అరబ్బీ భాష

అరబ్బీ (అరబ్బీ : الْعَرَبيّة ) (అల్-అరబియ్య) లేదా (అరబ్బీవ్: عَرَبيْ ) అరబి / అరబీ / అరబ్బీ ) సామీ భాషాకుటుంబంలో సజీవంగానున్న అతి పెద్ద భాష. ఇది హీబ్రూ, అరమాయిక్ భాషలకు దగ్గరగా వుంటుంది. నవీన అరబ్బీ భాష 27 రకాలుగా అరబ్ భూభాగంలో మాట్లాడబడుచున్నది. భాషాపరంగా ఇస్లామీయ ప్రపంచంలో ఉపయోగించబడుచున్నది.

అరబ్బీ భాష
العربية 
అల్-అరబియ్య అరబ్బీ 'నస్ఖ్' లిపిలో వ్రాయబడినది:
 
ఉచ్ఛారణ:/ అల్ అర బియ్ య /
మాట్లాడే దేశాలు:అల్జీరియా, బహ్రయిన్, ఈజిప్టు, ఇరాక్, జోర్డాన్, కువైట్, లెబనాన్, లిబియా, మారిటానియా, మొరాకో, ఒమన్, పాలస్తీనా పాలస్తీనా ప్రాంతాలు, కతర్, సౌదీ అరేబియా, సూడాన్, సిరియా, ట్యునీషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పశ్చిమ సహారా, యెమన్, మెజారిటీగా; ఇస్లాం యొక్క సాహితీ భాష. 
ప్రాంతం:అరబ్ ప్రపంచం
మాట్లాడేవారి సంఖ్య:ప్రాదేశికంగా 186 , 422 మిలియన్ మంది మాట్లాడేవారున్నారు.[1] According to Ethnologue, 246 million including second language speakers, (1999 est). 
ర్యాంకు:2 [2] to 6[3] (native speakers)
భాషా కుటుంబము:
 సామి
  పశ్చిమ సామి
   మధ్య సామి
    అరబ్బీ భాష 
వ్రాసే పద్ధతి:అరబ్బీ వర్ణమాల 
అధికారిక స్థాయి
అధికార భాష:
List
నియంత్రణ:ఈజిప్టు: కైరో లోని అరబ్బీ భాష అకాడెమి

సిరియా: డెమాస్కస్ లోని అరబ్ అకాడెమి (అత్యంత ప్రాచీనమైన)
ఇరాక్: ఇరాకీ సైన్స్ అకాడెమీ
సూడాన్: ఖార్టూమ్ లోని అరబ్బీ భాష అకాడెమి
మొరాకో: రబాత్ లోని అరబ్బీ భాష అకాడెమి (అత్యంత క్రియాశీలక)
జోర్డాన్: జోర్డాన్ అరబ్బీ అకాడెమి
లిబియా: Academy of the Arabic Language in Jamahiriya
ట్యునీషియా: en:Beit Al-Hikma Foundation
ఇజ్రాయెల్: అరబ్బీ భాషా అకాడెమీ. (నాన్-అరబ్ దేశంలో మొదటిది)[1]

భాషా సంజ్ఞలు
ISO 639-1:ar
ISO 639-2:ara
ISO 639-3:ara — Arabic (generic)
see అరబ్బీ రకాలు for the individual codes 

అరబ్బీ భాష ప్రధానంగా 'అధికారిక భాష' గల ప్రాంతాలు (ఆకుపచ్చ రంగులో) , అనేక భాషలలో ఒక భాషగా 'అరబ్బీ భాష' గల ప్రాంతాలు (నీలం రంగులో)

నవీన అరబ్బీ సాంస్కృతిక అరబ్బీ నుండి ఉధ్బవించింది, సా.శ. 6వ శతాబ్దంనుండి పురాతన ఉత్తర అరేబియా ప్రాంతంలో సాంస్కృతిక భాషగా విరాజిల్లిన అరబ్బీ 7వ శతాబ్దంలో సాంస్కృతిక, మతపరమైన భాషగా నేటికినీ వాడుకలోయున్నది.

