ఐరోపా సమాఖ్య

ఐరోపా సమాఖ్య ప్రధానంగా ఐరోపాలో ఉన్న 27 సభ్య దేశాల రాజకీయ, ఆర్థిక సమాఖ్య.[10] దీని సభ్యదేశాల మొత్తం విస్తీర్ణం 42,33,255 చ.కి.మీ. మొత్తం జనాభా 44.7 కోట్లు. ఇయు ప్రామాణికమైన చట్టాల ద్వారా అన్ని సభ్య దేశాలలో అంతర్గత సింగిల్ మార్కెట్‌ను అభివృద్ధి చేసింది. సభ్యులు ఏ అంశాలపై కలిసి పనిచెయ్యాలని అనుకున్నారో ఆ అంశాలపై మాత్రమే ఈ చట్టాలు చేస్తారు. ఈ అంతర్గత మార్కెట్లో ప్రజలు, వస్తువులు, సేవలు, మూలధనం స్వేచ్ఛగా కదిలేలా చూడడం ఇయు విధానాల లక్ష్యం.[11] న్యాయ, అంతర్గత రక్షణ వ్యవహారాలలో చట్టాన్ని రూపొందించడం, వాణిజ్యం,[12] వ్యవసాయం,[13] మత్స్యకార, ప్రాంతీయ అభివృద్ధిపై కామన్ విధానాలను ఏర్పరచడం కూడా ఇయు విధానాల లక్ష్యం.[14] షెంజెన్ ప్రాంతంలో ప్రయాణించడానికి పాస్‌పోర్ట్ నియంత్రణలు రద్దు చేసారు.[15] 1999 లో ఒక ద్రవ్య యూనియన్‌ను స్థాపించారు. ఇది 2002 లో పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. సమాఖ్య సభ్యుల్లో, 20 దేశాలు యూరో కరెన్సీని వాడతాయి.

ఐరోపా సమాఖ్య
Circle of 12 gold stars on a blue background
జండా
నినాదం: "In Varietate Concordia" (Latin)
"United in Diversity"
గీతం: "Ode to Joy" (orchestral)
Globe projection with the European Union in green
Location of the European Union,
its outermost regions,
and the overseas countries and territories
రాజధానిబ్రస్సెల్స్ (de facto)[1]
అతిపెద్ద cityలండన్
అధికార భాషలు
24 languages[a]
Official scripts[3]
  • Latin
  • Greek
  • Cyrillic
మతం
  • 71.6% Christian
    • 45.3% Roman Catholic
    • 11.1% Protestant
    • 9.6% Eastern Orthodox
    • 5.6% other Christian
  • 24% No religion
  • 1.8% Muslim
  • 2.6% other faiths[4]
పిలుచువిధంEuropean
TypePolitical and economic union
Member states
ప్రభుత్వంSupranational and intergovernmental
• President of the Council
Donald Tusk
• President of the Parliament
David Sassoli
• President of the Commission
Jean-Claude Juncker
శాసనవ్యవస్థsee "Politics" section below
Formation[5]
• Treaty of Rome
1 January 1958
• Single European Act
1 July 1987
• Treaty of Maastricht
1 November 1993
• Treaty of Lisbon
1 December 2009
• Last polity admitted
1 July 2013
విస్తీర్ణం
• మొత్తం
4,475,757 km2 (1,728,099 sq mi) (7th)
• నీరు (%)
3.08
జనాభా
• 2019 estimate
Increase 513,481,691[6] (3rd)
• జనసాంద్రత
117.2/km2 (303.5/sq mi)
GDP (PPP)2018 estimate
• Total
Increase $22.0 trillion[7] (2nd)
• Per capita
Increase $43,150[7]
GDP (nominal)2018 estimate
• Total
Increase $18.8 trillion[7] (2nd)
• Per capita
Increase $37,180
జినీ (2017)Positive decrease 30.7[8]
medium
హెచ్‌డిఐ (2017)Increase 0.899[c]
very high
ద్రవ్యంEuro (EUR; €; in eurozone) and
10 others
  • Lev (BGN; Bulgaria)
  • Koruna (CZK; Czech Republic)
  • Krone (DKK; Denmark)
  • Pound sterling (GBP; United Kingdom)
  • Gibraltar pound (GIP; Gibraltar)
  • Kuna (HRK; Croatia)
  • Forint (HUF; Hungary)
  • Złoty (PLN; Poland)
  • Leu (RON; Romania)
  • Krona (SEK; Sweden)
కాల విభాగంUTC to UTC+2 (WET, CET, EET)
• Summer (DST)
UTC+1 to UTC+3 (WEST, CEST, EEST)
(see also Summer Time in Europe)
Note: with the exception of the Canary Islands and Madeira, the outermost regions observe different time zones not shown.[d]
తేదీ తీరుdd/mm/yyyy (AD/CE)
See also: Date and time notation in Europe
Internet TLD.eu[e]

1993 లో మాస్ట్రిక్ట్ ఒప్పందం అమల్లోకి రావడంతో ఇయు, యూరోపియన్ పౌరసత్వం ఉనికి లోకి వచ్చాయి.[16] ఇయు మూలాలు యూరోపియన్ బొగ్గు, ఉక్కు సంఘం (ECSC), యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ (EEC) లలో ఉన్నాయి. 1951 పారిస్ ఒప్పందం, 1957 రోమ్ ఒప్పందం ద్వారా పై సంఘాలు ఏర్పడ్డాయి. యూరోపియన్ కమ్యూనిటీలు అనే సంఘాల్లో అసలు (వ్యవస్థాపక) సభ్యులు ఆరు: బెల్జియం, ఫ్రాన్స్, ఇటలీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, పశ్చిమ జర్మనీ. కొత్త సభ్య దేశాల ప్రవేశంతో కమ్యూనిటీలు, వాటి వారసులూ పరిమాణంలో పెరిగాయి. విధానపరమైన అంశాలు పెరుగుతూ పోవడంతో వాటి బలమూ పెరిగింది. ఇయు రాజ్యాంగ ప్రాతిపదికకు 2009 లో లిస్బన్ ఒప్పందం ద్వారా చేసినది, ముఖ్యమైన సవరణల్లో అత్యంత తాజాది.

