బైతుల్-ముఖద్దస్

బైతుల్-ముఖద్దస్, బైత్-అల్-ముఖద్దస్ (అరబ్బీ: مسجد قبة الصخرة, మస్జిద్ ఖుబ్బత్ అస్-సఖరా (టర్కీ : కుబ్బెతుస్-సహ్రా) ఇస్లాం లోని ఒక పుణ్యక్షేత్రం. ఇది జెరూసలేం లోని మస్జిద్ ల సమూహాలలో ముఖ్యమైన మస్జిద్. దీని నిర్మాణం 691 లో పూర్తయింది. ఇది ఇస్లాం లోని ప్రపంచంలోనే అత్యంత పురాతన కట్టడం.[1]

Dome of the Rock
Qubbat As-Sakhrah

Lua error in మాడ్యూల్:Location_map at line 525: Unable to find the specified location map definition: "Module:Location map/data/Old Jerusalem" does not exist.Location within the Old City of Jerusalem

Coordinates: 31°46′41″N 35°14′07″E / 31.7780°N 35.2354°E / 31.7780; 35.2354
ప్రదేశంJerusalem
ప్రారంభంBuilt 685-691
నిర్వహణMinistry of Awqaf
నిర్మాణ సమాచారం
నిర్మాణ శైలిUmayyad
Dome(s)1
మీనార్/మీనార్లు0
బైత్-అల్-ముఖద్దస్ (డూమ్ ఆఫ్ రాక్)
మతం
అనుబంధంఇస్లాం
నాయకత్వంవక్ఫ్ మంత్రిత్వశాఖ
ప్రదేశం
ప్రదేశంజెరూసలేం
వాస్తుశాస్త్రం.
గ్రౌండ్‌బ్రేకింగ్685
పూర్తైనది691
Dome(s)1
బైతుల్-ముఖద్దస్
బైతుల్-ముఖద్దస్ 1910 కు ముందు.

ప్రాంతము, నిర్మాణము , కొలతలు

ఈ బైతుల్ ముఖద్దస్ 'మస్జిద్ ల సమూహాల' లోని మధ్యభాగంలో మానవనిర్మితమైన అరుగు పై నిర్మింపబడింది. ఈ పెద్ద అరుగును 'హెరోడ్' పరిపాలనా కాలంలో విస్తరీకరించారు, ఇది పురాతన యూదుల దేవాలయంగా వుండేది. దీనిని రోమనులు జెరూసలేంను సా.శ. 70 లో కూలగొట్టారు. సా.శ. 637 లో రాషిదూన్ ఖలీఫాల చే ఆక్రమించబడింది.

ఈ 'డూమ్ ఆఫ్ రాక్' అనబడు 'బైతుల్ ముఖద్దస్' సా.శ. 685, 691 ల కాలంలో పునర్నిర్మింపబడింది. ఉమయ్యద్ ఖలీఫా అయిన అబ్దుల్ మాలిక్ ఇబ్న్ మార్వాన్ దీని గుంబద్ ను నిర్మించాడు,, ఇలా భావించాడు "ఇది ముస్లింలను వేడిమిలోనూ చల్లదనంలోనూ చేరదీస్తుంది" [2],, ఇది ఒక పుణ్యక్షేత్రంగా వర్థిల్లాలని, ప్రార్థనాలయంగా కాదని అభిలషించాడు.[3] చరిత్రకాలు "ఖలీఫా ఈ నిర్మాణాన్ని ఇతర మతస్థులగల దాని ప్రదేశంలోనే నిర్మించతలపెట్టాడ"ని వ్రాశారు. చరిత్రకారుడు 'అల్-మఖ్దిసి' ఇలా రాశాడు "ముస్లింల కొరకు ఒక అద్భుతమైన మస్జిద్ ను నిర్మించాలని, దీనిని చూసి ప్రపంచమంతా గర్వపడేలా నిర్మించాలని, నిర్మాణకులకు సూచించాడు." [4]

Print from 1887. (ఆర్కిటెక్ట్ ఫ్రెడెరిక్ 1833 లో గీచిన నమూనా)[5]

ఈ నిర్మాణం 'షడ్ముఖి", దీనియందు గల డూమ్ కలపతో తయారుచేయబడింది. దీని చుట్టుకొలత సుమారు 60 అడుగులు లేదా 20 మీటర్లు. దీనిక్రిందగల స్థూపాకార నిర్మాణం 16 స్తంభాలుగలది.[3] దీనిచుట్టూ గల వృత్తాకారం షడ్ముఖాల దాలానం, 24 స్తంభాలుగలది. తనప్రయాణంలో మార్క్ ట్వైన్ ఇలావ్రాస్తాడు :