అరబ్బీ భాష అనేకమైన తన పదాలను ఇతరభాషలకు ప్రసాదించింది. ముఖ్యంగా లాటిన్, ఐరోపా భాషలకు. దీనికి ప్రతిఫలంగా ఎన్నోభాషలనుండి పదాలను పొందింది. ఉర్దూ భాషలో కూడా అరబ్బీ పదాలు మెండుగా కనిపిస్తాయి.

భారతదేశంలో అరబ్బీ భాష

భారతదేశంలో అరబ్బీ భాష మాట్లాడేవారి సంఖ్య తక్కువగా వున్ననూ, ఈ భాష చదవడం, కొద్దిగా అర్థం చేసుకునేవారి సంఖ్య బాగా కనిపిస్తుంది."ఇబాద" ప్రార్థనల కొరకు ముహమ్మద్ ప్రవక్త వాడిన భాష ఈ అరబ్బీ, కావున షరియాను అనుసరించే ముస్లింలు ఆచరించే నమాజు, దుఆలు ఈ భాషలోనే కానవస్తాయి. ముస్లింల ధార్మిక గ్రంథం అయినటువంటి ఖురాన్ ఈ భాషలోనే ఉన్నది కావున, ఖురాన్ పఠించే వారంతా 'అరబ్బీ భాష' (కనీసం పఠించుటకు) నేర్చుకుంటారు. భారతదేశంలో దాదాపు 50,000 మంది అరబ్బీ మాతృభాషగా గలవారున్నారని అంచనా. అంతేగాక, భారతదేశంలోని అనేక విశ్వవిద్యాలయాలలో అరబ్బీ భాష డిపార్ట్‌మెంట్లు గలవు. ఉదాహరణకు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం.

భాష

[4]

తెలుగుఅరబ్బీతెలుగు లిప్యాంతరీకరణరోమన్ ఉచ్ఛారణ
తెలుగు
ఇంగ్లీషుالإنكليزيةఅల్-ఇంగ్లీజియా/alingliːziːjah/
అవునుنعمనఆమ్/naʕam/
లేదుلاలా/laː/
స్వాగతం, నమస్తేأهلاً (గ్రాంధికం "సుస్వాగతం") or مرحبًا (వ్యవహారికం)అహ్‌లన్ లేదా మర్హబన్/ahlan/ or /marħaban/
Goodbyeمع السلامةమా అల్-సలామ/maʕ assalaːmah/ (గ్రాంధికంగా 'శాంతి తో')
దయచేసిأرجوكఅర్‌జుక్/ʔardʒuːk/
ధన్యవాదాలుشكرًاషుక్రన్/ʃukran/
మీకు స్వాగతం / దయచేయండిعفوًاఅఫ్‌వన్/ʕafwan/
మన్నించండి / క్షమించండిآسفఆసిఫ్/ʔaːsif/
మీ పేరేమిటి?ما إسمكమా ఇస్‌ముక్/maː ismuka/
ఎంత?بكام؟బికామ్?/bikam/
నాకర్థం కాలేదుلا أفهمలా అఫ్‌హామ్/laː ʔafham/
నేను అరబ్బీ మాట్లాడలేనుلا أتكلم العربيةలా అతకల్లము అల్-అరబియా/ʔanaː laː ʔatakallam ulʕarabijja/
నాకు తెలియదుلا أعرفలా ఆరిఫ్/laː ʔaʕarif/
నాకు ఆకలేస్తుందిأنا جائعఅనా జాయినున్/ʔanaː dʒaʔiʕun/
నారింజبرتقاليబుర్తుఖాలి/burtuqaːliː/
నలుపుأسودఅస్వద్/ʔaswadu/
ఒకటిواحدవాహిద్/waːħid/
రెండుإثنانఇత్నాన్ / ఇస్నాన్/iθnaːn/
మూడుثلاثةసలాస/θalaːθah/
నాలుగుأربعةఅరబా/ʔarbaʕa/
ఐదుخمسةఖంసా/xamsah/

ఇవీ చూడండి

పాదపీఠికలు

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా