అప్పడం

sinhal

అప్పడం ఒక భారతీయుల తిండి పేరు. దీన్ని భారతదేశం, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో అన్నంతో పాటు వడ్డిస్తారు. భారతదేశంలో అనేకమంది మహిళలు అప్పడాల వ్యాపారం ద్వారా ఉపాధి పొందుతున్నారు.

అప్పడం
బెంగుళూరులో పనసపండుతో చేసిన అప్పడం
మూలము
ఇతర పేర్లుఅప్పళం, పాపడ్
మూలస్థానంభారత ఉపఖండం
ప్రదేశం లేదా రాష్ట్రందక్షిణ ఆసియా ప్రాంతం
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు కంది పప్పు, ఉద్ది పప్పు, బఠాణీలు, బియ్యప్పిండి
వైవిధ్యాలుబియ్యం, సగ్గుబియ్యం అప్పడం, బంగాళాదుంప అప్పడం, మసాలా అప్పడం, వెల్లుల్లి అప్పడం, అల్లం అప్పడం

కావలసిన పదార్థాలు

మినప అప్పడాలు
అప్పడాలు

అప్పడాలను రకరకాలైన పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. వీటిలో అత్యంత సాధారణమైనది మినప పిండి. మినప పిండిని మిరియాల పొడి,, ఉప్పుతో కలిపి కొద్ది కొద్దిగా నీళ్ళు కలిసి చపాతీ పిండి కలిపినట్లుగా నెమ్మదిగా కలుపుతారు. ఇలా తయారైన మిశ్రమాన్ని గుండ్రంగా, పలుచటి పొరల్లాగా రుద్ది, ఎండబెడతారు. ఎండబెట్టిన తరువాత భద్ర పరుస్తారు. మినప పిండే కాకుండా ఇందులో బియ్యప్పిండి, ఎండబెట్టిన పనస తొనలు, సగ్గుబియ్యం లాంటి వాటిని కూడా వాడుతుంటారు. మిరియాలు, మిరప పొడి, ఇంగువ, జీలకర్ర, నువ్వులు లాంటివి ఫ్లేవర్ కోసం వాడతారు.

వ్యాపారం

భారతదేశంలో అప్పడాల తయారీ వ్యాపారంలో అనేకమంది మహిళలు ఉపాధి పొందుతున్నారు.[1] మహిళలు సొంతంగా,, బృందాలుగా ఏర్పడి అప్పడాలు, పచ్చళ్ళు, ఇతర చిరుతిళ్ళు తయారు చేయడం ద్వారా ఆదాయాన్ని పొందుతుంటారు. తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాల్లో ఇదొకటి.

మూలాలు