మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) అమెరికాలోని, కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్ లోగల విశ్వవిద్యాలయం. 1861 లో ప్రారంభించబడిన ఈ విశ్వవిద్యాలయం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ప్రపంచ అత్యుత్తమ సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా నిలిచింది.[11][12][13][14] అమెరికాలో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతున్న సమయంలో దానికి ప్రతిస్పందనగా ఈ విశ్వవిద్యాలయ ఏర్పాటు జరిగింది. అప్పట్లో ఇది యూరోపియన్ పాలిటెక్నిక్ నమూనాను అనుసరించింది. ఇందులో భాగంగా అప్లైడ్ సైన్సు, ఇంజనీరింగ్ లో ప్రయోగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. దీనిని పట్టణ ప్రాంతంలో చార్లెస్ నది వెంబడి సుమారు 1.6 కిలోమీటర్ల తీరంలో ఏర్పాటు చేశారు.

మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
నినాదంMens et Manus (Latin)
ఆంగ్లంలో నినాదం
"Mind and Hand"[1]
రకంప్రైవేటు పరిశోధనా విశ్వవిద్యాలయం
స్థాపితంఏప్రిల్ 10, 1861; 163 సంవత్సరాల క్రితం (1861-04-10)
విద్యాసంబంధ affiliations
  • AAU
  • CDIO
  • COFHE
  • NAICU[2]
  • URA
  • 568 Group
  • Sea grant
  • Space grant
ఎండోమెంట్$27.4 billion (2021)[3]
ఛాన్సలర్మెలిస్సా నోబెల్స్
అధ్యక్షుడుఎల్. రఫెల్ రీఫ్
అత్యున్నత పరిపాలనాధికారిమార్టిన్ ఎ. స్మిట్
విద్యాసంబంధ సిబ్బంది
1,074[4]
విద్యార్థులు11,934 (Fall 2021)[5]
అండర్ గ్రాడ్యుయేట్లు4,638 (Fall 2021)[5]
పోస్టు గ్రాడ్యుయేట్లు7,296 (Fall 2021)[5]
స్థానంకేంబ్రిడ్జ్, మసాచుసెట్స్, అమెరికా
42°21′36″N 71°05′31″W / 42.360°N 71.092°W / 42.360; -71.092
కాంపస్Midsize City,[6] 166 acres (67.2 ha)[7]
వార్తాపత్రికది టెక్
రంగులు  Cardinal Red
  Silver Gray
  Black[8][9]
అథ్లెటిక్ మారుపేరుఎంఐటీ ఇంజనీర్లు
క్రీడా అనుబంధాలు
  • NCAA Division III – NEWMAC
  • NEISA
  • CWPA
  • UVC
  • EARC
  • EAWRC
  • EARC
మస్కట్టిమ్ ద బీవర్[10]
జాలగూడుమూస:Official url

జూన్ 2021 నాటికి 98 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు, 26 మంది ట్యూరింగ్ అవార్డు గ్రహీతలు, 8 మంది ఫీల్డ్స్ పురస్కార గ్రహీతలు MIT పూర్వ విద్యార్థులుగానో, అధ్యాపక సిబ్బంది గానో, పరిశోధకులుగా అనుబంధం ఉన్నవారు.[15]

మూలాలు