2020 జనవరిలో, యునైటెడ్ కింగ్‌డమ్ ఇయు ను విడిచిపెట్టిన మొదటి సభ్య దేశంగా అవతరించింది. 2016 ప్రజాభిప్రాయ సేకరణ తరువాత, యుకె వెళ్ళిపోయే ఉద్దేశాన్ని తెలియజేసింది. ఉపసంహరణ ఒప్పందంపై చర్చలు జరిపింది. కనీసం 2020 డిసెంబరు 31 వరకు యుకె సంధి దశలో ఉంటుంది. ఈ సమయంలో ఇది ఇయు చట్టానికి లోబడి ఉంటుంది. ఇయు సింగిల్ మార్కెట్, కస్టమ్స్ యూనియన్‌లో భాగంగానే ఉంటుంది. దీనికి ముందు, సభ్య దేశాలకు చెందిన మూడు భూభాగాలు ఇయు ను గానీ, దానికి పూర్వం ఉన్న సంస్థలను గానీ విడిచిపెట్టాయి అవి. ఫ్రెంచ్ అల్జీరియా (1962 లో, స్వాతంత్ర్యం పొందిన తరువాత), గ్రీన్లాండ్ (1985 లో, ప్రజాభిప్రాయ సేకరణ తరువాత), సెయింట్ బార్తేలెమీ (2012 లో).

2020 లో ప్రపంచ జనాభాలో 5.8% మంది ఇయు లో ఉన్నారు [note 1] 2021 లో ఇయు నామమాత్రపు స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 17.1 ట్రిలియన్ యుఎస్ డాలర్లు. ఇది ప్రపంచ నామమాత్రపు జిడిపిలో సుమారు 18%. అదనంగా, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ప్రకారం, ఇయు దేశాలన్నిటి మానవ అభివృద్ధి సూచికలు చాలా ఎక్కువగా ఉంటాయి. 2012 లో, ఇయుకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.[18] ఉమ్మడి విదేశీ, భద్రతా విధానాల ద్వారా, ఇయు విదేశీ సంబంధాల్లోను, రక్షణలోనూ తన పాత్రను విస్తరించింది. యూనియన్ ప్రపంచవ్యాప్తంగా శాశ్వత దౌత్య కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థ, జి 7, జి 20 లలో ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అది చూపిస్తున్న ప్రభావం కారణంగా, యూరోపియన్ యూనియన్‌ను రూపుదిద్దుకుంటున్న సూపర్ పవర్ గా అభివర్ణించారు.[19]

చరిత్ర

తొలినాళ్ళు (1945 – 57)

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, ఖండంలోని కొన్ని భాగాలను నాశనం చేసిన తీవ్ర జాతీయతా భావనకు, యూరోపియన్ సమైక్యతే విరుగుడు అని భావించారు.[20] 1946 సెప్టెంబరు 19 న స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగంలో, విన్‌స్టన్ చర్చిల్ మరింత ముందుకు వెళ్లి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఐరోపా ఆవిర్భవించాలని సూచించాడు.[21] యూరోపియన్ సమాఖ్య చరిత్రలో 1948 హేగ్ కాంగ్రెస్ ఒక కీలకమైన క్షణం. ఎందుకంటే ఇది యూరోపియన్ మూవ్మెంట్ ఇంటర్నేషనల్, కాలేజ్ ఆఫ్ ఐరోపాల సృష్టికి దారితీసింది. ఇక్కడే భవిష్యత్తు ఐరోపా నాయకులు కలిసి జీవించి చదువుకున్నారు.[22]

ఇది 1949 లో కౌన్సిల్ ఆఫ్ ఐరోపా స్థాపనకు దారితీసింది. ఐరోపా దేశాలను ఒకచోట చేర్చే మొదటి గొప్ప ప్రయత్నం అది. మొదట్లో పది దేశాలుండేవి. కౌన్సిల్ ప్రధానంగా ఆర్థిక, వాణిజ్య సమస్యలపై కాకుండా విలువలు-మానవ హక్కులు, ప్రజాస్వామ్యంపై దృష్టి పెట్టింది. సుప్రా నేషనల్ అధికారమేదీ లేకుండా, సార్వభౌమిక ప్రభుత్వాలు కలిసి పనిచేయగల ఒక ఫోరమ్‌గా దీన్ని భావించారు. ఇది మరింత యూరోపియన్ సమైక్యతపై గొప్ప ఆశలను పెంచింది. దీనిని ఎలా సాధించవచ్చనే దానిపై రెండేళ్ళలో చర్చలు జరిగాయి.

ఐరోపా కౌన్సిల్‌లో పురోగతి లేకపోవడంతో నిరాశ చెందిన ఆరు దేశాలు, 1952 లో, మరింత ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుని యూరోపియన్ బొగ్గు, ఉక్కు సంఘాన్ని స్థాపించాయి. దీనిని "ఐరోపా సమాఖ్య స్థాపనలో మొదటి అడుగు" అని ప్రకటించారు.[23] ఈ సంఘం ఆర్థికంగా ఏకీకృతం కావడానికి యునైటెడ్ స్టేట్స్ నుండి పెద్ద సంఖ్యలో మార్షల్ ప్లాన్ నిధులను సమన్వయం చేయడానికీ సహాయపడింది.[24] ఇటలీకి చెందిన ఆల్సైడ్ డి గ్యాస్పెరి, ఫ్రాన్స్‌కు చెందిన జీన్ మోనెట్, రాబర్ట్ షూమాన్, బెల్జియానికి చెందిన పాల్-హెన్రీ స్పాక్ వంటి యూరోపియన్ నాయకులు బొగ్గు, ఉక్కులు యుద్ధానికి అవసరమైన రెండు పరిశ్రమలని, వారివారి జాతీయ పరిశ్రమలను అనుసంధనించాడం ద్వారా భవిష్యత్తులో వారి మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు తక్కువౌతాయనీ అర్థం చేసుకున్నారు.[25] వీళ్ళు, ఇతరులూ యూరోపియన్ యూనియన్ వ్యవస్థాపక పితామహులుగా అధికారికంగా ఘనత పొందారు.

