బర్ధావాన్ సట్‌నర్

బెర్థా ఫెలిసిటాస్ సోఫీ ఫ్రైప్రా ఆన్ సట్నర్ (బర్ధావాన్ సట్‌నర్ (1843 జూన్ 9 - 1914 జూన్ 21) అస్ట్రేలియన్ నవలా రచయిత. ఈమె తీవ్రమైన శాంతికాముకమైన వ్యక్తి. ఈమె నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి మహిళ, నోబెల్ బహుమతి పొందిన రెండవ మహిళ[1].

బర్ధావాన్ సట్‌నర్
బర్ధావాన్ సట్‌నర్ సా.శ. 1906 లో చిత్రం
జననం(1843-06-09)1843 జూన్ 9
ప్రాగ్, ఆస్ట్రేలియన్ సామ్రాజ్యము
మరణం1914 జూన్ 21(1914-06-21) (వయసు 71)
వియన్నా, ఆస్ట్రేలియా-హంగరీ
వృత్తినవలా రచయిత
పురస్కారాలునోబెల్ శాంతి బహుమతి, 1905
A German postage stamp commemorating Bertha von Suttner.

ప్రారంభ జీవితం

సట్‌నర్ "భోమియా" లోని ప్రాగ్ లో జన్మించింది. ఆమె ఆస్ట్రియన్ సైన్యాధ్యక్షుడైన ప్రాంజ్-జోసెఫ్ గ్రాఫ్ కిన్‌స్కీ వాన్ సట్‌నర్, ఆయన భార్య సోఫియా వాన్ కోర్నెర్‌ లకు జన్మించారు[2]. 1873 నుండి సంపన్న కుటుంబమైన సట్నర్ కుటుంబంలో సంరక్షకరాలుగా పనిచేశారు.ఆమెకు అన్నయ్య ఆర్థర్ ఫ్రాంఝ్ కిన్‌స్కీ వాన్ వినిడ్జ్ ఉండ్ టెటాఉ కలడు.

ఆమె ప్రముఖ ఇంజనీరు, నవలాకారుదైన ఆర్థర్ గుండకార్ ఫ్రెహెర్ర్ వాన్ సట్‌నర్ ను వివాహమాడారు. కానీ ఆయన కుటుంబం ఈ వివాహానికి అంగీకరించలేదు.1876 లో ఆల్‌ఫ్రెడ్ నోబుల్ నివాసం (పారిస్) లో తన సెక్రటరీగా పనిచేయుటకు ఆయన ఇచ్చిన ప్రకటనకు ఆమె సమాధానమిచ్చింది. ఆమె వియన్నాకు రావడానికి ఒక వారం ముందు రహస్యంగా 1876 జూన్ 12 లో ఆర్థర్ ను వివాహమాడారు.

Bertha von Suttner Monument in Wagga Wagga, Australia.

ప్రభావం

సట్‌నర్ శాంతి ఉద్యమంలో ప్రముఖపాత్ర పోషించింది. ఆమె తన ప్రచురణలైన "డై వాఫెన్ నైడర్", "లే డౌన్ యువర్ ఆర్మ్స్" వంటి నవల ద్వారా ప్రముఖురాలైంది. 1891 లో ఆమె ఆస్ట్రియన్ పసిఫిక్ శాంతి సంస్థను స్థాపించింది. ఆమె అంతర్జాతీయ పసిఫిక్ జర్నల్ అయిన "డై వాఫెన్ నైడర్"కు సంపాదకునిగా ఉండి విశేష ఖ్యాతినార్జించారు. 1911 లో ఆమె "కార్నెగి పీస్ ఫౌండేషన్" కౌన్సిల్ లో సలహాదారుగా ఎంపిక కాబడినారు.[3]

ఆమె వ్రాసిన అహింసావాద రచనలకు ఇమ్మాన్యుయేల్ కాంట్, హెన్రీ థామస్ బకిల్, హెర్బాట్ స్పెన్సర్, ఛార్లెస్ డార్విన్, లియో టాల్‌స్టాయ్ వంటి ప్రముఖులు ప్రభావితులైనారు.[4] సట్‌నర్ ఒక జర్నలిస్టుగా కూడా పనిచేశారు. ఒక ప్రముఖమైన చరిత్రకారుడు ఆమెను "ఒక అత్యంత గ్రహణశక్తి, సమర్థవంతంగా రాజకీయ వ్యాఖ్యాత" అని వెల్లడించారు [4].

ఆల్ఫ్రెడ్ నోబెల్ ప్రభావం

ఆమెకు ఆల్‌ఫ్రెడ్ నోబుల్ తో వ్యక్తిగత పరిచయం ఉన్నప్పటికీ, ఆమె 1896 లో ఆయన మరణించేవరకు ఆయనతో సాన్నిహిత్యాన్ని కొనసాగించారు. ఆమె ఆయన నోబెల్ ప్రైజ్ లు యివ్వాలన్న వీలునామా వ్రాయుటకు ఆమె ప్రభావితం చేశారని నమ్మకం. ఆమెకూడా 1905 లో నోబెల్ శాంతి బహుమతి పొందారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

ఇతర లింకులు