సెయింట్ పాల్

తొలినాళ్ళ క్రైస్తవ అపోస్తలుడు, మత ప్రబోధకుడు

అపోస్తలుడైన పౌలు (Latin: Paulus; Greek: Παῦλος, romanized: Paulos; Coptic: c. 5 – c. 64 or 67), పరిశుద్ధుడైన పౌలుగా కూడా ప్రసిద్ధి చెందిన, యూదు పేరైన తార్సు వాడైన సౌలుగా (Hebrew: שאול התרסי‎, romanized: Sha'ūl ha-Tarsī; Greek: Σαῦλος Ταρσεύς, romanized: Saũlos Tarseús) [1][2][3] కూడా పిలువబడిన ఒక అపోస్తలుడు (12 మంది క్రీస్తు శిష్యులలో ఒకడు కాకపోయినప్పటికిని). 

అపోస్తలుల యుగములో ప్రముఖుడుగా.[4] పరిగణించబడియున్న ఈయన క్రీస్తు సువార్తను మొదటి శతాబ్దములో విరివిగా ప్రకటించి, సా.శ. (AD) 30 - 50[5][6] మధ్యలో చిన్న ఆసియా ఐరోపాలలో అనేక క్రైస్తవ సంఘములను స్థాపించాడు. యూదునిగా, రోమా పౌరసత్వము కలిగి ఉండుట అను విశిష్ట అర్హతలను ఆధారము చేసుకొని యూదులు, రోమా పౌరుల మధ్యలో విస్తృతమైన పరిచర్య చేసాడు. బైబిల్ లోని  నూతన నిబంధనలోని అపోస్తలుల కార్యములు (8,9 అధ్యాయములు) అను పుస్తకములో ప్రస్తావించబడిన రీతిగా,  పౌలుకు క్రీస్తు దర్శనము కలుగక ముందు (తన హృదయపు మార్పునకు ముందు) యెరుషలేములో  ఇంటింట జొచ్చి, క్రీస్తు శిష్యులైన పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. దమస్కులోని క్రీస్తు శిష్యులను బంధించి యెరూషలేమునకు తీసికొని వచ్చుటకు యెరూషలేము నుండి దమస్కుకు [7] వెళ్ళుచున్న మార్గములో క్రీస్తు ఒక గొప్ప వెలుగులో అతనికి ప్రత్యక్షమయ్యెను. పౌలు తన చూపు కోల్పోయి, తిరిగి 3 రోజుల తర్వాత అననీయ అను క్రీస్తు శిష్యుడు ప్రార్ధింపగా దృష్టి పొందెను. అటు తర్వాత పౌలు నజరేయుడైన యేసే యూదులు ఎదురుచూస్తున్న మెస్సీయా అనియు ఆయన దేవుని కుమారుడనియు ప్రకటించుట మొదలు పెట్టెను.[8] 'అపోస్తలుల కార్యములు' పుస్తకములో ఇoచుమించు అర్ధభాగము పౌల యొక్క జీవితమును, ఆయన పరిచర్యను గూర్చి వ్రాయబడెను.

బైబిల్ లోని  నూతన నిబంధనలోని 27 పుస్తకములలో 13 పుస్తకములు పౌలు గారిచే వ్రాయబడినవిగా క్రైస్తవ పండితులు గుర్తించారు. అందులో 7 పత్రికలు పౌలు రచనలుగా అందరు క్రైస్తవ పండితులు అంగీకరించగా, మిగిలిన 6 పత్రికలను గూర్చి క్రైస్తవ పండితులలో భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికిని  అధికులు మాత్రము పౌలు రచనలుగానే గుర్తించారు. కొంతమంది క్రైస్తవ పండితులు ఈ 6 పత్రికలు పౌలు గారి పేరు మీద ఆయన యొక్క పూర్వ ప్రతులను ఉపయోగించి ఆయన అనుచరులు వ్రాసినవిగా విశ్వసిస్తారు.[4][5][9] మరి కొంతమంది పండితులు అవి పూర్తిగా వేరే తెలియని రచయిత రాసినవి అని అంటారు. కానీ, ఆ వాదనలు చాల సమస్యలు  సృష్టించినవి.[10]. పౌలు యొక్క రచనగా హెబ్రీయులకు[11]  వ్రాసిన పత్రికలో ఎక్కడా ప్రస్తావించబడకపోవుట వలన, స్పష్టమైన సమాచారము లేకపోవుట వలన 2వ, 3వ శతాబ్దములలో[12] ఇది పౌలు పత్రికగా గుర్తించబడనప్పటికిని, 5 నుండి 16 వ శతాబ్దము వరకు ఈ పత్రిక పౌలు 14వ రచనగానే అధికులు విశ్వసించారు.  కానీ అప్పటి నుండి ఇప్పటివరకు క్రైస్తవ పండితులు మాత్రము ఇది గుర్తు తెలియని రచయితచే వ్రాయబడిన పత్రికగానే పరిగణించుచున్నారు .[13]

ఈ రోజుల్లో, పశ్చిమ ప్రొటెస్టెంట్ & లాటిన్ సంప్రదాయాల, తూర్పు ఆర్థొడాక్ష్ & ఈస్ట్రన్ కాథొలిక్ సంప్రదాయాల వేదాంత విద్య, ఆరాధన, కాపరి యొక్క జీవితములలో పౌలు గారి యొక్క పత్రికలు కీలక భూమిక పోషిస్తున్నాయి.   క్రైస్తవ విశ్వాసమును వ్యాప్తి చేయుచున్నటువంటి అపోస్తలులు, మిషనరీల మధ్యలో పరివ్యాప్తి చెందినటువంటి క్రైస్తవ అలోచనా ధోరణి, ఆచరణాత్మకమైన వ్యక్తిత్వము పౌలు గారి బోధనల ప్రభావమే.  మార్టిన్ లూధర్ యొక్క పౌలు రచనల వ్యాఖ్యానము, లూధర్ సిద్ధాంతము అయిన sola fideను ప్రభావితము చేసింది.  

మూలాలు

వెలుపలి లంకెలు