యెరెవాన్

అర్మేనియా రాజధాని

యెరెవాన్ (, అర్మేనియన్ భాష: Երևան, అజర్‌బైజాన్ భాష: İrəvan, రష్యన్ భాష: Ереван) అర్మేనియా దేశరాజధాని, ఆ దేశపు అతిపెద్ద నగరం. దీన్ని ఎరెవాన్ అని పిలవడం కూడా కద్దు. ప్రపంచంలో, సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా ప్రజలు నివసిస్తూ ఉన్న అత్యంత పురాతన నగరాలలో ఇది ఒకటి.[1] ఈ నగరం హ్రజ్డన్ నది ఒడ్డున ఉన్నది. ఇది దేశానికి పరిపాలన, సాంస్కృతిక, పారిశ్రామిక కేంద్రం. యెరెవాన్ 1918 నుండి దేశానికి రాజధానిగా ఉంది. దేశ చరిత్రలో ఇది పదమూడవ రాజధాని. అరారట్ ప్రాంతంలోని రాజధానుల్లో ఇది ఏడవది. ప్రపంచ పురాతన డయోసీస్‌లలో ఒకటి, అర్మేనియన్ అపోస్టోలిక్ చర్చికి చెందిన అతి పెద్ద డయోసీస్‌ యెరెవాన్‌లో ఉంది.[2]

యెరెవాన్ క్రీ.పూ. 8వ శతాబ్దానికి చెందిన నగరం. క్రీ.పూ. 782లో అర్గిష్టి-1 రాజు అరారట్ మైదానపు పడమటి కొసన ఎరెబునీ కోటను నిర్మించడంతో యెరెవాన్‌కు పునాదిరాయి పడింది.[3] ఎరెబునీని ఒక గొప్ప ఆధ్యాత్మిక, పరిపాలనా కేంద్రంగా, రాచరికాన్ని ప్రతిబింబించే రాజధానిగా రూపొందించారు.[4] ప్రాచీన ఆర్మేనియన్ రాజ్యపు అంతానికి కొత్త రాజధానీ నగరాలు ఉద్భవించి, యెరెవాన్ ప్రాముఖ్యత తగ్గింది. 1736 - 1828 మధ్యకాలంలో ఇరానియన్, రష్యన్ పరిపాలనలో ఎరివాన్ ఖానేట్‌కు, 1850 - 1917 మధ్య ఎరివాన్ గవర్నరేట్‌కూ ఇది రాజధానిగా విరాజిల్లింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒట్టోమన్ సామ్రాజ్యంలో జరిగిన ఆర్మేనియన్ మారణహోమం కారణంగా వలస వచ్చిన వారితో ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా ఏర్పాటవగా దానికి యెరెవాన్ రాజధాని అయ్యింది.[5] 20 వ శతాబ్దం నాటికి సోవియట్ యూనియన్ లో భాగమై, నగరం వేగంగా విస్తరించింది. నగరంలోని తిత్సర్నాబర్ద్ ను ఎంతో మంది ప్రముఖుల్లు సందర్శించారు.

ఆర్మేనియన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడంతో  యెరెవాన్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. 21 వ శతాబ్దపు తొలినాళ్ళ నుండి నగరం అంతటా భారీ నిర్మాణాలు జరిగాయి. రెస్టారెంట్లు, దుకాణాలు, వీధి కెఫేలు వంటి వాణిజ్య సౌకర్యాలు బాగా పెరిగాయి. సోవియట్ కాలంలో ఇవి చాలా అరుదుగా ఉండేవి. 2011 నాటి జనాభా గణాంకాల ప్రకారం నగర జనాభా 1,060,138. ఇది దేశం మొత్తం జనాభాలో 35%. 2016 నాటి అధికారిక అంచనాల ప్రకారం, నగర జనాభా 1,073,700.[6] యునెస్కో 2012లో యెరెవాన్ అనే పేరును ప్రపంచ రాజధానుల పుస్తకంలో చేర్చింది.[7] యూరోసిటీస్‌లో (ఐరోపా నగరాల నెట్‌వర్క్) యెరెవాన్‌కు అసోసియేట్ సభ్యత్వం ఉంది.[8]