”ఉమర్ కాలపు మస్జిద్ స్తంభాలపై నిర్మింపబడ్డ నిర్మాణం, ఈ స్తంభాల నిర్మాణం అద్వితీయం, దీనిని పాలరాతి పై సుందరమైన నగిషీలతో తయారుచేయించారు. సులేమాన్ (సాలమన్ రాజు) ప్రవక్త కాలపు నిర్మాణ శేషాలను, ముస్లింలు అతిజాగ్రత్తగా భద్రపరచగలిగారు.[6]

బాహ్యము

బాహ్యతర గోడలను పోర్సిలిన్ తోనూ .[7], దర్పణాలతో షడ్ముఖాన్ని డిజైన్ చేశాఅరు. ఇవి ప్రతిదీ దాదాపు 60 అడుగుల వెడల్పుతోను 36 అడుగుల ఎత్తుతోనూ గలదు. గుంబద్, గోడలు కిటికీలు గల్గివున్నాయి.

గుంబద్

బాహ్య

ఈ డూమ్ (గుంబద్) బైజాంటియనుల నిర్మాణాకృతి కలిగివున్నది, దీని నిర్మాణం మతాచార్యుల విడిదికేంద్రంగా వుపయోగపడుటకు నిర్మించబడింది. ఇది మధ్యకాలపు బైజాంటియనుల కళకు చక్కటి ఉదాహరణ. అల్-మఖ్దిసి ఇలా వ్రాస్తాడు: మిగులు రొక్కం లక్ష బంగారు దీనారులను కరిగించి, గుంబద్ యొక్క బాహ్యాన్ని పూత పూయించారు. ఆ కాలంలో దీని జిగేలును ఏ కళ్ళైనా దీనివైపే చూసేవి.[2] సులేమాన్ చక్రవర్తి కాలంలో ఈ డూమ్ యొక్క బాహ్యభాగాన్ని 'ఇజ్ఞిక్' ఫలకాలతో పైపూతభాగం నిర్మించారు. ఈ పనికి 7సంవత్సరాల కాలం పట్టింది. 'హజ్ అమీన్ అల్-హుసైనీ' గ్రాండ్ ముఫ్తీగా నియమింపబడినపుడు, ఈ డూమ్ ను బంగారు పూత పూయించాడు.

1955 లో జోర్డాన్ ప్రభుత్వం ఒక బృహత్తర పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది, ఈ కార్యక్రమానికి ధనసహాయం అరబ్ ప్రభుత్వాలు, టర్కీ ప్రభుత్వం అందించాయి. 1960 లో, అల్యూమినియం, కంచు ల మిశ్రమలోహాలను ఇటలీలో తయారు చేయించి వాడారు. ఈ కార్యక్రమం 1964లో ముగిసింది. 1998 లో జోర్డాన్ రాజు దీనిపై మరలా బంగారు పూత పూయించాడు. దీని కొరకు జోర్డాన్ రాజు లండన్ లో గల తన ఇంటిని అమ్మివేసి, కావలసిన 80 కిలోల బంగారం కొరకు తనవంతు సహాయం చేశాడు.

అంతర్భాగం

ఈ డూమ్ యొక్క అంతర్భాగం మొజాయిక్, ఫైన్స్, పాలరాయిని ఉపయోగించి అలంకరించారు. దీనిపై 16 వ శతాబ్దంలో సులేమాన్ చక్రవర్తి కాలంలో ఖురాన్కు చెందిన సూరా యాసీన్ను లిఖించారు.

చరిత్ర

దస్త్రం:Palestine Pound 1939 front.jpg
పాలస్తీనా బ్యాంకునోటుపై 'డూమ్ ఆఫ్ రాక్'

అయ్యూబీలు , మమ్లూక్ లు

1187 అక్టోబరు 2సలాహుద్దీన్ అయ్యూబీ చే ఆక్రమించబడినది,, దీనిని ముస్లింల పవిత్రక్షేత్రంగా మార్చబడింది. దీని డూమ్ పైగల క్రాస్ గుర్తును తీసివేసి బంగారుతో చేయించిన 'చంద్రవంక' వుంచారు,, క్రింది భాగంలో కలపతో తయారు చేయబడ్డ 'స్క్రీను' ఏర్పాడు చేశారు. సలాహుద్దీన్ మేనల్లుడైన మాలిక్ ముఅజ్జమ్ ఈసా (1218-1227) కూడా పలు మార్పులు చేశాడు. మమ్లూక్ ల కాలంలోని ఖలీఫాలందరూ 1250 నుండి 1510 వరుకూ దీనిని బాగోగులు శ్రధ్ధతో చూశారు.

