సౌదీ అరేబియా

సౌదీ అరేబియా ( లేక కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ) తూర్పు మధ్య దేశాలలో అతి పెద్ద అరబ్బు దేశం.

Kingdom of Saudi Arabia
Flag of సౌదీ అరేబియా సౌదీ అరేబియా యొక్క చిహ్నం
నినాదం
"ప్రభువెవ్వడూ లేడు అల్లాహ్ ను తప్పి; మహమ్మద్ అతని ప్రవక్త" (షహాద)
జాతీయగీతం
"ఆష్ అల్ మలీక్"
"రాజు అమరుడౌను గాక"

సౌదీ అరేబియా యొక్క స్థానం
సౌదీ అరేబియా యొక్క స్థానం
రాజధానిరియాధ్
24°39′N 46°46′E / 24.650°N 46.767°E / 24.650; 46.767
అతి పెద్ద నగరం రాజధాని
అధికార భాషలు అరబ్బీ
ప్రభుత్వం రాజరికం
 -  సౌదీ అరేబియా రాజు అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ అజీజ్
 -  రాకుమారుడు సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్
స్థాపనము
 -  రాజ్యం ప్రకటింపబడినది జనవరి 8, 1926 
 -  గుర్తింపబడినది మే 20, 1927 
 -  కేంద్రీకరణ జరిగినది సెప్టెంబరు 23, 1932 
విస్తీర్ణం
 -  మొత్తం 2,149,690 కి.మీ² (14వది)
829,996 చ.మై 
 -  జలాలు (%) negligible
జనాభా
 -  2007 అంచనా 27,601,038 1 (45th2)
 -  జన సాంద్రత 11 /కి.మీ² (205వది)
29 /చ.మై
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $446 బిలియన్లు (27వది)
 -  తలసరి $21,200 (41వది)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.777 (medium) (76వది)
కరెన్సీ రియాల్ (SAR)
కాలాంశం AST (UTC+3)
 -  వేసవి (DST) (not observed) (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .sa
కాలింగ్ కోడ్ +966
1 Population estimate includes 5,576,076 non-nationals.
2 Rank is based on 2005 figures.
Kingdom of Saudi Arabia

المملكة العربية السعودية
Al-Mamlakah al-Arabiyah as-Sa'ūdiyah
Flag of Saudi Arabia
జండా
Emblem of Saudi Arabia
Emblem
నినాదం: لا إله إلا الله، محمد رسول الله
"Lā ʾilāha ʾillāl–lāh, Muhammadun rasūl allāh"
"There is no god but God; Muhammad is the messenger of God."[1][a] (Shahada)
గీతం: السلام الملكي (as an instrumental)
"as-Salām al-Malakiyy"
"The Royal Salute"
Location of Saudi Arabia
రాజధాని
and largest city
Riyadh
అధికార భాషలుArabic language[5]
జాతులు
90% Arab
10% Afro-Arab
మతం
Sunni Islam (official)[6]
పిలుచువిధం
  • Saudi Arabian people
  • Saudi (informal)
ప్రభుత్వంUnitary state Islamic absolute monarchy
• King of Saudi Arabia
Salman of Saudi Arabia
• Crown Prince of Saudi Arabia
Muhammad bin Nayef
• Deputy Crown Prince
Mohammad bin Salman Al Saud
శాసనవ్యవస్థNone (Legislation passed by the Council of Ministers)[b]
History of Saudi Arabia
• Unification of Saudi Arabia
23 September 1932
విస్తీర్ణం
• మొత్తం
2,149,690[5] km2 (830,000 sq mi) (13th)
• నీరు (%)
0.7
జనాభా
• 2014 estimate
30,770,375[7] (41st)
• జనసాంద్రత
12.3/km2 (31.9/sq mi) (216th)
GDP (PPP)2015 estimate
• Total
$1,683 trillion[8] (14th)
• Per capita
$53,624[8] (12th)
GDP (nominal)2015 estimate
• Total
$653.219 billion[8] (19th)
• Per capita
$20,812[8] (38th)
హెచ్‌డిఐ (2014)Increase 0.837[9]
very high · 39th
ద్రవ్యంSaudi riyal (SR) (SAR)
కాల విభాగంUTC+3 (Arabia Standard Time)
వాహనాలు నడుపు వైపుright
ఫోన్ కోడ్+966
ISO 3166 codeSA
Internet TLD
  • .sa
  • السعودية.
  1. ^ Legislation is by king's decree. The Consultative Assembly of Saudi Arabia exists to advise the king.

సౌదీ అరేబియా [c] (/ˌsɔːd əˈrbiə/, /ˌs-/), అధికారికంగా " కింగ్డం ఆఫ్ సౌదీ అరేబియా " (కె.ఎస్.ఎ) [d] ఒక అరబ్ దేశం. ఇది పశ్చిమాసియాలో ఉంది. ఇది అరేబియన్ ద్వీపకల్పంలో అత్యధిక భాగం విస్తరించి ఉంది. దేశం వైశాల్యం 50,000 చ.కి.మీ. భౌగోళికంగా సౌదీ అరేబియా ఆసియా దేశాలలో 5వ స్థానంలో, అరబ్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అల్జీరియా ఉంది. దేశ ఉత్తర సరిహద్దులలో జోర్డాన్, ఇరాక్, ఈశాన్య సరిహద్దులో కువైట్, తూర్పు సరిహద్దులో కతర్,బహ్రయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆగ్నేయ సరిహద్దులో ఓమన్, దక్షిణ సరిహద్దులో యెమన్ దేశాలు ఉన్నాయి. ఎర్రసముద్రం, పర్షియన్ గల్ఫ్ సముద్రతీరాలు ఉన్న ఒకేఒక దేశం సైదీ అరేబియా మాత్రమే. దేశంలో అత్యధికంగా ఇసుకతో నిండిన ఎడారి, నిర్మానుష్యమైన భూభాగాలు ఉన్నాయి. ఆధునిక సౌదీ అరేబియాలో నాలుగు ప్రాంతాలు ఉన్నాయి. అవి వరుసగా హెజాజ్, నజ్ద్, తూర్పు అరేబియా లోని భూభాగాలు (అల్- అషా), దక్షిణ అరేబియా (అసిర్) ప్రాంతాలు. [10] కింగ్డం ఆఫ్ సౌదీ అరేబియా ఇబ్న్ సౌదీ చేత 1932 లో స్థాపించబడింది. ఆయన నాలుగు ప్రాంతాలను ఒకే దేశంగా రూపొందించాడు. ఆయన తన పూర్వీక స్థానం అయిన 1902 లో రియాద్‌ మీద వియం సాధించి, తరువాత సౌదీ అరేబియా సంపూర్ణ రాజ్యంగా మారింది. తరువాత వారస్త్వంగా ఇస్లామిక్ రాజవ్యవస్థ దేశాన్ని పాలిస్తూ ఉంది.[11][12]సున్నీ ముస్లిముల మద్య తలెత్తిన తీవ్రమైన సంప్రదాయవాద మతమైన వహ్హాదిజం ఉద్యమం " ప్రధానమైన సౌదీ సంప్రదాయం "గా భావించబడుతుంది. [11][12] సౌదీ అరేబియా " లాండ్ ఆఫ్ ది టూ హోలీ మసీద్ " అని అభివర్ణించబడింది. మసీద్- అల్ - హరం (మక్కా) , అల్- మసీద్ అన్- నబావి (మదీనా) అనే ఇస్లాం మతస్థుల అతిపవిత్ర ప్రదేశాలు సౌదీలో ఉన్నాయి. దేశం మొత్తం జనసంఖ్య 28.7 మిలియన్లు. వీరిలో సౌదీ పౌరులు 20 మిలియన్లు ఉండగా 8 మిలియన్లు విదేశీయులు ఉన్నారు.[13][14][15] 1938లో పెట్రోలియం కనుగొనబడింది. పెట్రోల్ నిక్షేపాలు షియా ముస్లిములు అధికంగా ఉన్న సౌదీ అరేబియాలోని తూర్పు ప్రాంతంలో కనుగొనబడ్డాయి.[16] తరువాత సౌదీ అరేబియా ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దేశంగా మారింది. ఆయిల్ ఉత్పత్తిలో సౌదీ అరేబియా ద్వితీయ స్థానంలో ఉంది. అలాగే సహజవావువు ఉత్పత్తిలో 6వ స్థానంలో ఉంది.[17] దేశాన్ని హై హ్యూమన్ డెవెలెప్మెంట్ ఇండెక్స్‌తో హై ఇంకం ఎకనమీగా వరల్డ్ బ్యాంక్ వర్గీకరించింది.[18] జి-20 దేశాలలో చోటు చేసుకున్న ఒకేఒక దేశం సౌదీ అరేబియా.[19][20] సౌదీ అరేబియా ఎకనమీ అతి తక్కువగా గల్ఫ్ కార్పొరేషన్ వైపు మళ్ళించబడింది. సేవారంగం , ఉత్పత్తి రంగానికి పెట్టుబడులు తక్కువగానే ఉన్నాయి. ఆయిల్ వెలికితీతకు మాత్రమే ప్రభుత్వ ధనం వ్యయం చేయబడుతుంది.[21] రాజరిక నిరంకుశత్వం [22][23] మిలటరీ కొరకు అత్యధికంగా వ్యయం చేస్తున్న ప్రపంచ దేశాలలో సౌదీ అరేబియా ఒకటి.[24][25] ప్రపంచదేశాలలో సౌదీ అరేబియా 2010-14 లో అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకున్నట్లు ఎస్,ఐ.పి.ఆర్ పరిశోధన తెలియజేసింది.[26] సౌదీ అరేబియా ప్రాంతీయ మధ్యశక్తిగా భావించబడుతుంది.[27] సౌదీ అరేబియా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ , ఒ.పి.ఇ.సి.[28] ప్రజాస్వతంత్ర కొరత కారణంగా దేశం తరచూ విమర్శకు గురౌతూ ఉంది. ఫ్రీడం హౌస్ దేశాన్ని " నాట్ ఫ్రీ "గా వర్గీకరించింది.[29] సౌదీలో స్త్రీల హక్కులు,[30] అలాగే మరణశిక్ష అమలు కూడా సౌదీని విమర్శకు గురిచేస్తుంది.[31]

పేరువెనుక చరిత్ర

రాజ్యాలను ఏకీకృతం చేసిన తరువాత హెజాజ్ రాజ్యం , నెజ్ద్ రాజ్యం " అల్ - మమ్లాక్ అల్- అరబియాహ్ అస్ - సౌదియా " అని పిలువబడింది.1932 సెప్టెంబర్ 23 దీనిని అబ్దుల్లాజిజ్ అల్ సౌద్ (ఇబ్న్ సౌద్) స్థాపించాడు. దీనిని సాధారణంగా ఆగ్లభాషలో " కిండం ఆఫ్ సౌదీ అరేబియా " అని పిలుస్తారు. [32] వాస్తవంగా దీనిని ది అరబ్ సౌదీ ఖండం అంటారు.[33][34] సౌదీ అనే మాట " అస్- సౌదియాహ్ " అనే అరబిక్ పదం నుండి వచ్చింది. ఇది ఒక రాజకుటుంబం పేరు (హౌస్ ఆఫ్ సౌదీ) (آل سعود). సౌదీ అరేబియా రాజకుటుంబానికి ఆధీనంలో ఉన్న దేశం.[35][36] అల్ సౌదీ ఒక అరబిక్ నామం. అల్ అంటే కుటుంబం లేక నివాసం అని అర్ధం.[37] ఇది పూర్వీకుల వ్యక్తిగతమైన పేరు. ఇది 18వ శతాబ్దం రాజ్యస్థాపన చేసిన రాజు ముహమ్మద్ బీన్ సౌదీ పేరు.[38] సౌదీ పాలనను అంగీకరించని (ప్రత్యేకంగా ఇస్లామిక్ దేశం ఇరాక్ , లెవంత్ ఇస్లామిక్ దేశం) దేశాలు దీనిని " లాండ్ ఆఫ్ హరమ్యన్ " (రెండు పవిత్ర ప్రదేశాలు) అని పిలుస్తారు. రెండు పవిత్రప్రదేశాలు మాక్కా, మసీద్.[39]

చరిత్ర

Before the foundation of Saudi Arabia

The Battle of Badr, 13 March 624 CE.

ఇస్లామిక్ కాలానికి ముందు (మక్కా, మదీనా) కొన్ని వ్యాపార నగరాలు ఉండేవి. ప్రస్తుత సౌదీ అరేబియా ఉన్న నివాసయోగ్యం కాని ఎడారి ప్రాంతాలలో నోమాడిక్ సమూహాలు నివసిస్తూ ఉండేవి.[40] ఇస్లాం మతప్రవక్త ముహమ్మద్ సా.శ. 571 లో మక్కాలో జన్మించాడు. 7 వ శతాబ్దం ఆరంభంలో ముహమ్మద్ అరేబియా ద్వీపకల్పం లోని విభిన్న జాతి ప్రజలను సమైక్యం చేసి ఇస్లామిక్ మతసంప్రదాయం రూపొందించాడు.[41] 632 లో ముహమ్మద్ ప్రవక్త మరణించిన తరువాత ఆయన యొక్క అనుచరులు వేగవంతంగా ముస్లింపాలనను అరేబియా అంతటా విస్తరింపచేసారు . ముస్లిములు కొన్ని దశాబ్ధాలలో పశ్చిమంలో ఇబెరియన్ ద్వీపకల్పం నుండి తూర్పున ఆధునిక పాకిస్థాన్ వరకు సామ్రాజ్యవిస్తరణ చేసారు. అరేబియా రాజకీయంగా ముస్లిం ప్రాంతంగా మారింది.[41] 10వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం ఆరంభం వరకు మక్కా, మదీనా ప్రాంతీయ అరబ్ పాలకుల (షరీఫ్ ఆఫ్ మక్కా) ఆధీనంలో ఉంది. అయినప్పటికీ షరీఫ్‌లు అధికంగా బాబిలోనియా, కైరో లేక ఇస్తాబుల్ సామ్రాజ్యానికి లోబడి పాలించారు. మిగిలిన అరేబియా ప్రాంతం గిరిజన సంప్రదాయ పాలనలో ఉంది.[42][43]

ఆట్టమన్ హెజాజ్

16వ శతాబ్దంలో ఆట్టమన్లు ఎర్రసముద్రతీరం, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాలను (హెజాజ్, అసిర్, ఈస్టర్న్ అరేబియా) తమ సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నారు. తరువాత అంతర్భాగాలను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.ఇందుకు కారణం హిందూ మహాసముద్రం, ఎర్రసముద్రప్రాంతాలలో (హెజాజ్) తమ ఆధిక్యతను నిలుపుకోవడానికి ఆట్టమన్లు పోర్చుగీసు మీద సముద్రమార్గదాడి చేయడమే.[44] తరువాత 4 శతాబ్ధాల బలాబలాలలో హెచ్చుతగ్గులు సామ్రాజ్యపు కేంద్ర ఆధిపత్యం బలహీనపడిన కారణంగా ఈ ప్రాంతాల మీద ఆట్టమన్ అధికారం క్షీణించింది.[45][46]

సౌదీ అరేబియా సామ్రాజ్య స్థాపన

The Arabian Peninsula in 1914.

సౌదీ అరేబియా రాజకుటుంబం (అల్ సౌద్) 1744 లో మద్య అరేబియా లోని నజ్ద్ ప్రాంతంలో రూపుదిద్దుకుంది. సామ్రాజ్య స్థాపకుడు ముహమ్మద్ బిన్ సౌద్ మతనాయకుడు వహ్హాబీ ఉద్యమ నాయకుడు ముహమ్మద్ ఇబ్న్ అబ్ద్ అల్- వహ్హాబ్‌తో కలిసి కలిసి సైనిక సమీకరణ చేసాడు.[47] [48] 18వ శతాబ్దం ఆరంభంలో రూపుదిద్దుకొన్న ఈ సంకీర్ణం సౌదీ స్థాపనకు దారితీసింది. ఇది సైదీ రాజవంశ పాలనకు పునాది అయింది.[49] 1744 లో రీయాద్ పరిసరప్రాంతంలో మొదటి సౌదీ రాజ్యం స్థాపించబడింది. తరువాత ఇది వేగవంతంగా విస్తరించబడి ప్రస్తుత సౌదీ ప్రాంతం అంతటా ఆధిపత్యం సాధించింది.[50] అయినప్పటికీ 1818 నాటికి ఈజిప్ట్కు చెందిన ఆట్టమన్ వైశ్రాయ్ " ముహమ్మద్ అలీ పాషా " ఈ ప్రాంతం మీద ఆధిపత్యం సాధించాడు.[51] 1824 లో నెజ్ద్ ప్రాంతంలో చిన్న సౌదీ రాజ్యం రెండవసారిగా స్థాపించబడింది. 19వ శతాబ్దం అంతటా సౌదీ అరేబియా ప్రాంతపాలనలో సౌదీ రాజకుటుంబం ఇతర రాజకుటుంబాలతో (రషిద్ రాజవంశం) పోటీపడింది. 1891 నాటికి అల్ రషిద్ విజయవంతమై సౌదీ రాజవంశం కువైట్కు పంపబడింది.[42]

Abdul Aziz Ibn Saud, the first king of Saudi Arabia.

20వ శతాబ్దం ఆరంభంలో ఆట్టమన్ సామ్రాజ్యం ద్వీపకల్పం మీద అధికారంతో లేక సామంతరాజ్యంగా పాలించింది. ఫలితంగా సౌదీ అరేబియాను గిరిజన తెగలు విడివిడిగా పాలించాయి.[52][53] మక్కా షరీఫ్ ఆధీనంలో పాలించబడింది.[54] 1902 లో అబ్దుల్ రహమాన్ కుమారుడు అబ్దుల్ అజిజ్ (ఇబ్న్ సౌదీ) రియాద్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. తరువాత అల్ సౌద్ తిరిగి నజ్ద్‌కు చేరుకున్నాడు.[42] ఇబ్న్ సౌద్ ఇఖ్వన్ మద్దతు సంపాదించాడు. [55] 1913లో ఇఖ్వన్ సహాయంతో ఇబ్న్ సౌద్ ఆట్టమన్ నుండి ఈస్టర్న్ అరేబియా (అల్- అషా)ను స్వాధీనం చేసుకున్నాడు. 1916లో బ్రిటన్ ప్రోత్సాహం, మద్దతుతో మక్కా షరీఫ్ " హుస్సేన్ బిన్ అలీ " నాయకత్వంలో ఆట్టమన్ పాలనకు వ్యతిరేకంగా యునైటెడ్ అరబ్ దేశం స్థాపించడానికి అరబ్ తిరుగుబాటు నిర్వహించబడింది.[56] 1916 నుండి 1918 అరబ్ తిరుగుబాటు విఫలం అయినప్పటికీ ప్రపంచ యుద్ధం విజయం తరువాత ద్వీపకల్పంలో ఆట్టమన్ పాలన ముగింపుకు వచ్చింది.[57]అరబ్ తిరుగుబాటులో పాల్గొనడాన్ని ఇబ్న్ సౌదీ నివారించి బదులుగా రషీద్‌తో వైరం కొనసాగించాడు. చివరి ఓటమి తరువాత 1021లో ఇబ్న్ సౌదీ " సుల్తాన్ ఆఫ్ నజ్ద్" బిరుదు అందుకున్నాడు. ఇఖ్వన్ సాయంతో 1924-25లో హెజాజ్ మీద విజయం సాధించాడు. 1926 జనవరి 10న తనకుతానే హెజాజ్ రాజుగా ప్రకటించుకున్నాడు. [58] ఒక సంవత్సరం తరువాత ఇబ్న్ సౌదీ నజ్ద్ రాజుగా అయ్యాడు. ఐదు సంవత్సరాల కాలం రెండు రాజ్యాలను రెండు విభాగాలుగా పాలించాడు.[42] హెజాజ్ విజయం తరువాత బ్రిటిష్ ప్రొటక్ట్రేట్‌లో " ఎమిరేట్ ఆఫ్ ట్రాంస్ జోర్డాన్ "లో చేర్చబడడానికి ఇఖ్వన్ వ్యతిరేకించాడు. ఇరాక్ , కువైట్ ఈ భూభాగం మీద దాడి చేయడం మొదలు పెట్టాయి. దీనిని ఇబ్న్ సౌద్ వ్యతిరేకించాడు. ఆయన బ్రిటన్‌తో నేరుగా యుద్ధం చేయవలసిన పరిస్థితి ఎదురౌతుందని ఊహించాడు.అదే సమయంలో సౌదీ ఆధునిక విధానాలు , విదేశీయులను దేశంలో ప్రవేశించడానికి ఆనుమతించడం ఇఖ్వన్‌కు అసహనం కలిగించింది. ఫలితంగా ఇఖ్వన్ ఇబ్న్ సౌదీకి వ్యతిరేకంగా మారాడు. రెండు సంవత్సరాల తరువాత 1929 లో " సబిల్లా యుద్ధంలో " ఇఖ్వన్ ఓటమిని ఎదుర్కొన్నాడు. నాయకులు మొత్తం హత్యకు గురైయ్యారు.[59] 1932 లో హెజాజ్ , నజ్ద్ " కిండం ఆఫ్ సౌదీ అరేబియా "గా సమైక్యం చేయబడ్డాయి.[42]

సమైఖ్యత తరువాత

Saudi Arabia political map
The Kingdom of Saudi Arabia after unification in 1932.