రోమ్ ఒప్పందం (1957 – 92)

యూరోపియన్[permanent dead link] యూనియన్ (1993 కి పూర్వం యూరోపియన్ కమ్యూనిటీలు) యొక్క సభ్య దేశాల ఖండాంతర భూభాగాలు, ప్రవేశానికి అనుగుణంగా రంగులో ఉన్నాయి

1957 లో, బెల్జియం, ఫ్రాన్స్, ఇటలీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, పశ్చిమ జర్మనీలు రోమ్ ఒప్పందంపై సంతకం చేశాయి. దీంతో యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ (ఇఇసి) ఉనికి లోకి వచ్చింది. ఈ ఒప్పందం కస్టమ్స్ యూనియన్‌ను కూడా ఏర్పాటు చేసింది. అణువిద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చెయ్యడంలో సహకరించుకునేందుకు గాను వారు యురోపియన్ అటామిక్ ఎనర్జీ కమ్యూనిటీ (Euratom) అనే మరో ఒప్పందంపై కూడా సంతకం చేసారు. ఈ రెండు ఒప్పందాలు 1958 లో అమల్లోకి వచ్చాయి.[26]

EEC, Euratom లు అంతకు ముందున్న ECSC నుండి విడిగా సృష్టించారు. ఈ సంస్థలన్నిటికీ ఉమ్మడిగా ఒకే కోర్టులు, అసెంబ్లీ ఉండేవి. EEC కి వాల్టర్ హాల్‌స్టెయిన్ (హాల్‌స్టెయిన్ కమిషన్) నాయకత్వం వహించాడు. యురాటమ్‌కు లూయిస్ అర్మాండ్ (అర్మాండ్ కమిషన్), అతడి తరువాత ఎటియెన్ హిర్ష్ నాయకత్వం వహించారు. యురాటమ్ అణుశక్తి రంగాలను ఏకీకృతం చేయగా, ఇఇసి ఒక కస్టమ్స్ యూనియన్‌ను అభివృద్ధి చేస్తుంది.[27][28]

1960 లలో, ఉద్రిక్తతలు కనిపించడం మొదలైంది. సుప్రానేషనల్ శక్తిని పరిమితం చేయాలని ఫ్రాన్స్ కోరింది. ఏదేమైనా, 1965 లో ఒక ఒప్పందం కుదిరింది. 1967 జూలై 1 న కుదిరిన విలీన ఒప్పందంతో మూడు సంస్థలను విలీనం చేసి, యూరోపియన్ కమ్యూనిటీస్ అనే ఒకే సంస్థను సృష్టించారు.[29][30] జీన్ రే మొదటి విలీన కమిషన్ కు అధ్యక్షత వహించాడు.[31]

1989[permanent dead link] లో, ఐరన్ కర్టెన్ పడిపోయింది, సమాజాన్ని మరింత విస్తరించడానికి వీలు కల్పించింది (బెర్లిన్ గోడ, దాని వెనుక బ్రాండెన్‌బర్గ్ గేట్ చిత్రపటం)

1973 లో, డెన్మార్క్ (గ్రీన్ ల్యాండ్‌తో కూడా చేరింది. తరువాత 1985 లో ఫిషింగ్ హక్కులపై వివాదం తరువాత బయటికి పోయింది), ఐర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌లు కమ్యూనిటీల్లో చేరాయి.[32] అదే సమయంలో నార్వే కూడా చేరడానికి చర్చలు జరిపింది, కాని నార్వేజియన్ ఓటర్లు ప్రజాభిప్రాయ సేకరణలో సభ్యత్వాన్ని తిరస్కరించారు. 1979 లో, యూరోపియన్ పార్లమెంటుకు మొదటి ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి.[33]

1981 లో గ్రీస్, 1986 లో పోర్చుగల్, స్పెయిన్లు చేరాయి.[34] 1985 లో కుదిరిన షెన్‌జెన్ ఒప్పందంతో చాలా సభ్య దేశాలు, కొన్ని సభ్యత్వం లేని దేశాల మధ్య పాస్‌పోర్ట్ నియంత్రణలు లేకుండా సరిహద్దులు దాటగలిగేలా నిర్నిరోధ సరిహద్దులను రూపొందించడానికి మార్గం సుగమమైంది.[35] 1986 లో, EEC యూరోపియన్ జెండాను ఉపయోగించడం ప్రారంభించింది.[36] సింగిల్ యూరోపియన్ యాక్ట్ పై సంతకం చేసారు.

1990 లో, ఈస్టర్న్ బ్లాక్ పతనం తరువాత , మాజీ తూర్పు జర్మనీ పునరేకీకృతమైన జర్మనీలో భాగంగా కమ్యూనిటీలలో భాగమైంది.[37]

మాస్ట్రిక్ట్ ఒప్పందం (1992 – 2007)

2002[permanent dead link] లో 12 జాతీయ కరెన్సీల స్థానంలో యూరోను ప్రవేశపెట్టారు. ఆ తరువాత మరో ఏడు దేశాలు చేరాయి.