నగరంలోని ప్రముఖ ఆనవాళ్లలో నగర జన్మస్థానంగా గుర్తింపు పొందిన ఎరెబునీ కోట ఒకటి. నగరంలోని చర్చిలలో అత్యంత పురాతనమైన కటోగికే త్సిరానవోర్ చర్చి కూడా ఒక ప్రముఖ కట్టడం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మేనియన్ కెథడ్రల్ అయిన సెయింట్ గ్రెగరీ కెథడ్రల్, అర్మేనియన్ నరమేధానికి అధికారిక సంతాప స్థలమైన సిసెర్నాకబర్క్ కూడా ప్రముఖమైన చూడదగ్గ ప్రదేశాల్లో ఉన్నాయి . అనేక ఒపేరా హౌస్‌లు, థియేటర్లు, సంగ్రహాలయాలు, గ్రంథాలయాలు ఇతర సాంస్కృతిక సంస్థలు కూడా నగరంలో ఉన్నాయి. యెరెవాన్ ఒపేరా థియేటర్, ఆర్మేనియన్ రాజధానిలోని ప్రధాన కట్టడం. నేషనల్ గేలరీ ఆఫ్ ఆర్మేనియా దేశంలోనే అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం. అదే భవనంలో అర్మేనియా చారిత్రిక సంగ్రహాలయం, మటేండారన్ ఉన్నాయి. మటేండారన్ ప్రపంచంలోని అతిపెద్ద పురాతన పుస్తకాలు, మాన్యుస్క్రిప్ట్ కలిగివున్న గ్రంథాలయాలలో ఒకటి.

వ్యుత్పత్తి

క్రీ.పూ. 782లో నగరానికి వేసిన పునాది రాయి

యెరెవాన్ అనే పేరు ఒరోన్టిడ్ వంశంలోని చివరి రాజయిన యెర్వాన్ద్ (ఒరంటీస్) 4 పేరు నుండి వచ్చిందని ఒక సిద్ధాంతం ఉంది. అయితే, క్రీ.పూ. 782 లో అర్గిష్టి-1 ఈ ప్రదేశాన్ని పరిపాలించడానికి ఎరెబునీలో ఒక కోటను నిర్మించారు. తరువాత యురేషియన్లు దానిని వాడడం వలన ఈ పేరు వచ్చిందని ప్రతీతి. 

చిహ్నాలు

అరరక్ పర్వతం, ఆర్మేనియా జాతీయ చిహ్నం[9][10]

ఆర్మేనియా ప్రధాన చిహ్నం అరారట్ పర్వతం, ఇది రాజధాని ప్రాంతంలోని ఏ ప్రదేశం నుండయినా కనపడుతుంది. నగర ముద్రలో కిరీటంతో ఉన్న సింహం ఒకటి పీఠం మీద కూర్చుని ఉంటుంది. ఎంబ్లెమ్‌లో నీలం రంగు సరిహద్దు కలిగిన చతురస్రం ఉంటుంది.[11]

27 సెప్టెంబరు 2004 న, "ఎరెబునీ-యెరెవాన్" అనే గీతాన్ని స్వీకరించారు, దీనిని పరూయ్ర్ సేవక్ రచించగా ఎడ్గార్ హొవ్హానిస్యాన్ కంపోస్ చేశారు. నగరానికి కొత్త గీతం ప్రకటించే పోటీలలో దీనికి చోటు దొరికింది. ఎంపిక చేసిన జెండా - తెలుపు రంగు నేపథ్యంలో మధ్య నగరపు ముద్ర, చుట్టూ పన్నెండు చారిత్రక రాజధానులకు చిహ్నంగా పన్నెండు చిన్న ఎరుపు త్రిభుజాలతో ఉంటుంది. ఈ జెండాలో దేశ జాతీయ జెండాలో ఉండే మూడు రంగులు ఉంటాయి.[12]