కొత్తగా రూపొందించిన దేశం ప్రపంచంలోని నిరుపేద దేశాలలో ఒకటిగా ఉండేది. వ్యవసాయం , పర్యాటకం మాత్రమే దేశానికి ఆదాయ వనరులుగా ఉండేవి.[60] 1938 లో పర్షియన్ గల్ఫ్ సముద్రతీరం (ఈస్టర్న్ అరేబియా లేక అల్- ఆషా) పెట్రోలియం నిలువలు విస్తారంగా కనుగొనబడ్డాయి. 1941లో యు.ఎస్. ఆధీనం లోని సౌదీ అరంకో పర్యవేక్షణలో పూర్తిస్థాయిలో ఆయిల్ ఫీల్డులు అభివృద్ధి చేయబడ్డాయి. ఆయిల్ కారణంగా లభించే ఆదాయం దేశానికి సుభిక్షం చేసి రాజకీయంగా అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగించింది.[42] హెజాజ్ సాంస్కృతిక జీవితం వేగవంతంగా అభివృద్ధి చెందింది. అది వార్తాపత్రికలకు , రేడియోకు కేంద్రం అయింది. సౌదీ అరేబియాలోని ఆయిల్ పరిశ్రమలో పనిచేయడానికి నియమితులైన విదేశీ ఉద్యోగులప్రవాహం అప్పటికే ప్రజలలో విదేశీయుల ప్రవేశంపట్ల భయం మరింత అధికం చేసింది. అదే సమయం ప్రభుత్వం చేస్తున్న వ్యర్ధమైన , మితిమీరిన వ్యయం ప్రభుత్వానికి లోటు బడ్జెట్ సమస్య , అధిక విదేశీ ఋణం సమస్యలు ఎదురయ్యాయి.[42] 1953లో సౌద్ ఆఫ్ సౌద్ అరేబియా తండ్రి మరణానంతరం వారసునిగా సౌదీ రాజయ్యాడు. 1964 లో సౌద్ సోదరుడు " ఫైసల్ ఆఫ్ సౌదీ అరేబియా " సౌద్‌ను తొలగించి రాజ్యాధికారం చేపట్టాడు. 1972 నాటికి సౌదీ అరేబియా అరాంకో సంస్థలో 20% స్వంతం చేసుకున్నది. తరువాత సౌదీ ఆయిల్ మీద యు.ఎస్. ఆదిపత్యం క్రమంగా తగ్గింది. 1973 లో సౌదీ అరేబియా పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఆయిల్ బాయ్‌కాట్‌కు నాయకత్వం వహించింది. యోం కిప్పూర్ యుద్ధంలో ఈజిప్ట్ , సిరియా వ్యతిరేకంగా ఇజ్రాయిల్కు సహకరించినందుకు ప్రతిగా ఈ చర్య తీసుకొనబడింది.ఫలితంగా ఆయిల్ ధరలు నాలుగు రెంట్లు అధికరించాయి.[42] 1975 లో ఫైసల్‌ను ఆయన మేనల్లుడు కాల్చివేసాడు, తరువాత రాకుమారుడు " ఫైసల్ బిన్ ముసైద్ " అధికారం స్వీకరించాడు. తరువాత ఆయన సోదరుడు ఖలీద్ ఆఫ్ సౌదీ అరేబియా రాజ్యాధికారం చేపట్టాడు.[61]

Saudi Arabian administrative regions and roadways map.

1976 నాటికి సౌదీ అరేబియా ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దేశంగా మారింది.[62] ఖలీద్ పాలనలో సౌదీ అరేబియా వేగవంతమైన ఆర్థిక , సాంఘిక రంగాలలో అభివృద్ధి చెందింది. మౌలికరంగం , విద్యారంగం విశేషంగా అభివృద్ధి చేయబడ్డాయి.[42] యు.ఎస్.తో సన్నిహిత సంబంధాలు మెరుగుపరచబడ్డాయి.[61] 1979లో ప్రభుత్వానికి ప్రోత్సాహ కరంగా రెండు ప్రధాన సంఘటనలు జరిగాయి.[63] ఇవి సౌదీ విదేశీ , దేశీయ విధానాల మీద దీర్ఘకాలం ప్రభావం చూపాయి. మొదటిది ఇరానియన్ తిరుగుబాటు. సౌదీ అరేబియా లోని ఆయిల్ ఫీల్డ్ ఉన్న తూర్పు సముద్రతీరంలో నివసిస్తున్న అల్ప సంఖ్యాక షియా ముస్లిములు షియా ముస్లిముల ఆధిక్యత కలిగిన ఇరాన్ తిరుగుబాటుదారులతో చేరి తిరుగుబాటు చేస్తారన్న భీతి సౌదీ అరేబియాలో చోటుచేసుకుంది. 1979 ఖ్వాతిఫ్ తిరుగుబాటు వంటి పలు సంఘటనలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంభవించాయి.[64] రెండవ సంఘటనగా మక్కా లోని ఇస్లాం అతివాదులు " గ్రాండ్ మసీద్ ఆక్రమణ " చేసారు. సౌదీ ప్రభుత్వంలో లంచం , ఇస్లాం వ్యతిరేక చర్యలు అధికమయ్యాయన్న ఆగ్రహం తీవ్రవాదుల ఆక్రమణ చర్యకు కారణం అయింది.[64] 10రోజులలో మసీదు తిరిగి ప్రభుత్వం వశపరచుకుంది. ప్రతిస్పందనగా ప్రభుత్వం కఠినంగా సినిమాల మీద నిషేధం , ఉలేమాకు ప్రభుత్వంలో ప్రధాన పాత్ర ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంది. [65] సౌదీ అరేబియా శక్తివంతమైన ఇస్లాం దేశంగా కొనసాగుతుంది.[66]

Dammam No. 7, the first commercial oil well in Saudi Arabia, struck oil on 4 March 1938

1980 లో సౌదీ అరేబియా అరంకో నుండి అమెరికాను తొలగించింది.[67]రాజా ఖలిద్ 1982లో గుండెపోటుతో మరణించాడు. ఆయన తరువాత ఆయన సోదరుడు అధికారం చేపట్టాడు. ఆయన అదనంగా " కస్టోడియన్ ఆఫ్ ది టూ హోలీ మసీద్ " అనే టైటిల్ చేర్చుకున్నాడు. ప్రతిస్పందనగా 1986లో సంప్రదాయవాదులు " మెజెస్టీ " అనే పదప్రయోగం వదలాలని అది భగవంతునికి మాత్రమే ఉండాలని పట్టుబట్టారు. ఖలీఫద్ యునైటెడ్ స్టేట్స్‌తో సన్నిహిత సంబంధం కొనసాగించాడు. అలాగే అమెరికన్ , బ్రిటన్ నుండి మిలటరీ ఉపకరణాలను కొనుగోలు చేయడం అధికరించాడు.[42] ఆయిల్ విక్రయాల మూలంగా లభిస్తున్న విస్తారమైన సంపద సౌదీ సమాజం మీద గొప్ప ప్రభావం చూపింది. ఇది వేగవంతమైన సాంకేతిక ఆధునికత, నగరీకరణ, అందరికీ ప్రభుత్వ విద్య, , కొత్త మాధ్యమాల రూపకల్పన మొదలైన మార్పులు సంభవించాయి. అధికరించిన విదేశీయుల సంఖ్య సౌదీ ప్రజల సంప్రదాయం , జీవిత విలువల మీద ప్రభావం చూపాయి. అయినప్పటికీ ప్రజల సాంఘిక , ఆర్థిక జీవితంలో నాటకీయమైన మార్పు చోటు చేసుకుంది. రాజకీయంగా " రాజకుటుంబ ఆధిపత్యం " కొనసాగుతూ ఉంది.[42] అయితే ఇందుకు వ్యతిరేకంగా ప్రభుత్వనిర్వహణలో అధికంగా పాల్గొనాలని సౌదీలు భావిస్తున్నారు.[68] 1980లో ఇరాన్ - ఇరాక్ యుద్ధానికి మద్దతుగా సౌదీ అరేబియా 25 బిలియన్ల అమెరికన్ డాలర్లు వ్యయం చేసింది.[69] అయినప్పటికీ సౌదీ అరేబియా 1990లో కువైత్ ఆక్రమణను వ్యతిరేకిస్తూ యు.ఎస్.ను జోక్యం చేసుకోవాలని కోరింది.[42] రాజా ఫాద్ అమెరికా , సంకీర్ణ దళాలు సౌదీ అరేబియాలో నిలవడానికి అనుమతి ఇచ్చాడు. కువైత్ పౌరులు సౌదీ అరేబియాలో ఉండడానికి అనుమతి ఇస్తూ ఆయన కువైట్ ప్రభుత్వానికి ఆహ్వానం పంపాడు. అయినప్పటికీ ఇరాక్కు మద్దతుగా నిలిచిన యెమన్ , జోర్డాన్ ప్రజలను దేశం నుండి వెలుపలికి పంపాడు. 1991 లో సౌదీ అరేబియన్ సైన్యం ఇరాక్ మీద భూమార్గ దాడి , బాంబు దాడిలో పాల్గొన్నారు. కువైట్‌ను విడిపించడానికి అది సహకరించింది.అభివృద్ధి చెందుతున్న సౌదీ అరేబియా పశ్చిమదేశాల సంబంధాలు కొందరు ఉలేమా , షరియా లా విద్యార్థులను కలవర పరచింది. ఇది సౌదీ అరేబియాలో తీవ్రవాద చర్యలకు దారి తీసింది. సౌదీ దేశీయులు పశ్చిమదేశాలలో తీవ్రవాద చర్యలలో పాల్గొన్నారు. ఒసామా బిన్ లాడెన్ సౌదీ పౌరుడు (1994 లో సౌదీ పౌరసత్వం నుండి తొలగించబడ్డాడు) న్యూయార్క్,,వాషింగ్టన్ , వర్జీనియా (సెప్టెబర్ 11) దాడులలో పాల్గొన్న 19 మంది హైజాకర్లలో 15 మంది సౌదీ అరేబియా పౌరులు.[70] తీవ్రవాద చర్యలకు మద్దతు ఇవ్వనప్పటికి పలువురు పౌరులు ప్రభుత్వ విధానాలకు అసహనపడుతున్నారు.[71]

Petroleum and Natural gas pipelines in the Middle-East

ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడడానికి ఇస్లామిజం ఒక్కటే కారణం కాదు. ప్రస్తుతం అత్యంత సంపన్నంగా ఉన్నప్పటికీ సౌదీ అరేబియా ఆర్థికం

స్తంభించింది. అధికరున్న నిరుద్యోగం , అధికమైన పన్నులు ప్రజలలో అసంతృప్తి , దేశాతర్గత అసహనం , రాజకుటుంబం పట్ల అసంతృప్తి కలిగిస్తున్నయి. ప్రతిస్పందనగా రాజా ఫాద్ పలు సంస్కరణలు ప్రవేశపెట్టాడు. 1992 మార్చిలో ఆయన " బేసిక్ లా ఆఫ్ సౌదీ అరేబియా " ప్రవేశపెట్టాడు. అది పాలకుని బాధ్యత , కర్తవ్యం ప్రస్పుటంగా తెలియజేస్తుంది. 1993లో ది కంసులేటివ్ కౌంచిల్ ఏర్పాటు చేయబడింది. అందులో రాజుచే ఎన్నిక చేయబడిన ఒక చైర్మన్ , 60 మంది సభ్యులు ఉంటారు. .[ఆధారం చూపాలి] ఫాద్ తన మనసులో ప్రజాప్రభుత్వ యోచన లేదని స్పష్టం చేసాడు.[42]

1995 లో ఫాద్ హార్ట్ అటాక్‌తో బాధపడ్డాడు. రాకుమారుడు " అబ్దుల్లా ఆఫ్ సౌదీ అరేబియా " రాజప్రతినిధిగా బాధ్యత వహించాడు. ఫాద్ సోదరులు (సౌదీ సెవెన్) రాకుమారుని అధికారాన్ని నియంత్రించారు.[72] 1990 నుండి మొదలైన అంసంతృప్తి 2003, 2004 నాటికి మరింత అధికం అయింది రియాద్, జెద్దాహ్, యంబు మరుయు ఖోబర్‌లలో వరుస బాంబింగ్ వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.[73] 2005 ఫిబ్రవరి - ఏప్రిల్ మధ్య మొదటిసారిగా సౌదీ అరేబియా అంతటా ముంసిపల్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికలలో స్త్రీలకు ఓటు హక్కు లేదు.[42]2005 లో రాజా ఫాద్ మరణించాడు. అబ్దుల్లా అధికారం చేపట్టి కొంత సంస్కరణలు చేపట్టి నిరసనలు తగ్గించే ప్రయత్నం చేసాడు. రాజు పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టాడు. ఆయిల్ ఆదాయంతో దేశానికున్న సంబంధాలను తగ్గించాడు. మితమైన క్రమబద్ధీకరణ, విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం, విశేషాధికారాలు కలిగించబడ్డాయి.2009 లో అబ్దుల్లా ఆఫ్ సౌదీ అరేబియా న్యాయవ్యవస్థ, ఆయుధవ్యవస్థ, విభిన్న మంత్రిత్వశాఖలు ఆధునికీకరణ చేయబడి న్యాయవ్యవస్థ, మతపరమైన పోలీస్ సిబ్బంధి స్థానంలో కొత్త ఉద్యోగుల నియామకం, మొదటి మహిళా ఉపమంత్రి నియామకం మొదలైన చర్యలు చేపట్టబడ్డాయి.[42]

నిరసనలు

2011 జనవరి 29న వందలాది నిరసనదారులు కూడి జెద్దాహ్‌లో తీవ్రమైన వరదలకు ధ్వంసం అయిన నగర మౌలిక వసతుల కారణంగా మరణించిన 11 మంది కొరకు నగర మౌలిక వసతులు లోపభూయిష్టంగా ఉన్నాయని నిరసన ప్రదర్శన నిర్వహించారు. సౌదీలో ఇలాంటి ప్రదర్శన చాలా అరుదుగా జరుగుతుంది. [74] 30-50 మందిని ఖైదు చేసి ప్రభుత్వం నిరసన ప్రదర్శనను 15 నిముషాలలో నిలిపివేసింది. [75] 2011 నుండి సౌదీ అరేబియా అంతర్గత నిరసనలతో బాధించబడుతుంది.[76] ప్రతిస్పందనగా 2011 ఫిబ్రవరి 22 న రాజా అబ్దుల్లా పౌరులకు పలు ప్రయోజనాలు కలిగిస్తూ 36 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువజేసే ప్రణాళికను ప్రకటించాడు. వీటిలో 10.7 బిలియన్లు నివాసగృహాలకు ప్రత్యేకించబడ్డాయి.[77][78][79] సంస్కరణలో ఎలాంటి రాజకీయాంశాలు లేనప్పటికీ కొంత మంది ఖైదీలకు క్షమాభిక్ష లభించింది.[80] మార్చి 18న రాజా అబ్దుల్లా 93 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువజేసే ప్యాకేజిని ప్రకటించాడు. అందులో అదనంగా 5,00,000 నివాసగృహాలు (67 బిలియన్లు) చేర్చబడ్డాయి. అదనంగా 60,000 సెక్యూరిటీ ఉద్యోగాలు రూపొందించబడ్డాయి.[81][82] పురుషులకు మాత్రమే సౌదీ అరేబియన్ 2011 ముంసిపల్ ఎన్నికలు 2011 సెప్టెంబరు మాసంలో నిర్వహించబడ్డాయి.[83][84] అబ్దుల్లా సౌదీ అరేబియన్ ముంసిపల్ ఎలెక్షంస్ 2015 లో స్త్రీలకు ఓటు హక్కు కల్పించాడు. అలాగే షురా కమిటీ ఏర్పాటు ప్రతిపాదన చేయబడింది. [85]