1993 నవంబరు 1 న మాస్ట్రిక్ట్ ఒప్పందం అమల్లోకి రావడంతో అధికారికంగా యూరోపియన్ యూనియన్ ఏర్పడింది. [16][38] ఈ ఒప్పందానికి ప్రధాన రూపకర్తలు హెల్ముట్ కోహ్ల్, ఫ్రాంకోయిస్ మిట్ట్రాండ్ లు. ఈ ఒప్పందంతో EEC పేరు యూరోపియన్ కమ్యూనిటీ అని మారింది. మధ్య, తూర్పు ఐరోపాలోని మాజీ కమ్యూనిస్ట్ దేశాలతో పాటు సైప్రస్, మాల్టా లను చేర్చుకోవాలని ప్రతిపాదనలు రావడంతో 1993 జూన్ లో కొత్త సభ్యులను EU లో చేరడానికి కోపెన్‌హాగన్ ప్రమాణాలను నెలకొల్పుకున్నారు. EU ను విస్తరణతో కొత్త స్థాయి సంక్లిష్టత, అసమ్మతి చోటుచేసుకున్నాయి.[39] 1995 లో, ఆస్ట్రియా, ఫిన్లాండ్, స్వీడన్ EU లో చేరాయి.

2002 లో 12 సభ్య దేశాల జాతీయ కరెన్సీల స్థానంలో యూరో నోట్లు, నాణేలు చలామణీ లోకి వచ్చాయి. అప్పటి నుండి, యూరోజోన్‌లో దేశాల సంఖ్య 20 కి పెరిగింది. యూరో కరెన్సీ ప్రపంచంలో రెండవ అతిపెద్ద రిజర్వ్ కరెన్సీగా నిలిచింది. 2004 లో, సైప్రస్, చెక్ రిపబ్లిక్, ఎస్టోనియా, హంగరీ, లాట్వియా, లిథువేనియా, మాల్టా, పోలాండ్, స్లోవేకియా, స్లోవేనియాలు ఒక్కసారే యూనియన్‌లో చేరినప్పుడు, అతిపెద్ద ఇయు విస్తరణ జరిగింది.[40]

లిస్బన్ ఒప్పందం (2007 – ప్రస్తుతం)

2007 లో, బల్గేరియా, రొమేనియా EU సభ్యులయ్యాయి. అదే సంవత్సరం, స్లోవేనియా యూరోను స్వీకరించింది[41] 2008 లో సైప్రస్, మాల్టా లు, 2009 లో స్లోవేకియా, 2011 లో ఎస్టోనియా, 2014 లో లాట్వియా, 2015 లో లిథువేనియాలు యూరోను స్వీకరించాయి..

1 2009 డిసెంబరు న, లిస్బన్ ఒప్పందం అమల్లోకి వచ్చినపుడు EU యొక్క అనేక అంశాలను సంస్కరించారు. ప్రత్యేకించి, ఇది యూరోపియన్ యూనియన్ యొక్క చట్టపరమైన నిర్మాణాన్ని మార్చింది, EU మూడు స్తంభాల వ్యవస్థను విలీనం చేసి, ఒకే చట్టబద్దమైన సంస్థ ఏర్పడింది. యూరోపియన్ కౌన్సిల్ యొక్క శాశ్వత అధ్యక్ష పదవిని సృష్టించింది. మొదటి అధ్యక్షుడు హర్మన్ వాన్ రోంపూయ్. యూనియన్ ఫర్ ఫారిన్ అఫైర్స్ అండ్ సెక్యూరిటీ పాలసీ యొక్క ఉన్నత ప్రతినిధి స్థానాన్ని బలోపేతం చేసారు. [42][43]

"ఐరోపాలో శాంతి, సయోధ్య, ప్రజాస్వామ్యానికి, మానవ హక్కుల పురోగతికీ దోహదపడినందుకు" 2012 లో EU నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది.[44][45] 2013 లో క్రొయేషియా 28 వ EU సభ్యునిగా చేరింది.[46]

2010 ల ప్రారంభం నుండి, యూరోపియన్ యూనియన్ సమైక్యతకు పలు పరీక్షలు ఎదుర్కొంది. కొన్ని యూరోజోన్ దేశాలలో రుణ సంక్షోభం, ఆఫ్రికా, ఆసియా నుండి వలసల పెరుగుదల, యునైటెడ్ కింగ్‌డమ్ EU నుండి వైదొలగడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంది.[47] యూరోపియన్ యూనియన్ సభ్యత్వంపై యుకెలో ప్రజాభిప్రాయ సేకరణ 2016 లో జరిగింది, 51.9% మంది బయటకు రావడానికి ఓటు వేశారు.[48] EU నుండి నిష్క్రమిస్తామని 2017 మార్చి 29 న బ్రిటన్ ఇయుకు తెలియజేసి, ఉపసంహరణ కమాన్ని మొదలుపెట్టింది. చివరికి 2020 జనవరి 31 న యునైటెడ్ కింగ్‌డమ్ యూరోపియన్ యూనియన్ నుండి నిష్క్రమించింది, అయినప్పటికీ EU చట్టంలోని చాలా అంశాలు 2020 చివరి వరకు యుకెకు వర్తిస్తాయి.[49]

బ్రెక్జిట్

2020 ఫిబ్రవరి 1 న, యునైటెడ్ కింగ్‌డమ్ యూరోపియన్ యూనియన్‌ ఒప్పందం లోని ఆర్టికల్ 50 ప్రకారం యూరోపియన్ యూనియన్ నుండి నిష్క్రమించింది. అప్పటి నుండి 2020 డిసెంబరు 31 వరకు వ్యాపారాలను సిద్ధం చేయడానికి, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరపడానికీ అవసరమైన పరివర్తన కాలం.[50]

భవిష్యత్ విస్తరణ

1993 లో అంగీకరించిన కోపెన్‌హాగన్ ప్రమాణాలు, మాస్ట్రిక్ట్ ఒప్పందం (ఆర్టికల్ 49) లలో యూనియన్‌లోకి చేరడానికి ప్రమాణాలను చేర్చారు. మాస్ట్రిక్ట్ ఒప్పందంలోని ఆర్టికల్ 49 (సవరించిన విధంగా) "స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛలను, చట్టబద్ధతను" గౌరవించే ఏ "యూరోపియన్ దేశమైనా" ఇయు లో చేరవచ్చని పేర్కొంది. ఒక దేశం యూరోపియన్ కాదా లేదా అనేది ఇయు సంస్థల రాజకీయ అంచనాకు లోబడి ఉంటుంది.[51]

