ముహమ్మద్ ఆలీ

మహమ్మద్ అలీ విశ్వ విఖ్యాత బాక్సర్. మూడు సార్లు హెవీవెయిట్ బాక్సింగ్ ప్రపంచ విజేతగా నిలిచిన శక్తిశాలి. ఇతని అసలు పేరు క్లాషియస్ క్లే. నల్లజాతివారి హక్కుల కోసం పోరాడిన మాల్కం ఎక్స్ స్ఫూర్తితో ఇస్లాం మతాన్ని స్వీకరించి తనపేరును మార్చుకున్నాడు. పన్నెండేళ్ళ వయసు నుంచే బాక్సింగ్ ను అభ్యసించడం ప్రారంభించాడు. ఈయన చేసిన కఠోరమైన అభ్యాసం వలన దాదాపు ఇరవై ఏళ్ళ పాటు బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నా భారీ గాయాలు కాకుండా కాపాడుకోగలిగాడు. వ్యక్తిగతంగా క్రమశిక్షణ పాటించేవాడు. బాక్సింగ్ ను ఒక తపస్సులా భావించేవాడు. మద్యానికి, మహిళలకు దూరంగా ఉండేవాడు. పద్దెనిమిదేళ్ళ వయసులో ఒలంపిక్ క్రీడల్లో స్వర్ణపతకం సాధించాడు. బాక్సింగ్ ద్వారా తన జీవితకాలంలో సుమారు అరవై మిలియన్ డాలర్లు దాకా సంపాదించగలిగాడు. 1967లో అమెరికా వియత్నాంపై చేసిన యుద్ధాన్ని వ్యతిరేకించి జైలు పాలయ్యాడు. హెవీ వెయిట్ ఛాంపియన్ హోదాను కోల్పోయాడు. అయినప్పటికీ తన రాజకీయ అభిప్రాయాలు మార్చుకోలేదు. జైలు నుంచి తిరిగివచ్చి మళ్ళీ బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. రెండు సార్లు ప్రయత్నించి 1974లో మళ్ళీ ఆ టైటిల్ ని చేజిక్కించుకున్నాడు. ఎన్ని విజయాలు సాధించినా అమెరికాలో ఆలీ కొంత వివక్షతను కూడా ఎదుర్కొన్నాడు. వయసు మీరిన తర్వాత ఆయనకు పార్కిన్‌సన్స్ వ్యాధి వచ్చింది. అంతటి అనారోగ్యంలో కూడా 1996 లో జరిగిన వేసవి ఒలంపిక్ క్రీడల్లో వణుకుతున్న చేతితోనే కాగడా వెలిగించాడు.ఇతని కూతురు లైలా అలీ కూడా మహిళా విభాగంలో ప్రపంచ విజేత. ఇతను కొన్ని చిత్రాలలో కూడా నటించాడు.

ముహమ్మద్ అలీ
1967 లో ముహమ్మద్ ఆలీ
గణాంకాలు
ఇతర పేర్లుది గ్రేటెస్ట్
ది పీపుల్స్ ఛాంపియన్
ది లూస్విల్లే లిప్
బరువు విభాగంహెవీ వెయిట్
ఎత్తు6 ft 3 in (1.91 m)
Reach80 in (203 cm)
జననము(1942-01-17)1942 జనవరి 17
లూస్విల్లే, కెంటకీ, అమెరికా
మరణము2016 జూన్ 3(2016-06-03) (వయసు 74)
ఫీనిక్స్, ఆరిజోనా, అమెరికా
StanceOrthodox
బాక్సింగ్ రికార్డ్
పాల్గొన్న పోరాటాలు61
విజయాలు56
నాకౌట్ విజయాలు37
పరాజయాలు5
డ్రా లు0
No contests0

