జియో

భారత టెలికమ్యూనికేషన్ కంపెనీ

జియో లేదా రిలయన్స్ జియో అనునది రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఒక అనుబంధ పరిశ్రమ. వీరు అతి చౌకగా భారతదేశంలో మొబైల్, డాటా సేవలను ఆరంభించి ఈ రంగంలో పోటీకి తెరలేపారు.

జియో
తరహాఅనుబంధ పరిశ్రమ
స్థాపన
ప్రధానకేంద్రమునవీ ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
కీలక వ్యక్తులుసంజయ్ మష్రువాల(నిర్వాహక సంచాలకుడు)
జ్యోతీంద్ర ధాకర్ (IT అధ్యక్షుడు)
ఆకాశ్ అంబానీ (వ్యూహరచన ముఖ్యుడు) [1]
పరిశ్రమదూరప్రసారం
ఉత్పత్తులు
మై జియో
జియో చాట్
జియో ప్లే
జియో బీట్స్
జియో మనీ
జియో డ్రైవ్
జియో ఆన్ డిమాండ్
జియో సెక్యూరిటీ
జియో జాయిన్
జియో మాగ్స్
జియో ఎక్స్‌ప్రెస్ న్యూస్
జియోనెట్ వైఫై
మాతృ సంస్థరిలయన్స్ ఇండస్ట్రీస్
అనుబంధ సంస్థలుLYF

సాంకేతిక పరిజ్ఞానం

మాట్లాడుకోవడానికి చెల్లించక్కర్లేదు.. డేటాకు మాత్ర మే చెల్లించండి ఇదీ రిలయన్స్‌ జియో వ్యాపార సూత్రం. అదెలా సాధ్యమో తెలుసుకోవాలంటే.. వీవోఎల్‌టీఈ పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అన్ని టెలికం కంపెనీలు వాయిస్ కాల్స్‌ కోసం వాడుతున్న పరిజ్ఞానం.. సర్క్యూట్‌ స్విచింగ్‌. ఈ విధానంలో ఒక ఫోన్‌ నుంచి రెండో ఫోన్‌కు కాల్‌ వెళ్లినప్పుడు రెండు నెట్‌వర్క్‌ నోడ్‌ల మధ్య కనిపించని ఒక సమాచార మార్పిడి వ్యవస్థ (సర్క్యూట్‌) ఏర్పడుతుంది. కాల్‌ ఒకరి నుంచి మరొకరికి వెళ్లాలంటే ఆ సిగ్నల్‌ పలు స్విచ్‌లను(స్విచ్‌ అంటే మన ఫోన్‌ నుంచి ఇన్‌పుట్‌ సిగ్నల్‌ను తీసుకుని రిసీవర్‌కు అవుట్‌పుట్‌ సిగ్నల్‌ను పంపే పరికరం) దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఈ విధానాన్ని కేవలం వాయిస్‌ కాల్స్‌ చేయడానికి మాత్రమే వినియోగించుకోవచ్చు. డేటాను పంపలేం. ఇక, వీవోఎల్‌టీఈ అంటే.. రిలయన్స్‌ వాడేది 'వాయిస్‌ ఓవర్‌ లాంగ్‌ టర్మ్‌ ఎవల్యూషన్‌ టెక్నాలజీ '. ఇది పూర్తిగా డేటా సరఫరా కోసం ఉపయోగపడే పరిజ్ఞానం. కాబట్టి.. మాటల్ని సైతం డేటాగా మార్చి పంపిస్తుంది. జియో సిమ్‌ ఉన్న ఫోన్‌లోంచి మాట్లాడినప్పుడు మాటలు ఈ టెక్నాలజీ ద్వారా డేటా రూపంలోకి మారి వివిధ మార్గాల్లో రిసీవర్‌ ఫోన్‌కు చేరుతాయి. అక్కడికి చేరాక, ఆ డేటా ప్యాకెట్లన్నీ ఒకటిగా మారి మాట రూపంలో వినిపిస్తుంది. దీన్ని ప్యాకెట్‌ స్విచింగ్‌ అంటారు.[2]

ఇవి కూడా చూడండి

మూలాలు