యూనియన్ యొక్క భవిష్యత్తు సభ్యత్వం కోసం ఐదుగురు గుర్తింపు పొందిన అభ్యర్థులు ఉన్నారు: టర్కీ (14 1987 ఏప్రిల్ న దరఖాస్తు చేసుకుంది), నార్త్ మాసిడోనియా (22 2004 మార్చి న "మాజీ యుగోస్లావ్ రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా"గా దరఖాస్తు చేసుకుంది), మోంటెనెగ్రో (2008 లో దరఖాస్తు చేసుకుంది), అల్బేనియా (2009 లోదరఖాస్తు చేసుకుంది), సెర్బియా (2009 లో దరఖాస్తు చేసుకుంది). టర్కిష్ చర్చలు నిలిచిపోగా మిగతావి పురోగతిలో ఉన్నాయి.[52][53][54]

2019-2020 కరోనావైరస్ మహమ్మారి కారణమని పేర్కొంటూ 2020 మార్చిలో, హంగరీ ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్కు నిరవధిక అత్యవసర అధికారాలను ఇస్తూ విస్తృతమైన చట్టాన్ని ఆమోదించింది. ఎగ్జిక్యూటివ్ డిక్రీలు జారీ చేయడం, పార్లమెంటును నిలిపివేయడం, నకిలీ వార్తలుగా పరిగణించిన వాటిని ప్రచురించిన వ్యతిరేక మీడియా ప్రచురణలను మూసివేయడం, హింసించడం ఈ అధికారాల్లో ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో తిరోగమనం వలన, ఇయు ప్రాథమిక హక్కుల చార్టరుకే విరుద్ధంగా ఉన్నందునా ఇయు ఆ దేశంతో తెగతెంపులు చేసుకోవాలని చాలా మంది కోరారు.[55][56] ఈ పిలుపులు ఎలా ఉన్నప్పటికీ, సభ్య దేశాలను యూనియన్ నుండి తొలగించే యంత్రాంగాలు ఇయు లో లేవు. ఒప్పందం లోని ఆర్టికల్ 7 ప్రకారం ఆంక్షలు విధించవచ్చు. వీటిని మొదట 2015 లో ప్రతిపాదించారు. కాని అధికారికంగా వోటు వేసింది మాత్రం 2018 లో. ఇది కూడా ఇయు యొక్క మూల విలువలను ఉల్లంఘించిన సందర్భంలో మాత్రమే వర్తిస్తుంది.[57]

జనాభా వివరాలు

జనాభా

As of 1 ఫిబ్రవరి 2020[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]], 2020 ఫిబ్రవరి 1 నాటికి ఇయు జనాభా 447 మిలియన్లు (ప్రపంచ జనాభాలో 5.8%).[58] 2015 లో, ఇయు-28 లో 5.1 మిలియన్ల పిల్లలు జన్మించారు. అంటే ప్రతి వెయ్యి మందికీ 10 జననాలు ఉన్నట్లు. ప్రపంచ సగటు కంటే ఇది 8 జననాలు తక్కువ.[59] పోలిక కోసం, ఇయు-28 జననాల రేటు 2000 లో 10.6, 1985 లో 12.8, 1970 లో 16.3 గా ఉండేవి.[60] దాని జనాభా పెరుగుదల రేటు పాజిటివుగా ఉంది - 2016 లో 0.23%.[61]

2010 లో, ఇయు జనాభాలో 47.3 మిలియన్ల మంది తాము నివసిస్తున్న దేశంలో కాకుండా వేరే దేశంలో జన్మించారు. ఇది మొత్తం ఇయు జనాభాలో 9.4%. వీరిలో 31.4 మిలియన్ల మంది (6.3%) ఇయు వెలుపల జన్మించారు. 16.0 మిలియన్లు (3.2%) ఇయు లోనే వేరొక సభ్య దేశంలో జన్మించారు. ఇయు వెలుపల జన్మించిన వారిలో అత్యధిక సంఖ్యలో జర్మనీ (6.4 మిలియన్లు), ఫ్రాన్స్ (5.1 మిలియన్లు), యునైటెడ్ కింగ్‌డమ్ (4.7 మిలియన్లు), స్పెయిన్ (4.1 మిలియన్లు), ఇటలీ (3.2 మిలియన్లు) , నెదర్లాండ్స్ (1.4 మిలియన్లు) లో ఉన్నారు.[62] 2017 లో, సుమారు 825,000 మంది యూరోపియన్ యూనియన్ లోని ఏదో ఒక సభ్య దేశంలో పౌరసత్వం పొందారు . అతిపెద్ద సమూహాలు మొరాకో, అల్బేనియా, ఇండియా, టర్కీ, పాకిస్తాన్ దేశస్థులు. ఇయు యేతర దేశాల నుండి 2.4 మిలియన్ల వలసదారులు 2017 లో ఇయు లోకి ప్రవేశించారు.[63][64]

పట్టణీకరణ

ఇయు లో ఒక మిలియన్ జనాభా కంటే ఎక్కువ మంది ఉన్న పట్టణ ప్రాంతాలు 40 ఉన్నాయి. ఇయు లో అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతాలు పారిస్, మాడ్రిడ్ .[65] వీటి తరువాత బార్సిలోనా, బెర్లిన్, రైన్-రుహ్ర్, రోమ్, మిలన్ వస్తాయి. వీటన్నిటి మెట్రోపాలిటన్ జనాభా 4 మిలియన్లకు పైగా ఉంది.[66]

