సహెలాంత్రోపస్

సహెలాంత్రోపస్ చాడెన్సిస్ అనేది హోమినినే (ఆఫ్రికన్ కోతుల) కు చెందిన అంతరించిపోయిన జాతి. ఇది 70 లక్షల సంవత్సరాల క్రితం నాటి, మయోసీన్ కాలానికి చెందినది. ఒక పాక్షిక పుర్రెపై ఆధారపడి 2002 లో ఈ జాతిని, దాని ప్రజాతి సహెలాంత్రోపస్‌నూ ప్రకటించారు. చాద్ ఉత్తర భాగంలో కనుగొన్న ఈ పుర్రెకు టౌమాయ్ అనే పేరు పెట్టారు.

Sahelanthropus tchadensis
"Toumaï"
కాల విస్తరణ: Messinian, 7–6 Ma
PreЄ
Є
O
S
D
C
P
T
J
K
Pg
N
A ubiquitously cracked ape skull in three-quarters view, with the right side jutting out and the left side sloping in due to major warping
Cast of the skull of Toumaï
శాస్త్రీయ వర్గీకరణ edit
Kingdom:Animalia
Phylum:Chordata
Class:Mammalia
Order:Primates
Suborder:Haplorhini
Infraorder:Simiiformes
Family:Hominidae
Subfamily:Homininae
Genus:Sahelanthropus
Brunet et al., 2002[1]
Species:
S. tchadensis
Binomial name
Sahelanthropus tchadensis
Brunet et al., 2002[1]

సహేలాంత్రోపస్ చాడెన్సిస్ చింపాంజీ-మానవ వేర్పాటు కాలానికి దగ్గరలో నివసించింది. దీనికి 10 లక్షల సంవత్సరాల తరువాత నివసించిన ఓర్రోరిన్‌కు ఇది పూర్వీకుడు కావచ్చు. ఇది మానవులు, చింపాంజీలు రెంటికీ పూర్వీకుడై ఉండవచ్చు (అంటే, హోమినిని తెగ లోనిది), లేదా గొరిల్లిని తెగలో తొలి సభ్యుడై ఉండవచ్చు.

శిలాజాలు

చిన్న కపాలం, ఐదు దవడ ముక్కలు, కొన్ని దంతాలు ప్రస్తుతం లభించిన శిలాజాల్లో ఉన్నాయి. దీనికి ఉత్పన్న, ఆదిమ లక్షణాలు రెండూ ఉన్నాయి. కపాల సామర్థ్యం, కేవలం 320 సెం.మీ.3 - 380 సెం.మీ.3 మాత్రమే, ప్రస్తుత చింపాంజీల్లో ఉన్నంతే, ఉంది. దంతాలు, నుదురు గట్లు, ముఖం హోమో సేపియన్లలో కంటే బాగా విభిన్నంగా ఉన్నాయి. చదునైన ముఖం, U ఆకారపు పలువరుస, చిన్న కోర పళ్ళు, వెనగ్గా ఉన్న ఫోరమెన్ మాగ్నమ్, భారీ కంటి గట్లూ ఉన్నాయి. పోస్ట్‌క్రానియల్ అవశేషాలు ఏవీ కనబడలేదు. శిలాజంగా మారే క్రమంలోను, ఆవిష్కరణ సమయంలోనూ పుర్రె పెద్ద మొత్తంలో వంకర్లు పోయింది. [2]

కనుగోలు, పేరు

చాడ్ లోని జురాబ్ ఎడారిలో అలైన్ బూవిలైన్ అనే ఫ్రెంచి వ్యక్తి నేతృత్వంలో ఆడూమ్ మహమాత్, జిమ్‌డౌమాల్బాయ్ అహౌంటా, గాంగ్‌డైబ్ ఫానోన్ అనే ముగ్గురు చాద్ వ్యక్తులతో కూడిన నలుగురు వ్యక్తుల బృందం,ఈ శిలాజాలను కనుగొంది. [3] సహెలాంత్రోపస్ కు సంబంధించిన అన్ని శిలాజాలు 2001 జూలై, 2002 మార్చి ల మధ్య కాలం లోనే, టోరోస్-మెనాల్లా లోని మూడు స్థలాల్లో కనుగొన్నారు. వీటికి TM 266 అని (కపాలం, తొడతో సహా చాలా శిలాజాలు ఇక్కడే దొరికాయి), TM 247, TM 292 అనీ పేర్లు పెట్టారు. చింపాంజీల నుండి మానవ వంశరేఖ విడిపోయిన తరువాత ఎస్. చాడెన్సిసే అత్యంత పురాతన మానవ పూర్వీకుడని దీన్ని కనుగొన్నవారు చెప్పారు. [4]