జీవితవిశేషాలు

ఇతడు 1942,జనవరి 17వ తేదీన కెంటకీలో జన్మించాడు. ఇతని అసలు పేరు కాసియస్ మార్సెలస్ క్లే జూనియర్. ఇతడు తన 12వ ఏట నుండి బాక్సింగ్ శిక్షణ పొందాడు. 1960లో రోమ్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే సంవత్సరం ప్రొఫెషనల్‌గా మారి 21 సంవత్సరాల పాటు బాక్సింగ్‌లో తిరుగులేని విజయాలను సాధించాడు. ఇతడు 1964లో ఇస్లాం మతం స్వీకరించి తన పేరును ముహమ్మద్ అలీగా మార్చుకున్నాడు. తాను ఆచరించిన ధర్మం కోసం నేరుగా అమెరికా ప్రభుత్వంతోనే తలపడ్డాడు. అప్పటి నిబంధనల ప్రకారం ఆలీ కూడా సైన్యంలో చేరి వియత్నాం యుద్ధానికి వెళ్లాల్సి ఉండగా తాను నమ్మిన ఇస్లాం అమాయకులను చంపనీయదంటూ సైన్యంలో చేరడానికి వ్యతిరేకించాడు.దానితో అమెరికా ప్రభుత్వం అతని హెవీవెయిట్ టైటిల్స్ అన్నీ రద్దు చేసి అరెస్ట్ కూడా చేసి జైలుకు పంపింది. దీనిపై కోర్టులో పోరాటం తర్వాత ఇతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇతడు 1964లో సోంజి రాయ్‌ను, 1967లో బెలిండా బాయ్డ్‌ను,1977లో వెరోనికా పోర్షేను వివాహం చేసుకుని వారికి విడాకులు ఇచ్చి 1986లో లోనీ విలియమ్స్‌ను నాలుగో వివాహం చేసుకున్నాడు. ఇతనికి తొమ్మిది మంది సంతానం. వీరిలో లైలా అలీ బాక్సర్ కాగా, హనా అలీ రచయిత్రిగా పేరు పొందింది.

సినిమాలలో

అలీ జీవితం ఓ సినిమాకథ లాంటిది. అందుకే ఆయనపై హాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కొన్నిటిలో తనపాత్ర తానే ధరించడం విశేషం. 1977లో తీసిన గ్రేటెస్ట్‌లో అలీ తనపాత్ర తానే పోషించి మెప్పించాడు. 2001లో తీసిన అలీ సినిమాలో విల్‌స్మిత్ మహమ్మదలీ పాత్ర వేస్తే ఆస్కార్ నామినేషన్ దక్కింది. హోవర్డ్ ఫాస్ట్ నవల ఆధారంగా 1979లో తీసిన ఫ్రీడంరోడ్‌లో అలీయే హీరో. ఆటలో మెడల్స్ లాగే ఇంకా కొంచెం గట్టిగా పట్టుబడితే ఆస్కార్ కూడా వచ్చేదేమో అంటారు. కొన్ని సినిమాలు ఇండియాలో కూడా విడుదలై బాగానే ఆడాయి. అందుకే ఎలాగైనా బాక్సింగ్ లెజెండ్‌ను బాలీవుడ్ సినిమాల్లోకి దించాలనే ఆలోచనలు కూడా జరిగాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ 1980లలో లాస్ ఏంజిల్స్‌కు వెళ్లి మహమ్మద్ అలీని కలిశారు. ఆయన వెంట దర్శక నిర్మాత ప్రకాశ్ మెహ్రా కూడా ఉన్నారట. అలీని, తనను పెట్టి సినిమా తీయాలని మెహ్రా అనుకున్నారని బిగ్‌బీ ట్విట్టర్‌లో వెల్లడించారు. 1980లో ఇండియా వచ్చినప్పుడు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఎగ్జిబిషన్ ఫైట్ ఏర్పాటైంది. ఆ సందర్భంగా స్టేడియానికి వచ్చిన తమిళనాడు సినీ, పొలిటికల్ సూపర్‌స్టార్ ఎమ్జీ రామచంద్రన్‌తో అలీ చేతులు పైకెత్తినప్పుడు స్టేడియం హర్షధ్వానాలతో దద్దరిల్లడం చాలామంది ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.[1]

