అన్నవాహిక

అన్నవాహిక, ఆహారవాహిక, అన్ననాళం, ఆహారనాళం (ఆంగ్లం: Esophagus) ఒక కండరాలతో చేయబడిన నాళము. ఇది ఆహారాన్ని గొంతు నుండి జీర్ణకోశానికి చేర్చుతుంది.ఇది ఇంచుమించు 25 సెం.మీ. పొడవుంటుంది. దీని చివరిభాగం ఉదరంలో ఉంటుంది.

అన్నవాహిక
Head and neck.
Digestive organs. (Esophagus is #1)
లాటిన్œsophagus
గ్రే'స్subject #245 1144
ధమనిesophageal arteries
సిరesophageal veins
నాడిceliac ganglia, vagus[1]
PrecursorForegut
MeSHEsophagus
Dorlands/Elseviere_16/12343479

నిర్మాణము

The esophagus is constricted in three places.

అన్నవాహికలోని ముఖ్యమైన భాగాలు:[2]

  • ఉపకళా కణజాలము
  • కండరాలు:
    • ప్రధమ భాగం: చారల కండరాలు
    • మధ్య భాగం నునుపు కండరాలు, చారల కండరాలు,
    • మూడవ భాగం: ప్రధానంగా నునుపు కండరాలు.

పనులు

ఆహారాన్ని మ్రింగుట

అన్నవాహిక మానవుని జీర్ణవ్యవస్థలోని మొట్టమొదటి భాగము. మనం భుజించిన ఆహారం నోటిలో నుండి క్రిందికి జారి మ్రింగుట ద్వారా ఫారింక్స్ లోనికి ఆ తర్వాత అన్నవాహికలోనికి ప్రవేశిస్తుంది. అన్నవాహిక ద్వారా కదలిన ఆహారం జీర్ణకోశం చేరుతుంది.[3] మనం ఆహారాన్ని మ్రింగినప్పుడు ఎపిగ్లాటిస్ వెనుకకు గొంతును కప్పివుంచుతుంది. అందువలన ఆహారం శ్వాసమార్గాలలోకి ప్రవేశించకుండా నిరోధించబడుతుంది. అదే సమయంలో అన్నవాహిక ముందుభాగంలోని కండరాలు వ్యాకోచించి, ఆహారం అందులోనికి ప్రవేశించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అన్నవాహిక కండరాల సంకోచ వ్యాకోచాల మూలంగా ఆహారం క్రమంగా క్రిందికి కదలుతుంది. ఆ సమయంలోనే అన్నవాహిక క్రిందభాగంలోని కండరాలు వ్యాకోచించి ఆహారం అన్నకోశంలోని ప్రవేశించడానికి తోడ్పడుతుంది.[3]

అన్నకోశపు ఆమ్లాలు వెనుకకు రాకుండా నిరోధించుట

జీర్ణకోశం చాలా గాఢమైన ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. జీర్ణకోశపు స్రావాలలో హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో పాటు, పొటాషియం క్లోరైడు, సోడియం క్లోరైడు లవణాలు ఆహారం జీర్ణం కావడానికి ఉపకరిస్తాయి. అన్నవాహిక క్రింది భాగంలోని కండరాలు సంకోచించడం వలన ఈ జీర్ణకోశ స్రావాలు వెనుకకు తిరిగి ప్రవేశించకుండా నిరోధించబడతాయి. ఇదే కాకుండా ఆ ప్రాంతంలోని లఘుకోణం, డయాఫ్రం కండరాలు కూడా ఇందులో కొంత పాత్ర పోషిస్తాయి.[3][4]

వ్యాధులు

  • గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్ వ్యాధి: జీర్ణకోశం లోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం పైకి రావడం మూలంగా అన్నవాహిక వాచి అల్సర్ లు ఏర్పడవచ్చును.
  • అన్నవాహిక కండరాలు అధికంగా స్పందించి మనం తినే ఆహారానికి అడ్డం పడే అవకాశం ఉంది.
  • శిలీంద్రాల మూలంగా కూడా అన్నవాహిక వాపు ఏర్పడి, రక్తస్రావం కలుగువచ్చును.
  • అన్నవాహిక కండరాల నుండి ట్యూమర్లు ఏర్పడవచ్చును. వీటిలో ముఖ్యమైనది లియోమయోమా.
  • అన్నవాహిక కాన్సర్ అన్నింటి కన్నా ప్రమాదకరమయినది. ప్రారంభంలో ఆహారం మింగడానికి కష్టం కలిగించి, చివరి దశలో పూర్తిగా ద్రవాలతో సహా వేటినీ తిననీయకుండా చేసి ఉపవాసంతో మనిషిని చంపేస్తుంది.

మూలాలు