మౌఖిక సాహిత్యం

సాహిత్యంలో ఒక రకమైన కళా ప్రక్రియ. ఇది నోటితో మాట్లాడడము లేదా గానం చేయడం ద్వారా ఏర్పడిన సాహిత్య

మౌఖిక సాహిత్యం, లేదా జానపద సాహిత్యం అనేది సాహిత్యంలో ఒక రకమైన కళా ప్రక్రియ. ఈ మౌఖిక సాహిత్యం నోటితో మాట్లాడడము లేదా గానం చేయడం ద్వారా ఏర్పడిన సాహిత్య శైలి. చాలావరకు ఇది లిప్యంతరీకరణ చేయబడినది.[1] మానవ శాస్త్రవేత్తలు ఈ మౌఖిక సాహిత్యం లేదా జానపద సాహిత్యమును వివిధ తీరులలో వర్ణించినందున, ఉపయోగించినందున ఒక ప్రామాణిక నిర్వచనం లేదు. దీనికి ఏ స్థిరమైన రూపం లేకపోవడం వలన దీనిని మౌఖికంగా ప్రసారం అయే సాహిత్యం అని దీని గురించిన విస్తృత భావన. దీంట్లో మాట్లాడే రూపంలో తరతరాలుగా మౌఖికంగా వస్తున్న కథలు, ఇతిహాసాలు, చరిత్ర ఉన్నాయి.[2] చెవిటి వ్యక్తులు నోటి ద్వారా కాకుండా చేతితో సంభాషించినప్పటికీ, వారి సంస్కృతి, సంప్రదాయాలను మౌఖిక సాహిత్యం వలెనే పరిగణిస్తారు. కథలు, హాస్యోక్తులు, కవిత్వం లిఖిత మాధ్యమం లేకుండా ఒక వ్యక్తి నుండి మరొకరికి ప్రసారం జరుగుతుంటుంది.   

నేపథ్యం

అక్షరాస్యతకు పూర్వం సమాజంలో లిఖిత సాహిత్యం లేదు, కానీ జానపద ఇతిహాసాలు, జానపద కథనాలు (అద్భుత కథలు, సాహస కథలు, జానపద నాటకాలు, సామెతలు, జానపద గీతాలు) వంటి గొప్ప వైవిధ్యమైన మౌఖిక సంప్రదాయాలను కలిగి ఉండవచ్చు, వీటిని మౌఖిక సాహిత్యం అంటారు. వీటిని జానపద రచయితలు, పారెమియోగ్రాఫర్లు (సామెతలు సేకరించి అధ్యయనం చేసి రాసేవారు[3]) వంటి నిష్ణాతులు సేకరించి ప్రచురించినప్పటికీ, ఇప్పటికీ దీనిని "మౌఖిక సాహిత్యం" గానే పేర్కొంటారు. డిజిటల్ యుగంలో సాంస్కృతిక చైతన్యం కారణంగా మౌఖిక సాహిత్యం వెలువడే వివిధ శైలులు పండితుల వర్గీకరణకు సవాళ్లను విసురుతున్నాయి.[4]

అక్షరాస్యత కలిగిన సమాజాలు కూడా మౌఖిక సంప్రదాయాన్ని కొనసాగించవచ్చు, ముఖ్యంగా కుటుంబంలో నిద్రబుచ్చే వేళ చెప్పే కథలు వంటివి, ఇతిహాసాల గురించి చెప్పడం మౌఖిక సాహిత్యానికి ఒక ఉదాహరణగా పరిగణిస్తారు, అలాగే పరిహాసాలు (జోకులు,) ఆశుకవిత్వం (స్లామ్ పోయెట్రీ) వంటివి మౌఖిక కవిత్వం లోనివే. 'రస్సెల్ సిమన్స్' "డెఫ్ పోయెట్రీ", "పెర్ఫార్మెన్స్ కవిత్వం" వంటివి టెలివిజన్ రూపంలో ఉన్నవి కూడా వ్రాత రూపాన్ని మరింత మెరుగు పరచే మౌఖిక కవితా శైలులు.[5]