బాక్సింగ్ ప్రస్థానము

12వ ఏట బాక్సింగ్ లో శిక్షణ ప్రారంభించిన అలీ, 22 ఏళ్లకే ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్ గా ఎదిగారు. 1964లో దిగ్గజ బాక్సర్ సోనీలిస్టన్ పై గెలుపుతో ప్రపంచ ఛాంపియన్ గా మహ్మద్ అలీ నిలిచారు. తర్వాత ఇస్లాం మతం స్వీకరించి మహ్మద్ అలీగా పేరు మార్చుకున్నారు. 1967లోనూ హెవీవెయిట్ టైటిల్ సొంతం చేసుకున్నారు. 1964, 1974, 1978ల్లో ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ గా నిలిచారు.గొప్ప ఛాంపియన్ గా, మానవతావాదిగా పేరొందినప్పటికీ ఆయన కెరీర్ వివాదాస్పదంగా కొనసాగింది. 1967లో అమెరికా-వియత్నాం యుద్ధ సమయంలో అలీని అమెరికా ఆర్మీలో పనిచేయడానికి ఎంపిక చేశారు. కానీ, ఆర్మీ ఆఫర్ ను అలీ తిరస్కరించారు. శక్తివంతమైన అమెరికా కోసం పేద ప్రజలపై పోరాడనని తేల్చి చెప్పారు. మరికొన్ని వివాదాలతో అలీ బాక్సింగ్ టైటిల్ వదులుకున్నారు. ఐదేళ్ల జైలుశిక్ష కూడా అనుభవించారు.

న్యాయ పోరాటం తర్వాత తిరిగి బాక్సింగ్ రింగ్ లోకి దిగిన మహ్మద్ అలీ 1974లో ఫ్రేజియర్ పై గెలుపొంది ఛాంపియన్ షిప్ సొంతం చేసుకున్నారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ తో పాటు మరెన్నో పోటీల్లో అద్భుత విజయాలు సాధించారు. తన బాక్సింగ్ కెరీర్ లో ఐదుసార్లు మాత్రమే మహ్మద్ అలీ ఓటమి చవిచూశారు.[2]

