ఫూల్స్ డే

ఫూల్స్ డే అనగా ఏప్రిల్ ఒకటవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సరదాగా జరుపుకునే ఒక పండగ. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆటపట్టించుకోవడం, గాలి వార్తలు ప్రచారం చెయ్యడం దీని ప్రత్యేకత. దీని బాధితులని ఏప్రిల్ ఫూల్స్ గా వ్యవహరించడం పరిపాటి. కొన్ని వార్తా పత్రికలు, మ్యాగజీన్లు కూడా ఒక్కోసారి అసత్య కథనాలను ప్రచారం చేస్తూ ఉంటాయి. మళ్ళీ మరుసటి రోజు ఎక్కడో చిన్న అక్షరాలతో వివరణ ఇస్తుంటారు. 19 వ శతాబ్దం నుంచి బాగా ప్రాచుర్యం లోకి వచ్చినా ఫూల్స్ డే ఏ దేశంలోనూ సెలవు దినం కాదు. జెఫ్రీ షాసర్ రాసిన ద కాంటర్ బరీ టేల్స్ (1392) లో దీని గురించి ప్రస్తావన ఉంది.

ప్రారంభం

లండన్‌లోని టవర్ ఆఫ్ లండన్ వద్ద "వాషింగ్ ది లయన్స్"కి 1857 టిక్కెట్. అలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు.

ఫూల్స్ డే కి స్ఫూర్తి రోమన్ల పండగ హిలేరియా, [1] భారత్ లో హోళీ, [2] మధ్య ప్రాచ్య దేశాల్లోని ఫీస్ట్ ఆఫ్ ఫూల్స్. [3]

వివిధ దేశాల్లో

ఐర్లండ్

ఆటపట్టించాలనుకున్న వ్యక్తికి ఒక ముఖ్యమైన లేఖ అందింది ఫలానా వారికి అందించమని చెప్పడం. ఆ వ్యక్తి అతని దగ్గరకు వెళ్ళి ఇంకో వ్యక్తికి అందించమనడం. ఇలాగా సాగుతుంది. చివరగా ఆ లేఖలో ఉండే సందేశం ఏంటంటే Send the fool further.

మూలాలు