రియో డి జనీరో

రియో డి జనీరో, బ్రెజిల్లో రెండవ అత్యధిక జనాభా కలిగిన నగరం. ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల్లో ఆరవ పెద్ద నగరం. బ్రెజిల్ లోని రియో డి జానీరో రాష్ట్రానికి రాజధాని. 2012 జూలై 1 న నగరంలో కొంతభాగాన్ని యునెస్కో వారి ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తించారు.[1]| image_flag = Bandeira da cidade do Rio de Janeiro.svg

రియో డి జనీరో

ఈ నగరాన్ని పోర్చుగీసు వారు 1565 లో స్థాపించారు. 1763 లో పోర్చుగీసు వారి పాలనలోని బ్రెజిల్ దేశానికి రాజధాని అయింది. 1808 లో యాత్తు పోర్చుగీసు సామ్రాజ్యానికి ఇది రాజధాని అయింది. 1822 లో స్వాతంత్ర్య యుద్ధం మొదలయ్యే వరకూ ఇది పోర్చుగీసు సామ్రాజ్యానికి రాజధానిగా ఉంది. ఒక వలస సామ్రాజ్యపు రాజధానిగా, దాని వలస దేశాల్లోని ఒక నగరం ఉండడం చరిత్రలో చాలా అరుదు. ఆ తరువాత 1889 అరకు రియో, బ్రెజిల్ సవతంత్ర సామ్రాజ్యానికి రాజధాని గాను, ఆ తరువాత 1960 వరకూ బ్రెజిల్ రిపబ్లిక్కుకు రాజధాని గానూ ఉంది. 9160 లో బ్రసీలియా, బ్రెజిల్‌కు రాజధాని అయింది.

రియో 2016 ఒలెంపిక్ క్రీడలకు ఆతిధ్యం ఇచ్చింది.[2] 2016 వేసవి పారాలింపిక్కులకూ ఆతిథ్యం ఇచ్చింది.

రియో జిడిపి 343 బిలియన్ల రియల్‌లు. ఇది దేశంలో రెండవ అతి పెద్ద నగర జిడిపి.[3] 2008 లో ప్రపంచ నగర జిడిపీల్లో రియో 30 వ స్థానంలో ఉంది, [4] అనేక వ్యాపార సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు, రియో నెలవు. పరిశోధన అభివృద్ధిలో ఇది బ్రెజిల్లో రెండవ అతిపెద్ద నగరం. 2005 నాటి జాతీయ శాస్త్రీయ దిగుబడిలో 17% రియో నుండి వచ్చింది.[5]

రియో దక్షిణార్థగోళంలో అతిపెద్ద పర్యాటక నగరం. అక్కడి ప్రకృతి దృశ్యాలు, కార్నివాళ్ళు, సాంబా, బస్సా నోవా లు, [6] ఇక్కడి బీచిలూ ఇక్కడి పర్యాటక ఆర్షణలు. కోర్కోవాడో పర్వతం మీద నెలకొల్పిన క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహం రియో లోని అత్యంత ప్రముఖమైన ప్రదేశాల్లో ఒకటి. ఇది ప్రపంచంలోని 7 నవీన వింతల్లో ఒకటి.

రాత్రివేళ రియో - 2013.
రాత్రివేళ రియో - 2013.


ప్రముఖులు

మూలాలు