బహుకణ జీవులు

బహుకణ జీవులు అంటే ఒకటి కంటే ఎక్కువ కణంతో ఏర్పడ్డ జీవులు. ఒకేకణంతో ఏర్పడ్డ ఏకకణ జీవులకంటే ఇవి భిన్నమైనవి.[1] దాదాపు అన్ని జంతువులు, నేలమీద పెరిగే చెట్లు, శిలీంధ్రాలు మొదలైనవన్నీ బహుకణ జీవులే.బహుకణ జీవులు కణవిచ్ఛిత్తి లేదా పలు జీవకణాలు కలవడం ద్వారా ఏర్పడతాయి.[2]

పుట్టుక - పరికల్పన

ఈ బహుకణ జీవులు ఎలా ప్రారంభం అయ్యాయో తెలిపేందుకు పలు సిద్ధాంతాలు (Hypothesis) ఉన్నాయి. ఇందులో ఒకదాని ప్రకారం ఒకే పనులు నిర్వర్తించే కణాలు గుంపుగా ఏర్పడి గ్రెక్స్ అనే ముద్దలాగా ఏర్పడతాయి. ఇది ఒక ముద్దలాగా కదులుతూ ఉంటుంది. రెండో సిద్ధాంతం ప్రకారం కణంలోని కేంద్రకం విచ్ఛిన్నం చెంది కోనోసైట్ (coenocyte) గా మారడం. తర్వాత దాని చుట్టూ త్వచం (పొర) ఏర్పడటం, మధ్య ఖాళీ భాగంలో కణంలోని ఇతర భాగాలు ఏర్పడతాయి. ఈ విధంగా ఒక జీవిలో ఒకదానితో ఒకటి అనుసంధానమైన అనేక కణాలు ఏర్పడతాయి.

బహుకణ జీవులు, ముఖ్యంగా దీర్ఘకాలం జీవించే జీవుల్లో క్యాన్సర్ ప్రమాదం ఉంటుంది. ఇది కణాలు సాధారణ స్థాయిలో పెరుగుదల మీద నియంత్రణ కోల్పోయినపుడు సంభవిస్తుంది. ఈ విధంగా జరిగేటపుడు కణజాల స్వరూపంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి.

మూలాలు