మౌఖిక సాహిత్యాలు సాధారణంగా సంస్కృతికి మౌలిక అంశాలు ఏర్పరుస్తాయి, ఇంకా సాహిత్యం ఆశించిన అనేక విధాలుగా పనిచేస్తాయి. [6] ఉగాండా పండితుడు 'పియో జిరిము' పరస్పర విరుద్ధ పదాలను (ఆక్సిమోరాన్) నివారించే ప్రయత్నంలో వక్తృత్వం లేదా ప్రసంగం (orature) అనే పదాన్ని ప్రవేశపెట్టాడు, అయితే విద్యాపరమైన, ప్రజాదరణ పొందిన రచనలలో మౌఖిక సాహిత్యం కూడా సర్వసాధారణంగా ఉండిపోయింది. "ది ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఆఫ్రికన్ లిటరేచర్ " సంపాదకుడు 'సైమన్ గికాండి' (రౌట్లెడ్జ్, 2003), "ప్రసంగం అంటే మాట్లాడే పదం ద్వారా ఏదో ఒకటి ప్రసారం చేయడం. అది మాట్లాడే భాషపై ఆధారపడినందున అది ఒక సజీవమైన సమాజంలో మాత్రమే జీవిస్తుంది. సమాజ జీవితం మసకబారినప్పుడు, మౌఖికత దాని పనితీరును కోల్పోయి చనిపోతుంది. దీనికి జీవన సామాజిక నేపధ్యంలో ప్రజలు అవసరం ఉంది. దానికి జీవితం కూడా అవసరం", అని పేర్కొన్నాడు.

'కిమానీ న్జోగు', 'హెర్వే మౌప్యూ '(2007) సంపాదకత్వం వహించిన "సాంగ్స్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఈస్టర్న్ ఆఫ్రికాలో" ఈ విధంగా ప్రస్తావించారు. 'జిరిము' ఈ వక్తృత్వం లేదా ప్రసంగం (orature) అనే పదాన్ని రూపొందించాడు, "ఉచ్చారణను" ఒక అందమైన భావ వ్యక్తీకరణకు ఒక సాధనంగా ఉపయోగించడంగా వ్యాఖ్యానించాడు (న్గుగి వా తియోంగో, 1988). 'ఎక్హార్డ్ బ్రీటింగర్' సంపాదకత్వం వహించిన "డిఫైనింగ్ న్యూ ఇడియమ్స్ అండ్ ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్" పుస్తకంలో (రోడోపి, 1996, పేజీ 78): "దీని అర్థం ఏదైనా 'మౌఖిక సమాజం' మాట్లాడే పదాన్ని కనీసం కొంతకాలం పాటు కొనసాగించడానికి మార్గాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. మేము అన్ని రకాల ప్రసంగాలను సజాతీయ జానపద సాహిత్యానికి చెందినవిగా పరిగణిస్తాము". అని చెప్పాడు.

'జిరిము' రూపొందించిన 'ప్రసంగం' అను ఆలోచనను ఆధారంగా చేసుకుని, పాశ్చాత్య సిద్ధాంతాలు మౌఖిక సాహిత్యాన్ని, ముఖ్యంగా ఆఫ్రికా వంటి ప్రాంతాలకు చెందిన స్థానిక సాహిత్యాన్ని సమర్థవంతంగా సేకరించలేవని, వివరించలేవని 'మ్బుబే న్వి-అకీరి' పేర్కొన్నాడు. కారణం ఏమంటే ఈ ప్రదేశాలలో మౌఖిక సంప్రదాయాలకు సంకేతాలు, నృత్యం, కథకుడు ప్రేక్షకుల మధ్య పరస్పర సంభాషణ వంటివి ఉంటాయి, కాబట్టి ఇవి పదాల ద్వారా సంగ్రహించలేని అంశాలు. 'న్వి-అకీరి' ప్రకారం, మౌఖిక సాహిత్యం అనేది ఒక కథనం మాత్రమే కాదు, ఒక ప్రదర్శన కూడా.[7]

మౌఖిక సాహిత్య చరిత్ర

మౌఖిక సంప్రదాయం అంటే తీవ్రమైన మౌఖిక ప్రసార పద్ధతులు కలిగిన సమాజాలలో మౌఖిక సాహిత్యం, ఏదైనా లిఖిత సాహిత్యం, అధునాతన రచనలతో సంకర్షణ చెందగల, వారి వ్యక్తీకరణను విస్తరించే అదనపు మాధ్యమాలు, దృశ్య ప్రదర్శన కళలు కలిగి ఉండే ఒక సాధారణ పదం అనిపిస్తుంది. అందువల్ల స్థానిక భాషలో "మౌఖిక సాహిత్యం" అని సరిగ్గా అనువదించే ఏ పదబంధం ఉపయోగించబడనప్పటికీ, ఈ రోజు "మౌఖిక సాహిత్యం" అంటే అదే అర్థం ఉన్నది. ఇప్పటికే సమాజం తన సభ్యుల మధ్య లోతైన సాంస్కృతిక వ్యవహారాలను మౌఖికంగా నిర్వహించే మీడియాలో భాగం అని అర్థం చేసుకుంది. ఈ కోణంలో, మౌఖిక సిద్ధాంతం అనేది భాషా-ఆధారిత మానవ సమాజాలు ప్రారంభం నుండి జ్ఞానం, సంస్కృతి సమాచార ప్రసారాలకు సహజమైన అభ్యాసం ఈ మౌఖిక రూపం అనేది భావన. 'మౌఖిక సాహిత్యాన్ని వర్ణచిత్రాలు, రచనలు వంటి మౌఖికం కాని మాధ్యమాలలో చరిత్రను నమోదుకు ముందు కాలంలో ఈ విధంగా అర్థం చేసుకోవడం జరిగింది.

