రూమ్ (2015 సినిమా)

రూమ్ లెని అబ్రహంసన్ దర్శకత్వంలో 2015లో విడుదలైన ఇంగ్లీష్ చలనచిత్రం. ఎమ్మా డోనోగ్చే రాసిన రూమ్ అనే నవల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం 2015 సంవత్సరపు ఉత్తమ చిత్రాలలో ఒకటిగా పేర్కొనబడింది.

రూమ్
దర్శకత్వంలెన్ని అబ్రహంసన్
స్క్రీన్ ప్లేఎమ్మా డోనోగ్యు
నిర్మాతఎడ్ గునీ, డేవిడ్ గ్రోస్
తారాగణంజాకబ్ ట్రెంబ్లే, బ్రీ లార్సన్, జోన్ అలెన్, విలియం హెచ్. మాసి
ఛాయాగ్రహణండానీ కోహెన్
కూర్పునాథన్ నుగేంట్
సంగీతంస్టీఫెన్ రెన్నిక్స్
పంపిణీదార్లుఎలివేషన్ పిక్చర్స్ (కెనడా), ఎ24 (యునైటెడ్ స్టేట్స్), యూనివర్సల్ పిక్చర్స్ (ఇంటర్నేషనల్)
విడుదల తేదీs
2015 సెప్టెంబరు 4 (2015-09-04)(టెల్లురుడే)
అక్టోబరు 16, 2015 (యునైటెడ్ స్టేట్స్)
సినిమా నిడివి
118 నిముషాలు[5]
దేశాలుకెనడా, ఐర్లాండ్[1][2][3]
యునైటెడ్ కింగ్‌డమ్
యునైటెడ్ స్టేట్స్[4]
భాషఇంగ్లీష్
బడ్జెట్$13 మిలియన్[6]
బాక్సాఫీసు$36.3 మిలియన్[7]

కథ

ఏడు సంవత్సరాలపాటు బంధీగా ఉంచబడిన బ్రీ లార్సన్ కు నిర్బంధంలోనే కుమారుడు (జాకబ్ ట్రెంబ్లే) జన్మిస్తాడు. వారూ అక్కడనుండి తప్పించుకోవడం ద్వారా ఆ బాలుడు, తాను పుట్టిన ఐదేళ్ళ తరువాత మొదటిసారి బాహ్య ప్రపంచాన్ని చూస్తాడు. ఈ చిత్రంలో జోన్ అలెన్, సీన్ బ్రిడ్జర్స్, విలియమ్ హెచ్. మాకీ నటించారు.

నటవర్గం

  • జాకబ్ ట్రెంబ్లే
  • బ్రీ లార్సన్
  • జోన్ అలెన్
  • విలియం హెచ్. మాసి
  • సీన్ బ్రిడ్జర్స్
  • టామ్ మెక్కాస్
  • అమాండా బ్రుగెల్
  • జో పింగ్యు
  • కాస్ అన్వర్
  • వెండి క్రూసన్

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: లెన్ని అబ్రహంసన్
  • నిర్మాత: ఎడ్ గునీ, డేవిడ్ గ్రోస్
  • స్క్రీన్ ప్లే: ఎమ్మా డోనోగ్యు
  • ఆధారం: ఎమ్మా డోనోగ్యు రాసిన రూమ్ నవల
  • సంగీతం: స్టీఫెన్ రెన్నిక్స్
  • ఛాయాగ్రహణం: డానీ కోహెన్
  • కూర్పు: నాథన్ నుగేంట్
  • నిర్మాణ సంస్థ: టెలిఫిల్మ్ కెనడా, ఫిలింనేషన్ ఎంటర్టైన్మెంట్, బోర్డ్ స్కాన్నాన్ హయిరేయన్ / ఐరిష్ ఫిలిం బోర్డ్, ఎలిమెంట్ పిక్చర్స్, నో ట్రేస్ క్యాంపింగ్
  • పంపిణీదారు: ఎలివేషన్ పిక్చర్స్ (కెనడా), ఎ24 (యునైటెడ్ స్టేట్స్), యూనివర్సల్ పిక్చర్స్ (ఇంటర్నేషనల్)

అవార్డులు - పురస్కారాలు

88వ [[ఆస్కార్ అవార్డు]లలో ఉత్తమ నటి అవార్డును గెలుపొందడంతోపాటు నాలుగు కేటగిరీల్లో నామినేషన్లు పొందింది. అంతేకాకుండా తొమ్మిది కెనడియన్ స్క్రీన్ అవార్డులు, బెస్ట్ మోషన్ పిక్చర్, ఏడు ఐరిష్ ఫిల్మ్ & టెలివిజన్ అవార్డ్స్, ఉత్తమ సినిమా అవార్డులు అందుకుంది. లార్సన్ ఉత్తమ నటిగా BAFTAను కూడా గెలుచుకుంది.

మూలాలు