పంజాబ్ ప్రాంతం

ప్రస్తుత పాకిస్తాన్, భారతదేశాలలో ఉన్న భౌగోళిక ప్రాంతం

పంజాబ్ (/pʌnˈɑːb/, /ˈpʌnɑːb/, /pʌnˈæb/, /ˈpʌnæb/) (ఐదు నదుల ప్రాంతంగా సుప్రసిద్ధం) [1](పంజాబీ: پنجاب, ਪੰਜਾਬ; హిందీ: पंजाब), అన్నది భారత ఉపఖండం లేదా దక్షిణాసియాలోని వాయువ్యపు చివరి ప్రదేశాలు కల ప్రాంతం. ఉత్తర భారతదేశంలో, తూర్పు పాకిస్తాన్ లోని భూభాగాల్లో ఇది విస్తరించింది.

పంజాబ్
پنجاب
ਪੰਜਾਬ
पंजाब
అతిపెద్ద నగరాలుఢిల్లీ
లాహోర్
ఫైసలాబాద్
దేశాలు
Official languages
Area445,007 km2 (171,818 sq mi)
జనాభా (2011)~200 కోట్లు
జన సాంద్రత449/km2
మతాలు
Demonymపంజాబీ

ఈ ప్రాంతంలో సింధు లోయ నాగరికత, వేద సంస్కృతి విలసిల్లాయి, అచేమెనిద్ సామ్రాజ్యం, గ్రీకులు, కుషాణులు, గజ్నవీదులు, తైమూరులు, మొగలులు, ఆఫ్ఘాన్లు, బ్రిటీష్ వారు మొదలైన విదేశీయులెందరో సాగించిన అసంఖ్యాకమైన, మేరలేని దండయాత్రలను చారిత్రికంగా చూస్తూనేవుంది. పంజాబ్కు చెందిన ప్రజల్ని పంజాబీలు అని, వారి భాషను పంజాబీ భాష అని పిలుస్తున్నారు. పంజాబ్ ప్రాంతంలోని ప్రధానమైన మతాలు ఇస్లాం, హిందూ మతం, సిక్ఖు మతాలు. ఇతర మత సమూహాల్లో క్రైస్తవం, జైన మతం, బౌద్ధం కూడా ఉన్నాయి.

1947లో బ్రిటీష్ ఇండియా పరిపాలన నుంచి భారత ఉపఖండం స్వతంత్రం కావడంతోటే ఈ ప్రాంతం భారత, పాకిస్తాన్ దేశాల మధ్య విభజితమైంది.

పాకిస్తాన్ లో పంజాబ్ ప్రాంతంలో పాకిస్తానీ పంజాబ్, ఇస్లామాబాద్ రాజధాని ప్రాంతం, భీంబెర్, మీర్ పూర్ వంటి ప్రాంతాల చుట్టూ ఉన్న ఆజాద్ కాశ్మీర్ లోని దక్షిణ ప్రాంతాలు,[2] ఖైబర్ పఖ్తూన్ఖ్వా లోని కొన్ని ప్రాంతాలు (పెషావర్ వంటివి[3][4] పంజాబ్ ప్రాంతాలుగా అక్కడ పిషోర్ గా పేరొందాయి).[5]

భారతదేశంలో ఈ ప్రాంతంలో పంజాబ్ రాష్ట్రం, చండీగఢ్, జమ్ము డివిజన్,[6][7] హర్యానా,[8] హిమాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు, ఢిల్లీలోని కొన్ని భాగాలు, రాజస్థాన్ లోని కొంత భాగం,[9][10][11][12] ప్రధానంగా గంగానగర్ జిల్లా, హనుమాన్‌గర్ జిల్లా వంటివి ఉన్నాయి.[13]

పదవ్యుత్పత్తి

ఈ ప్రాంతాన్ని మొదట్లో సప్త సింధు అని పిలిచేవారు,[14] ఆ పదం ఏడు నదులు సముద్రంలోకి కలిసే వేదభూమిని సూచిస్తుంది.[15] రామాయణం, మహాభారతాల్లో సంస్కృతంలో ప్రస్తావించిన సంస్కృత పదం - "పంచనద" అంటే ఐదు నదుల భూమి. ఇదే పదం ముస్లిం దండయాత్రల అనంతరం పర్షియన్‌లోకి "పంజాబ్"గా అనువదించారు.[16][17] పంజాబ్ అన్న పదం రెండు పర్షియన్ పదాల కలయికతో ఏర్పడింది,[1][18] పంజ్ (ఐదు), అబ్ (నీరు). ఈ పదం ఈ ప్రాంతాన్ని జయించిన టర్కో-పర్షియన్ దండయాత్రికులు [19] పంజాబ్ అన్న పదానికి వ్యాప్తి కల్పించారు, మరీ ముఖ్యంగా, ముఘల్ సామ్రాజ్య పరిపాలనా కాలంలో ఈ పదం స్థిరపడింది.[20][21] ఝేలం, చీనాబ్, సట్లెజ్, బియాస్ నదులను ఉద్దేశించే పంజాబ్ లేక పంచనద అని పిలిచారు.[22] ఇవన్నీ సింధు నదికి ఉపనదులు.

రాజకీయ భూగోళం

పంజాబ్ ప్రాంతానికి ప్రధానంగా రెండు నిర్వచనాలు ఉన్నాయి: 1947 నాటి నిర్వచనం, 1846-1849 నాటి నిర్వచనం. మూడవ నిర్వచనం 1947 నాటి నిర్వచనం, 1946-49 నాటి నిర్వచనం కలుపుకుంటూ, దానితో పాటుగా భాషాపరంగానూ, ప్రాచీన నదుల గమనాన్ని అనుసరిస్తూ ఉత్తర రాజస్థాన్ ప్రాంతాలను కూడా కలుపుకుంటుంది.

1947 నిర్వచనం

1947 నిర్వచనం పంజాబ్ ప్రాంతాన్ని అప్పటికి విలీనమౌతూన్న బ్రిటీష్ ఇండియాలోని నాటి బ్రిటీష్ పంజాబ్ ప్రావిన్సుగా నిర్వచిస్తోంది. ఈ పంజాబ్ ప్రావిన్సు భారత విభజనలో భారత, పాకిస్తాన్‌ల నడుమ విభజితమైంది. ఇది పాకిస్తాన్‌లో పంజాబ్ ప్రావిన్సు, ఇస్లామాబాద్ రాజధాని ప్రాంతాల్లోనూ, భారతదేశంలో పంజాబ్ రాష్ట్రం, ఛండీగఢ్, హర్యానా,[23] హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించింది.

కాలరేఖ

చిత్రాలు

మూలాలు