రాజకీయాలు

సౌదీ అరేబియా సంపూర్ణ రాజరికవ్యవస్థ కలిగిన దేశం.[86] 1992 లో రాజ్యాంగ వ్యవస్థ స్వీకరించిన సౌదీ అరేబియా చట్టవ్యవస్థ షరియా (ఇస్లామిక్ చట్టం), ఖురాన్ ఆధారంగా రూపొందించబడింది.[87] రాజకీయ పార్టీలకు, ఎన్నికలకు అవకాశం లేదు.[86] విమర్శకులు దీనిని నిరంకుశ పాలనగా వర్ణిస్తుంటారు.[88][89][90]2012 డెమాక్రసీ ఇండెక్స్ జాబితాలోని 167 దేశాలలో సౌదీ అరేబియా 5 వ స్థానంలో ఉంది.[23] ఫ్రీడం హౌస్ " స్వతత్రం రహితం " (నాట్ ఫ్రీ) లో అతి దిగువస్థానం ఇచ్చింది.[29] ఎన్నికలు, రాజకీయ పార్టీలు లేకపోవడం.[86] సౌదీ అరేబియా రాజకీయాలు రెండు వైవిధ్యమైన రంగాలుగా ఉంటుంది. అల్ సౌద్, రాజకుటుంబం మద్య రాజకీయం ఆధారపడి ఉంటుంది.[91] అల్ సౌద్ రాజకీయాలలో అధికంగా పాల్గొంటున్నందున వెలుపలి నుండి స్వల్పంగా మాత్రమే రాజకీయాలలో పాల్గొంటున్నారు. రాజకుటుంబ సభ్యులు ఉలేమా, గిరిజన షేకులు, ప్రధాన వ్యాపార కుటుంబాలతో చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.[92] సౌదీ మాధ్యమం ఈ విధానాన్ని ప్రజలకు వివరించదు.[93] సాధారణంగా పురుషులు రాజుకు సభాముఖంగా (మజిలీస్) తమ ఫిర్యాదులు తెలియజేయడానికి అవకాశం ఉంది.[94] ప్రభుత్వానిని చేరుకోవడానికి వైవిధ్యమైన మార్గాలు ఉంటాయి. గిరిజన సంప్రదాయం పరిపాలనలో రాకుటుంబం తరువాత ప్రధాన పాత్ర వహిస్తుంది. గిరిజన షేకులకు రాజకీయాలలో ప్రభావం అధికంగా ఉంటుంది. గిరిజనులకు ప్రాంతీయంగా, జాతీయ సంఘటనలలో ప్రధాన్యత అధికంగా ఉంటుంది.[92] సమీపకాలంలో రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలలో 1990 లో కంసల్టేటివ్ కౌంసిల్, 2003 లో నేషనల్ డైలాగ్ ఫోరం ఏర్పాట్లు ప్రధానమైనవి.[95] అల్ సౌద్ రాజకీయంగా సున్నీ ముస్లిం ఇస్లామిక్ తీవ్రవాదం, లిబరల్ క్రిటిక్స్, షియా ఇస్లాం (అల్పసంఖ్యాకులు), ప్రాతీయవాదుల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది.[96] వీటిలో ముస్లిం తీవ్రవాదం సమస్యప్రధానమైనది.[73] అయినప్పటికీ ప్రభుత్వానికి వ్యరేకంగా ప్రశాంతమైన ప్రకటనపట్ల కూడా సహనం ప్రదర్శించబడడం లేదు. స్త్రీలు వాహనాలు నడపడానికి నిషేధం అమలు చేస్తున్న ఏకైక దేశం సౌదీ అరేబియా మాత్రమే.[97] 2011 సెప్టెంబరు 25న సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా స్త్రీలు ఓటు వేయడానికి, ఎన్నికలలో పాల్గొనడానికి, షురా కౌంసిల్‌లో సభ్యత్వం వహించడానికి అనుమతిస్తూ ప్రకటన జారీ చేసాడు.[98]

సాంరాజ్యం , రాజకుటుంబం

రాజు చట్టం,పాలన, న్యాయవ్యవస్థ నిర్వహణ [92] దేశాచట్టాల ఆధారంగ రాయల్ డిక్రీ అధికారాలు కలిగి ఉంటారు. [99] రాజు ప్రధాన మంత్రి, ఉపప్రధాని, మంత్రివర్గ నియామకానికి బాధ్యత వహిస్తాడు. రాజకుంటుంబం రాజకీయాల మీద ఆధిక్యత కలిగి ఉంటుంది. రాజకుంటుంబం దేశరాజకీయాలలో అన్ని స్థాయిలలో ఆధిక్యత కలిగి రాజకీయంగా కీలక స్థానాలను తన ఆధీనతలో నిలుపుకుంటూ ఉంది.[100] రాజకుమారుల సంఖ్య దాదాపు 7,000 ఉన్నప్పటికీ వీరిలో ఇబ్న్ సౌద్ వంశానికి చెందిన 200 మందికి ఉన్నత పదవులు ఇవ్వబడ్డాయి.[101] కీలకమైన మంత్రిపదవులు సాధారణంగా రాజకుటుంబ సభ్యులకు కేటాయించబడుతుంటాయి.[86] 13 గవర్నర్ పదవులు కూడా రాజకుటుంబ సభ్యులకు కేటాయించబడుతుంటాయి.[102] దీర్ఘకాలిక ప్రభుత్వ ఉన్నత పదవులు సీనియర్ రాజకుమారులకు అధికార మాన్యం అందించడానికి ఉపకరిస్తున్నాయి.[103] కింగ్ అబ్దుల్లా సౌదీ నేషనల్ గార్డ్ కమాండర్‌గా పదవి వహించాడు. 1963 లో పదవీ బాధ్యతలు చేపట్టిన అబ్దుల్లా తనకుమారుని అదే పదవిలో నియమించే వరకు పదవిలో కొనసాగాడు.[104] గతంలో యువరాజు సుల్తాన్ 1962 నుండి 2011లో మరణించే వరకు రక్షణమంత్రిగా పదవి వహించాడు. గత యువరాజు నయేఫ్ 1975 నుండి హోం శాఖా మంత్రిగా పనిచేసాడు. సౌద్ ఫైసల్ బిన్ అబ్దులాజిజ్ అల్ సౌద్ (రాజకుమారుడు సౌద్) 1975 నుండి విదేశాంగ మంత్రిగా పదవి వహించాడు.[105] ప్రస్తుత రాజు సల్మాన్ 1962-2011 వరకు రక్షణ మంత్రిత్వశాఖ, విమానయాన శాఖ, రియాద్ ప్రొవింస్ గవర్నర్‌గా పదవులు వహిస్తున్నాడు. [106] ప్రస్తుతం కింగ్ సల్మాన్ కుమారుడు, డెఫ్యూటీ క్రౌన్ ప్రింస్ అయిన రాజకుమారుడు మొహమ్మద్ బిన్ సల్మాన్ రక్షణ మంత్రిగా పదవి వహిస్తున్నాడు.[107] రాజకుంటుంబంలో వంశవిశ్వాసాలు, వ్యక్తిగత అకాంక్షలు, వ్యూహాత్మ విధానాల విభేదాల కారణంగా రాజకీయంగా వర్గాలుగా విడిపోతుంటాయి.[91] గతించిన రాజు ఫాద్ సహోదరులు, రాజు వారసుల మద్య సంభవించిన " సౌదారి సెవెన్ " వర్గవిబేధాలను అత్యంత శక్తివంతమైన వర్గవిబేధంగా భావిస్తున్నారు.[108] వేగవంతమైన ప్రత్యక్ష స్వతంత్రం, సంస్కరణలు విషయంలో,[109] ఉలేమా పాత్ర హెచ్చించడం, తగ్గించడం విషయంలో అత్యధికంగా విధానపరమైన విభేదాలు తలెత్తాయి. రాకుమాౠడు సుల్తాన్ హత్య లేక ముందుగా సంభవించిన మరణం తరువాత వారసత్వం ఎవరికి దక్కాలన్న విషయంలో రాజకుటుంబంలో తీవ్రమైన విభేదాలు సంభవించాయి.[108][110] 2011 అక్టోబరు 21న రాకుమారుడు సుల్తాన్ మరణించిన తరువాత కింగ్ అబ్దుల్లా రాకుమారుడు నయాఫ్‌ను యువరాజును చేసాడు.[111] తరువాత సంవత్సరం యువరాజు నయాఫ్ కూడా మరణించాడు.[112]

King Salman bin Abdulaziz Al Saud inherited power in 2015.

లంచం

సౌదీ ప్రభుత్వం, రాజకుటుంబం పలు సంవత్సరాల నుండి తరచుగా లంచగొండి తనం ఆరోపణలను ఎదుర్కొంటున్నది.[113][114][115][116][117][118][119][120][121] దేశంలో రాజకుటుంబంలోని [36] సీనియర్ రాజకుమారుల ఆస్తులు స్పష్టంగా వెల్లడించబడలేదన్నది ఆరోపణలలో భాగంగా ఉంది.[101] లంచం విస్తరణ స్థానీయంగా [122] దీని ఉనికి సర్వజనీనంగా,[123][124] సమర్ధనీయంగా ఉంది.[125] 2001లో ఒక ఇంటర్వ్యూలో రాజకుటుంబానికి చెందిన బందర్ బిన్ సుల్తాన్ (రాజకుటుంబానికి చెందిన సీనియర్ సభ్యుడు) లంచాన్ని సమర్ధించడం విశేషం.[126]) [127]లంచం ఆరోపణలు అన్నీ వ్రాతబద్ధం కానప్పటికీ [128] 2007 లో " బ్రిటిష్ డిఫెంస్ కాంట్రాక్టర్ (బి.ఎ.ఇ. సిస్టంస్) అల్- యమమాహ్ ఆర్మ్‌స్ డీల్ కొరకు రాకుమారుడు బందర్‌కు 2 బిలియన్ల అమెరికన్ డాలర్లు లంచం ఇచ్చారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.[129][130] రాకుమారుడు బందర్ ఆరోపణలనఖండించాడు.[131] 2010లో యు.ఎస్. , యు.కె. అధికారులు సాగించిన విచారణలో 447 మిలియన్ల అమెరికన్ డాలర్లు జరిమానాగా విధించబడినదని లంచంకాదని వివరించారు.[132] 2010లో ట్రాంస్పరెంసీ ఇంటర్నేషనల్ తన వార్షిక " కరప్షన్ పర్సిప్టేషంస్ ఇండెక్స్ " సౌదీ అరేబియాకు 4.7 (హైలీ క్లీన్ , లంచం సంబంధిత దేశాలలో 0.10 స్కోర్) స్కోర్ ఇచ్చింది.[133]

సంస్కరణలు

సౌదీ అరేబియా పారదర్శకత కలిగిన పాలన , నిర్వహణ వంటి రాజకీయ , సాంఘిక సంస్క్రణలను చేపట్టింది. వ్యాపారంలోబంధుప్రీతి , పలుకుబడి ప్రభావందేశమంతటా వ్యాపించి ఉంటుంది. లంచగొండితనం నివారణ కొరకు ప్రవేశపెట్టబడిన చట్టాలు ప్రభుత్వాధికారులకు శిక్షవిధించడానికి సహకరిస్తూ ఉన్నాయి.రాజకుటుంబం పాలనను సంస్కరించడం , ఆధునికీకరణ చేయడం కొరకు ప్రజల నుండి వత్తిడి అధికరిస్తూ ఉంది. 2005 లో రాజ్యాధికారం చేపట్టిన తరువాత రాజా అబ్దుల్లా సంస్కరణ , ఆధునికీకరణ కొరకు పోరాటం ఆరంభించాడు. 1990 లో రూపొందించబడిన " కంసల్టేటివ్ కౌంసిల్ " రాజకీయ భాగస్వామ్యం విషయంలో ప్రజలను సంతృప్తి చేయడంలో విఫలం అయింది. 2003 లో ప్రకటించబడిన " నేషనల్ డైలాగ్ ఫోరం " ప్రొఫెషనల్స్ , మేధావులు దేశరాజకీయాల గురించి కొన్ని పరిమితులకు లోబడి చర్చలలో బహిరంగంగా పాల్గొనడానికి అనుమతించింది. 2005 లో మొదటి మునిసిపల్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. 2007 లో వారసత్వ విధానం క్రమబద్ధీకరణ చేయడానికి " అలెజియంస్ కౌంసిల్ " రూపొందించబడింది.[95] 2009 లో సౌదీ రాజు పాలనలో వ్యక్తిగతంగా గుర్తించతగిన మార్పులు చేసాడు. మార్పులలో భాగంగా కీలక స్థానాలలో సంస్కరణ వాదులను నియమించడం , మొదటిసారిగా మహిళను మంత్రివర్గంలో నియమించడం వంటి చర్యలు చేపట్టబడ్డాయి.[134][135] అయినప్పటికీ మార్పులు కేవలం పైమెరుగులేననన్న విమర్శనకు లోనయ్యాయి.[136]

Al ash-Sheikh and role of the ulema

Abdullah ibn Muhammad Al ash-Sheikh with Bogdan Borusewicz in the Polish Senate, 26 May 2014

సౌదీ అరేబియాలో ఉలేమా (ఇస్లాం మతనాయకులు , న్యాయాధీశులు) ప్రభుత్వంలో నేరుగా జోక్యం చేసుకుంటారు.[137] ఉలేమా అధికారానికి మరొక ఉదాహరణగా ఇరాన్ ప్రభుత్వం ఉంది.[138] ప్రధానమైన ప్రభుత్వ నిర్ణయాలలో ఉలేమా ప్రభావం చూపుతుంది. ఉదాహరణగా 1973 ఆయిల్ సంక్షోభం , 1990 సౌదీ అరేబియా యుద్ధం [139] వ్యాయనిర్ణయాలు , విద్యా విధానాలలో కూడా ఉలేమా ప్రభావం చూపుతూ ఉంది.[140] అంతేకాక మతవిధానాలు , సామాజిక నియమాలలో ఏకీకృత అధికారం కలిగి ఉంది.[141] 1970 నాటికి ఆయిల్ ద్వారా వస్తున్న సంపద రాజా ఫైసల్ దేశాన్ని ఆధునికీకరణ చేయడం ప్రారంభించారు. క్రమంగా సౌదీ అరేబియా రాజకీయాలలో ఉలేమా ప్రభావం తగ్గుముఖం పట్టింది.[142] ఫలితంగా 1979 నాటికి ఇస్లాం తీవ్రవాదులు మక్కా లోని గ్రాండ్ మసీద్ ఆక్రమణ చేసుకొనడం వంటి సంఘటన చోటుచేసుకుంది.[143] సంఘర్షణకు ప్రభుత్వ ప్రతిస్పందనగా ఉలేమా అధికారం పునరుద్ధరణ , వారికి ఆర్ధికసహాయం చేయబడింది.[65] తరువాత ఉలేమా విద్యావిధానం మీద ఆధిపత్యం వహించారు.[143] అదనంగా సామాజిక వ్యవహారాలు , నీతినియమాల విషయంలో ఉలేమా కఠినంగా వ్యవహరించింది.[65] 2005లో రాజా అబ్దుల్లా సిహాసనం అధిష్ఠించిన తరువాత ఉలేమా అధికారం తగ్గించబడింది. అలాగే మహిళావిధ్యా విధానం మీద ఆధిపత్యం విద్యామంత్రిత్వశాఖకు మళ్ళించబడింది.[144] చారిత్రాత్మకంగా ఉలేమా దేశంలోని మతపరంగా ప్రాముఖ్యత వహించిన కుటుంబానికి చెందిన " అల్ ఆష్- షేక్ " నాయకత్వంలో నిర్వహించబడుతుంది.[141][145] " అల్ ఆష్- షేక్ " గా ముహమ్మద్ ఇబ్న్ అబ్ద్ అల్- వహ్హాబ్ వారసులు నియమించబడుతుంటారు. వహ్హాబీని 18వ శతాబ్దంలో " సున్నీ ముస్లిం " రూపంలో స్థాపించబడింది. ప్రస్తుతం సున్నీ ముస్లిం మతం సౌదీ అరేబియాలో ఆధిపత్యం వహిస్తుంది. [146] అల్ ఆష్-షేక్ రాజకుంటుంబానికి తరువాత అంతస్థులో ఉంది.[147] అల్ ఆష్-షేక్ రాజకుంటుంబ సహాయంతో " ముచ్యుయల్ సపోర్ట్ పాక్ట్ ",[148] పవర్ షేరింగ్ ఒప్పందం (300 సంవత్సరాలకు ముందుగా) చేయబడింది.[139] ఈ పాక్ట్ ప్రస్తుతకాలం వరకు అమలులో ఉంది.[148] మతసంబంధిత విషయాలు , వహాబీ ఆదేశాల అమలులో అల్ - ఆష్ షేక్ అధికారాన్ని అల్ సౌద్ ఆదరిస్తుంది. ప్రతిగా అల్ ఆష్- షేక్ అల్ సౌదీ రాజకీయ అధికారానికి మద్దతు ఇస్తూ ఉంటాడు.[149] వారు రాజరిక పాలనలో మతం- నీతి సంబంధిత అధికారం చట్టబద్ధం చేసుకున్నారు. [150] సమీప దశాబ్ధాలలో ఉలేమా మీద అల్- అష్ షేక్ ఆధిపత్యం తగ్గించబడినప్పటికీ [151] వారు ఇప్పటికీ మతసంబంధిత విషయాలలో ప్రధానపాత్ర వహిస్తున్నారు.[141]

న్యాయ విధానం

Verses from the Quran. The Quran is the official constitution of the country and a primary source of law. Saudi Arabia is unique in enshrining a religious text as a political document.[152]

సౌదీ అరేబియాలో ఖురాన్ , సున్నాహ్ ఆధారంగా రూపొందిన షరియా చట్టం అమలులో ఉంది.[99] ఆధునిక ముస్లిందేశాలు షరియా ఆధారిత చట్టాలు రూపొందించబడలేదు. ఆ దేశాలలో న్యాయాద్యక్షుని విధానం, జడ్జిలకు స్వతంత్రమైన నిర్భయాధికారం కాని లేదు. సౌదీ అరేబియా న్యాధికారులు పురాతన న్యాయమీమాంస సంబంధిత హంబలి (ఫిక్యూ) స్కూల్స్ విధానాలను అనుసరిస్తూ [153] ఖురాన్ , హాడిత్ అర్ధాలను ఉదహరిస్తారు.[154] అందువలన న్యాయాధికారులు మునుపటి తీర్పులను అధిగమించడానికి (స్వంత తీర్పులు , ఇతర న్యాధికారులు) అధికారం కలిగి ఉండి ప్రత్యేక కేసులలో షరియాకు వారిస్వంత భాస్యం జతచేస్తారు.[155] అందువలన తీర్పును ముందుగా ఊహించడం కఠినం.[156] సౌదీ న్యాయవిధానం , న్యాయమూర్తులకు , న్యాయవాదులకు షరియా చట్టవిధానం ఆధారభూతంగా ఉంటుంది. రాజరిక ఉత్తర్వులు చట్టానికి అదనపు వనరుగా ఉంటుంది.[99] షరియా అనుబంధిత షరియా విధానం శ్రామిక, వాణిజ్య , వ్యాపార రంగాలలో అనుసరించబడుతుంది.[157] ప్రభుత్వ న్యాయస్థానాలు ప్రత్యేక వివాదాలకు రాజరిక ఉత్తర్వులకు అనుగుణంగా కేసులను పరిష్కరిస్తుంటాయి.[158] షరియా న్యాయస్థానాలు , ప్రభుత్వ న్యాయస్థానాల ఫైనల్ అప్పీల్ కొరకు షరియా చట్టాలను అనుసరిస్తుంటాయి.

