క్రిస్టియానో రోనాల్డో

క్రిస్టియానో రొనాల్డో డాస్ శాంటాస్ అవీరో (జననం 5 ఫిబ్రవరి 1985) పోర్చుగల్ దేశానికి చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు. అతను పోర్చుగల్ జాతీయ జట్టుకు 2003 నుండి కెప్టెన్‌. రొనాల్డో [[మాంచెస్టర్ యునైటెడ్]కి ఫార్వార్డ్‌ స్థానంలో ఆడుతాడు. తరచుగా ప్రపంచంలోని అత్యుత్తమ గొప్ప ఆటగాళ్ళలో ఒకడిగా పరిగణింపబడుతూ ఉంటాడు. [1] రొనాల్డో ఐదు బ్యాలన్ డి ఓర్ అవార్డులు ఇంకా నాలుగు యూరోపియన్ గోల్డెన్ షూస్‌ను గెలుచుకున్నాడు. ఈ రెండూ రికార్డులు సాధించిన ఏకైక ఐరోప ఆటగాడు. అతను తన కెరీర్‌లో 30 ప్రధాన ట్రోఫీలను గెలుచుకున్నాడు, వాటిలో ఏడు లీగ్ టైటిల్స్, ఐదు UEFA ఛాంపియన్స్ లీగ్స్, ఒకటి UEFA యూరోపియన్ ఛాంపియన్‌షిప్, ఒకటి UEFA నేషన్స్ లీగ్ టైటిల్స్ ఉన్నాయి. రొనాల్డోకు UEFA ఛాంపియన్స్ లీగ్ చరిత్రలో అత్యధిక గోల్స్ (134), అత్యధిక అసిస్ట్ (41) రికార్డులు కలిగి ఉన్నాయి. [2] క్లబ్, దేశం కోసం 750 కి పైగా సీనియర్ కెరీర్ గోల్స్ చేశాడు. [3] అతను 100 అంతర్జాతీయ గోల్స్ ఘనత సాధించిన రెండవ ఆటగాడు, ఐరోపా దేశాలలో మొదటివాడు. [4]

క్రిస్టియానో రొనాల్డో (2018)

మూలాలు