చరిత్ర

పూర్వ చరిత్ర, ప్రీ-క్లాసికల్ యుగం

షెంగావిత్ చారిత్రక సైట్ లో క్రీ.పూ. 3200 నాటి పునాదులు

యెరెవాన్ నగరం క్రీ.పూ. 4వ శతాబ్దం నుండి ఉంది. నగర దక్షిణ భాగంలో ఉన్నటువంటి షెంగావిత్ జిల్లాలో కనీసం క్రీ.పూ. 3200 అనగా కురా-అరాక్సెస్ సంసృతి (కాంస్య యుగం ప్రారంభదిశ) నుండి జనాభా ఉంటున్నారు. ఇక్కడ మొదటి త్రవ్వకాలు పురావస్తు పరిశోధనాకారుడయిన యెవ్గెని బాయ్బుర్ద్యాన్ ఆధ్యర్యంలో 1936 - 1938 మధ్య షెంగావిత్ లోని చారిత్రక ప్రదేశంలో జరిగాయి. రెండు దశాబ్దాల తర్వాత 1958 నుంచి 1983 వరకు, పరిశోధకుడుసాన్డ్రో సర్దరియన్ త్రవ్వకాలను కొనసాగించాడు.[13] మూడవ దశ త్రవ్వకాల్లో 2000లో హకోబ్ సిమోన్యాన్ మార్గదర్శకత్వంలో జరిగాయి. 2009, పెన్సిల్వేనియాలోని వైడనర్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మిచెల్ ఎస్. రాత్మాన్ సాన్డ్రోతో కలిశారు. వారు మూడు దశలలో (2009, 2010, 2012) జరిపిన త్రవ్వకాల్లో క్రీ.పూ 3200 నుంచి క్రీ.పూ. 2500 మధ్య కాలపు అవశేషాలు బయటపడ్డాయి. వాటిలో కొన్ని భారీ భవంతులను, అందులోని గదులనూ వారు ప్రపంచానికి పరిచయం చేశారు.

ఎరెబునీ

క్రో.పూ. 782లో అర్గిష్తి  స్థాపించిన ఎరబుని కోట

ఉరార్టు రాజ్యాం క్రీ.పూ. తొమ్మిదవ శతాబ్దంలో వాన్ సరస్సు ఒడ్డున రూపుదిద్దుకుంది.[14] కునెఫార్ం మీద రాసిన దాని ప్రకారం,[15] యురేర్షియన్ సైనిక కోట క్రీ.పూ. 782 లో చక్రవర్తి ఆర్గిష్టి ఆదేశాలనుసారం ఉత్తర కాకసస్ నుండి జరిగే వ్యతిరేక దాడుల నుండి నగరాన్ని కాపాడడానికి స్థాపించబడింది. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నగరాలలో యెరెవాన్ ఒకటి.[16]

యురర్టియన్ అధికారంలో ఉన్న సమయంలో ఎరెబునీ, దాని పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున నీటిపారుదల కాలువలను, ఒక కృత్రిమ జలాశయాన్నీ నిర్మించారు.

క్రీ.పూ. ఏడవ శతాబ్దానికి చెందిన తెషిబైని భవన పునాదులు

క్రీ.పూ. ఏడవ శతాబ్దం మధ్యలో, నగరంలోని ఎరెబునీ కోట నుండి 7 కి.మీ. పశ్చిమాన తెషిబైనిను ఉరార్టు వంశానికి చెందిన రూసా-2 నిర్మించారు.[17] అది ప్రస్తుతం బలవర్థకమైన గోడలతో షెంగావిత్ జిల్లాలో ఉంది. ఉరార్టు తూర్పు సరిహద్దులను మొరటు సిమ్మెరియన్లు, సితియన్ల నుండి రక్షించడానికి దీన్ని నిర్మించారు. త్రవ్వకాల్లో సమయంలో, 40,000 చ.మీ. వైశాల్యం కలిగిన  గవర్నరు ప్యాలెస్ యొక్క అవశేషాలు కనుగొన్నారు. వాటిలో 120 గదులు ఉన్నాయి. వీటి నిర్మాణం క్రీ.పూ. ఏడవ దశాబ్ధం నాటికి రుస-3 ఆధ్వర్యంలో పూర్తయ్యాయి. అయితే, ఈ ప్రాంతాన్ని క్రీ.పూ. 585 లో సిమ్మెరియన్లు, సితియన్లు నాశనం చేశారు.