విమర్శలు

[159]సౌదీ న్యాయవిధానం " తీవ్రమైన మతప్రాతిపదిక కలిగినది " అని విమర్శలకు లోనౌతూఉంది. పురుషులకు అనుకూలంగా తీర్పులు ఉంటాయని విమర్శలు వెలువడుతుంటాయి. భార్యను కొట్టడం , విడిచి పెట్టడం మొదలైన కేసులలో చాలా జాప్యం వహిస్తుంటారని భావిస్తుంటారు. వివాహరద్దు నుండి కూడా మహిళలకు రక్షణ కొరవడుతుందని కూడా భావిస్తుంటారు.[160][161] న్యాయవ్యస్థ మర్మమైనదన్న విమర్శకూడా ఉంది.[162] ఆధునిక ప్రపంచంతో అనుసంధానం చేయలేని న్యాయపరమైన రక్షణ లోపం విమర్శించబడుతుంది.[163]

సంస్కరణలు

2007 లో రాజా అబ్దుల్లా న్యాయవ్యస్థ సంస్కరణలు , సరికొత్త న్యాయవిధానం రూపొందిస్తూ ఉత్తర్వు జారీ చేసాడు.[155] 2009 లో రాజా అబ్దుల్లా న్యాయవిధానంలో గుర్తించతగిన మార్పులు చేస్తూ సీనియర్ స్థాయి వ్యక్తుల స్థానంలో యువతను నియమించాడు.[162]

Deera Square, central Riyadh. Known locally as "Chop-chop square", it is the location of public beheadings.[164]

శిక్షలు

సౌదీ అరేబియాలో మరణశిక్ష, శారీరక శిక్ష అమలులో ఉంది. శిరచ్ఛేధం, మరణించే వరకు రాళ్ళతో కొట్టడం, శిలువ వేయడం కొరడా దెబ్బలు వెయ్యడం, అంగవిచ్ఛేధం వంటి శారీరక శిక్షలు ప్రధానమైనవి.[165] సౌదీ అరేబియాలో హత్య, మానభంగం,ఆయుధాలతో బెదిరించి దోపిడీ, తిరిగి తిరిగి మాదకద్రవ్యాల వాడుక, మతమార్పిడి, వ్యభిచారం, మంత్రవిద్య, వశీకరణ మొదలైన నేరాలకు మరణశిక్ష విధించబడుతుంది. ఇలాంటి శిక్షలకు కత్తితో శిరచ్ఛేధం, రాళ్ళతో కొట్టడం, తుపాకులతో కాల్చడం, శిలువవేయడం [166][167][168] 2007 నుండి 2010 మద్య 345 మరణశిక్షలు అమలయ్యాయి.చివరిసారిగా 2014లో మరణశిక్ష అమలయ్యింది.[169]దొగతనం తిరిగి తిరిగి చేసినప్పుడు కుడి చేయి తొలగించడం వంటి శిక్షలు విధించబడుతుంటాయి. 2007-2010 మద్యకాలంలో ఇలాంటి శిక్ష ఒకటి మాత్రమే అమలయ్యింది. హోమోసెక్క్షియల్ నేరానికి రాళ్ళతో కొట్టడం లేక మరణశిక్ష విధించడం మొదలైన శిక్షలు విధించబడుతుంటాయి.[166][168][170][171][172][173] నాస్థికవాదం లేక ముస్లిం సంప్రదాయాన్ని ప్రశ్నించడం మొదలైనవి నేరంగా, తీవ్రవాదంగా పరిగణించబడుతుంటాయి.[174]కొరడాదెబ్బలు సాధారణంగా అమలులో ఉన్న శిక్షగా ఉంది.[175] అలాగే మద్యపానం, ప్రార్థన పట్ల నిర్లక్ష్యవైఖరి, ఉపావాసంలో నియమ ఉల్లంఘన వంటి మతపరమైన, నీతిసంబంధమైన నేరాలకు కూడా బెత్తం, కొరడాదెబ్బలు శిక్షగా విధించబడుతుంటాయి.[166] ప్రతీకారం (క్విసాస్) శిక్షలు; కన్ను కోల్పోయిన వ్యక్తి సూచన మేరకు కారణమైన వ్యక్తికి ఆపరేషన్ ద్వారా కన్ను తొలగించడం,[161] హత్యలు చేసిన నేరస్థునికి హత్యకు గురైన వారి కుటుంబ సభ్యులు కోరుకుంటే మరణశిక్ష లేక దియ్యా (బ్లడ్ మనీ) ఇవ్వడం వంటి శిక్షలు అమలులో ఉన్నాయి.[176]

మానవహక్కులు

In 2014, Saudi Arabian writer Raif Badawi was sentenced to 10 years in prison and 1,000 lashes for "insulting Islam".

ఆమెంస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ మొదలైన పశ్చిమదేశాల సంస్థలు సౌదీ క్రిమినల్ జస్టిస్ సిస్టం, తీవ్రమైన శిక్షలను విమర్శిస్తూ ఉన్నాయి.[177] 2008 హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదికల ఆధారంగా 2002 లో మొదటిసారిగా వెలువరించబడిన నేరసంబంధిత చట్టాల రూపకల్పనలో ఎలాంటి కేసులోనైనా ఆధారభూతమైన రక్షణ లోపం ఉందని భావించారు. న్యాయవాదులు సహజంగా వీటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. న్యాయనిర్ధారణ అధికంగా రహస్యంగానే జరుగుతుంది. అపరాధికి సాక్షిని కాని, సాక్ష్యం కాని చూపించి న్యాయవాదిని నియమించుకోవడానికి తగినంత అవకాశం ఉండదు.[178][179] ఉదాహరణగా యునైటెడ్ కింగ్డానికి చెందిన 74 సంవత్సరాల వయస్కుడు కేంసర్ వ్యాధిగ్రస్థుడైన కార్ల్ అండ్రీ అనే వ్యక్తికి ఇంట్లో మద్యం కాచిన నేరానికి 360 కొరడాదెబ్బలు శిక్షగా విధించబడ్డాయి.[180] తరువాత బ్రిటిష్ ప్రభుత్వ జోక్యంతో ఆయన శిక్ష నుండి తప్పించబడ్డాడు.[181]సౌదీ అరేబియా ప్రపంచం వ్యాప్తంగా అత్యధిక స్థాయిలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నది. స్త్రీల ప్రాథమిక హక్కులను సౌదీ అరేబియా అణిచివేతకు గురిచేస్తుంది. స్వలింగసంపర్క నేరానికి సౌదీ అరేబియాలో మరణశిక్ష విధించబడుతూ ఉంది.[182] మత వివక్ష, మతస్వాతంత్ర్యం లోపం, మతపరమైన రక్షకసిబ్బంధి (రిలీజియస్ పోలీస్) చర్యలు మానవహక్కుల ఉల్లంఘనకు సాక్ష్యంగా ఉన్నాయి.[165] 1996, 2000 మద్య సౌదీ అరేబియా 4 ఐక్యరాజ్యసమిటి మానవహక్కుల సమావేశాలలో పాల్గొనడానికి అంగీకరించంది, 2004 లో ప్రభుత్వం " నేషనల్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రైట్స్ " స్థాపనకు అంగీకరించింది. అయినప్పటికీ నేషనల్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చర్యలు పరిమితమైనవని, దాని నిష్పక్షపాత వైఖరి, స్వతంత్రం పట్ల సందేహాలు వ్యక్తం ఔతున్నాయి. [183] సౌదీ అరేబియా ఐక్యరాజ్యసమితి " యూనివర్శల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ "కు అంగీకారం తెలుపని కొన్ని దేశాలలో సౌదీ అరేబియా ఒకటి. ఫలితంగా సౌదీ అరేబియా మానవహక్కుల ఉల్లంఘన విషయంలో విమర్శలు కొనసాగుతూ ఉన్నాయి. సౌదీ అరేబియా ప్రభుత్వం ఒక ముస్లిం దేశంగా సాంఘిక , రాజకీయ విధానాలు ప్రత్యేకంగా ఉంటాయని ప్రపంచానికి ఎత్తిచూపుతూ ఉంది.[184] అంతర్జాతీయ మతస్వతంత్రం విషయంలో [185] (2014 పర్యటనలో) వత్తిడి తీసుకురావాలని " యునైటెడ్ స్టేట్స్ కమిషన్ " అధ్యక్షుడు బారక్ ఒబామాను కోరింది. ప్రత్యేకంగా సుల్తాన్ హమిద్ మర్జూక్ అల్- ఎనెజి, సౌద్ ఫలుహ్ అవాద్ అల్- ఎనెజ్ , రైఫ్ బదావి ఖైదు విషయంలో వత్తిడి తీసుకురావాలని కోరింది.[186] సౌదీ అరేబియా హత్యలు, మాదకద్రవ్యాల దొంగరవాణా నేరాలకు వార్షికంగా డజన్లకొద్దీ నేరస్తులకు మరణశిక్ష విధిస్తుంది. రాజకుటుంబానికి ద్రోహం చేసిన వారు , ఇస్లాం మతాన్ని విసర్జించిన వారికి కూడా మరణశిక్ష విధించబడుతుంది.[187] మరణశిక్షగా ప్రజలముందు బహిరంగంగా శిరచ్ఛేదం నిర్వహించబడుతుంది.[188][189] 2012 లో అరబ్ తిరుగుబాటు సమయంలో " అలి మొహమ్మద్ బక్విర్ అల్- నింర్ " తన 17వ సంవత్సరంలో సౌదీ అరేబియన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేనందుకు సౌదీ అరేబియాలో ఖైదు చేయబడ్డాడు.[190] 2014 మే మాసంలో అలి అల్- నింర్‌కు ప్రజల సమక్షంలో శిరచ్ఛేధం చేసి శిలువ వేయాలన్న శిక్ష విధించబడింది.[191] 2013 లో ప్రభుత్వం సౌదీ పౌరులు కాని వేలాది మందిని (విసా పరిమితి దాటి చట్టవిరుద్ధంగా సౌదీలో పనిచేస్తున్న వారు) దేశం నుండి వెలుపలకు పంపింది. విదేశీ ఉద్యోగులను దేశీయ సబ్బంధి , ఇతరులు హింసిస్తున్నారని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. [192][193] ఫలితంగా ప్రధాన సేవాసంస్థలలో ఉద్యోగుల కొరత ఏర్పడింది. సాధారణంగా సౌదీ అరేబియా పౌరులు బ్లూ కాలర్ ఉద్యోగాలు చేయడానికి వ్యతిరేకంగా ఉన్నారు.[194][195][196] సౌదీ అరేబియా ప్రభుత్వం తీవ్రవాదంతో పోరాడడానికి అలాగే ఇస్లామిక్ విలువను అభివృద్ధి చేయడానికి, సహనం , విధేయత కలిగించడానికి " కౌంటర్ - రాడికలైజేషన్ ప్రోగ్రాం " ఏర్పాటు చేసింది.[197] ఆమెంస్టీ ఇంటర్నేషనల్ ఆధారిత బాల్టిమోర్ సన్ రైఫ్ బదావి ఖైదు,[198] హఫ్ర్ అల్- బతిన్ (ఇస్లాంను నిరాకరించినందుకు ) మరణశిక్షను పేర్కొంటూ కౌంటర్ - రాడికలైజేషన్ ప్రోగ్రాంను ప్రశ్నించింది.[199] 2015 సెప్టెంబరులో యు.ఎన్ జెనీవాలోని సౌదీ అరేబియా దూత " ఫైసల్ బిన్ హాసన్ ట్రాడ్ " యునైటెడ్ నేషంస్ హ్యూమన్ రైట్స్ కౌంసిల్ చైర్ పర్సన్‌గా ఎన్నికైయ్యాడు.[200] 2016 జనవరిలో సౌదీ అరేబియా ప్రముఖ షియా మతగురువు షేక్ నింర్‌కు మరణశిక్ష విధించింది. షేక్ నింర్ సౌదీ అరేబియాలో ప్రొ డెమొక్రసీ , స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగడానికి పిలుపు ఇచ్చినందుకే ఈ శిక్ష విధించబడింది.[201]

విదేశీసంబంధాలు

U.S. President Barack Obama with King Abdullah of Saudi Arabia, July 2014

1945 లో సౌదీ అరేబియ యు.ఎన్.లో చేరింది.[32][202] అలాగే అరబ్ లీగ్, కార్పొరేషన్ కౌంసిల్ ఫర్ ది అరబ్ స్టేట్స్ ఆఫ్ ది గల్ఫ్, ముస్లిం వరల్డ్ లీగ్ , ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాంఫరెంస్ (ప్రస్తుతం ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్) లకు ఫండింగ్ మెంబర్‌గా ఉంది. [203] " ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ " , " ది వరల్డ్ బ్యాంక్ " లలో సౌదీ అరేబియా ప్రధానపాత్ర పోషిస్తుంది. అలాగే 2005 లో " ది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ " సభ్యత్వం తీసుకుంది.[32] 2015 లో సౌదీ అరేబియా " అరబ్ కస్టంస్ యూనియన్ " , అరబ్ సింగిల్ మార్కెట్ " రూపకల్పనకు మద్దతు తెలిపింది. [204] 2009 అరబ్ లీగ్ సమ్మిట్‌లో 2020 సమ్మిట్ ప్రకటించబడింది.[205] 1960 నుండి ఒ.పి.ఇ.సి. ఫండింగ్ సభ్యదేశంగా ఆయిల్ ప్రైసింగ్ పాలసీ క్రమబద్ధీకరణ చేయబడింది.[32][206] 1970 మద్య నుండి 2002 మద్యకాలంలో సౌదీ అరేబియా 70 బిలియన్ల " ఓవర్సీస్ డెవెలెప్మెంట్ ఎయిడ్ " అభివృద్ధి చేసింది.,అయినప్పటికీ ఇది ఇతర ఇస్లాం సంస్థల కంటే వహాబిజం ఆధిక్యత అధికరించడానికి వ్యయం చేస్తుంది.[207] సౌదీ ఎయిడ్, వహాబిజం విషయంలో అత్యధికంగా చర్చలు జరుగుతున్నాయి.[208] The two main allegations are that, by its nature, Wahhabism encourages intolerance and promotes terrorism.[209] సెప్టెంబరు 11 తీవ్రవాద దాడి తరువాత సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్ మద్య సంబంధాల మీద వత్తిడి అధికం అయింది. [210] సౌదీ అరేబియా జిహాదీ సంస్కృతి, తీవ్రవాదులకు మద్దతు ఇస్తుందని అమెరికన్ రాజకీయవాదులు, మాద్యం ఆరోపిస్తున్నాయి.[211] సెప్టెంబరు 11 దాడులలో పాల్గొన్న హైజాకర్లలో ఒసామా బిన్‌లాడెన్‌తో సహా 15 మంది సౌదీ అరేబియాకు చెందిన వారు ఉండడం విశేషం.[212] 2014 లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, లెవంత్‌ల కేసులో పాల్గొన్న న్యాయమూర్తులలో 12 మంది సౌదీకి చెందినవారే.[213] మునుపటి యు.ఎస్. స్టేట్ సెక్రటరీ హిలారీ క్లింటన్ అభిప్రాయం ఆధారంగా సౌదీ అరేబియా అల్- కక్వైదా, తాలిబాన్, లే త్, ఇతర తీవ్రవాద సంస్థలకు ప్రధాన నిధి వనరుగా సహకరిస్తుందన్న ఆరోపణ ఉంది. సౌదీ అరేబియాకు చెందిన దాతలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సున్నీ తీవ్రవాద బృందాలకు నిధిసహాయం అందిస్తున్నారు.[214] మునుపటి సి.ఐ.ఎ. డైరెక్టర్ " జేంస్ వూల్సీ " అల్- క్వైదా, అనుబంధ తీవ్రవాద సంస్థలు వర్ధిల్లిన భూమి అని సౌదీ అరేబియాను వర్ణించాడు.[215] సౌదీ అరేబియా మతసంబంధిత, సస్కృతిక తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలను నిరాకరిస్తుంది.[216]

Faisal Mosque in Islamabad is named after a Saudi King. The Kingdom is a strong ally of Pakistan, WikiLeaks claimed that Saudis are "long accustomed to having a significant role in Pakistan's affairs"." [217]

అరబ్ , ముస్లిం ప్రపంచం సౌదీ అరేబియాను ప్రొ- వెస్టర్న్ , ప్రొ- అమెరికన్‌గా భావిస్తున్నాయి.[218] అలాగే దేశం దీర్ఘకాలంగా యునైటెడ్ స్టేట్స్‌తో సత్సంబంధాలు కలిగి ఉందని అభిప్రాయపడుతుంది.[219] అయినప్పటికీ [220] 1991 పర్షియన్ గల్ఫ్ యుద్ధంలో సౌదీ అరేబియా ప్రధానపాత్ర వహిస్తుంది. ప్రత్యేకంగా 1991లో యు.ఎస్. బృందాలు నిలవడానికి సహకరించినందుకు ముస్లిం వాదులను లోలోపల ఆగ్రహానికి గురిచేసింది.[221] ఫలితంగా సైదీ అరేబియా యు.ఎస్. నుండి కొంచెం దూరంగా జరిగింది. 2003 ఇరాక్ దాడిలో సౌదీ అరేబియా పాల్గూనక పోవడం ఇందుకు నిదర్శనం.[92] 2003 దాడి , అరబ్ తిరుగుబాటు ఫలితంగా సౌదీ రాజ్యాంగంలో ఇరాన్ ప్రభావం అధికం అయింది.[222] ఈ భయాల ఫలితంగా రాజా అబ్దుల్లా వాఖ్యలు వెలువడుతున్నాయి.[144] ఆయన ప్రైవేట్‌గా ఇరాన్ మీద దండయాత్ర చేయమని (పాము తల కత్తిరించమని) యునైటెడ్ స్టేట్స్‌ను కోరారు.[223] 2011 లో రహస్యంగా యు.ఎస్. , ఇరాన్ మద్య సంబంధాలు ఆరంభం అయ్యాయి. [224] ఇది సౌదీలలో భీతికి కారణం అయింది.[225] ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంకు యు.ఎస్. స్వాగతించగానే సౌదీ అరేబియాలో ఆందోళన మొదలైంది.[226] 2014 లో యు.ఎస్. అధ్యక్షుడు బారక్ ఒబామా సౌదీ పర్యటన చేసిన సమయంలో యు.ఎస్. - ఇరాన్ సంబంధాల గురించిన చర్చ జరిగింది.[227] 2011 మార్చి 14 లో " హౌస్ ఆఫ్ ఖలీఫా " బహ్రయిన్, సౌదీ అరేబియా రాచరిక వ్యవస్థలను రక్షించడానికి బహ్రయిన్ తిరుగుబాటు అణిచివేత కొరకు సౌదీ అరేబియా బహ్రయిన్‌కు సైనిక బృందాలను పంపింది.[228] సౌదీ ప్రభుత్వం బహ్రయిన్‌కు చెందిన షియా ముస్లిములు అధికంగా పాల్గొన్న రెండు మాసాల తిరుగుబాటును దేశరక్షణకు ముప్పుగా భావించింది.[228] 2014 మార్చిలో ఇరాక్ ప్రధానమంత్రి నౌరీ అల్ - మాలిక్ సౌదీ అరేబియా, కతర్ దేశాలు రాజకీయంగా, ఆర్ధికంగా , మధ్యమాల ద్వారా ఇరాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు ఇస్తుందని అభిప్రాయం వెలిబుచ్చాడు.[229]

Saudi Arabian-led airstrikes in Yemen, June 2015. Saudi Arabia is operating without a UN mandate.

