రాశి

12 భాగాలుగా విభజించిన ఖగోళ భాగం

జ్యోతిష శాస్త్రంలో రాశులు పన్నెండు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో తొమ్మిది నక్షత్రపాదాలు ఉంటాయి. ఇలా పన్నెండు రాశులలో కలిసి నూట ఎన్మిమిది నక్షత్ర పాదాలు ఉంటాయి. రాశి నక్షత్ర సమూహాలను ఉహా రేఖతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి ఋషుల చేత నిర్ణయించబడినవే మేషము, మీనం మొదలగు రాశులు.

కాణిపాకంలోని శివాలయం వద్ద ఉన్న రాశీచక్రం. ఇందులో 12 రాశుల బొమ్మలు ఉన్నాయి

సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాస కాలం ఉంటాడు. ఆతరువాత రాశి మారుతూ ఉంటాడు. దానిని మాస సంక్రాంతి అంటారు. అలాగే ఒక రోజుకు ఒక లగ్నానికి రెండు గంటలు చొప్పున ఇరవైనాలుగు గంటల కాలాన్ని పన్నెండు లగ్నాలుగా విభజిస్తారు.

రాశులు

ఒక రోజులో పన్నెండు లగ్నాలు ఉంటాయి. ప్రతి రెండు గంటల సమయానికి లగ్నం మారుతూ ఉంటుంది. పుట్టిన సమయాన్ని అనుసరించి లగ్న నిర్ణయం జరుగుతుంది. జాతకుడు పుట్టిన లగ్నం అతడికి మొదటి రాశి లేక స్థానం లేక లగ్నం ఔతుంది. మేషమునకు అధిపతి కుజుడు, వృషభముకు అధిపతి శుక్రుడు. మిధునముకు అధిపతి బుధుడు. కటకముకు అధిపతి చంద్రుడు. సింహముకు అధిపతి సూర్యుడు. కన్యకు అధిపతి బుధుడు.తులకు అధిపతి శుక్రుడు. వృశ్చికముకు అధిపతి కుజుడు. ధనస్సుకు అధిపతి గురువు. మర, కుంభములకు వరుసగా శని అధిపతి. చివరి రాశి అయిన మీనముకు అధిపతి గురువు.

  • ఉపచయ రాశులు లగ్నము నుండి 3,6,10,11.
  • అపోక్లిమ రాశులు లగ్నము నుండి 3,6,9,12.
  • ఉపాంత్యము అంటే చివరి రాశికి ముందు రాశి.

ఉచ్ఛ నీచ రాశులు

  1. సూర్యునకు ఉచ్ఛ రాశి మేషము. అలాగే నీచరాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న తులారాశి.
  2. చంద్రుడికి ఉచ్ఛ రాశి వృషభము. నీచరాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న వృశ్చికము.
  3. కుజుడికి ఉచ్ఛ రాశి మకరము. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న కటకము.
  4. బుధుడికి ఉచ్ఛరాశి కన్య. నీచ రాశి దానికి ఏడవ స్థానం ఉన్న మీనము.
  5. గురువుకు ఉచ్ఛ రాశి కర్కాటకం. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న మకరము.
  6. శుక్రుడికి ఉచ్ఛ రాశి మీనము. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న కన్య.
  7. శనికి ఉచ్ఛ రాశి తుల. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న మేషము.
  8. పురుష రాశులు :- మేషము, మిధునము, సింహము, తుల, ధనస్సు, కుంభము.
  9. స్త్రీరాశులు :- వృషభము, కర్కాటకం, కన్య, వృశ్చికము, మకరము, మీనము.
  10. ఎరుపు వర్ణ రాశులు :- మేషము, సింహము, ధనస్సు.
  11. నలుపు :- మకరము, కన్య, మిధునము.
  12. పసుపు :- వృశ్చికము, కుంభము, మీనము.
  13. తెలుపు :- వృషభము, కటకము, తుల.
  14. బ్రాహ్మణ జాతి :- వృషభము, తులా, వృశ్చికము, మీనము.
  15. క్షత్రియ జాతి :- మేషము, సింహము, ధనస్సు.
  16. వైశ్యజాతి :- మిధునము, కుంభము.
  17. శూద్రజాతి :- కర్కాటకం, కన్య, మకరములు.
  18. రాశులు దిక్కులు :-
  19. తూర్పు దిక్కు :- మేషం, వృషభం, మిధునములు.
  20. దక్షిణం దిక్కు :- కటకం, సింహం, కన్య.
  21. ఉత్తర దిక్కు :- తులా, వృశ్చికం, ధనస్సులు.
  22. పడమర దిక్కు :- మకరం, కుంభం, మీనం.
  23. చరరాశులు:- మేషము, కర్కాటకం, తులా, మకరములు.
  24. సమరాశూలను ఓజ రాశులు అంటారు.