ఇయు లో ఒకటి కంటే ఎక్కువ పట్టణాలతో కూడిన పాలీసెంట్రిక్ పట్టణ ప్రాంతాలున్నాయి. అవి: రైన్-రుహ్ర్ (కొలోన్, డార్ట్మండ్, డ్యూసెల్డార్ఫ్ తదితరాలు), రాండ్‌స్టాడ్ (ఆమ్స్టర్డామ్, రోటర్‌డామ్, ది హేగ్, ఉట్రేచ్ట్ తదితరాలు.), ఫ్రాంక్‌ఫర్ట్ రైన్-మెయిన్ (ఫ్రాంక్‌ఫర్ట్), ఫ్లెమిష్ డైమండ్ (ఆంట్వెర్ప్, బ్రస్సెల్స్, లెవెన్, ఘెంట్ తదితరాలు), ఎగువ సిలేసియన్ ప్రాంతం (కటోవిస్, ఆస్ట్రావా తదితరాలు.).[65]

భాషలు

యూరోపియన్ యూనియన్‌లో 24 అధికారిక భాష లున్నాయి: బల్గేరియన్, క్రొయేషియన్, చెక్, డానిష్, డచ్, ఇంగ్లీష్, ఎస్టోనియన్, ఫిన్నిష్, ఫ్రెంచ్, జర్మన్, గ్రీక్, హంగేరియన్, ఇటాలియన్, ఐరిష్, లాట్వియన్, లిథువేనియన్, మాల్టీస్, పోలిష్, పోర్చుగీస్, రొమేనియన్, స్లోవాక్, స్లోవేన్, స్పానిష్, స్వీడిష్ . చట్టం వంటి ముఖ్యమైన పత్రాలను ప్రతి అధికారిక భాషలోకి అనువదిస్తారు. యూరోపియన్ పార్లమెంటు, పత్రాలకు, ప్లీనరీ సమావేశాలకూ అనువాదం అందిస్తుంది.[67][68][69]

అధిక సంఖ్యలో ఉన్న అధికారిక భాషల కారణంగా, చాలా సంస్థలు కొన్ని భాషలను మాత్రమే పనుల్లో ఉపయోగిస్తాయి. యూరోపియన్ కమిషన్ తన అంతర్గత వ్యాపారాన్ని ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ అనే మూడు పద్ధతుల భాషల్లో నిర్వహిస్తుంది. అదేవిధంగా, యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఫ్రెంచ్‌ను భాషలో పనిచేస్తుంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ తన వ్యాపారాన్ని ప్రధానంగా ఆంగ్లంలో నిర్వహిస్తుంది.[70]

మాతృభాషగా కలిగినవారుమొత్తం
జర్మన్18%32%
ఫ్రెంచ్13%26%
ఇటాలియన్12%16%
స్పానిష్8%15%
పోలిష్8%9%
రొమేనియన్5%5%
డచ్4%5%
గ్రీకు3%4%
హంగేరియన్3%3%
పోర్చుగీస్2%3%
చెక్2%3%
స్వీడిష్2%3%
బల్గేరియన్2%2%
ఆంగ్ల1%51%
స్లోవాక్1%2%
డానిష్1%1%
ఫిన్నిష్1%1%
లిథుయేనియన్1%1%
క్రొయేషియన్1%1%
స్లోవీన్<1%<1%
ఎస్టోనియన్<1%<1%
ఐరిష్<1%<1%
లాట్వియన్<1%<1%
మాల్టీస్<1%<1%
సర్వే 2012.[71]
మొత్తం= సంభాషించగల వ్యక్తుల సంఖ్య[72]

భాషా విధానం సభ్య దేశాల బాధ్యత అయినప్పటికీ, ఇయు సంస్థలు దాని పౌరులలో బహుభాషావాదాన్ని ప్రోత్సహిస్తాయి.[f][73] ఇయు లో ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడే భాష. మాతృభాషగాను, ఇతరత్రానూ మాట్లాడేవారిని లెక్కలోకి తీసుకుంటే ఇయు జనాభాలో 51% మందికి ఇంగ్లీషు అర్థమవుతుంది.[74] ఎక్కువ మంది మాట్లాడే మాతృభాష, జర్మన్ (ఇయు జనాభాలో 18%), తరువాత ఫ్రెంచ్ (ఇయు జనాభాలో 13%). పైగా, రెండూ అనేక ఇయు సభ్య దేశాలకు అధికారిక భాషలు. ఇయు పౌరులలో సగానికి పైగా (56%) వారి మాతృభాష కాకుండా ఇతర భాషలో సంభాషించ గలుగుతారు.[75]

ఇయు లోని మొత్తం భాషల్లో ఇరవై అధికారిక భాషలు ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినవి, వీటిలో బాల్టో-స్లావిక్,[g] ఇటాలిక్,[h] జర్మానిక్,[i] హెలెనిక్,[j] సెల్టిక్[k] శాఖలున్నాయి. హంగేరియన్, ఫిన్నిష్, ఎస్టోనియన్ (మూడు యురేలిక్), మాల్టీస్ (సెమిటిక్) అనే నాలుగు భాషలు మాత్రమే ఇండో-యూరోపియన్ భాషలు కావు.[76] యూరోపియన్ యూనియన్ యొక్క మూడు అధికారిక వర్ణమాలలు (సిరిలిక్, లాటిన్, ఆధునిక గ్రీకు) అన్నీ పురాతన గ్రీకు లిపి నుండి ఉద్భవించినవే.[77]

లక్సెంబోర్గిష్ (లక్సెంబర్గ్‌లో), టర్కిష్ (సైప్రస్‌లో) లు మాత్రమే ఇయు అధికారిక భాషలు కాని జాతీయ భాషలు. 2016 ఫిబ్రవరి 26 న, టర్కిష్‌ను అధికారిక ఇయు భాషగా చేయమని సైప్రస్ కోరినట్లు వెల్లడైంది. ఇది దేశ విభజనను పరిష్కరించడంలో సహాయపడే “సంకేతం”.[78] సైప్రస్‌, నార్దర్న్ సైప్రస్‌లు తిరిగి విలీనమైనప్పుడు టర్కిష్ అధికారిక భాషగా మారుతుందని 2004 లోనే ప్రణాళిక చేసారు.[79]