2015 మార్చి 25 న సౌదీ అరేబియా సున్నీ ముస్లిం దేశాల సంకీర్ణానికి నాయకత్వం వహించింది.[230] ఇది షియా ముస్లిములకు వ్యతిరేకంగా యెమన్ వ్యవహారంలో జోక్యం చేసుకుని అరబ్ తిరుగుబాటును అణిచివేసిన మునుపటి అధ్యక్షుడు అల్- అబ్దుల్లా సలేహ్‌కు మద్దతు తెలియజేయడంతో మొదలైంది.[231] 2015 లో సౌదీ అరేబియా కతర్ , టర్కీ దేశాలతో కలిసి " ఆర్మీ ఆఫ్ కాంక్వెస్ట్ " కు బహిరంగంగా మద్దతు ఇచ్చింది.[232][233] సిరియన్ సివిల్ వార్‌లో పాల్గొన్న అంబ్రెల్లా గ్రూప్ ఆఫ్ యాంటీ - గవర్నమెంటు ఫోర్సెస్‌లో అల్-క్వైదా అనుసంబధిత అల్- నుస్రా ఫ్రంట్ , సలాఫీ జీహాదిజం సంకీర్ణం (అషర్ అష్ - షాం) భాగస్వామ్యం వహించాయి.[234] తరువాత హజీ సీజన్‌లో పలు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. [235] 2,070 మంది యాత్రికుల మరణానికి కారణమైన సంఘటన వీటిలో ఘోరసంఘటనగా భావించబడుతుంది.[236] 2015 మైనా తొక్కిసలాట సంఘటనలో సౌదీ ప్రభుత్వ నిర్వహణా లోపంగా విమర్శలను ఎదుర్కొన్నది.[237] సౌదీ అరేబియా అరబ్ - ఇజ్రేలీ యుద్ధంలో పరిమితమైన ప్రభావం చూపింది. క్రమంగా ఇజ్రాయిల్ , పాలస్తీనా మద్య శాతి ఒప్పందానికి ప్రయత్నించింది.[238] అరబ్ తిరుగుబాటు తరువాత పదవీచ్యుతుడైన తునీషియా అధ్యక్షుడు " జైన్ ఈ అదిబినే బెన్ అలి " కి సౌదీలో ఆశ్రయం ఇవ్వబడింది. రాజా అబ్దుల్లా ఈజిప్ట్ అధ్యక్షుడు హోస్ని ముబారక్ (పదవీఛ్యుతుడు కాక ముందు) కు మద్దతు తెలుపుతూ ఫోన్ చేశాడు.[239] 2014 లో ముస్లిం బ్రదర్‌హుడ్ విషయంలో సౌదీ అరేబియా కతర్ మద్య సంబంధాలలో విబేధాలు ఏర్పడ్డాయి. ఈ వ్యవహారంలో కతర్ జోక్యం ఉందని సౌదీ అరేబియా భావించడమే ఇందుకు ప్రధానకారణం. 2014 లో ఇరుదేశాలు కలిసి విభేధాలు తొలగించుకోవడానికి మార్గాలు అణ్వేషించాయి. [240]

సైన్యం

సైన్యం కొరకు అత్యధికంగా వ్యయంచేస్తున్న దేశాలలో సౌదీ అరేబియా ఒకటి. సౌదీ అరేబియా జి.డి.పి. లో 10% సైన్యం కొరకు వ్యయం చేస్తుంది. సౌదీ సైన్యంలో " ది రాయల్ సౌదీ లాండ్ ఫోర్సెస్ ", " ది రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్సెస్ ", " ది రాయల్ రాయల్ సౌదీ నేవీ ", " ది సౌదీ అరేబియన్ నేషనల్ గార్డ్ " , " పారా మిలటరీ ఫోర్సెస్ " మొత్తం కలిసి 2,00,000 యాక్టివ్ - డ్యూటీ సిబ్బంధి ఉన్నారు. 2005 లో సైన్యంలో : కాల్బలం 75,000, ఎయిర్ ఫోర్చ్ 18,000, ఎయిర్ డిఫెంస్ 16,000, నేవీ 15,500 (మేరిన్ 3,000 చేర్చి), సౌదీ అరేబియా నేషనల్ గార్డ్స్ 75,000 , 25,000 గిరిజన లెవీ సిబ్బంధి ఉన్నారు.[241] అదనంగా దేశంలో " అల్ ముఖబరాత్ అల్ ఆమాహ్ " మిలటరీ ఇంటెలిజెంస్ సర్వీస్ ఉంది. సౌదీ రాజ్యం పాకిస్తాన్తో దీర్ఘకాలిక సైనిక సంబంధాలను కలిగి ఉంది. సౌదీ అరేబియా రహస్యంగా దీర్ఘకాలికంగా పాకిస్థాన్ అటామిక్ బాంబ్ ప్రోగ్రాంకు నిధిసహకారం అందిస్తుందని పర్యవేక్షకులు భావిస్తున్నారు. అలాగే భవిష్యత్తులో పాకిస్తాన్ నుండి ఆయుధాలను కొనుగోలు చేస్తుందని భావిస్తున్నారు.[242][243] సౌదీ నేషనల్ గార్డ్ రిజర్వ్ దళం కానప్పటికీ ఆపరేషన్ ఫ్రంట్ - లైన్ ఫోర్స్‌గా సేవలందిస్తుంది. ఇది సౌదీ ట్రైబల్ - మిలటరీ - రిలీజియస్ ఫోర్స్, ది ఇఖ్వాన్ నుండి రూపొందించబడింది. 1960 నుండి ఇది అబ్దుల్లా ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తూ ఉంది. ఇది రక్షణ, వాయు సేన మంత్రిత్వశాఖ ఆధ్వర్యానికి అతీతంగా స్వతంత్రంగా పనిచేస్తుంది. సౌదీ నేషనల్ గార్డ్ ఫోర్చ్ రాజకుటుంబ అంతర్గత సంఘర్షణ (సుదైరి) పరిష్కరించడానికి వినియోగించబడింది.[244]

Saudi and U.S. troops train in December 2014

సైనిక వ్యయం

1990 నుండి డిఫెంస్, సెక్యూరిటీ కొరకు వ్యయం చేయడం క్రమంగా అధికరిస్తూ ఉంది. 2005 లో సైనిక వ్యయం 25.4 బిలియన్ల అమెరికండాలర్లు. సైనిక వ్యయంలో సౌదీ అరేబియా ప్రపంచంలో అత్యధికంగా సైనికవ్యయం చేస్తున్న 10 దేశాలలో ఒకటిగా ఉంది. 2005 లో సౌదీ అరేబియా జి.డి.పి.లో 7% సైన్యం కొరకు వ్యయం చేసింది. ప్రస్తుత అత్యున్నత సాంకేతిక విలువలు కలిగిన సౌదీ అరేబియా ఆయుధ సంపద అత్యధిక ఆయుధ సాంధ్రత కలిగినదేశంగా గుర్తించబడుతుంది. సౌదీ అరేబియా ఆయుధాలు యు.ఎస్. ఫ్రాన్స్, బెల్జియం నుండి కొనుగోలు చేయబడుతున్నాయి.[241] 1951, 2006 మద్య కాలంలో సౌదీ అరేబియా యునైటెడ్ స్టేట్స్ నుండి 80 బిలియన్ల అమెరికన్ డాలర్ల మిలిటరీ హార్డ్వేర్‌ను కొనుగోలు చేసింది.[245] 2010 అక్టోబరు 20న యు.ఎస్. స్టేట్ డిపార్ట్మెంట్ అమెరికా చరిత్రలో అత్యధిక స్థాయిలో ఆయుధాలు అమ్మినట్లు పేర్కొన్నది. సౌదీ అరేబియాకు మాత్రమే 65.5 బిలియన్ డాలర్ల ఆయుధాలను విక్రయించింది.[246] 2013 లో సౌదీ సైనిక వ్యయం 67 మిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుని యు.కె., ఫ్రాన్స్, జపాన్ దాటి అంతర్జాతీయంగా 4 వ స్త్యానానికి చేరుకుంది.[247] 1965 నుండి యునైటెడ్ కింగ్డం సౌదీ అరేబియాకు ఆయుధాలను సరఫరాచేసింది.[248] 1985 నుండి యు.కె. మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్‌ను సరఫరా చేసింది. యు.కె. ప్రత్యేకంగా పవనియా టొర్నాడో, యురోఫైటర్ టైఫూన్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ఇతర ఉపకణాల సరఫరా చేసింది.[249] 2012 మే మాసంలో బ్రిటిష్ డిఫెంస్ జెయింట్ బి.ఎ.ఇ. సౌదీ అరేబియాతో 3 బిలియన్ల అమెరికన్ డాలర్ల డీల్ (హాక్ ట్రైనర్ జెట్లు) మీద సంతకం చేసి [250] స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ (ఎస్.ఐ.పి.ఆర్.ఎల్) అభిప్రాయం ఆధారంగా 2010-14 సౌదీ అరేబియా ఆయుధాలను అధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశాలలో సౌదీ అరేబియా అంతర్జాతీయంగా ద్వితీయస్థానంలో ఉంది. 2010-2014 మద్య సౌదీ అరేబియా యు.కె నుండి 45 కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, యు.ఎస్.ఎ. నుండి 38 కంబాట్ హెలీకాఫ్టర్లు, స్పెయిన్ నుండి 4 టాంకర్ ఎయిర్ క్రాఫ్టులు, కెనడా నుండి 600 ఆర్మౌర్డ్ వెహికల్స్ దిగుమతి చేసుకుంది.[26] 2010-2014 మద్య కాలంలో సౌదీ అరేబియా యు.కె. నుండి 41 % ఆయుధాలను దిగుమతి చేసుకుంది.[251]

భౌగోళికం

Saudi Arabia topography (Altitude color coded)
Saudi Arabia physical features

సౌదీ అరేబియా అరేబియా ద్వీపకల్పంలోని (ప్రపంచంలోని అతి పెద్ద ద్వీపకల్పం) 80% భూభాగాన్ని ఆక్రమించింది.[252] దేశం 16-33 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 34-56 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. దేశం దక్షిణ సరిహద్దులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఓమన్ ఉన్నాయి.[252] " ది సి.ఐ.ఎ. ఫాక్ట్ బుక్ " అంచనా అనుసరించి దేశవైశాల్యం 49,690 చ.కి.మీ. వైశాల్యపరంగా సౌదీ అరేబియా ప్రపంచంలో 13వ స్థానంలో ఉంది.[253] అరేబియన్ దేశాలలో సౌదీ అరేబియా అతిపెద్ద దేశం.[254] సౌదీ అరేబియాలో అత్యధికభాగం ఎడారి ఆధిక్యత చేసింది. సౌదీ ఎడారి " సెమీ డిసర్ట్ "గా వర్గీకరించబడింది. పలు ఎడారులుగా ఉన్న సౌదీ ఎడారుల మొత్తం వైశాల్యం 647,500 km2 (250,001 sq mi) రబ్ అల్ ఖలి (ఖాళీగా ఉన్న నాలుగవ భాగం) దేశం దక్షిణ ప్రాంతంలో ఉంది. ఇది ప్రపంచపు ఎడారిగా గుర్తించబడుతుంది.[92][255] సౌదీ అరేబియాలో నదులు కాని చెరువులు కానీ లేదు. అయినప్పటికీ పలు వాదీలు ఉన్నాయి. వాదీ బేసిన్‌, ఒయాసిస్‌ప్రాంతాలలో కొంత సారవంతమైన భూమి ఉంది.[92] సెంట్రల్ ప్లాట్యూ ప్రధాన భౌగోళిక భూభాగంగా ఉంది. ఇది ఎర్రసముద్రం నుండి నెజ్ద్ కలుపుకుంటూ పర్షియన్ గల్ఫ్ వరకు విస్తరించి ఉంది. ఎర్రసముద్రం తీరంలో తిహమాహ్ అనే చిన్న పీఠభూమి ఉంది. నైరుతీ భూభాగంలో అసిర్ పర్వతం ఎత్తు 3,133 m (10,279 ft) ఉండగా ఇందులో ఉన్న జబల్ సవ్ద పర్వతం దేశంలో ఎత్తైన ప్రాంతంగా గుర్తించబడుతుంది.[92]

Saudi Arabia satellite image-Ecoregions as delineated by the World Wide Fund for Nature. The yellow line encloses the ecoregions – Arabian Desert, East Sahero-Arabian xeric shrublands and two other smaller desert areas.[256]
Saudi Arabia’s Köppen climate classification map[257] is based on native vegetation, temperature, precipitation and their seasonality.
  hot desert climate
  cold desert climate
  BSh Hot semi-arid
  BSk Cold semi-arid

వాతావరణం

అసిర్ పర్వతానికి నైరుతీ భూభాగం మినహాయించి సౌదీ అరేబియాలో ఎడారి వాతావరణం నెలకొని ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత అత్యధికంగా ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా పతనం ఔతూ ఉంటాయి. సరాసరి వేసవి ఉష్ణోగ్రత 113 °F (45 °C) ఉంటుంది. అత్యధికంగా 129 °F (54 °C). శీతాకాలంలో ఉష్ణోగ్రత అత్యల్పంగా 32 °F (0 °C) ఉంటుంది. ఆకురాలు కాలం, వసంతకాలం ఉష్ణోగ్రత మితంగా ఉంటుంది. సరాసరి ఉష్ణోగ్రత 84 °F (29 °C) ఉంటుంది. వార్షిక వర్షపాతం అత్యల్పంగా ఉంటుంది. అసిర్ ప్రాంతంలో హిందూ మహాసముద్ర వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ ప్రాంతంలో అక్టోబరు, మార్చి మాసాలలో వర్షపాతం ఉంటుంది. సరాసరి వర్షపాతం 300 mm (12 in) ఉంటుంది. ఈ సమయంలోనే 60% వర్షపాతం ఉంటుంది.[258]

పర్యావరణం

సౌదీ అరేబియాలో అరేబియన్ తోడేలు, స్ట్రిప్డ్ హైనాలు, మంగూలు, బాబూన్లు, జింకలు, ఇసుక ఎలుకలు, జెర్బోలు మొదలైన జంతువులు ఉన్నాయి. 1950 వరకు గజెల్లెస్, ఒరిక్స్, చిరుతపులు మొదలైన పెద్ద జంతువులు ఉండేవి. తరువాత వేటకారణంగా ఈ జంతువులు దాదాపు అంతరించి పోయే దశకు చేరుకున్నాయి. పక్షులలో ఫెల్కాన్లు (వీటిని పట్టి వేటకు ఉపయోగిస్తుంటారు), గ్రద్దలు, రాబందులు, శాండ్‌ గ్రౌసులు, బుల్‌బుల్ పిట్టలు ఉన్నాయి. దేశంలో పలు జాతుల పాములు ఉన్నాయి. వీటిలో అధికంగా విషసర్పాలు ఉన్నాయి. అలాగే పలు బల్లి జాతులు ఉన్నాయి. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో విస్తారమైన సముద్రజీవులు ఉన్నాయి. పెంపుడు జంతువులుగా అరేబియన్ ఒంటె, గొర్రెలు, మేకలు, గాడిదలు, కోళ్ళు వంటి ప్రాణులు పెంచబడుతున్నాయి. ఎడారి ప్రాంతం కనుక దేశంలో అధికంగా స్వల్పమైన నీటిని గ్రహించే ఎడారి మొక్కలు దేశంలో అధికంగా ఉన్నాయి.దక్షిణప్రాంతంలోని అసిర్ ప్రాంతంలో కొంత పచ్చికబయళ్ళు ఉన్నాయి. దేశమంతటా ఖర్జూరపు చెట్లు విస్తరించి ఉన్నాయి. [92]

పాలనా విభాగాలు

సౌదీ అరేబియా 13 ప్రాంతాలుగా విభజించబడింది.[259] (అరబ్బీ: مناطق إدارية‎; మనతిక్యూ ఇదరియ్యా , ఉచ్ఛరణ. منطقة إدارية; మినతక్వాహ్ ఇదరియ్యా ). ప్రంతాలు అదనంగా 118 గవర్నరేటులుగా విభజించబడ్డాయి. (అరబ్బీ: محافظات‎; ముహాఫాజత్ , ఉచ్ఛారణ. محافظة; ముహాఫాజత్ ). 13 ప్రాంతాలకు 13 రాజధానులు ఉన్నాయి. రాజధాని నగరాలకు ముంసిపాలిటీ అంతస్తు ఇవ్వబడింది. (అరబ్బీ: أمانة‎; " అమనాహ్ " అంటారు. వీటి పాలనా బాధ్యతలు మేయర్లు నిర్వహిస్తారు. (అరబ్బీ: أمين‎; అమిన్'). గవర్నరేటులు అదనంగా ఉప గవర్నరేటులుగా విభజించబడ్డాయి. (అరబ్బీ: مراكز‎; 'మరాకిజ్ అంటారు. ఉచ్ఛారణ మరాకిజ్ . مركز; మార్క్జ్).

సంఖ్యప్రాంతంరాజధాని
Provinces of Saudi Arabia
1జవ్ఫ్ (జౌఫ్)సకాక
2నార్తన్ బార్డర్స్అరార్
3తబుక్అరేబియల్ తబుక్
4హాయిల్
5మదీనామదీనా
6క్వాసింబురైదా
7మక్కామెక్కా
8రియాద్రియాద్
9ఈస్టర్న్ ప్రొవింస్దమ్మామ్
10బహాహ్ (బహా)అల్ బహాహ్
11అసిర్అబాహ్
12జిజాన్జిజాన్
13నజ్రన్నజ్రన్

ఆర్ధికం

King Fahd Road in Riyadh

సౌదీ అరేబియా ప్రణాళికాబద్ధమైన ఆర్థికరంగం పెట్రోల్ అధారితమై ఉంది. బడ్జెట్ ఆధారిత వనరులో 75%, 90% ఎగుమతులు ఆయిల్ నుండి లభిస్తుంది. ఆయిల్ ఇండస్ట్రీ 80% విదేశీ ఉద్యోగుల మీద ఆధారితమై ఉంది.[260][261] సౌదీ అరేబియా తలసరి ఆదాయంలో క్షీణత, ఉద్యోగ నిర్వహణకు అవసరమైన దిశగా యువతను విద్యావంతులనును చేయడం వారికి ఉపాధి కల్పించడం, ఆర్థికరంగాన్ని వైవిధ్యమైన రంగాల వైపు మళ్ళించడం, ప్రైవేట్ రంగం, నివాసగృహ నిర్మాణ రగం అభివృద్ధి చేయడం, లంచగొండితనం, సమాజంలో అసమానత నిర్మూలన చేయడం వంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నది. [ఆధారం చూపాలి] సౌదీ అరేబియా గ్రాస్ డొమెస్టిక్ ఉత్పత్తిలో ఆయిల్ ఉత్పత్తి 45%, పారిశ్రామిక రంగం 40% భాగస్వామ్యం వహిస్తున్నాయి. సౌదీ అరేబియా అధికారికంగా 260 billion barrels (4.1×1010 m3) ఆయిల్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంది. ప్రపంచ ఆయిల్ ఉత్పత్తిలో సౌదీ అరేబియా ఆయిల్ ఉత్పత్తి ఐదవ స్థానంలో ఉంది.[262] 1990లో సౌదీ అరేబియా అత్యధిక ఆయిల్ ఉత్పత్తి ఆదాయం, అధికరించిన జనసంఖ్య వంటివి సంభవించాయి. 1981 లో 11,700 అమెరికన్ డాలర్ల తలసరి ఆదాయం 1998 నాటికి 6,300 అమెరికన్ డాలర్లకు పతనం అయింది.[263][264] [265][266]

Office of Saudi Aramco, world's most valuable company and main source of revenue for the state.