రాశుల స్వరూపం

  1. మేషం :- మేక ఆకారం.
  2. వృషభం :- కుమ్ముతున్న ఎద్దు.
  3. మిధునం :- గదను ధరించిన పురుషుడు.
  4. కర్కాటకం :- ఎండ్రకాయ ఆకారం.
  5. సింహం :- సింహాకారము.
  6. కన్య :- సస్యమును, దీపమును చేత పట్టుకుని తెప్ప మీద ఉన్న కన్య.
  7. తుల :- త్రాసు ధరించిన పురుషుడు.
  8. వృశ్చికము :- తేలు ఆకారము.
  9. ధనస్సు :- ధనస్సు ధరించిన పురుషుడు.
  10. మకరము :- మృగము వంటి ముఖము కలిగిన మొసలి.
  11. కుంభము :- రిక్త కుంభము చేత పట్టిన పురుషుడు.
  12. మీనము :- అన్యోన్య పుచ్ఛాభిముఖమై ఉన్న రెండు చేపలు.

రాశులు మరికొన్ని వివరాలు

రాశులులింగంస్వభావంతత్వంశబ్దంసమయంఉదయంజల/నిర్జలజీవులువర్ణంపరమాణంజాతిదిశఅధిపతిసంతానంప్రకృతికాలపురుషుని అంగంసమ/విషమ
మేషరాశిపురుషచరఅగ్నిఅధికరాత్రిపృష్ఠపాదంపశువులురక్తవర్ణంహస్వక్షత్రియతూర్పుకుజుడుఅల్పపిత్తశిరసువిషమ
వృషభరాశిస్త్రీస్థిరభూమిఅధికరాత్రిపృష్ఠఅర్ధపశువులుశ్వేతంహస్వబ్రాహ్మణదక్షిణశుక్రుడుసమంవాతముఖముసమం
మిధుననరాశిపురుషద్విశ్వభావవాయుఅధికరాత్రిశీర్షంనిర్జలమనుష్యఆకుపచ్చసమవైశ్యపడమరబుధుడుసమంవాతంబాహువులువిషమ
కర్కాటకరాశిస్త్రీచరజలనిశ్శబ్దంరాత్రిపృష్టపూర్ణజలపాటలసమశూద్రఉత్తరచంద్రుడుఅధికంకఫంవక్షంసమ
సింహరాశిపురుషస్థిరఅగ్నిఅధికపగలుశీర్షంనిర్జలపశువులుధూమ్ర, పాండుదీర్ఘంక్షత్రియతూర్పుసూర్యుడుఅల్పంపిత్తంగుండెవిషమ
కన్యారాశిస్త్రీద్విశ్వభావభూమిఅర్ధపగలుశీర్షంనిర్జలమానవచిత్రవర్ణందీర్ఘంశూద్రదక్షిణంబుధుడుఅల్పంవాతంపొట్టసమ
తులారాశిపురుషచరవాయునిశ్శబ్ధపగలుశీర్షంపాదమానవనీలవర్ణందీర్ఘంవైశ్యపడమరశుక్రుడుఅల్పంవాతంపొత్తికడుపువిషమ
వృశ్చికరాశిస్త్రీస్థిరజలనిశ్శబ్ధపగలుశీర్షంపాదకీటకస్వర్ణవర్ణందీర్ఘంబ్రాహ్మణఉత్తరకుజుడుఅధికంకఫంమర్మస్థానంసమ
ధనస్సురాశిపురుషద్విశ్వభావంఅగ్నిఅధికరాత్రిపృష్టఅర్ధమనుష్య, పశుకపిలసమక్షత్రియతూర్పుగురువుఅల్పంఉష్ణ, పిత్తతొడలువిషమ
మకరరాశిస్త్రీచరభూమిఅర్ధరాత్రిపృష్టపూర్ణపశు, జలచరశుక్ల, కపిలసమశూద్రదక్షిణంశనిఅల్పంవాతంమోకాళ్ళుసమ
కుంభరాశిపరుషస్థిరవాయుఅర్ధపగలుశీర్షంఅర్ధమానవబబ్రుహస్వవైశ్యపడమరశనిసమవాత, పిత్త, కఫపిక్కలువిషమ
మీనరాశిస్త్రీద్విశ్వభావజలనిశ్శబ్ధపగలుఉభయపూర్ణజలస్వచ్ఛహస్వబ్రాహ్మణఉత్తరంగురువుఅధికంకఫంపాదంసమ

నవాంశ రాశులు

నవాంశచక్రము జాతక నిర్ణయంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఉత్తరభారతదేశంలో నవాంశను ఆధారంగా చేసుకుని జాతక నిర్ణయం చేస్తారు. ఫలితాలు తుల్యంగా ఉంటాయని పండితుల అభిప్రాయం. రాశిలోని తొమ్మిది నక్షత్ర పాదాలను తొమ్మిది భాగాలుగా విభజిస్తారు. ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క రాశి ఆధిపత్యం వహిస్తుంది. మేషం, కటకం, తుల, మకరం వరుసగా నవాంశ ఆరంభ రాశులు. నవాంశను గ్రహం ఉపస్థిత రాశిని దానికి ఒక్కొక్క పాదంలో స్థానంలో ఉన్న రాశిని స్థానంలో ఉన్న రాశిని అనుసరించి నిర్ణయిస్తారు.