మోనికా బెల్లూచి

మోనికా బెల్లూచి (ఇటాలియన్: mɔ nika belˈluttʃi; ఆంగ్లం: Monica Bellucci; 1964 సెప్టెంబరు 30) ఇటాలియన్ నటి, మోడల్. ఆమె డోల్స్ & గబ్బానా, డియోర్‌లకు మోడలింగ్ చేసింది. పలు ఇటాలియన్ చిత్రాలతో పాటు అమెరికన్, ఫ్రెంచ్ చిత్రాలలో నటించింది.

మోనికా బెల్లూచి
2016లో మోనికా బెల్లూచి
జననం
మోనికా అన్నా మరియా బెల్లూచి

(1964-09-30) 1964 సెప్టెంబరు 30 (వయసు 59)
సిట్టా డి కాస్టెల్లో, ఉంబ్రియా, ఇటలీ
వృత్తి
  • నటి
  • ఫ్యాషన్ మోడల్
క్రియాశీల సంవత్సరాలు
  • 1977–ప్రస్తుతం (మోడల్)
  • 1990–ప్రస్తుతం (నటి)
జీవిత భాగస్వామి
  • క్లాడియో కార్లోస్ బస్సో
    (m. 1984; div. 1985)
  • విన్సెంట్ కాసెల్
    (m. 1999, divorced)
పిల్లలు2
ఇర్రెవర్సిబుల్ ప్రచారం కోసం 2002 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మోనికా బెల్లూచి

కెరీర్

ఆమె ఫ్రాన్సిస్కో లౌడాడియో ఇటాలియన్ కామెడీ లా రిఫా (1991)తో తన సినీ రంగ ప్రవేశం చేసింది. మరుసటి సంవత్సరం ఆమె ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోల గోతిక్ హర్రర్ రొమాన్స్ చిత్రం బ్రామ్ స్టోకర్స్ డ్రాక్యులా (1992)లో డ్రాక్యులా బ్రైడ్‌గా నటించింది. ఎల్'అపార్ట్‌మెంట్ (1997)లో ఆమె ప్రధాన పాత్ర కోసం అత్యంత ప్రామిసింగ్ నటిగా సీజర్ అవార్డును అందుకుంది. ఆమె గియుసేప్ టోర్నాటోర్ ప్రశంసలు పొందిన ఇటాలియన్ రొమాంటిక్ డ్రామా మలేనా (2000)లో మలేనా స్కోర్డియా పాత్ర పోషించింది. ఆమె గ్యాస్పర్ నోయే వివాదాస్పద ఆర్ట్‌హౌస్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ఇర్రెవర్సిబుల్ (2002)లో నటించింది, ఇది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది.

2004లో మెల్ గిబ్సన్ బైబిల్ డ్రామా ది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ (2004)లో మేరీ మాగ్డలీన్ పాత్రను మోనికా బెల్లూచి పోషించింది. ఆమె 2003 సైన్స్-ఫిక్షన్ చిత్రాలైన ది మ్యాట్రిక్స్ రీలోడెడ్, ది మ్యాట్రిక్స్ రివల్యూషన్స్‌లో పెర్సెఫోన్ పాత్రను పోషించింది. 51 సంవత్సరాల వయస్సులో 2015 జేమ్స్ బాండ్ చలనచిత్రం స్పెక్టర్‌లో కనిపించడం ద్వారా, ఆమె ఫ్రాంచైజీ చరిత్రలో అతి పెద్ద బాండ్ గర్ల్ గా గుర్తింపు పొందింది.[1] ఆమె అప్పటి నుండి ది విజిల్‌బ్లోయర్ (2010), ది వండర్స్ (2014), ఆన్ ది మిల్కీ రోడ్ (2016), ది బెస్ట్ ఇయర్స్ ఆఫ్ ఎ లైఫ్ (2019), ది మ్యాన్ హూ సోల్డ్ హిజ్ స్కిన్ (2020), మెమరీ (2022) వంటి ఎన్నో చిత్రాలలో నటించింది.

జననం

మోనికా బెల్లూచి 1964 సెప్టెంబరు 30న సిట్టా డి కాస్టెల్లో, ఉంబ్రియాలో బ్రూనెల్లా బ్రిగాంటి, పాస్‌క్వెల్ బెల్లూచికి ఏకైక సంతానం.[2] ఆమె శాన్ గియుస్టినోలోని లామాలో పెరిగింది.[3][4][5]

మూలాలు