[267]

దస్త్రం:RajhiBankLogo.png
Al-Rajhi Bank is world's largest Islamic bank.
దస్త్రం:KHClogo.svg
Kingdom Holding Company has investments in Apple, Euro Disney S.C.A., Twitter and Citigroup

ప్రైవేటీకరణ

2003-2013 నుండి ముంసిపల్ వాటర్ సప్లై, విద్యుత్తు ఉత్పత్తి, టెలీకమ్యూనికేషన్, విద్యలో కొంత భాగం ఆరోగ్యరక్షణ, రవాణా, కార్ విపత్తు నివేదికలు మొదలైన సేవారంగం ప్రైవేటీకరణ చేయబడింది.[268]

సభ్యత్వం

2005 నవంబరులో సౌదీ అరేబియా " వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ " సభ్యత్వం పొందింది. విదేశీవస్తువుల మార్కెట్ అధికరించడానికి, విదేశీ పెట్టుబడులను నేరుగా అనుమతించడానికి 2000 లో సౌదీ అరేబియన్ జనరల్ ఇంవెస్ట్మెంట్ అథారిటీ " స్థాపించబడింది. సౌదీ అరేబియా విదేశీపెట్టుబడులను నిషేధించిన టెలీకమ్యూనికేషంస్, ఇంసూరెంస్ , విద్యుత్తు సరఫరా రంగాలలో ప్రస్తుతం విదేశీపెట్టుబడులను అనుమతిస్తుంది.సౌదీ ప్రభుత్వం చేపట్టిన సౌదీజేషన్‌లో భాగంగా విదేశీ ఉద్యోగుల స్థానంలో స్వదేశీయుల నియామకం కొంతవరకు విజయం సాధించింది.[269] సౌదీ అరేబియా 1970లో పంచవర్షప్రణాళిక ద్వారా అభివృద్ధి పనులు ఆరంభించింది. ఈ ప్రణాళిక ద్వారా " కింగ్ అబ్దుల్లా ఎకనమిక్ సిటీ " వంటి ఎకనమిక్ సిటీల ఏర్పాట్లు చేయబడ్డాయి. ఇది ఆర్ధికరంగాన్ని వైవిద్యమైన రంగాలవైపు మళ్ళించడం , ఉపాధి కలపనకు సహకరించాయి. 2013 నాటికి 4 నగరాలకు ప్రణాళిక వేయబడింది.[270] 2020 నాటికి తలసరి ఆదాయం 15,000 అమెరికన్ డాలర్ల నుండి 33,000 అమెరికన్ డాలర్లకు అభివృద్ధి చేయాలని పిలుపు ఇచ్చాడు.[271] ఈ నగరాలు సౌదీ అంతటా విస్తరించి ప్రాంతాలవారీగా ఆర్ధికాభివృద్ధికి సహకరిస్తున్నాయి. ఈ సిటీలు దేశ జి.డి.పి.లో 150 బిలియన్ల అమెరికడార్ల భాగస్వామ్యం వహిస్తుంది. సౌదీ అరేబియా ఆర్ధికరంగంలో ఆయిల్ , గ్యాస్‌తో బంగారు గనులు (మహ్ద్ అధ్ ధహాబ్) కూడా భాగస్వామ్యం వహించాయి. వ్యవసాయ రంగం (ప్రత్యేకంగా నైరుతీ ప్రాంతంలో) పెంపుడు జంతువులు , ఖర్జూరం మీద ఆధారపడుతూ ఉంటుంది. వార్షికంగా హాజీ యాత్ర సందర్భంగా పలు తాత్కాలిక ఉపాధులు కల్పించబడుతుంటాయి. వార్షికంగా 2 మిలియన్ల యాత్రికులు హజ్‌యాత్రకు వస్తుంటారు.[272] సౌదీ అరేబియా పేదరికం గురించిన వివరణలు ఐఖ్యరాజ్యసమితికి అందించలేదు. [273] పేదరికం మీద దృష్టి కేంద్రీకరించడం , పేదరికం మీద ఫిర్యాదు చేయడాన్ని సౌదీ అరేబియా ప్రోత్సహించడం లేదు. 2011 డిసెంబర్‌లో సౌదీ దేశాంగ మంత్రిత్వశాఖ పేదరికం సంబంధిత వీడియోను యూట్యూబ్‌లో ప్రదర్శించినందుకు ముగ్గురు విలేఖరులను ఖైదు చేసి రెండు వారాల కాలం నిర్భంధంలో ఉంచింది. [274][275][276] వీడియోలు (2009) 22% సౌదీ ప్రజలు బీదవారుగా ఉన్నారని వివరించాయి.[277][278] ఖైదు వంటి సమస్యలు ఉన్నందున పరిశీలకులు ఈ సమస్యను స్పృజించలేదు.

వ్యవసాయం

The Nejd landscape: desert and the Tuwaiq Escarpment near Riyadh

సౌదీ అరేబియా ఎడారి వ్యవసాయానికి గణనీయమైన రాయితీలు అందిస్తూ ప్రోత్సహిస్తుంది. అరేబియన్ ఎడారులలో అల్ఫాల్ఫా, ధాన్యాలు, మాంసం , పాలౌత్పత్తి కొరకు 300 బిలియన్ల " నాన్ రిన్యూవబుల్ " జలాలను ఉచితంగా అందిస్తుంది.[279] " నాన్ రిన్యూవబుల్ " భూగర్భజలాలు తగ్గుముఖం పడుతున్నాయి.[280]

నీటి సరఫరా , శానిటేషన్

సౌదీ అరేబియా నీటి సరఫరా, శానిటేషన్ కొరకు (సముద్రజలాల సుద్ధీకరణ) గణనీయంగా పెట్టుబడులు పెడుతుంది. నీటిసరఫరా, వాటర్ శుద్ధీకరణ మరుయు మురుగు నీటి నిర్వహణ కారణంగా గత దశాబ్ధాలలో త్రాగునీటి సరఫరాలో అభివృద్ధి సాధ్యమైంది. సముద్రజలాల శుద్ధీకరణ ద్వారా 50% త్రాగునీరు లభిస్తుంది. నాన్ రిన్యూవబుల్ భూగర్భజలాల ద్వారా 40% నీరు లభిస్తుంది. నైరుతీ భూభాగంలో ఉన్న పర్వతప్రాంతాల నుండి 10% జలాలు సర్ఫేస్ వాటర్ నుండి లభిస్తుంది. రాజధాని రియాద్ దేశం మధ్యభాగంలో ఉపస్థితమై ఉంది. ఈ నగరానికి పర్షియన్ గల్ఫ్ నుండి శుద్ధీకరించబడిన సముద్రజలాలు 467 కి.మీ పొడవైన పైప్ మార్గం ద్వారా చేరవేయబడుతున్నాయి. ఆయిల్ ఉత్పత్తి సౌదీ అరేబియాకు గణనీయమైన ఆదాయాన్ని అందిస్తున్న కారణంగా త్రాగునీరు ఉచితంగా లభిస్తుంది. రియాద్‌లో నీరు 2.5 దినాలకు ఒక మారు మాత్రమే నీరు సరఫరా చేయబడుతుండగా జెద్దాహ్‌లోరోజులకు ఒకమారు మాత్రమే త్రాగు నీరు లభిస్తుంది.[281] సౌదీ అరేబియా ప్రైవేట్ రంగం బలహీనంగా ఉంది. 2000 నుండి నీటిసరఫరా, మౌలిక నిర్మాణాల కొరకు ప్రభుత్వం అధికంగా ప్రైవేట్ రంగం మీద ఆధారపడుతూ ఉంది.

గణాంకాలు

Saudi Arabia population density (people per km2)

2013 గణాంకాల ఆధారంగా సౌదీ అరేబియా జనసంఖ్య 26.9 మిలియన్లు. వీరిలో 5.5 నుండి [5] 10 మిలియన్ల మంది దేశాంతరాల నుండి వచ్చిన విదేశీ వలస ప్రజలు.[261][282] అందువలన సౌదీ అరేబియా నాయకులకు దేశ జనసంఖ్య కచ్చితంగా నిర్ణయించడం కష్టం.[283] 1950 నుండి సౌదీ అరేబియా జనసంఖ్య వేగవంతంగా అభివృద్ధి చెందింది. అప్పటి జనసంఖ్య 3 మిలియన్లు ఉండేది.[284] చాలా సంవత్సరాల వరకు ప్రపంచంలో సౌదీ అరేబియా వార్షిక జననాల శాతం అత్యధికం (3%) గా ఉంది.[285] సౌదీ అరేబియాలో 90% అరబ్బులు, 10 ఆఫ్రో ఆసియన్లు ఉన్నారు.[286] సౌదీ ప్రజలు హెజాజ్‌లో 35%, నజిద్‌లో 28%, ఈస్టర్న్ ప్రొవింస్‌లో 15% ఉన్నారు.[287] సౌదీ అరేబియాలో హెజిజ్ అత్యంత జనసాంధ్రత కలిగిన ప్రాంతం.[288]1970 గణాంకాలను అనుసరించి అధికంగా సౌదీ ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారని భావిస్తున్నారు. అయినప్పటికీ 20వ శతాబ్ధపు ద్వితీయార్ధంలో దేశం వేగవంతంగా నగరీకరణ చేయబడింది. 2012 గణాంకాలు అనుసరించి 80% సౌదీ ప్రజలు మహానగర ప్రాంతాలలో నివసిస్తున్నారని తెలియజేస్తున్నాయి. ప్రత్యేకంగా రియాధ్, జెడ్డాహ్, డమ్మంలలో అధికంగా నివసిస్తున్నారు.[289][290] సౌదీ అరేబియాలో 25 సంవత్సరాలకంటే తక్కువ వయసున్న వారి సంఖ్య జనసంఖ్యలో సగంకంటే అధికంగా ఉంది.[291] సౌదీ అరేబియాలో 21% కంటే అధికంగా విదేశీయులు నివసిస్తున్నారని సి.ఐ.ఎ ఫ్యాక్ట్ బుక్ అంచనాలు తెలియజేస్తున్నాయి.[5] ఇతర అంచనాల ఆధారంగా 30% - 33% ఉంటారని భావిస్తున్నారు.[292][293])1960 ఆరంభకాల గణాంకాలను అనుసరించి సౌదీ అరేబియా బానిస ప్రజల సంఖ్య దాదాపు 3,00,000 ఉండేదని భావిస్తున్నారు.[294] 1962లో అరేబియా అధికారికంగా బానిసత్వాన్ని నిషేధించింది.[295][296]

భాషలు

సౌదీ అరేబియా అధికారిక భాష అరబిక్. ప్రధానంగా హెజాజి అరబిక్, (దాదాపు 6 మిలియన్ల వాడుకతులు [297]), నజ్ది అరబిక్ (దాదాపు 8 మిలియన్ల వాడుకరులు [298]),, గల్ఫ్ అరబిక్ (0.2 మిలియన్ల వాడుకరులు [299]). బధిరుల కొరకు సౌదీ సంఙాభాష వాడుకలో ఉంది. అధికసంఖ్యలో ఉన్న విదేశీ ఉద్యోగులకు తగలాగ్ (7,00,000), రొహింగ్యా (4,00,000), ఉర్దు (3,80,000), ఈజిప్షియన్ (3,00,000) మొదలైన వారి వారి స్వంత భాషలు వాడుకలో ఉన్నాయి. [300]

An open-air mosque near Jeddah

మతం

సౌదీ అరేబియన్లందరూ ముస్లిములు.[301] (అధికారికంగా - అందరూ), సౌదీ నివాసితులలో అత్యధికులు ముస్లిములే ఉన్నారు.[302][302][303] వీరిలో సున్నీ ముస్లిములు 75%-90% ఉన్నారు. మిగిలిన 10%-25% షియా ముస్లిములు ఉన్నారు.[304][305][306][307][308] 2016 జనవరిలో సౌదీ అరేబియా షియా క్లెరిక్ షేక్ నింర్‌ను మరణశిక్షకు గురిచేసింది.[201] అధికారిక, ఆధిక్యత కలిగిన సున్నీ ఇస్లాం సౌదీ అరేబియాలో వహ్హాబిజం అంటారు. (వహాబీ అనే పదం అమర్యాదకరమైనదని భావించడం కారణంగా ప్రతిపాదకులు వీరిని సలాఫీలు అంటారు.[309]) అలాగే వీరిని తరచుగా ప్యూరిటానికల్, ఇంటాలరెంట్ లేక అల్ట్రా - కనసర్వేటివ్ అని పరిశోధకులు అంటారు. అథరెంట్స్ వీరిని " సత్యం " అంటుంది. ఇది అరేబియన్ ద్వీపకల్పంలో ముహమ్మద్ ఇబ్న్ అబ్ద్ అల్ - వహాబ్‌చే 18వ శతాబ్దంలో స్థాపించబడింది. గణాంకాలను అనుసరించి సౌదీ అరేబియాలో 15,00,000 మంది క్రైస్తవులు ఉన్నారని అంచనా. వీరంతా ఉద్యోగులే.[310] సౌదీ అరేబియా క్రైస్తవులను విదేశీ ఉద్యోగులుగా తాత్కాలికంగా దేశంలో ప్రవేశించడానికి అనుమతిస్తుంది. అయినప్పటికీ వారిని బహిరంగంగా మతారాధన చేయడానికి అనుమతించడం లేదు. అధికారికంగా సౌదీ అరేబియా జనసంఖ్యలో క్రైస్తవులు పూజ్యంగా ఉన్నారు.[311] సౌదీ అరేబియాలో ఇస్లాం నుండి ఇతర మతానికి మారడం నిషేధం అలా చేసిన వారికి మరణశిక్ష విధించబడుతుంది.[312][313] ప్యూ రీసెర్చి సెంటర్ పరిశోధన ఆధారంగా సౌదీ అరేబియాలో 3,90,000 వేలమంది హిందువులు ఉన్నారని వీరంతా విదేశీ ఉద్యోగులని అంచనా.[314]

విదేశీయులు

" సౌదీ అరేబియా సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ & ఇంఫర్మేషన్ " అంచనా అనుసరించి 2014 నాటికి విదేశీయుల సంఖ్య 33% (10.1 మిలియన్లు) ఉంది.[315] సి.ఐ.ఎ. ఫ్యాక్ట్ బుక్ అంచనా అనుసరించి 2013 నాటికి సైదీ అరేబియాలో నివసిస్తున్న విదేశీయుల శాతం 21% అని భావిస్తున్నారు.[5] ఇతర వనరులు అంచనాలు విభిన్నంగా ఉంటాయి.[293] సౌదీ అరేబియాలో విదేశీ నివాసిత భారతీయులు 1.3 మిలియన్లు, పాకిస్థానీయులు 1.5 మిలియన్లు [316] ఈజిప్షియన్లు 9,00,000, యేమనీయులు 8,00,000, బంగ్లాదేశీయులు 5,00,000, ఫిలిప్పైనీయులు 5,00,000, జోర్డానీయులు (పాలస్తీనీయులు 2,60,000, ఇండోనేషనీయులు 2,50,000, శ్రీలంకనీయులు 3,50,000, సుడానీయులు 2,50,000, సిరియన్లు 1,00,000, టర్కిషీయులు 1,00,000 ఉన్నారు.[317] సౌదీ అరేబియాలో నివసిస్తున్న 1,00,000 మంది పాశ్చాత్యులు గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్నారు. విదేశీ ముస్లిములు [318] సౌదీ అరేబియాలో 10 సంవత్సారాలు నివసించిన తరువాత సౌదీ పౌరసత్వానికి అభ్యర్థించవచ్చు. (విభిన్నమైన సైన్సు డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది).[319] పాలస్తీనీయులకు ఇందులో మినహియింపు ఉంటుంది. అయినప్పటికీ సౌదీ పౌరులను వివాహం చేసుకున్న వారికి అరబ్ లీగ్ సూచనల ఆధారంగా అర్హత లభిస్తుంది. సౌదీ అరేబియా శరణార్ధులకు అనుకూల ప్రదేశం కాదు.[320] సౌదీ జనసంఖ్య అభివద్ధి చెందడం, ఆయిల్ ద్వారా లభిస్తున్న ఆదాయం క్షీణించడం కారణంగా " సైదీజేషన్ " చేయాలన్న వత్తిడి అధికం ఔతుంది. అంటే విదేశీ ఉద్యోల స్థానంలో అరేబీయులను నియమించడం వలన దేశంలోని విదేశీ ఉద్యోగుల సంఖ్య తగ్గించడం.[321] సౌదీ ప్రభుత్వం 1990-1991 లో దాదాపు 8,00,000 మంది యేమన్ ప్రజలను దేశం నుండి వెలుపలకు పంపింది.[322] చట్టవిరుద్ధమైన యేమన్ ప్రజల ప్రవేశం నివారించడానికి, మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా నివారించడానికి యేమన్, సౌదీ అరేబియా మధ్య కంచ నిర్మించబడింది.[323] 2013 నవంబరులో సౌదీ అరేబియా వేలాది ఎథియోపియన్ ప్రజలను దేశం నుండి వెలుపలికి పంపారు. పలు మానవహక్కుల సంరక్షణ సంస్థలు సౌదీ అరేబియా మానవ హక్కుల విధానం గురించి విమర్శిస్తున్నారు.[324]సౌదీ అరేబియాలో 5,00,000 కంటే అధికమైన విదేశీయ ఉద్యోగులు చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న సోమాలియా, ఎథియోపియా, యెమన్ దేశాలకు చెందిన వారు 2013 నుండి దేశం నుండి వెలుపలకు పంపబడుతున్నారు.[325]

పెద్ద నగరాలు

రాజవంశాలు (1932–ప్రస్తుత)

  • ఇబ్న్ సౌదీ రాజు అబ్దుల్లాజిజ్ ఫ్ (1932–1953) ; అధిక కాలం పాలించిన రాజవంశాలలో రెండవ రాజవంశం.
  • సౌద్ ఆఫ్ సౌదీ అరేబియా రాజు (1953–1964) ; అధిక కాలం పాలించిన రాజవంశాలలో మూడవ రాజవంశం.
  • రాజా ఫైసల్ (1964–1975) ; అధిక కాలం పాలించిన రాజవంశాలలో నాలుగవ రాజవంశం.
  • రాజా ఖలిద్ (1975–1982) ; అధిక కాలం పాలించిన రాజవంశాలలో ఆరవ రాజవంశం.
  • రాజా ఫాద్ (1982–2005) ; అత్యధిక కాలం పాలించిన రాజవంశం.
  • రాజా అద్బుల్లా (2005–2015) ; అధిక కాలం పాలించిన రాజవంశాలలో ఐదవ రాజవంశం.
  • రాజా సల్మాన్ (2015–present) ; ప్రస్తుత రాజవంశం.

యువరాజులు (1933–ప్రస్తుత)

Crown Prince Mohammad bin Nayef with U.S. Secretary of State John Kerry, 6 May 2015
Deputy Crown Prince Mohammad bin Salman Al Saud aboard the aircraft carrier USS Theodore Roosevelt, 7 July 2015
రాకుమారుడుపాలనా కాలంతండ్రి
సౌద్ బిన్ అబ్దులాజిజ్1933-1953రాజా అబ్దులాజిజ్
బిన్ అబ్దుల్లా1953-1964రాజా సౌద్
ముహమ్మద్ బిన్ అబ్దులాజిజ్1964-1965రాజా ఫైసల్
ఖలిద్ బిన్ అబ్దులాజిజ్1965-1975రాజా ఫైసల్
ఫహ్ద్ బిన్ అబ్దులాజిజ్1975-1982రాజా ఖలిద్
అబ్దుల్లా బిన్ అబ్దులాజిజ్1982-2005రాజా ఫహ్ద్
సుల్తాన్ బిన్ అబ్దులాజిజ్2005-2011రాజా అబ్దుల్లా
నాయెఫ్ బిన్ అబ్దులాజిజ్2011-2012రాజా అబ్దుల్లా
సల్మాన్ బిన్ అబ్దులాజిజ్2012-2015రాజా అబ్దుల్లా
ముక్విర్న్ బిన్ అబ్దులాజిజ్2015రాజా సల్మాన్
ముహమ్మద్ బిన్ నయేఫ్2015- ప్రస్తుతరాజా సల్మాన్

ఉప ప్రధానులు (1965–2011)

  • రాజకుమారుడు ఫాద్ (1965–1975) ; యువరాజు అయ్యాడు.
  • రాజకుమారుడు అబ్దుల్లా (1975–1982) ; యువరాజు అయ్యాడు.
  • రాజకుమారుడు సుల్తాన్ (1982–2005) ; యువరాజు అయ్యాడు.
  • రాజకుమారుడు నయేఫ్ (2009–2011) ; యువరాజు అయ్యాడు.

