కిలోబైట్

కిలోబైట్ (కేబీ) అనగా డిజిటల్ సమాచార పరిమాణం తెలుపు ప్రమాణం. ఇది అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి కిలో అనే ప్రత్యయము బైట్ తో చేర్చడం వలన ఉద్భవించింది. ఇది కంప్యూటర్ల సమాచారం స్థాయిని, భద్రపరిచే పరిమాణాన్ని సూచించడానికి ఉపయోగ పడుతుంది. అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ ప్రకారం కిలో అనగా 1000 (103). అందువలన కిలో బైట్ అనగా 1000 బైట్లక్ సమానం.[1] అంతర్జాతీయంగా కిలో బైట్ ను kB గా సూచించాలని ప్రతిపాదించడమైనది. [1]

5¼-అంగుళాల ఫ్లాపీ డిస్క్

సాధారణంగా కంప్యూటర్లలో ద్విసంఖ్యామానం ఉపయోగించడం వలన 210 = 1024 ≈ 1000 సంఖ్యాత్మకంగా పరిగణించబడింది. కిలోబైట్ ను సాధారణంగా KB , K లుగా సూచిస్తారు. (K అనగా కిలోగా భావించవచ్చు).

ఉదాహరణలు

  • సుగర్త్ కంపెనీ SA-400 5¼ - అంగుళాల ఫ్లాపీ డిస్క్ (1976) లో ఫార్మాట్ కాని 109,375 బైట్లతో తయారుచేసి,[2] దాని ప్రకటలలో "110 Kbyte" అని తెలియజేసింది. ఇక్కడ 1000 గుణకాలను ఉపయోగించారు.[3] అదే విధంగా 8 అంగుళాల DEC RX01 ఫ్లాపీ (1975) ఫార్మాట్ చేయబడిన 256,256 బైట్ల పరిమాణంతో తయారుచేసి ప్రకటనలలో "256k" అని తెలియజేసారు.[4] మరొకవైపు టాండన్ 5¼- అంగుళాల DD ఫ్లాపీ ఫార్మాట్ (1978) 368,640 బైట్లతో తయారుచేసి, వాణిజ్య ప్రకటనలో "360 KB" అని తెలియజేసింది. ఇందులో 1024 గుణకాలను ఉపయోగించారు.
  • నవీన వ్యవస్థలలో మైక్రోసాఫ్ట్ విండోస్ (2019 ప్రకారం) 1024 చే భాగించి 65,536-బైట్ల ఫైల్ ను "64KB" గా సూచిందింది.[5]
  • ద్విసంఖ్యా విధానాన్ని ప్రస్తుతం మార్కెటింగ్ లో కొన్ని టెలీ కమ్యూనికేషన్స్ సంస్థలు (వొడాఫోన్,[6] AT&T, ఆరెంజ్,[7] టెల్‌స్ట్రా[8] వంటివి) ఉపయోగిస్తున్నాయి.

మూలాలు