏప్రిల్ 23

ప్రపంచ పుస్తక దినోత్సవం (ప్రపంచ కాపీ హక్కుల దినోత్సవం) ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు.[1] 1995 నుండి నిర్వహించబడుతున్న ఈ ప్రపంచ పుస్తక దినోత్సవం రోజున పుస్తకం చదవడం, ప్రచురించడం, కాపీ హక్కులు వంటి విషయాలను ప్రోత్సహించి వాటి గురించి విస్తృత ప్రచారం చేస్తారు.[2]

ప్రపంచ పుస్తక దినోత్సవం
ప్రపంచ పుస్తక దినోత్సవం
ప్రపంచ పుస్తక దినోత్సవం 2012 పోస్టర్
అధికారిక పేరుప్రపంచ పుస్తక దినోత్సవం
యితర పేర్లుWND
జరుపుకొనేవారుఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు
రకంఅంతర్జాతీయ
ఆవృత్తివార్షిక
అనుకూలనంప్రతి ఏటా ఇదే రోజు

ప్రారంభం

వాలెనియన్ రచయితైన విసెంటే క్లావెల్ ఆండ్రెస్ కు పుస్తక దినోత్సవం జరపాలని మొట్టమొదటగా ఆలోచన వచ్చింది. ప్రపంచ రచయిత మిగ్యుఎల్ డి సెర్వంటెస్ పుట్టిన తేది (అక్టోబర్ 7)గానీ, మరణించిన తేది (ఏప్రిల్ 23)గానీ పుస్తక దినోత్సవంగా చేసి ఆయనకు గౌరవాన్ని అందించాలనుకున్నాడు. అయితే,విలియం షేక్స్పియర్, గార్సియాసా డి లా వేగా వంటి రచయితలు మరణించిన తేది, అనేక ఇతర రచయితల పుట్టిన, మరణించిన తేది ఏప్రిల్ 23వ తేది అవడంవల్ల 1995, ఏప్రిల్ 23న యునెస్కో తొలిసారిగా ప్రపంచ పుస్తక దినోత్సవంను నిర్వహించింది.[3][4]

కార్యక్రమాలు

  1. యునెస్కో ప్రతి సంవత్సరం ప్రపంచంలోని ఒక ముఖ్య నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటిస్తుంది. 2017లో రిపబ్లిక్‌ ఆఫ్‌ గినీలోని ‘కొనాక్రీ’ సిటీ, 2018లో గ్రీస్ లోని ‘ఏథెన్స్’ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానులుగా ప్రకటించింది.
  2. 2023 సంవత్సరానికి గానూ ఆఫ్రికన్‌ దేశం ఘనాలోని ఆక్రా నగరంను ప్రపంచ పుస్తక నగరంగా ప్రకటించారు. [5]

మూలాలు

ఇతర లంకెలు