ఉప యువరాజు (2014–ప్రస్తుత)

  • రాజకుమారుడు ముక్విరిన్ (2014–2015) ; యువరాజు అయ్యాడు.
  • రాజకుమారుడు మొహమ్మద్ (2015) ; యువరాజు అయ్యాడు.
  • రాజకుమారుడు మొహమ్మద్ (2015–present) ; యువరాజు అయ్యాడు.

సంస్కృతి

Supplicating Pilgrim at Masjid Al Haram, Mecca

సౌదీ అరేబియా శతాబ్ధాల పూర్వపు అలవాట్లు, సంప్రదాయం అనుసరిస్తూ ఉంది. ఇది అరబ్ నాగరికత నుండి గ్రహించబడుతూ ఉంది. ఈ సంస్కృతి మీద అత్యధికంగా ఇస్లాం మతరూపమైన వహాబీ ప్రభావం ఉంది. 11వ శతాబ్దంలో ఆరంభించబడిన వహాబీ ప్రస్తుతం దేశంలో ఆధిక్యత కలిగి ఉంది. [11]

మతం

Stoning of the Devil at Mina during the Hajj pilgrimage, following in the tradition of Ibrahim and Ismail

సౌదీ అరేబియా ఇతర ఆధునిక ముస్లిం దేశాలకంటే వ్యత్యాసం కలిగిఉంది. జిహాద్ స్త్యాపించిన ఒకేఒక ముస్లిం దేశంగా, ఖురాన్ ఆధారిత రాజ్యాంగ నిర్మాణం కలిగిన్ ఏకైక ముస్లిం దేశం, కాలనీ పాలనలో లేని నాలుగు ముస్లిం దేశాలలో ఒకటిగా సౌదీ అరేబియాకు ప్రత్యేకత ఉంది.[326] హెజాజ్ ప్రాంతం అందులోని మక్కా, మెదీనా నగరాలు ఇస్లాంకు ఆధారభూత్మగా ఉన్నాయి.[327]సౌదీ అరేబియా అధికారిక మతం ఇస్లాం. చట్టపరంగా పౌరులందరూ ముస్లిములే.[328] సౌదీ పౌరులకుగాని క్వెస్ట్ వర్క్లర్లకు కాని మతస్వతంత్రం ఉండదు. [328] ఇస్లాం మతం అధికారిక, ఆధిక్యత కలిగిన సౌదీ అరేబియాలో మభ్యప్రాంతం నజ్ద్‌లో18వ శతాబ్దంలో వహ్హబిజం తలెత్తింది. మత ప్రచారకులు దీనిని సలాఫిజం అంటారు.[309] 7 వ శతాబ్దంలో ముహమ్మద్, ఆయన అనుయాలచేత స్థాపించబడిన ఇస్లాం మతాన్ని వహాబీ ప్రసంగాలు మరింత పవిత్రం చేస్తాయని విశ్వసించబడుతుంది.[329] సౌదీ అరేబియా తరచుగా షియా ముస్లింను అణిచివేస్తుందని భావించబడుతుంది.[330] రాకుమారుడు బందర్ బిన్ సుల్తాన్ సౌదీ అరేబియన్ తరఫున యునైటెడ్ స్టేట్స్ దూతగా నియమించబడ్డాడు.[331] మతపరమైన పోలీస్ వ్యవస్థ (హైయా లేక ముతవీన్) కలిగిన ముస్లిం దేశాలలో సౌదీ అరేబియా ఒకటి. వీరు వీధులలో కాపలాకాస్తూ ప్రజల దుస్తులను పర్యవేక్షిస్తుంటారు. స్త్రీలు, పురుషులు విడివిడిగా తప్పక రోజుకు ఐదుమార్లు ప్రార్థనలు (సలాత్) చేస్తారు. మద్యపానం నిషేధించబడింది., షరియా సంబంధిత ఇతర చట్టాలు అమలు [332])సౌదీ అరేబియా అంతర్జాతీయ గ్రిగోరియన్ కేలండర్‌ను ఉపయోగించక ఇస్లామిక్ ల్యూనార్ కేలండర్‌ను అమలుచేస్తుంది.[333] దైనందిక జీవితం ఇస్లామిక్ పర్యవేక్షణ ఆధిపత్యం వహిస్తుంది.[334] బిజినెస్ సమయంలో 30-45 నిముషాలు వాడుకరులు, ఉద్యోగులు ప్రార్థన కొరకు పంపబడుతుంటారు.[335] ముస్లిములకు పవిత్ర దినమైన శుక్రవారంతో కలిపి శనివారం శలవు దినాలుగా ఉంటాయి.[92][336][337] పలు సంవత్సరాలుగా " ఇద్ అల్ ఫిత్ర్ ", ఇద్ అల్ అధా " లు మాత్రమే శలవు దినాలుగా ఉన్నాయి.[338])రేడియో, టెలివిజన్ ప్రసారాలలో సగానికి పైగా మతసంబంధిత ప్రసారాలు ఉంటాయి.[339] ప్రచురితమౌతున్న 90% పుస్తకాలు మతసంబంధితమై ఉంటాయి. డాక్టర్ పట్టాలు అధికంగా ఇస్లామిక్ పరిశోధనల కొరకు ఇవ్వబడుతుంటాయి.[340] పాఠశాలలలో సగభాగం మతసంబంధిత విషయాలు బోధించబడుతుంటాయి. 12 సంవత్సరాల ప్రాథమిక, సెకండరీ విద్యలో చరిత్ర, సాహిత్యం, ముస్లిమేతర సంస్కృతి అధ్యయనానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.[339]

Non-Muslims are prohibited from entering the holy city of Mecca.

పేపర్ మనీ (1951), స్త్రీ విద్య (1964), బానిసత్వ నిర్మూలనకు (1962) లకు మతపరమైన ఆటకం ఎదురౌతుందని భావించారు.[341] మతసంబంధిత రాజ్యాంసగం విధానాలకు ప్రజల మద్దతు బలంగా ఉంది. సౌదీ ప్రజలు లౌకిక వాద విధానాలకు అనుకూలంగా లేరని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.[342][343][344] మాలిద్ (ముహమ్మద్ జన్మదినం), డే ఆఫ్ అసుర (10% -25% ప్రజలకు ప్రధానమైన ఉత్సవం) [305][306][307] ప్రాతీయంగా షియా ముస్లిముల చేత నిర్వహించబడుతుంది. [345] ఉద్యోగ నియామకాలు, విద్య, న్యాయవ్యవస్థలలో షియా ముస్లిముల పట్ల వివక్ష చూపబడుతుందని భావించబడుతుంది.[346][347][348] ముస్లిమేతర పండుగలైన క్రిస్‌మస్, ఈస్టర్ పండుగలకు అనుమతి లభించదు.[349] విదేశీ ఉద్యోగులలో క్రైస్తవులు, హిందువులు, బౌద్ధులు దాదాపు 1 మిలియన్ మంది ఉన్నారు.[6][349] చర్చీలు, ఆలయాలు మొదలైన ముస్లిమేతర నిర్మాణాలకు అనుమతి లేదు. ముస్లిములు ఇతర మతాలకు మారడం చట్టవిరుద్ధం.[6] ముస్లిమేతర ప్రచురణల పంపకం చేసినవారికి మరణశిక్ష విధించబడుతుంది.[350][351] చట్టపరంగా ముస్లేమతరులకు ప్రాధాన్యత తక్కువగా ఉంది.[349] నాస్థికులు తీవ్రవాదులుగా భావించబడ్తున్నారు.[352] అరేబియన్లు, ఇతరులు ఎవరైనా ముస్లిం వ్యతిరేక భావాలు ప్రదర్శిస్తే 20 సంవత్సరాల ఖైదుశిక్ష విధించబడుతుంది.[353] అల్పసంఖ్యాకులైన అహమ్మదీయ ముస్లిములను దేశం వెలుపలకు పంపి వారి ప్రవేశాన్ని నిషేధించారు.[354] [355]

ఇస్లామిక్ వారసత్వ ప్రదేశాలు

The Mosque of the Prophet in Medina containing the tomb of Muhammad.

సౌదీ వహ్హాబిజం షిర్క్ (ఇస్లాం), విగ్రహారాధన వంటి విధానాలు అధికరిస్తాయన్న భయంతో ఏమతానికి చారిత్రక, ఆరధనా ప్రదేశాలకు అనుమతి ఇచ్చేది కాదు. సౌదీ పశ్చిమ ప్రాంతంలో ఉన్న హెజాజ్‌లో ఇస్లాం మతస్థులకు అతి పవిత్రప్రాంతాలైన మక్కా మదీనా ఉన్నాయి.[327] సౌదీ పాలన పర్యవసానంగా మక్కాలోని 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన మతసంబంధిత నిర్మాణాలలో 95% మతసంబంధిత కారణాలవలన ధ్వంసం చేయబడ్డాయని భావిస్తున్నారు. [356]గత 50 సంవత్సరాలలో ముహమ్మద్, ఆయన కుటుంబానికి సంబంధం ఉన్న దాదాపు 300 ప్రదేశాలు ధ్వంసం అయ్యాయని విమర్శకులు భావిస్తున్నారు.[357] ముహమ్మద్ కాలానికి చెందిన మక్కాలో 20 నిర్మాణాలు మిగిలి ఉన్నాయి.[358] ధ్వంసం చేయబడిన వాటిలో ముహమ్మద్ కుమార్తె ఫాతిమా నిర్మించిన మసీదులు, అబుబకర్ (ముహమ్మద్ మామగారు, మొదటి ఖలిఫా) స్థాపించిన మసీదులు, ఉమర్ (రెండవ ఖలీఫా) అలి (ముహమ్మద్ అల్లుడు), సలీం అల్ ఫర్సి (ముహమ్మద్ మిత్రులు ) నిర్మించిన మసీదులు ఉన్నాయి.[359][360]

దుస్తులు

సౌదీ అరేబియన్ దుస్తులు ధరించే విషయంలో నియమనిబంధనలను (వినయవిధేయతలు కలిగిన ఇస్లామీ వస్త్రధారణ) ఖచ్ఛితంగా పాటించాలి. సౌదీ అరేబియా ఎడారి వాతావరణానికి అనుకూలమైన వస్త్రంతో తయారు చేసిన వదులుగా ఉండి శరీరాన్ని అధికంగా కప్పి ఉంచే దుస్తులను ధరిస్తుంటారు. పురుషులు ఊలు, పత్తితో నేయబడిన కాలిమడమల వరకు ఉండే దుస్తులను (దవబ్) ధరిస్తారు. దీనితో కెఫియత్ (తలపాగా) ధరిస్తుంటారు. అరుదుగా ఉండే శీతాకాలంలో ఒంటె వెంట్రుకలతో చేసిన తలపాగా ధరిస్తారు. స్త్రీలు బురఖా ధరిస్తుంటారు. ముస్లిమేతర స్త్రీలకు కూడా వద్త్రధారణ నిబంధనలు ఉంటయి. నిబంధనలను పాటించని వారి మీద పోలీస్ చర్య తీసుకుంటారు. అధికంగా సంప్రదాయాలను అనుసరించే ప్రాంతాలలో వస్త్రధారణ నిబంధనలు ఖచ్ఛితంగా పాటించాలి. స్త్రీల వస్త్రాలు తరచుగా సరిగ, నాణ్యాలు, గిరిజన చిహ్నాలు, అల్లిక లేసులతో అలంకరించబడతాయి.

  • ఘుత్రాహ్ (అరబ్బీ: غتره‎) ఇది సంప్రదాయమైన తలపాగా. దీనిని చదరమైన పత్తి నూలుతో తయారు చేసిన వస్త్రంతో మడతలు పెట్టి వివిధరకాలుగా తలచుట్టూ చుట్టుకుంటారు.

ఇవి సాధారణంగా పొడివాతావరణం కలిగిన ప్రాంతాలలో ధరిస్తుంటారు. ఇది తలను ఎండ నుండి రక్షించడమే కాక దుమ్ము ధూళి, ఎగిరిపడే ఇసుక నుండి కళ్ళకు, నోటికి రక్షణ కల్పిస్తుంది.

  • అగల్ (అరబ్బీ: عقال‎) నాల్లగా గుండ్రంగా ఉండే దీనిని తలపాగా సరిగా నిలిచి ఉండడానికి తలపాగా మీద ధరిస్తుంటారు.
  • తవ్బ్ (అరబ్బీ: ثوب‎) ఇది మడమల వరకు పొడవైన చేతులతో ఉంటుంది.
  • బిష్త్ (అరబ్బీ: بشت‎) ఇది వివాహాది వేడుకలలో పురుషులు ఆడంబరంగా ధరించే విలువైన దుస్తులలో ఒకటి.
  • అభయ (అరబ్బీ: عبائة‎) ఇది స్త్రీలు ధరించే దుస్తులలో ఒకటి. ఇది వదులుగా ఉండి శరీరాని పూర్తిగా కప్పుతూ ఉంటుంది. కొందరు స్త్రీలు వారి ముఖాలను నిక్వాబ్‌తో కప్పుకుంటారు. కొంతమంది దీనిని ధరించరు.[361]

కళలు , వినోదాలు

King Abdullah practising falconry, a traditional pursuit in Saudi Arabia

1970 లో సౌదీలో పలు సినిమాలు చిత్రీకరించబడ్డాయి. అయినా అవి వహాబీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి.[362] 1980లో ఇస్లామిక్ తిరుగుబాటు ఉద్యమంలో ఇస్లామిక్ తీవ్రవాదులు అధికరించినందుకు ప్రతిస్పందనగా (1979 గ్రామ్ండ్ మసీదు ఆక్రమణ) ప్రభుత్వం మొత్తం సినిమాలను, ప్రదర్శనశాలను మూసివేసింది. 2005 లో రాజా అబ్దుల్లా చేసిన సంస్కరణల తరువాత కొన్ని ప్రదర్శనశాలలు తిరిగి ఆరంభించబడ్డాయి.[363] వీటిలో రాజా అబ్దుల్లా యూనివర్శిటీ ఆఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ కూడా ఒకటి.18వ శతాబ్దంలో వహాబీ విధానాలు ప్రచారంతో కళలు కళాకారులకు ప్రోత్సాహం క్షీణించింది. సున్నీ ఇస్లామిక్ మీద విధించబడిన నిషేధం విషయుయల్ కళలను పరిమితిలో ఉంచింది. ఫలితంగా ఇస్లామిక్ భౌగోళిక విధానాలు, డిజైన్లు, అక్షరాల కళ ఆధిక్యత వహించాయి. 20వ శతాబ్దంలో ఆయిల్ మూలంగా లభించిన సంపద వెలుపలి ప్రపంచ ప్రభావాన్ని అధికం చేస్తూ పాశ్చాత్య శైలి ఫర్నీచర్, దుస్తులను ప్రవేశపెట్టాయి. సంగీతం, నృత్యం సౌదీ జీవితంలో సదా ఒక భాగంగా నిలిచాయి. సంప్రదాయ సంగీతం కవిత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇది బృందగానంగా ఆలాపించబడుతుంది. సంగీత పరికరాలలో రబాబహ్, వైవిధ్యమైన వాయిద్యాలు వాడుకలో ఉన్నాయి. వీటిలో తబి (డ్రం), తబల్ (తంబురా) లు ఉన్నాయి. ప్రాంతీయ నృత్యాలలో అర్దాహ్ ప్రధానమైనది. ఇందులో పురుషులు కత్తులు లేక తుపాకులతో డ్రమ్ములను, తంబురాలను వాయిస్తూ నృత్యం చేస్తుంటారు. బెడుయిన్ కవిత్వం (నబాజీ) చాలా ప్రాబల్యత సంతరించుకుంది.[92] సెంసార్ కఠిన నియమాల కారణంగా సౌదీలో సాహిత్యంలో అభివృద్ధి సంభవించలేదు. అరబ్ ప్రపంచంలో సౌదీ అరేబియన్లు ప్రాబల్యత సంతరించుకున్నా స్వదేశంలో అధికారికంగా ద్వేషం ఎదుర్కొన్నారు. వీరిలో ఘాజీ అల్గోసైబీ, అబ్దుల్ రహ్మాన్ మునీఫ్, తురికీ అల్ హమద్, రాజా అల్ సానియా ప్రధానులు.[364][365][366]

క్రీడలు

సౌదీ అరేబియా జాతీయక్రీడ అసోసియేషన్ ఫుట్‌బాల్ (సూకర్). స్కూబా డైవింగ్, విండ్ సర్ఫింగ్, నౌకాయానం, బాస్కెట్ బాల్ కూడా ప్రాబల్యత సంతరించుకున్నాయి. వీటిని మహిళలు, పురుషులు ఆడుతుంటారు. సౌదీ అరేబియా నేషనల్ బాస్కెట్ బాల్ టీం 1999 ఆసియన్ చాంపియన్‌షిప్ సాధించింది. [367][368][369] సంప్రదాయ క్రీడలలో 1970లో ఒంటెల పదెం మరింత ప్రాబల్యత సంతరించుకుంది. రియాద్‌లో ఉన్న స్టేడియంలో శీతాకాలంలో ఒంటెల పందాలు నిర్వహించబడుతున్నాయి. 1974లో వార్షిక కింగ్ కెమేల్ ఫెస్టివల్ నిర్వహించబడుతూ ప్రధాన క్రీడగా ఈ ప్రాంతం అంతటా ప్రాబల్యత సంతరించుకుంది.[92]

ఆహారం

సౌదీ అరేబియన్ ఆహారవిధానం సౌదీ ద్వీపకల్పంలో ఉన్న ఇతర దేశాలు, పొరుగున ఉన్న టర్కీ, భారతదేశం,పర్షియన్, ఆఫ్రికా ఆహారవిధానాలతో ప్రభావితమై ఉంటుంది. ఇస్లామిక్ చట్టం పంది మాసం అనుమతించదు. ఇతర జంతువులు మాంసాహారం కొరకు హలాల్ విధానంలో వధించబడతాయి. మసాలాలతో కూరి మేకపిల్లతో చేసిన ఆహారం (ఖుజి) సంప్రదాయ జాతీయ ఆహారంగా గుర్తించబడుతుంది. నిప్పులమూద కాల్చిన కబాబ్ అనే మాంసాహారం చాలా ప్రాబల్యత సంతరించుకుంది. దీనిని మేకమాసం, కోడి మాసంతో తయారు చేస్తుంటారు. మిగిలిన అరబ్ దేశాలలోలా మచ్బూస్ (కబ్సా) కూడా ప్రాబల్యత కలిగిన ఆహారాలలో ఒకటి. దీనిని బియ్యం, చేపలు లేక రొయ్యలతో కలిపి వండుతుంటారు. ఆహారంతో ఫ్లాత్ అనే రొట్టె ప్రతి పూట ఉంటుంది. ఆహారంతో ఖర్జూరం, తాజా పండ్లు తీసుకుంటారు. టర్కిష్ కాఫీని అందిచడం సప్రదాయంగా ఉంటుంది.[92]