56 విజయాలు (37 నాకౌట్స్, 19 ఫలితాలు), 5 పరాజయాలు (4 ఫలితాలు, 1 TKO), 0 డ్రాలు[3]
ఫలితము.రికార్డుప్రత్యర్థిరకమురౌండ్, సమయముతేదీవయస్సుప్రాంతముఇతర వివరాలు
ఓటమి56-5ట్రెవెర్ బెర్బిక్ఫలితము (ఏకాభిప్రాయము)10 (10)01981-12-11 డిసెంబరు 11, 198139 సంవత్సరాలు, 328 రోజులునస్సావ్, బహమాస్"డ్రామా ఇన్ ద బహమాస్"[4]
ఓటమి56-4లారీ హోమ్స్TKO (Corner Stoppage)10 (15)01980-10-02 అక్టోబరు 2, 198038 సంవత్సరాలు, 259 రోజులులాస్ వెగాస్ వాలీది రింగ్ ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్
చేజార్చుకున్నాడు. కానీ WBC ప్రపంచ హెవీవెయిట్ పోటీల విజేత
గెలుపు56-3లియోన్ స్పింక్స్ఫలితము (ఏకాభిప్రాయము)15 (15)01978-09-15 సెప్టెంబరు 15, 197836 సంవత్సరాలు, 241 రోజులున్యూ ఓర్లియేన్స్ ది రింగ్, WBA ప్రపంచ హెవీవెయిట్ పోటీల విజేత;
1979-09-06 న WBA టైటిల్ వదిలేశాడు
ఓటమి55-3లియోన్ స్పింక్స్ఫలితము (విడిగా)15 (15)01978-02-15 ఫిబ్రవరి 15, 197836 సంవత్సరాలు, 29 రోజులులాస్ వెగాస్ది రింగ్, WBC, WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ ఓడిపోయాడు.
గెలుపు55-2ఎర్నీ షేవర్స్ఫలితము (ఏకాభిప్రాయము)15 (15)01977-09-29 సెప్టెంబరు 29, 197735 సంవత్సరాలు, 255 రోజులున్యూయార్క్ సిటీది రింగ్, WBC, WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు54-2అల్ఫ్రేడో ఎవాంజలిస్టాఫలితము(ఏకాభిప్రాయము)15 (15)01977-05-16 మే 16, 197735 సంవత్సరాలు, 119 రోజులులాండ్ ఓవర్. మేరీ లాండ్ ది రింగ్, WBC, WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు53-2కెన్ నార్టన్ఫలితము(ఏకాభిప్రాయము)15 (15)01976-09-28 సెప్టెంబరు 28, 197634 సంవత్సరాలు, 255 రోజులుద బ్రాంక్స్, న్యూయార్క్ది రింగ్, WBC, WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు52-2రిచర్డ్ డన్TKO5 (15)01976-05-24 మే 24, 197634 సంవత్సరాలు, 128 రోజులుమ్యూనిచ్, పశ్చిమ జర్మనీది రింగ్, WBC, WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు51-2జిమ్మీ యంగ్ఫలితము(ఏకాభిప్రాయము)15 (15)01976-04-30 ఏప్రిల్ 30, 197634 సంవత్సరాలు, 104 రోజులులాండ్ ఓవర్ది రింగ్, WBC, WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు50-2జీన్ పియర్రీ కూప్‌మాన్KO5 (15)01976-02-20 ఫిబ్రవరి 20, 197634 సంవత్సరాలు, 34 రోజులుసాన్ జువాన్, పూర్టోరికోది రింగ్, WBC, WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు49-2జో ఫ్రేజియర్TKO14 (15), 0:5901975-10-01 అక్టోబరు 1, 197533 సంవత్సరాలు, 257 రోజులుక్విజోన్ నగరం, ఫిలిప్పీన్స్ది రింగ్, WBC, WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు48-2జో బగ్నర్ఫలితము(ఏకాభిప్రాయము)15 (15)01975-06-30 జూన్ 30, 197533 సంవత్సరాలు, 164 రోజులుకౌలాలంపూర్ది రింగ్, WBC, WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు47-2రాన్ లైల్TKO11 (15)01975-05-16 మే 16, 197533 సంవత్సరాలు, 119 రోజులులాస్ వెగాస్ది రింగ్, WBC, WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు46-2చక్ వెప్నర్TKO15 (15), 2:4101975-03-24 మార్చి 24, 197533 సంవత్సరాలు, 66 రోజులురిచ్‌ఫీల్డ్, ఓహియోది రింగ్, WBC, WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు45-2జార్జ్ ఫోర్మాన్KO8 (15), 2:5801974-10-30 అక్టోబరు 30, 197432 సంవత్సరాలు, 286 రోజులుకింషసా, జైర్"ద రంబుల్ ఇన్ ది జంగిల్";
ది రింగ్, WBC, WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ విజేత
గెలుపు44-2జో ఫ్రేజియర్ఫలితము (ఏకాభిప్రాయము)12 (12)01974-01-28 జనవరి 28, 197432 సంవత్సరాలు, 11 రోజులున్యూయార్క్ సిటీ"ఆలీ - ఫ్రేజియర్ II"
NABF హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు, 1974 లో వదిలేశాడు
గెలుపు43-2రూడీ లబ్బర్స్ఫలితము(ఏకాభిప్రాయము)12 (12)01973-10-20 అక్టోబరు 20, 197331 సంవత్సరాలు, 276 రోజులుజకార్తా
గెలుపు42-2కెన్ నార్టన్ఫలితము (విడిగా)12 (12)01973-09-10 సెప్టెంబరు 10, 197331 సంవత్సరాలు, 236 రోజులుఇంగిల్ వుడ్, కాలిఫోర్నియాNABF హెవీవెయిట్ టైటిల్ విజేత.
ఓటమి41-2కెన్ నార్టన్ఫలితము (విడిగా)12 (12)01973-03-31 మార్చి 31, 197331 సంవత్సరాలు, 73 రోజులుశాండియాగోNABF హెవీవెయిట్ టైటిల్ ఓడిపోయాడు.
గెలుపు41-1జో బగ్నర్ఫలితము(ఏకాభిప్రాయము)12 (12)01973-02-14 ఫిబ్రవరి 14, 197331 సంవత్సరాలు, 28 రోజులులాస్ వెగాస్
గెలుపు40-1బాబ్ ఫోస్టర్KO8 (12), 0:4001972-11-21 నవంబరు 21, 197230 సంవత్సరాలు, 309 రోజులుస్టాటెలీన్, నెవెడా NABF హెవీవెయిట్ టైటిల్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు39-1ఫ్లాయెడ్ పాటర్సన్TKO7 (12)01972-09-20 సెప్టెంబరు 20, 197230 సంవత్సరాలు, 247 రోజులున్యూయార్క్ సిటీNABF హెవీవెయిట్ టైటిల్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు38-1ఆల్విన్ లూయీస్TKO11 (12), 1:1501972-07-19 జూలై 19, 197230 సంవత్సరాలు, 184 రోజులుడబ్లిన్
గెలుపు37-1జెర్రీ క్వారీTKO7 (12), 0:1901972-06-27 జూన్ 27, 197230 సంవత్సరాలు, 162 రోజులులాస్ వెగాస్NABF హెవీవెయిట్ టైటిల్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు36-1జార్జ్ చువాలోఫలితము(ఏకాభిప్రాయము)12 (12)01972-05-01 మే 1, 197230 సంవత్సరాలు, 105 రోజులువాంకోవర్NABF హెవీవెయిట్ టైటిల్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు35-1మాక్ ఫోస్టర్ఫలితము(ఏకాభిప్రాయము)15 (15)01972-04-01 ఏప్రిల్ 1, 197230 సంవత్సరాలు, 75 రోజులుటోక్యో
గెలుపు34-1జర్గెన్ బ్లిన్KO7 (12), 2:1201971-12-26 డిసెంబరు 26, 197129 సంవత్సరాలు, 343 రోజులుజూరిచ్
