వార్సా

పోలాండ్ రాజధాని

వార్సా పోలండ్ దేశంలో అతిపెద్ద నగరం, రాజధాని. ఈ నగరం పోలండ్ తూర్పు మధ్యభాగంలో విస్టులా నది పక్కన ఉంది. నగరం సరిహద్దుల్లో 18 లక్షల జనాభా ఉండగా, గ్రేటర్ మెట్రోపాలిటన్ ఏరియా లో సుమారు 31 లక్షలమంది ప్రజలు నివసిస్తున్నారు.[1] యూరోపియన్ యూనియన్ లో వార్సా ఏడవ అత్యధిక జనాభా కలిగిన నగరం. నగర హద్దులు 517.24 చదరపు కిలోమీటర్లు కాగా గ్రేటర్ ఏరియా 6,100.43 చ.కి.మీ వైశాల్యం కలిగిఉంది. వార్సా ఒక ఆల్ఫా గ్లోబల్ సిటీ, పేరొందిన అంతర్జాతీయ పర్యాటక కేంద్రం, చెప్పుకోదగిన సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక కేంద్రం. దీనిలో ఉన్న ప్రాచీన నగరం ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఒకటి.

డౌన్‌టౌన్ ఆఫ్ వార్సా, పోలాండ్

ఈ నగరం 16వ శతాబ్దం చివరలో సిగిస్మండ్ III అనే రాజు పోలండ్ రాజధానిని క్రాకో నుండి ఇక్కడికి తరలించాలనే నిర్ణయంతో ప్రాభవాన్ని సంతరించుకుంది. సొగసైన వాస్తుశిల్పం, వైభవం, విశాల పథాలు రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు వార్సాకు ఉత్తర పారిస్ అనే మారుపేరును సంపాదించాయి. 1939లో జర్మన్ దాడిలో ఈనగరం నిర్బంధం నుంది బయట పడింది.[2] అయితే 1943 లో వార్సా ఘెట్టో తిరుగుబాటు, 1944 లో వార్సా తిరుగుబాటు, జర్మన్ల చేతిలో క్రమబద్ధమైన నాశనానికి గురైంది. యుద్ధంలో 85% భవనాలు నేలమట్టం కాగా తిరిగి మళ్ళీ పునర్నిర్మించబడి ఫీనిక్స్ నగరంగా పేరు తెచ్చుకుంది.

2012 లో ఎకనామిక్ ఇంటెలిజెంట్ యూనిట్ జరిపిన సర్వేలో నివాసానికి అత్యంత అనువైన నగరాల్లో 32వ స్థానం దక్కించుకుంది.[3] 2017లో వ్యాపారానికి అనువైన ప్రాంతీయ నగరాల్లో 4వ స్థానం, మానవ జీవన నాణ్యతా సూచికపై ఉన్నత స్థానం సంపాదించుకుంది.[4]

ప్రముఖులు

మూలాలు