గద్దలు (పక్షిజాతి)

గద్దలు
White-tailed Eagle in flight
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
ఏనిమేలియా
Phylum:
ఖార్డేటా
Class:
Order:
ఫాల్కనీఫార్మిస్
Family:
ప్రజాతులు

Several, see text.

గద్దలు

తెలుగు రాష్ట్రాలలో గద్ద లేదా గ్రద్ద అన్న పేరుతో చలామణీ అవుతున్న పక్షిని ఇంగ్లీషులో kite అంటారు. ( సంస్కృతం: గృధ్రము). ఈ జాతి పక్షులు అనేకం వివిధమైన పేర్లతో పిలవబడుతున్నాయి. దరిదాపు ఇవన్నీ ఫాల్కనీఫార్మిస్ క్రమంలో ఏక్సీపెట్రిడే కుటుంబానికి చెందినది.

ఇందులోని సుమారు 60 జాతులలో ఎక్కువగా యూరేసియా, ఆఫ్రికా ఖండాలలో కనిపిస్తాయి.[1] రెండు జాతులు (బాల్డ్ గద్దలు, గోల్డెన్ గద్దలు) మాత్రమే అమెరికా, కెనడా లలో, తొమ్మిది జాతులు మధ్య అమెరికా, దక్షిణ అమెరికా లలోను, మరి మూడు జాతులు ఆస్ట్రేలియాలోను కనిపిస్తాయి.

ఉదాహరణకి గద్దలలో కొన్ని జాతులు (species):

  • గ్రద్ద (black kite)
  • అడవి రామదాసు, నల్ల-రెక్కల గద్ద (black-winged kite, Elanus caeruleus). ఇది చిన్న పరిమాణం ఉన్న దివాచరి (diurnal) పక్షి. ఇది సాధారణంగా మైదానాల మీద ఎగురుతూ కనబడుతుంది.
  • నల్ల-భుజాల గద్ద (black-shouldered kite, Elanus axillaris) ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది.
  • తెల్ల-తోక గద్ద (white-tailed kite, Elanus leucurus) ఉత్తర, దక్షిణ అమెరికాలలో కనిపిస్తుంది.

గద్దని పోలిన ఇతర పక్షులు

గద్దని పోలిన పక్షులు చాలా ఉన్నాయి. ఉదాహరణకి కొన్ని ఇంగ్లీషు పేర్లు, వాటితో సమానార్థకాలైన కొన్ని తెలుగు పేర్లు:

  • kite, n. గద్ద; గృధ్రము;
  • hawk, n. డేగ; జాలె; కురుజు; వేసడం; ఒరణం;
  • harrier, n. పిల్లి గద్ద[2] (pallid harrier)
  • eagle, n. గూళి;
  • eaglet, n. గూళి పిల్ల;
  • buzzard, n. శరారి; రామశాంక[3];
  • falcon, n. సాళువ; బైరిపక్షి; భైరవ డేగ;
  • vulture, n. రాబందు; బోరువ; తెల్ల గద్ద; పీతిరిగద్ద;
  • osprey, n. సముద్రపు డేగ; మీను డేగ; నీటి డేగ; (sea hawk, river hawk, or fish hawk).

ఈ పక్షుల గురించి మరికొన్ని వివరాలు:

RaptorialSilhouettes
  • గద్ద (kite). పరిమాణంలో ఇది మధ్యస్థంగా ఉండే పక్షి. రెక్కలు పొడుగ్గానే ఉంటాయి కాని కాళ్లల్లో శక్తి తక్కువ. గాలిలో ఎగురుతూ పల్టీలు కొట్టడంలో ప్రవీణురాలు. ఎక్కువ కాలం గాలిలో తేలియాడుతూ, పచార్లు చేస్తూ ఉంటుంది. తోక చివర కొద్దిగా చీలి ఉంటుంది. ప్రాణంతో ఉన్న కశేరుకాలని (vertebrates) వేటాడి తినడానికి ఇష్టపడతాయి. కాని అప్పుడప్పుడు చిన్నచిన్న పురుగులని, చచ్చిన జంతువులని కూడా తింటాయి.
  • డేగ (hawk). ఇది చిన్న, పెద్దలకి మధ్యస్థంగా ఉండే పక్షి. ఇది తుప్పలు, చెట్లు (woodlands) ఉన్న ప్రదేశాలలో చాటుమాటున ఉండి అకస్ంత్తుగా, జోరుగా ఎర మీదకి దూకుతూకనిపిస్తుంది. తోక పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఆకాశంలో ఎగురుతూన్నప్పుడు ఒక్క పెట్టున దిశ మార్చగలదు. ఎగిరే తీరులో రెక్కలు తాటించడం కొంత సేపు, రెక్కలని నిలకడగా ఉంచి పయనించడం (gliding) కొంత సేపు. డేగలు ఎలకలని, చుంచులని, చిన్న పిట్టలని వేటాడి తింటాయి.
  • గూళి (eagle). ఇది డేగ కంటే బాగా పెద్దది, శక్తిమంతమైనది. ఇది చాల పెద్ద పక్షి. దీని రెక్కల విస్తృతి కూడా బాగా ఎక్కువ. పటిష్ఠమైన కాళ్లు, బలమైన పాదాలు. ఇవి చాల ఎత్తుగా ఎగురుతూ, రెక్కలని నెమ్మదిగా ఆడిస్తూ కనబడతాయి. ఇది వేటాడి చేపని తినడానికి ఇష్టపడినా, అప్పుడప్పుడు చిన్న చిన్న జంతుజాలాన్ని, పిట్టలని కూడా తింటుంది. ఇది వేటాడే పక్షే అయినా అవకాశాన్నిబట్టి ఇతరులు వేటాడిన ఎరని దొంగిలించి కాని, చచ్చి కుళ్లుతూన్న ప్రాణులని కాని తింటుంది.
  • సాళువ (falcon) డేగ కంటే చిన్నగా, సన్నగా ఉంటుంది. డేగ కంటే జోరుగా ఎగురుతుంది.
  • రాబందు (vulture):
  • సముద్రపు డేగ (osprey): ఇది దివాచరి (diurnal). దీని సంచార పరిధి సార్వజనికం (cosmopolitan). ఈ వేట పక్షి (raptor) 60 సెంటీమీటర్లు పొడుగు ఉంటుంది. రెక్కలు విచ్చుకున్నప్పుడు ఈ చివర నుండి ఆ చివరకి 180 సెంటీమీటర్లు ఉంటుంది.చేపలని వేటాడి తినడానికి సుముఖత చూపుతాయి.

మూలాలు