గెలుపు33-1బస్టర్ మతిస్ఫలితము (ఏకాభిప్రాయము)12 (12)01971-11-17 నవంబరు 17, 197129 సంవత్సరాలు, 304 రోజులుహొస్టన్, టెక్సాస్NABF హెవీవెయిట్ టైటిల్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు32-1జిమ్మీ ఎలిస్TKO12 (12), 2:1001971-07-26 జూలై 26, 197129 సంవత్సరాలు, 190 రోజులుహూస్టన్, టెక్సాస్ NABF హెవీవెయిట్ టైటిల్ విజేత.
ఓటమి31-1జో ఫ్రేజియర్ఫలితము (ఏకాభిప్రాయము)15 (15)01971-03-08 మార్చి 8, 197129 సంవత్సరాలు, 50 రోజులున్యూయర్క్ సిటీ"ఈ శతాబ్దపొ పోరాటము";
WBA, WBC ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్
కోసము
ది రింగ్ ప్రపంచ హెవీవెయిట్ టైటిల్ కోల్పోయాడు
గెలుపు31-0ఆస్కార్ బోనవేనాTKO15 (15), 2:0301970-12-07 డిసెంబరు 7, 197028 సంవత్సరాలు, 324 రోజులున్యూయార్క్ సిటీది రింగ్ ప్రపంచ హెవీవెయిట్ టైటిల్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు30-0జెర్రీ క్వారీTKO3 (15)01970-10-26 అక్టోబరు 26, 197028 సంవత్సరాలు, 282 రోజులుఅట్లాంటాది రింగ్ ప్రపంచ హెవీవెయిట్ టైటిల్ నిలబెట్టుకున్నాడు.
Suspended
గెలుపు29-0జోరా ఫోలీKO7 (15), 1:4801967-03-22 మార్చి 22, 196725 సంవత్సరాలు, 64 రోజులున్యూయార్క్ సిటీది రింగ్, WBC, WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు;
04-28-1967 న ఈ టైటిల్స్ వదిలేశాడు.
గెలుపు28-0ఎర్నీ టెర్రెల్ఫలితము (ఏకాభిప్రాయము)15 (15)01967-02-06 ఫిబ్రవరి 6, 196725 సంవత్సరాలు, 20 రోజులుహూస్టన్, టెక్సాస్ది రింగ్, WBC ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు
WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్ గెలుచుకున్నాడు.
గెలుపు27-0క్లెవెలాండ్ విలియమ్స్TKO3 (15)01966-11-14 నవంబరు 14, 196624 సంవత్సరాలు, 301 రోజులుహూస్టన్ది రింగ్ & WBC ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు26-0కార్ల్ మిల్డెన్‌బర్గర్TKO12 (15)01966-09-10 సెప్టెంబరు 10, 196624 సంవత్సరాలు, 236 రోజులుఫ్రాంక్‌ఫర్ట్ది రింగ్ & WBC ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు25-0బ్రియాన్ లండన్KO3 (15)01966-08-06 ఆగస్టు 6, 196624 సంవత్సరాలు, 201 రోజులులండన్ది రింగ్ & WBC ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు24-0హెన్రీ కూపర్TKO6 (15), 1:3801966-05-21 మే 21, 196624 సంవత్సరాలు, 124 రోజులులండన్ది రింగ్ & WBC ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు23-0జార్జ్ చువాలోఫలితము (ఏకాభిప్రాయము)15 (15)01966-03-29 మార్చి 29, 196624 సంవత్సరాలు, 71 రోజులుటొరంటోది రింగ్ & WBC ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు22-0ఫ్లాయ్డ్ పాటర్సన్TKO12 (15), 2:1801965-11-22 నవంబరు 22, 196523 సంవత్సరాలు, 309 రోజులులాస్ వెగాస్ది రింగ్ & WBC ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు21-0సొన్నీ లిస్టన్KO1 (15), 2:1201965-05-25 మే 25, 196523 సంవత్సరాలు, 128 రోజులులెవిస్టన్"ఆలీ vs. లిస్టన్ (II)"