19వ శతాబ్దపు పూర్వీకుల తరువాత 'హెక్టర్ మున్రో చాడ్విక్', 'నోరా కెర్షా చాడ్విక్' లు వారి "సాహిత్య వృద్ధి (1932-40)" అను తులనాత్మక రచనలో మౌఖిక సాహిత్యం అను ఆలోచన మరింత విస్తృతంగా ప్రసారం చేసారు. 1960లో, ఆల్బర్ట్ బి. లార్డ్ "ది సింగర్ ఆఫ్ టేల్స్ను" ప్రచురించాడు, ఇది పురాతన గ్రంథాలలో తరువాతి గ్రంథాలలో "మౌఖిక-సూత్రాలను, ముఖ్యంగా సుదీర్ఘ సాంప్రదాయ కథనాలకు సంబంధించి సమకాలీన తూర్పు యూరోపియన్ బార్డ్స్ ద్వారా ప్రభావవంతంగా పరిశీలించింది.

మౌఖిక సాహిత్యం ("ఓరల్ లిటరేచర్") అనే పదం సాహిత్య పండితులు, మానవ శాస్త్రవేత్తల రచనలలో కనిపిస్తుంది- ఫిన్నెగన్ (1970,1977), గోర్గ్-కరాడీ (1976), [8] బౌమన్ (1986), వరల్డ్ ఓరల్ లిటరేచరల్ ప్రాజెక్ట్, 'జర్నల్ కైర్స్ డి లిట్రేచర్ ఓరేల్ ' వ్యాసాలలో కనిపిస్తుంది.[9]

సూచనలు

గ్రంథ పట్టిక

  • Finnegan, Ruth (2012) ఓరల్ లిటరేచర్ ఇన్ ఆఫ్రికా. కేంబ్రిడ్జ్ః ఓపెన్ బుక్ పబ్లిషర్స్. CC BY ఎడిషన్ doi: doi:10.11647/OBP.0025
  • ఓంగ్, వాల్టర్ (1982) ఓరాలిటీ అండ్ లిటరసీః ది టెక్నాలజీ ఆఫ్ ది వర్డ్. న్యూయార్క్ః మెతుయెన్ ప్రెస్.
  • త్సాయర్, జేమ్స్ తార్ (2010) "వెబ్డ్ వర్డ్స్, మాస్క్డ్ మీనింగ్స్ః ప్రోవర్బియాలిటీ అండ్ నరేటివ్/డిస్కర్సివ్ స్ట్రాటజీస్" డి. టి. నియాన్ యొక్క సుందియాటాః యాన్ ఎపిక్ ఆఫ్ ఓల్డ్ మాలి. సామెత 27:1
  • వాన్సినా, జాన్ (1978) "ఓరల్ ట్రెడిషన్, ఓరల్ హిస్టరీః అచీవ్మెంట్స్ అండ్ పర్స్పెక్టివ్స్", బి. బెర్నార్డి, సి. పోని, ఎ. ట్రియుల్జీ (ఎడ్స్) లో ఫోంటీ ఓరాలి, ఓరల్ సోర్సెస్, సోర్సెస్ ఓరల్స్. మిలన్ః ఫ్రాంకో ఏంజెలీ, పేజీలు. 59-74. 
  • వాన్సినా, జాన్ (1961) ఓరల్ ట్రెడిషన్. మౌఖిక సంప్రదాయం. హిస్టారికల్ మెథడాలజీలో ఒక అధ్యయనం. చికాగో, లండన్ః ఆల్డైన్, రౌట్లెడ్జ్ & కేగన్ పాల్.

ఇవి కూడా చూడండి

  1. జానపద సాహిత్యం
  2. మౌఖిక కథనం

బాహ్య లింకులు