Achaemenid rhyton from Erebuni

భౌగోళికం

నైసర్గిక స్వరూపం, నగర దృశ్యం

యెరెవాన్ నుండి ప్రవహిస్తున్న హ్రజ్డాన్ నది
అరారట్ మైదానంలోని ఈశాన్య భాగంలో యెరెవాన్ ఉన్నది 

యెరెవాన్ సముద్ర మట్టం నుండి సగటున 990 మీ (3,248.03 అడుగులు) ఎత్తున, కనిష్టంగా 856 మీ., గరిష్ఠంగా 1,390 మీ, మధ్యనా ఉంటుంది.[18] ఈ నగరం హ్రజ్డాన్ నదిఒడ్డున, ఈశాన్య అరారట్ లోయలో, దేశానికి పశ్చిమ కేంద్రంలో ఉంది. నగరానికి మూడు వైపులా పర్వతాలు ఉన్నాయి. దక్షిణాన హ్రజ్దాన్ నది ఉంది. హ్రజ్దాన్ నది ప్రవహించే క్రమంలో ఒక సుందరమైన గండి (కాన్యన్) ని ఏర్పరచింది. ఈ గండి నగరాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. రాజధాని కావడం వలన యెరెవాన్ ఏ  రాష్ట్రంలోనూ భాగంగా లేదు. యెరెవాన్ కు ఉత్తర, తూర్పు దిక్కున కొటాయ్క్, దక్షిణాన, పశ్చిమాన అరారట్,  పశ్చిమాన  అర్మవిర్, వాయవ్యాన అరగట్సన్  రాష్టాలు ఉన్నాయి.

ఎరెబునీ అభయారణ్యం 1981లో ఏర్పాటు చేసారు. ఇది నగర కేంద్రం నుండి ఆగ్నేయంగా 8 కి.మీ. దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1300 నుండి 1450 మీటర్ల ఎత్తున, 120 హెక్టార్లలో ఈ అభయారణ్యం ఉంది. పాక్షిక ఎడారి పర్వతాలు కలిగిన గడ్డి మైదానాలలో ఈ రిజర్వ్ ఆక్రమించి ఉంది.[19]

వాతావరణం

యెరెవాన్ లో వాతావరణం ఒక చిన్న ఎడారిని పోలి ఉంటుంది. ఎండాకాలం బాగా వేడిగా, పొడిగా ఎక్కువ రోజులు ఉంటుంది. చలికాలం బాగా చల్లగా, మంచు పడుతూ ఉంటుంది. తక్కువ రోజులు ఉంటుంది. ఇందుకు కారణం యెరెవాన్ నగరానికి మూడు ప్రక్కలా పర్వతాలు ఉండడం. ముఖ్యంగా ఆగస్టులో వాతావరణం వేడిమి 40 °C (104 °F) లను దాటుతుంది. జనవరిలోని శీతాకాలంలో ఉష్ణోగ్రత −15 °C (5 °F) ఉంటుంది. సగటున ప్రతి సంవత్సరం 318 మి.మి.(12.5 అంగుళాల) వర్షపాతం నమోదవుతుంది. సగటున సంవత్సరానికి 2,700 గంటలు సూర్యకాంతి ఉంటుంది. యెరెవాన్‌లో వేసవి, శీతాకాలాల సగటు ఉష్ణోగ్రతల మధ్య ఉండే తేడా మధ్య యూరోపియన్ రాజధాని నగరాలలో కెల్లా అత్యధికం.

ఆర్కిటెక్చర్

యెరెవాన్ టి.వి. టవరు నగరంలోని ఎత్తైన నిర్మాణం.

నగరంలోని  రిపబ్లిక్  స్క్వేర్, యెరెవాన్  ఒపేరా థియేటర్, Yerevan కోన ప్రధాన కేంద్రాలు. నగర అభివృద్ధి ఆర్కిటెక్ట్ జిమ్ టొరొస్యాన్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం కొనసాగుతుంది.

2017 మే నాటికి, యెరెవాన్ లో 4,883 అపార్టుమెంట్లు ఉన్నాయి. 1,514 కి.మీ. పొడవున ఏర్పాటు చేసిన 39,799 విద్యుద్దీప స్తంభాలపై 65,199 వీధి దీపాలు, 750 కి.మీ. పొడవైన 1,080 రోడ్లూ ఉన్నాయి.[20]

పార్కులు

యెరెవాన్ ఎంతో సాంద్రంగా నిర్మించిన నగరం. కానీ అనేక ప్రజా పార్కులు జిల్లాలంతటా వ్యాపించి ఉన్నాయి. ఎరెబునీలోని కృత్రిమ సరస్సు చుట్టుప్రక్కల ఒక సుందరమైన పబ్లిక్ పార్క్ ఉంది. 17 హెక్టార్లలో ఆక్రమించి ఉన్న ఈ పార్కును, కృత్రిమ సరస్సునూ అర్గిష్టి రాజు క్రీ.పూ. 8వ శతాబ్దంలో నిర్మించారు. 2011లో ఈ తోటను పూర్తిగా పునర్నిర్మించడమే కాకుండా దానికి లియోన్ పార్క్ అని నామకరణం చేశారు.[21]

యెరెవాంత్సిస్ లోని మార్షల్ బహ్రామ్యన్ పై ఉన్న లవర్స్ పార్కు, నగర మధ్యభాగంలో ఉన్న ఇంగ్లీష్ పార్కులను 18, 19 శతాబ్దాలలో నిర్మించారు. యెరెవాన్ బొటానికల్ గార్డెన్ ను 1935 లో ప్రారంభించారు, 1950లో స్థాపించబడిన విక్టరీ పార్కు, 1950లో ప్రారంభించిన సర్కులర్ పార్కులు నగరంలోని అతిపెద్ద పార్కులలో కొన్ని.

1960 లో ఏర్పాటయిన యెరెవాన్ ఒపేరా గార్డెన్, దానిలోని కృత్రిమ హంసల సరస్సు నగరంలోని చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఈ సరస్సు శీతాకాలంలో ఐస్-స్కేటింగ్ కు నిలయంగా మారుతుంది.

యెరెవాన్ సరస్సు 1967లో ప్రారంభమైన ఒక కృత్రిమ జలాశయం. నగరపు దక్షిణ భాగంలో ఉన్న ఈ సరస్సు 0.65 చ.కీ. ఉపరితల వైశాల్యం కలిగి ఉంటుంది.

రాజకీయాలు, ప్రభుత్వం

రాజధాని

బగ్రమన్యన్ రహదారిలో ఉన్నటువంటి ఆర్మేనియా జాతీయ శాశనసభ

1918 లో మొదటి రిపబ్లిక్ గా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి యెరెవాన్ అర్మేనియా రాజధానిగా ఉంది. చారిత్రిక అరారట్ మైదాన ప్రాంతంలో నెలకొని ఉన్న యెరెవాన్ రాజధానికి సహజమైన ఎంపిక అయ్యింది.

సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అన్ని విధాలుగా నగరం అభివృద్ధి చెందింది. 1991 లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ నగరం, దేశానికి రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా మారింది. ఇక్కడే అన్ని జాతీయ సంస్థలు - గవర్నమెంట్ హౌస్, నేషనల్ అసెంబ్లీ, రాష్ట్రపతి భవనం, కేంద్ర బ్యాంకు, రాజ్యాంగ కోర్టు, అన్ని మంత్రిత్వ శాఖలు, న్యాయ సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థల భవనాలు ఉన్నాయి.

మున్సిపాలిటీ

యెరెవాన్ సిటీ హాల్

1879 అక్టోబరు 1న రష్యాకు చెందిన అలెగ్జాండర్-2 ఆదేశాలతో యెరెవాన్, నగర స్థాయిని పొందింది. మొదటి సిటీ కౌన్సిల్ ఏర్పాటయిన తరువాత హొవ్హన్నెస్ ఘోర్గన్యన్ మొదటి మేయరుగా ఎన్నికయ్యారు.

1995 జూలై 5న ఆర్మేనియా రాజ్యాంగం ఏర్పడిన తరువాత యెరెవాన్ కు రాష్ట్రస్థాయిని ఇచ్చారు. అందువలన, చిన్న మార్పులతో యెరెవాన్ ఆర్మేనియాలోని రాష్ట్రాలవలె పనిచేస్తుంది.

యెరెవాన్ పన్నెండు "పరిపాలనా జిల్లాలు"గా విభజించబడింది.[22] వాటి పూర్తి వైశాల్యం 223 చ.కి.[23][24][25]

జిల్లాఅర్మేనియన్జనాభా
(2011 జనాభా లెక్కలు)
జనాభా
(2016 అంచనా)
వైశాల్యం (చ.కి.)
అజప్న్యాక్Աջափնյակ108,282109,10025.82
అరబ్కిర్Արաբկիր117,704115,80013.29
అవన్Ավան53,23153,1007.26
దవ్తాషెన్Դավթաշեն42,38042,5006.47
ఎరెబునీԷրեբունի123,092126,50047.49
 కనాకర్-జేత్యున్Քանաքեր-Զեյթուն73,88674,1007.73
కెంట్రాన్Կենտրոն125,453125,70013.35
మల్టియా-సెబష్టియాՄալաթիա-Սեբաստիա132,900135,90025.16
నార్క్-మరాష్Նորք-Մարաշ12,04911,8004.76
నార్-నార్క్Նոր Նորք126,065130,30014.11
నుబరాషెన్Նուբարաշեն9,5619,80017.24
షెంగావిత్Շենգավիթ135,535139,10040.6

జనాభా వివరాలు

యెరెవాన్ జనాభా లెక్కలు (ఎర్వియన్ కోటలోని వారు కాకుండా)
సంవత్సరంఆర్మేనియన్లుఅజెర్బైజానిస్రష్యన్లుఇతరులుమొత్తం
c. 1650పూర్తి మెజారిటీ
c. 1725పూర్తి మెజారిటీ~20,000
18304,13235.7%7,33164.3%1951.7%11,463
18735,90050,1%5,80048,7%1501.3%240.2%11,938
189712,52343,2%12,35942,6%2,7659.5%1,3594.7%29,006
192659,83889.2%5,2167.8%1,4012.1%6661%67,121
1939174,48487.1%6,5693.3%15,0437.5%4,3002.1%200,396
1959473,74293%3,4130.7%22,5724.4%9,6131.9%509,340
1970738,04595.2%2,7210.4%21,8022.8%12,4601.6%775,028
1979974,12695.8%2,3410.2%26,1412.6%14,6811.4%1,017,289
19891,100,37296.5%8970.0%22,2162.0%17,5071.5%1,201,539
20011,088,38998.63%6,6840.61%8,4150.76%1,103,488
20111.048.94098.94%4,9400.47%62580.59%1,060,138

హోటళ్ళు, మాల్స్

విశ్వవిద్యాలయాలు

పాఠశాలలు

విమానాశ్రయం

యెరెవాన్ ప్రముఖులు

చారిత్రిక ప్రదేశాలు

మూలాలు