ది రింగ్ & WBC ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు20-0సొన్నీ లిస్టన్TKO7 (15)01964-02-25 ఫిబ్రవరి 25, 196422 సంవత్సరాలు, 39 రోజులుమియామీ బీచ్, ఫ్లోరిడా"క్లే లిస్టన్ I",
ది రింగ్ & WBC ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ విజేత.
;
06-19-1964 న WBA టైటిల్ వదిలేశాడు.
గెలుపు19-0హెన్రీ కూపర్TKO5 (10), 2:1501963-06-18 జూన్ 18, 196321 సంవత్సరాలు, 152 రోజులులండన్
గెలుపు18-0డగ్ జోన్స్ఫలితము (ఏకాభిప్రాయము)10 (10)01963-03-13 మార్చి 13, 196321 సంవత్సరాలు, 55 రోజులున్యూయార్క్ సిటీ
గెలుపు17-0చార్లీ పోవెల్KO3, 2:0401963-01-24 జనవరి 24, 196321 సంవత్సరాలు, 7 రోజులుపిట్స్‌బర్గ్
గెలుపు16-0అర్చీ మూర్TKO4 (10), 1:3501962-11-15 నవంబరు 15, 196220 సంవత్సరాలు, 302 రోజులులాస్ ఎంజెలస్
గెలుపు15-0అలెగ్జాండ్రో లావొరంటేKO5 (10), 1:4801962-07-20 జూలై 20, 196220 సంవత్సరాలు, 184 రోజులులాస్ ఎంజెలస్
గెలుపు14-0బిల్లీ డానియేల్TKO7 (10), 2:2101962-05-19 మే 19, 196220 సంవత్సరాలు, 122 రోజులున్యూయార్క్ సిటీ
గెలుపు13-0జార్జ్ లోగాన్TKO4 (10), 1:3401962-04-23 ఏప్రిల్ 23, 196220 సంవత్సరాలు, 96 రోజులున్యూయార్క్ సిటీ
గెలుపు12-0డాన్ వార్నర్TKO4, 0:3401962-03-28 మార్చి 28, 196220 సంవత్సరాలు, 70 రోజులుమియామీ బీచ్
గెలుపు11-0సొన్నీ బాంక్స్TKO4 (10), 0:2601962-02-10 ఫిబ్రవరి 10, 196220 సంవత్సరాలు, 24 రోజులున్యూయార్క్ సిటీ
గెలుపు10-0విల్లీ బెస్మనాఫ్TKO7 (10), 1:5501961-11-29 నవంబరు 29, 196119 సంవత్సరాలు, 316 రోజులులూస్విల్లే, కెంటకీ
గెలుపు9-0అలెక్స్ మిటెఫ్TKO6 (10), 1:4501961-10-07 అక్టోబరు 7, 196119 సంవత్సరాలు, 263 రోజులులూస్వెల్లీ
గెలుపు8-0అలోంజో జాన్సన్ఫలితము (ఏకాభిప్రాయము)10 (10)01961-07-22 జూలై 22, 196119 సంవత్సరాలు, 186 రోజులులూస్విల్లే
గెలుపు7-0డూక్ సెబెడాంగ్ఫలితము (ఏకాభిప్రాయము)10 (10)01961-06-26 జూన్ 26, 196119 సంవత్సరాలు, 160 రోజులులాస్ వెగాస్
గెలుపు6-0లామార్ క్లార్క్KO2 (10), 1:2701961-04-19 ఏప్రిల్ 19, 196119 సంవత్సరాలు, 92 రోజులులూస్విల్లే
గెలుపు5-0డానీ ఫ్లీమాన్TKO7 (8)01961-02-21 ఫిబ్రవరి 21, 196119 సంవత్సరాలు, 35 రోజులుమియామీ బీచ్
గెలుపు4-0Jజిమ్‌ రాబిన్సన్KO1 (8), 1:3401961-02-07 ఫిబ్రవరి 7, 196119 సంవత్సరాలు, 21 రోజులుమియామీ బీచ్
గెలుపు3-0టోనీ ఎస్పెర్టీTKO3 (8), 1:3001961-01-17 జనవరి 17, 196119 సంవత్సరాలు, 0 రోజులుమియామీ బీచ్
గెలుపు2-0హెర్బ్ సిలెర్KO4 (8)01960-12-27 డిసెంబరు 27, 196018 సంవత్సరాలు, 345 రోజులుమియామీ బీచ్
గెలుపు1-0టన్నీ హన్‌సెకెర్ఫలితము (ఏకాభిప్రాయము)6 (6)01960-10-29 అక్టోబరు 29, 196018 సంవత్సరాలు, 286 రోజులులూస్విల్లే

మరణం

ఇతడు పార్కిన్సన్స్, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ 2016, జూన్ 4వ తేదీన అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.[5]

మూలాలు

బయటి లింకులు