సాంఘిక సమస్యలు

సౌదీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలలో నిరుద్యోగసమస్య ప్రధానమైనది. 2010 గణాంకాలను అనుసరించి నిరుద్యోగసమస్య 10% ఉన్నట్లు అంచనా.[370] లంచగొండితనం, మతపరమైన ఆధిక్యత.[371][372] నేరం గణనీయమైన సమస్యగా లేదు.[241] మరొకపక్క తఫీత్ వంటి చట్టవిరుద్ధమైన పందాలు, అత్యధిక సస్థాయిలో మద్యపానం సమస్యలుగా మారాయి. అధికస్థాయిలో ఉన్న నిరుద్యోగసమస్య కారణంగా యువతలో రాజకుటుంబం పట్ల విముఖత అధికం ఔతుంది. అది సామాజిక స్థిరత్వానికి గొడ్డలిపెట్టుగా మారింది. కొంతమంది సౌదీలు తాము సౌదీప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలకు అర్హులుగా భావిస్తున్నారు. వారిని తృప్తిపరచడంలో ప్రభుత్వం విఫలమైనట్లైతే అది విధ్వంసకర పరిస్థితికి దారితీయవచ్చు.[373][374][375]

పిల్లలను హింసించుట

కుటుంబ సంరక్షణ కార్యక్రమం (నేషనల్ గార్డ్ హెల్త్ అఫైర్స్) డైరెక్టర్ డాక్టర్. నౌరా అల్- సువైయన్ సౌదీ అరేబియాలోని పిల్లలలో 4 మందిలో ఒకరు హింసకు గురౌతున్నారని అభిప్రాయపడుతున్నాడు.[376] " ది నేషనల్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ " నివేదికల ఆధారంగా దేశంలోని 45% పిల్లలు కొంత హింస, నిందలకు గురౌతున్నారని అంచనావేస్తున్నారు. [377] 2013 లో ప్రభుత్వం పిల్లలపట్ల గృహహింసకు వ్యతిరేకంగా చట్టం ప్రవేశపెట్టారు.[378]

మానవ వలసలు

సౌదీ అరేబియాలో విదేశీ మహిళా ఇంటి పని మనుషుల సమస్య ప్రత్యేక సమస్యగా భావించబడుతుంది. దేశంలో పెద్ద సంఖ్యలో విదేశీ మహిళలు ఇంటిపని కొరకు నియమించబడుతున్నారు. సాంఘిక విధానాలలో ఉన్న లోపాల కారణంగా వీరు పలు నిందలకు, హింసలకు గురౌతూ ఉన్నారు.[379]

యువత

మిడిల్ ఈస్ట్ లోని ఇతర దేశాలలో లాగా సౌదీ అరేబియాలో జనాభా అభివృద్ధి అత్యధికంగా ఉంది. దేశంలోని జనాభాలో 30 సంవత్సరాలకంటే తక్కువ వయసున్నవారు అధికశాతం ఉన్నారు.[380] సౌదీ అరేబియా లోని ప్రస్తుత తరం పెద్దవారయ్యే సమయానికి గుర్తించతగినంత మార్పులు సంభవిస్తాయని భావిస్తున్నారు. యువత జీవనశైలి, సంతృప్తి విషయంలో ముందు తరంకంటే భిన్నంగా ఉంటుందని భావిస్తున్నారు: పలు దశాబ్ధాలుగా సౌదీ ప్రజలు చక్కని జీతభత్యాలు అందిస్తున్న ఉద్యోగాల పట్ల అనాసక్తి ప్రదర్శించారు.అలాగే బలహీనమైన విద్యాస్థాయి ప్రైవేట్ ఉద్యోగాలను అందుకోవడానికి ఆటంకంగా ఉంది.[373] 20 వ శతాబ్ధపు జీవనస్థాయికి చేరుకోవడంలో యువత తమ తల్లితండ్రులను నిరాశకు గురిచేస్తున్నారు.[381] రాజు, యువరాజు సరాసరి వయసు 74.[382] దేశంలోని అత్యధికమైన జనబాహుళ్యానికి పాలకులకు మద్య దాదాపు అర్ధశతాబ్దం వ్యత్యాసం ఉంది.[383][384][385] కఠినమైన మతపరమైన నిబంధనలు, అనుగుణ్యత కారణంగా వెలుపలి ప్రపంచం యువత జీవనశైలి సౌదీ యువత జీవనశైలికి మద్య అత్యధికమైన వైవిధ్యం ఉంది.[386] తల్లి తండ్రులు పిల్లలను విదేశీ సేవకుల పర్యవేక్షణలో వదిలివేయడం.[387] కారణంగా సేవకుల నుండి పిల్లలు స్వచ్ఛమైన ఇస్లామిక్ విలువలు, సంప్రదాయం అశక్తులు కావడం సౌదీ యువత మీద, సమాజం మీద ప్రభావం చూపుతుంది.[388] 2011 గణాంకాలు సౌదీలోని 31% యువత " సంప్రదాయ విలువలకు కాలం చెల్లిందని అలాగే ఆధునిక విలువలు , విశ్వాసాలు అందుకోవడంలో గట్టిగా నిర్ణయించుకున్నామని " అభిప్రాయం వెలిబుచ్చింది. ఈ సర్వేలో యువత అధికసంఖ్యలో భాగస్వామ్యం వహించింది.[389][390][391] తమదేశం విధివిధానాల పట్ల విశ్వాసం వెలిబుచ్చిన వారి శాతం 98% నుండి 62% పతనం అయింది.[381][392]

వివాహాలు

ఫస్ట్ లేక సెకండ్ కజింస్ మద్య వివాహాలు చేయడంలో సౌదీ అరేబియా ప్రపంచంలో ద్వితీయస్థానంలో ఉంది.సంప్రదాయానుకూలమైన ఇలాంటి వివాహాల కారణంగా బాంధవ్యాలు సురక్షితంగా ఉంటాయని, సంపదలు సరక్షించబడుతుంటాయని గిరిజన ప్రజలు భావిస్తుంటారు. [393] ఈ దగ్గర బంధుత్వంలో వివాహాల కారణంగా సిస్టిక్ ఫైబ్రాసిస్ (తలస్సేమియా), బ్లడ్ డిసార్డర్, టైప్ 2 డయాబెటీస్ (సౌదీ అరేబియాలో 32% పెద్దవారిలో ఈ వ్యాధి ఉంది) హైపెర్టెంషన్ (ఇది 33% వారిని బాధిస్తుంది).[394] సికిల్ సెల్ అనీమియా, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ, చెవుడు, మూగతనం వంటి ఆరోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి.[395][396]

బీదరికం

సౌదీ అరేబియాలో 12.7% -25% వరకు ప్రజలు దారిద్యరేఖకు దిగువన ఉన్నారని అంచనా.[397] [398] మాద్యమ నివేదికలు, ప్రైవేట్ ఏజెంసీ అంచనాలు 2013 గణాంకాలలో 2-4 మిలియన్ల స్థానిక సౌదీ ప్రజల మాసాంతర ఆదాయం 530 (దినసరి 17 అమెరికండాలర్లు) అమెరికన్ డాలర్లకంటే తక్కువగా ఉందని తెలియజేస్తున్నాయి. ఇది సౌదీ అరేబియాలో దారిద్యరేఖగా భావించబడుతుంది. ఫోర్బ్స్ పత్రిక అంచనాలు రాజా అబ్దుల్లా వ్యక్తిగత ఆదాయం 18 బిలియన్ల అమెరికండాలర్లు అని తెలియజేస్తుంది.[398]

స్త్రీలు

సౌదీలో మహిళలకు పురుషులతో సమానమైన హక్కులు లేవు. సౌదీ ప్రభుత్వం మహిళలపట్ల వివక్ష చూపుతుందని వివక్షకారణంగా మహిళలకు రాజకీయపరమైన హక్కులు స్వల్పంగానే ఉన్నాయని యు.ఎస్. స్టేట్ డిపార్ట్మెంట్ భావిస్తుంది.[399] వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2010 గ్లోబల్ జండర్ గ్యాప్ రిపోర్ట్ అనుసరించి 134 దేశాల సౌదీ అరేబియా 134లో ఉందని భావిస్తున్నారు.[400] మహిళల పట్ల జరుగుతున్న హింసాత్మక చర్యలను అడ్డుకోవడానికి అవసరమైన చట్టం ఇతర వనరులు వివరిస్తున్నాయి.[399] 2013 ఆగస్టులో మహిళలకు వ్యతిరేకమైన హింసాత్మక చర్యలకు వ్యతిరేకంగా చట్టం ప్రవేశపెట్టబడింది. హింసాత్మక చర్యకు శిక్షగా 12 మాసాల జైలు శిక్ష, 50,000 రియాళ్ళ (13,000 అమెరికన్ డాలర్లు) జరిమానా విధించబడుతుంది.[378][401][402]

A woman wearing a niqāb. Under Saudi law, women are required to wear Hijab but niqab is optional.

సౌదీ చట్టం అనుసరించి యుక్తవస్కురాలైన ప్రతి మహిళకు బంధువైన పురుషుడు ఎవరనా సంరక్షకునిగా ఉండాలి.[399] మహిళలు ప్రయాణించడానికి, విద్యాభ్యాసం చేయడానికి, పని చేయడానికి సరక్షకుని అనుమతి తీసుకోవాలి. [399][403][403][404] న్యాయవ్యవస్థ కూడా మహిళలపట్ల వివక్ష చూపుతుంది.[399] పురుషులకు బహుభార్యత్వం చట్టపరంగా అనుమతించబడుతుంది.[405] భార్యకు వివాహరద్దు చేయడానికి న్యాయపరమైన విధానం అనుసరించవలసిన అవసరం లేదు.[406] మహిళలు భర్త అనుమతితో లేక భార్యపట్ల భర్త హింసాత్మక చర్యలు ఆధారంగా వివాహరద్దు తీసుకొనడానికి ఆస్కారం ఉంది.[407] స్త్రీ వారసులు పురుషవారసులు తీసుకున్న దానిలో సగం సంపదకు మాత్రమే వారసులు ఔతారు.[408] సౌదీ అరేబియాలో స్త్రీల సరాసరి వివాహ వయసు 25 సంవత్సరాలు. [409][410][411] సాధారణంగా బాల్యవివాహాలు ఉండవు.[412][413] As of 2015, సౌదీ అరేబియాలో మహిళలు 13% మాత్రమే ఉద్యోగాలలో నిమితులై ఉన్నారు. విశ్వావిద్యాలయ పట్టబధ్రులలో మహిళల శాతం 51%.[414] స్త్రీల అక్షరాస్యత 81% (పురుషులకంటే తక్కువ).[5][415]

మహిళా సమస్యలు

సౌదీ అరేబియా మహిళలకు స్థూలకాయ సమస్య అధికంగా ఉంది. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలలో ఇంటిపనులు పనిమనుషులు చేయడం ఇందుకు ప్రధానకారణంగా ఉంది.[416] 2014 ఏప్రిల్ నాటికి విద్యాశాలలోని సౌదీ అధికారులు పాఠశాల విద్యార్థినులకు క్రీడల నిషేధం తొలగించమని కోరారు.[261] ఇస్లామీక్ పోలీస్ (ముత్వా) మహిళల మీద పలు నిషేధాలు విధించారు.[399][417] రెస్టారెంట్లలో మహిళలు మహిళలకు ప్రత్యేకించిన ప్రదేశంలో మాత్రమే కూర్చోవాలన్న నిషేధం కూడా ఉంది.[399] వాహనాలు నడపడానికి మహిళలకు నిషేధం ఉండేది.[418] సౌదీ అరేబియా మతపోలీస్ ద్వారా మహిళల దుస్తుల మీద కఠినమైన నింబంధనలు విధించినప్పటికీ అల్ అరేబియా న్యూస్ వర్క్‌లో పనిచేసే మహిళలు పశ్చాత్య వస్త్రధారణ చేయడానికి అవకాశం ఉంది.[419][420] కొంతమంది మహిళలు వైద్య విద్యను పూర్తిచేసారు.[421][422]2011 సెప్టెంబరు 25న రాజా అబ్దుల్లా సౌదీ మళలకు ఓటు హక్కూ కలిగిస్తూ ప్రకటించాడు. అలాగే పురుష గార్డియన్ అనుమతితో మహిళలకు ముంసిపల్ ఎన్నికలలో పోటీచేయడానికి అనుమతి కల్పించబడింది.[423][424] 2015 డిసెంబరు 12న మహిళలు ఓటు వేసారు.[425]

విద్య

The Al-Yamamah Private University in Riyadh

సౌదీ అరేబియాలో అన్ని స్థాయిలలో విద్య ఉచితం. విద్యావిధానంలో ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, సెకండరీ విద్యా విధానం ఉంటుంది. విద్యాధ్యయనంలో ఎక్కువభాగం ఇస్లాం సబంధిత విషయాలు బోధించబడుతుంటాయి. సెకండరీ స్థాయి నుండి విద్యార్థులు మతసంబంధిత విద్య కాని సాంకేతిక విద్యకాని ఎంచుకోవచ్చు. పురుషుల అక్షరాస్యత శాతం 90.4%, స్త్రీల అక్షరాస్యత 81.3% ఉంది.[5] బాలబాలికకు తరగతులు విడివిడిగా ఉంటాయి. 2000 లో అధికసంఖ్యలో విశ్వవిద్యాలయాలు, కాలేజీలు స్థాపించబడ్డాయి. " కింగ్ సౌద్ యూనివర్శిటీ " (1957), మదీనాలోని ఇస్లామిక్ యూనివర్శిటీ (1961), జదాహ్‌లో కింగ్ అబ్దులాజిజ్ యూనివర్శిటీ (1967) స్థాపించబడ్డాయి. సైన్సు అండ్ టెక్నాలజీ, మిలటరీ విద్య, మతవిద్య, మెడిసిన్ మొదలైన విద్యాసంస్థలు స్థాపించబడ్డాయి. ఇస్లామిక్ విద్యాసంస్థలు విస్తారంగా ఉన్నాయి. కాలేజీ స్థాయిలో స్త్రీలకు ప్రత్యేక విద్యాసంస్థలు ఉంటాయి.[92]సౌదీ అరేబియా సిలబస్‌ను ఇస్లాం మాత్రమే ఆధిక్యత చేయడం లేదని వహాబీ విధానాలు కూడా ఆధిక్యత వహిస్తున్నాయని విమర్శకులు భావిస్తున్నారు. వహాబీకి చెందని వారు, ముస్లిములు కానివారి పట్ల ఈ విద్యావిధానం ద్వేషభావం కలిగిస్తుంది.[426] అయినా విద్యావిధానంలో ఉపాధికి అవసరమైన సాంకేతిక విద్య, ఇతర విద్యల కొరత ఉంది.[5][427] ఖురాన్‌లో అధికభాగం గుర్తుపెట్టుకి వ్రాయడం, తఫ్సిర్ అర్ధం చేసుకుని వివరణ ఇవ్వడం,, దైనందిక జీవితంలో ఖురాన్‌ను అంవయించుకోవడం యూనివర్శిటీ విద్యార్థులకు తప్పనిసరి.[428] ఫలితంగా విద్యార్థులకు ప్రైవేట్ రంగాలకు అవసరమైన సాంకేతిక మాత్రం అందడం లేదు.[5] సౌదీ అరేబియా విద్యావిధానంలో మతపరమైన విద్య ఆధిక్యత వహిస్తున్న కారణంగా 2006 ఫ్రీడం హౌస్ నివేదిక విద్యార్థులకు వహాబీ విధానాలను అనుసరించని క్రైస్తవులు, యూదులు, షీటెస్, సుఫీలు, సున్నీలు ముస్లిములు, హిందువుల పట్ల ద్వేషం అధికరించగలదని తెలియజేస్తుంది.[429][430] సౌదీ వెలుపల ప్రపంచం అంతటా సౌదీ సిలబస్ మదరసాలు, క్లబ్బుల ద్వారా బోధించబడుతుంది.[431] సౌదీ అరేబియా వహాబిజానికి ప్రోత్సాహం అందిస్తుంది. సున్నీ ముస్లిములు, జిహాదిస్టులు (ఇరాక్, లెవెంత్), అల్- కొయిదా, అల్- నుస్రా ఫ్రంట్ వహాబీ విధానాలు అనుసరిస్తూ ఉన్నారు. సౌదీ స్థాపించిన మసీదులు, మదరసాల ద్వారా మొరాకో నుండి పాకిస్తాన్ నుండి ఇండోనేషియా వరకు తీవ్రవాద విధానాలు బోధించబడుతుంటాయి.[432]

దస్త్రం:ISIS school textbook.jpg
ISIS edition of Tawhid reprinted from Saudi school textbook.

మొసుల్ నగరంలో ఇరాకీ పిల్లలకు, ఇరాక్, లెవెంత్ దేశంలోని పిల్లలకు ఇరాకీ విద్యా సిలబస్ తొలగించి వహాబీ సిలబస్ ప్రవేశపెట్టబడింది. ప్రత్యేకంగా ఇరాక్, లెవెంత్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబీ వ్రాసిన తవ్హిద్ పుస్తకాల ఆధారిత పుస్తకాలను పెద్ద ఎత్తున పునర్ముద్రించి విద్యార్థులకు పంచిపెట్టింది.[433] ఇ పుస్తకం సౌదీ అరేబియా పాఠశాలలలో 7-9 తరగతి విద్యార్థులకు బోధించబడుతుంది.[434]సెకండరీ ఎజ్యుకేషన్ (1435 - 1438 ఇస్లామిక్ క్యాలెండర్) సిలబస్ అనుసరించి నేచురల్ సైన్సు‌లో భాగంగా తవ్హిద్, ఫిక్వ్, తఫ్సిర్, హడిత్, ఇస్లామిక్ ఎజ్యుకేషన్, ఖురాన్ చేర్చబడ్డాయి. అదనంగా విద్యార్థులు గణితం, ఫిజిక్స్, కెమెస్ట్రీ, బయాలజీ, జియాలజీ, కంప్యూటర్ అధ్యయనం చేయాలి.[435]సౌదీ విద్యావిధానం ఇస్లామిక్ తీవ్రవాదానికి ప్రోత్సాహం అందిస్తుందని ఆరోపణలు ఉన్నాయి.[436][437] 2 బిలియన్ల ప్రణాళికతో తత్వీర్ పేరుతో సంస్కరణలు చేపట్టబడ్డాయి. సంస్కరణలో సంప్రదాయ విద్య స్థానంలో లౌకికవాద విద్య ప్రవేశపెట్టబడింది.[427][438]

ఇవి కూడా చూడండి

నోట్స్

మూలాల జాబితా

  • Tripp, Harvey; North, Peter (2003). Culture Shock, Saudi Arabia. A Guide to Customs and Etiquette. Singapore; Portland, Oregon: Times Media Private Limited.

ఆత్మకథలు

వెలుపలి లింకులు


24°N 45°E / 24°N 45°E / 24; 45