ఉస్మానియా సామ్రాజ్యం 1517 - 1917

పెద్దమోతాదులో 2వ మహమూద్ పరిపాలనా కాలంలో 1817 లో పునర్నిర్మాణం జరిగింది.

బ్రిటిష్ ల ఆధ్వర్యం 1917 - 1948

బైతుల్ ముఖద్దస్ 11 జూలై, 1927లో పాలస్తీనా భూకంపానికి లోనై తీవ్రంగా దెబ్బతిని క్రితం జరిగిన నిర్మాణాలన్నీ కదలిపోయాయి.

1948 నుండి నేటివరకు

పాతనగరం (జెరూసలెం) బాబ్ అల్-ఖత్తానీన్ నుండి డూమ్ దృశ్యం.
పాలస్తీనియన్ స్త్రీ డూమ్ వద్ద ప్రార్థనలు చేస్తూ, ఇస్లామీయ లిపీ కళాకృతులులో సుందర అలంకారాలు (పై భాగాన)

జోర్డాన్ రాజు కాలంలో యూదులకు ఈ డూమ్ ఆఫ్ రాక్ లో ప్రవేశ నిషేధముండేది. 1967 లో ఇస్రాయెల్ ఆరు రోజుల యుధ్ధం తరువాత ఆక్రమించింది. ఈ డూమ్ ఆఫ్ రాక్ ను ముస్లింల వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో వుంచింది. దీనిద్వారా శాంతిని కాంక్షించింది.[8] ఇస్రాయేలు విశ్వాసుల ఉద్యమాలకు చెందిన గ్రూపులు ఈ డూమ్ ను మక్కాకు తరలించి, ఇంకో ఆలయాన్ని నిర్మించాలని సూచించాయి.

మార్గము

బైతుల్ ముఖద్దస్ ద్వారసమీపాన ఒక పలక.

ఇంతకు మునుపు జోర్డాన్ ప్రభుత్వానికి చెందిన 'వక్ఫ్ మంత్రిత్వశాఖ్' దీనిపై ఆజమాయిషీ వుంచేది.[9]

19వ శతాబ్దపు మధ్యకాలంలో ముస్లిమేతరులకు నిషేధం వుండేది. 1967 నుండి ముస్లిమేతరులకు కూడా ప్రవేశం కల్పించ బడింది. కానీ ముస్లిమేతరులు ఇక్కడ ప్రార్థనలు చేయరాదనే నిబంధన విధంచారు.[10]

2000 లో ఇస్రాయేలు ప్రధానమంత్రి ఈ ప్రాంతాన్ని సందర్శించి ఉద్రిక్తతలను తగ్గించడానికి ముస్లిమేతరులను తిరిగీ నిషేధించాడు.[11]

2006 లో, తిరిగీ ముస్లిమేతర సందర్శకులకు ప్రవేశం కల్పించబడినది, శుక్రవారాలు, ముస్లింల పండుగరోజులను మినహాయించారు. సందర్శకులపై నిఘావుంటుంది, సెక్యూరిటీ స్క్రీనింగ్ వుంటుంది. హెబ్రూ ప్రార్థనాపుస్తకాలు, సంగీతవాయిద్యాలూ నిషేధం.

ఇన్ని చట్టాలున్ననూ యూదుల రబ్బీలు, దీని ప్రాంగణంలో ప్రవేశం యూదుల ధర్మానికి విరుధ్ధమని భావిస్తారు. ఈ ప్రాంగణంలో ప్రవేశం కేవలం ధార్మికనాయకులకు మాత్రమేవున్నదని వాదిస్తారు.[12]

మతపరమైన ప్రాముఖ్యత

  • ఈ 'డూమ్ ఆఫ్ రాక్' అని పిలువబడు బైతుల్ ముఖద్దస్ మక్కా లోనికాబా తరువాత అతి ప్రాముఖ్యం గలిగిన పవిత్రక్షేత్రం.
  • "హరమ్ షరీఫ్" తరువాత ముస్లింలకు మధ్యప్రాచ్యములో ఈ బైతుల్ ముఖద్దస్.
  • ఖురాన్లో దీని ప్రస్తావన గలదు, హిజ్రీశకం 72 తరువాత (691-692) ఈ బైతుల్ ముఖద్దస్ యొక్క డూమ్ ను నిర్మించారు.

చిత్రమాలిక

ఆలివ్ కొండ నుండి ఆలయాల సమూహం, అల్ అక్సా మస్జిద్, బైతుల్ ముకద్దస్ ల దృశ్యం.

ఇవీ చూడండి

నోట్స్

మూలాలు

  • Peterson, Andrew (1994). Dictionary of Islamic Architecture. London: Routledge. ISBN 0-415-06084-2

బయటి లింకులు