ఈ ఎముకలు తూర్పు, దక్షిణ ఆఫ్రికాలలో కనుగొన్న మునుపటి హోమినిన్ శిలాజ స్థలాల నుండి చాలా దూరంలో ఉన్నాయి. అయితే, 1995 లోనే చాడ్‌లో మామెల్‌బే టోమల్టా, నజియా, అలైన్ బ్యూవిలైన్, మిచెల్ బ్రూనెట్, అలాడ్జీ హెచ్‌ఇ మౌతే లు ఒక ఆస్ట్రలోపిథెకస్ బహ్రెల్‌గజాలి కింది దవడను కనుగొన్నారు. [5]

బ్రూనిట్ తది. (2002), హోమినిడేలో సహేలాంత్రోపస్ (" సహెల్ మ్యాన్") ను కొత్త ప్రజాతిగా ప్రతిపాదించారు. చాడెన్సిస్ కు జాతి హోదా ఇవ్వాలని కూడా అందులోనే ప్రతిపాదించారు. [2]

దీనికి పెట్టిన టౌమాయ్ అనే పేరు డజాగా అనే సహారా భాష లోనిది. జీవితేచ్ఛ అని దీనికర్థం. ఈ పేరును చాడ్ అధ్యక్షుడు ఇడ్రిస్ డెబీ సూచించాడు. ఈ ప్రాంతానికి చెందిన, హిస్సేన్ హబ్రేకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో మరణించిన తన సహచరులలో ఒకరికి గౌరవసూచకంగా ఈ పేరును ఎంచుకున్నానని డెబి వివరించాడు. [6]

రెండు కాళ్ళపై నడక

సహేలాంత్రోపస్ చాడెన్సిస్ రెండు కాళ్ళపై నడిచి ఉండవచ్చు. అయితే, పుర్రె క్రింద ఉండే ఎముకలేవీ కనబడనందున, అది ద్విపాదా కాదా అనేది ఖచ్చితంగా తెలియదు. ఫోరామెన్ మాగ్నమ్ (వెన్నెపాము వెళ్ళి పుర్రెలో కలిసే చోట ఉండే రంధ్రం) ముందుకు జరిగి ఉండటాన, అది ద్విపాది అయి ఉండవచ్చనే వాదన లున్నాయి. ప్రాధమిక అధ్యయనంలో ఫోరామెన్ మాగ్నమ్‌ను పరిశీలించిన తరువాత, రెండు కాళ్ళపై నడిచేదని అనుకోవడం కారణరహితమేమీ అవదు అని అన్నాడు. [2] కొంతమంది పాలియోంటాలజిస్టులు ఈ వ్యాఖ్యానాన్ని ఖండిస్తూ, పుర్రె, దంత, ముఖ లక్షణాలు హోమినిన్ లాగ లేవని, ఇవి ద్విపాద నడకకు సూచికలు కావనీ పేర్కొంది; [7] కోరపళ్ళలో ఉన్న అరుగుదల, ఇతర మయోసీన్ కాలపు వాలిడుల పళ్ళ అరుగుదల మాదిరిగానే ఉందని పేర్కొంది. ఇంకా, ఇటీవలి సమాచారం ప్రకారం, ఈ కపాలం దొరికిన ప్రదేశానికి దగ్గర లోనే, ఒక హోమినిడ్ తొడ ఎముక లాంటిది కూడా కనబడింది-కాని ఈ విషయాన్ని ప్రచురించలేదు. [8]

2018 లో, యూనివర్శిటీ ఆఫ్ పోయిటియర్స్, మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ ఆఫ్ పారిస్, [9] లోని మానవ శాస్త్రవేత్త రాబర్టో మాకియారెల్లి, కొత్తగా లభించిన ఈ తొడ ఎముక గురించిన సమాచారాన్ని మిచెల్ బ్రూనెట్, అతని ప్రయోగశాల వారూ కలిసి తొక్కిపెట్టారనే అనుమానాన్ని వెలిబుచ్చాడు. [10] తొడ ఎముక గురించి బయటకు వస్తే టౌమాయ్ రెండు కాళ్ళ నడకపై అనుమానాలు తలెత్తుతాయనే భయమే ఇందుకు కారణమని అతడు సూచించాడు. [11] [12] [13] [14]

ఇవి కూడా చూడండి

మూలాలు

వనరులు

బయటి లింకులు