24 అధికారిక భాషలతో పాటు, 50 మిలియన్ల వరకు ప్రజలు మాట్లాడే సుమారు 150 ప్రాంతీయ, మైనారిటీ భాష లున్నాయి.[76] కాటలాన్, గెలీషియన్, బాస్క్ లు యూరోపియన్ యూనియన్ అధికారిక భాషలుగా గుర్తించబడలేదు గాని, కనీసం ఒక సభ్య దేశంలో (స్పెయిన్) సెమీ-అధికారిక హోదాను కలిగి ఉన్నాయి: అందువల్ల, ఒప్పందాల యొక్క అధికారిక అనువాదాలు వాటిలో తయారు చేస్తారు. పౌరులకు సంస్థలతో ఈ భాషల్లో సంప్రదించే హక్కు ఉంది.[80] ఇయు వారి ప్రాంతీయ మైనారిటీ భాషల కోసం యూరోపియన్ చార్టర్, భాషా వారసత్వాన్ని కాపాడటానికి రాష్ట్రాలు అనుసరించగల సాధారణ మార్గదర్శకాలను అందిస్తుంది. యూరోపియన్ భాషల దినోత్సవం ఏటా సెప్టెంబరు 26 న జరుగుతుంది. ఐరోపా అంతటా భాషా అభ్యాసాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఉంది.

మతం

ఇయుకి ఏ మతంతోనూ అధికారిక సంబంధం లేదు. యూరోపియన్ యూనియన్ పనిపై ఒప్పందం యొక్క ఆర్టికల్ 17[81] "చర్చిలు, మత సంఘాల జాతీయ చట్టం ప్రకారం" స్థితిని గుర్తించింది.[82]

యూరోపియన్ యూనియన్ ఒప్పందం యొక్క అవతారికలో " ఐరోపా యొక్క సాంస్కృతిక, మత, మానవతా వారసత్వం" గురించి ప్రస్తావించింది.[82] యూరోపియన్ రాజ్యాంగం యొక్క ముసాయిదా గ్రంథాలపై చర్చలోను, ఆ తరువాత లిస్బన్ ఒప్పందం సమయం లోనూ క్రైస్తవ మతం లేదా ఒక దేవుడిని లేదా రెండింటినీ అవతారికలో ప్రస్తావించాలని ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ఈ ఆలోచన వ్యతిరేకత రావడ్ంతో ఆ ప్రతిపాదన వీగిపోయింది.[83]

సభ్య దేశాలు

వరుస విస్తరణల ద్వారా, యూరోపియన్ యూనియన్ ఆరు వ్యవస్థాపక దేశాల (బెల్జియం, ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ, ఇటలీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్) నుండి ప్రస్తుత 27 సభ్యుల దాకా విస్తరించింది. వ్యవస్థాపక ఒప్పందాలకు పార్టీగా మారడం ద్వారా కొత్త దేశాలు యూనియన్‌లో చేరుతాయి. తద్వారా ఇయు సభ్యత్వ అధికారాలు బాధ్యతలకు లోబడి ఉంటాయి. ఇందుకోసం సభ్యదేశాలు తమ సార్వభౌమత్వంలో కొంత భాగాన్ని యూనియన్ సంస్థలకు ధారపోస్తాయి. దీన్ని సార్వభౌమత్వ సమీకరణ అని అంటారు..[84][85]

సభ్యత్వం పొందడానికి, ఒక దేశం కోపెన్‌హాగన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఈ ప్రమాణాలను 1993 లో కోపెన్‌హాగన్‌లో జరిగిన యూరోపియన్ కౌన్సిల్ సమావేశంలో నిర్వచించారు. వీటికి మానవ హక్కులను, చట్ట పాలనను గౌరవించే స్థిరమైన ప్రజాస్వామ్యం అవసరం; పనిచేసే మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఉండాలి; ఇయు చట్టంతో సహా సభ్యత్వంతో వచ్చే బాధ్యతలను స్వీకరించాలి. సభ్యత్వం కోరుతున్న దేశం ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో తేల్చే బాధ్యత యూరోపియన్ కౌన్సిల్ ది.[86] లిస్బన్ ఒప్పందంలోని ఆర్టికల్ 50 ఒక సభ్యుడు యూనియన్ నుండి నిష్క్రమించడానికి వీలు కల్పిస్తుంది. రెండు భూభాగాలు యూనియన్ నుండి నిష్క్రమించాయి: గ్రీన్లాండ్ (డెన్మార్క్ యొక్క స్వయంప్రతిపత్త ప్రావిన్స్) 1985 లో ఉపసంహరించుకుంది;[87] యునైటెడ్ కింగ్‌డమ్ అధికారికంగా 2016 లో యూరోపియన్ యూనియన్‌పై ఏకీకృత ఒప్పందంలోని ఆర్టికల్ 50 ను వాడుకుంది. 2020 లో వైదొలిగినప్పుడు ఇయు ను విడిచిపెట్టిన ఏకైక సార్వభౌమ రాజ్యంగా అవతరించింది.

ఆరు దేశాల సభ్యత్వం అభ్యర్ధనలు పరిశీలనలో ఉన్నాయి: అల్బేనియా, ఐస్లాండ్, నార్త్ మాసిడోనియా,[l] మాంటెనెగ్రో, సెర్బియా, టర్కీలు.[88] ఐస్లాండ్ 2013 లో చర్చలను నిలిపివేసింది.[89] బోస్నియా హెర్జెగోవినా, కొసావోలను అభ్యర్థులుగా అధికారికంగా గుర్తించింది.[88] బోస్నియా, హెర్జెగోవినా సభ్యత్వ దరఖాస్తును సమర్పించింది.

యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA) ను ఏర్పాటు చేసిన నాలుగు దేశాలూ ఇయు లో సభ్యులు కాదు. కానీ ఇయు ఆర్థికవ్యవస్థకు, దాని నిబంధనలకూ పాక్షికంగా కట్టుబడి ఉన్నాయి: స్విట్జర్లాండ్, ఐస్లాండ్, లీచ్టెన్స్టెయిన్, నార్వే.[90][91] యూరోపియన్ సూక్ష్మ దేశాలైన అండోరా, మొనాకో, శాన్ మారినో, వాటికన్ సిటీల సంబంధాలలో యూరో వాడకం, ఇతర సహకారాలు ఉన్నాయి.[92] యూరోపియన్ యూనియన్‌లో ఉన్న 27 సార్వభౌమ దేశాలు (మ్యాప్‌లో ఐరోపాలోను, ఆ చుట్టుపక్కల ఉన్న భూభాగాలను మాత్రమే చూపిస్తుంది) :[93]

FinlandSwedenEstoniaLatviaLithuaniaPolandSlovakiaHungaryRomaniaBulgariaGreeceCyprusCzech RepublicAustriaSloveniaItalyMaltaPortugalSpainFranceGermanyLuxembourgBelgiumNetherlandsDenmarkIreland
Map showing the member states of the European Union (clickable)


పతాకందేశంరాజధానిచేరికజనాభా
(2019)[6]
వైశాల్యంయూరోపియన్

పార్లమెంటులో సభ్యుల సంఖ్య

ద్రవ్యం
ఆస్ట్రియావియన్నా199501010లోపం: సమయం సరిగ్గా లేదు1 జనవరి 1995&&&&&&&&08932664.&&&&&089,32,66483,855 km2
(32,377 sq mi)
19EUR
బెల్జియంబ్రస్సెల్స్19570325వ్యవస్థాపక దేశం&&&&&&&011566041.&&&&&01,15,66,04130,528 km2
(11,787 sq mi)
21EUR
బల్గేరియాసోఫియా200701010లోపం: సమయం సరిగ్గా లేదు1 జనవరి 2007&&&&&&&&06916548.&&&&&069,16,548110,994 km2
(42,855 sq mi)
17EUR
క్రొయేషియాజాగ్రెబ్201307010లోపం: సమయం సరిగ్గా లేదు1 జూలై 2013&&&&&&&&04036355.&&&&&040,36,35556,594 km2
(21,851 sq mi)
12HRK
సైప్రస్నికోసియా200405010లోపం: సమయం సరిగ్గా లేదు1 మే 2004&&&&&&&&&0896005.&&&&&08,96,0059,251 km2
(3,572 sq mi)
6EUR
చెక్ రిపబ్లిక్ప్రాగ్200405010లోపం: సమయం సరిగ్గా లేదు1 మే 2004&&&&&&&010701777.&&&&&01,07,01,77778,866 km2
(30,450 sq mi)
21CZK
డెన్మార్క్కోపెన్‌హాగన్197301010లోపం: సమయం సరిగ్గా లేదు1 జనవరి 1973&&&&&&&&05840045.&&&&&058,40,04543,075 km2
(16,631 sq mi)
14DKK
ఎస్టోనియాతల్లిన్న్200405010లోపం: సమయం సరిగ్గా లేదు1 మే 2004&&&&&&&&01330068.&&&&&013,30,06845,227 km2
(17,462 sq mi)
7EUR
ఫిన్లాండ్హెల్సింకీ199501010లోపం: సమయం సరిగ్గా లేదు1 జనవరి 1995&&&&&&&&05533793.&&&&&055,33,793338,424 km2
(130,666 sq mi)
14EUR
ఫ్రాన్స్పారిస్19570325వ్యవస్థాపక దేశం&&&&&&&067439599.&&&&&06,74,39,599640,679 km2
(247,368 sq mi)
79EUR
జర్మనీబెర్లిన్19570325వ్యవస్థాపక దేశం[m]&&&&&&&083155031.&&&&&08,31,55,031357,021 km2
(137,847 sq mi)
96EUR
గ్రీస్ఏథెన్స్198101010లోపం: సమయం సరిగ్గా లేదు1 జనవరి 1981&&&&&&&010682547.&&&&&01,06,82,547131,990 km2
(50,960 sq mi)
21EUR
హంగేరిబుడాపెస్ట్200401010లోపం: సమయం సరిగ్గా లేదు1 మే 2004&&&&&&&&09730772.&&&&&097,30,77293,030 km2
(35,920 sq mi)
21HUF
ఐర్లాండ్డబ్లిన్197301010లోపం: సమయం సరిగ్గా లేదు1 జనవరి 1973&&&&&&&&05006907.&&&&&050,06,90770,273 km2
(27,133 sq mi)
13EUR
ఇటలీరోమ్వ్యవస్థాపక దేశం&&&&&&&059257566.&&&&&05,92,57,566301,338 km2
(116,347 sq mi)
76EUR
లాట్వియారీగా200405010లోపం: సమయం సరిగ్గా లేదు1 మే 2004&&&&&&&&01893223.&&&&&018,93,22364,589 km2
(24,938 sq mi)
8EUR
లిథువేనియావిల్నియస్200405010లోపం: సమయం సరిగ్గా లేదు1 మే 2004&&&&&&&&02795680.&&&&&027,95,68065,200 km2
(25,200 sq mi)
11EUR
లక్సెంబర్గ్లక్సెంబర్గ్ నగరంవ్యవస్థాపక దేశం&&&&&&&&&0634730.&&&&&06,34,7302,586 km2
(998 sq mi)
6EUR
మాల్టావలెట్టా200405010లోపం: సమయం సరిగ్గా లేదు1 మే 2004&&&&&&&&&0516100.&&&&&05,16,100316 km2
(122 sq mi)
6EUR
నెదర్లాండ్స్ఆమ్‌స్టర్‌డ్యామ్19570325వ్యవస్థాపక దేశం&&&&&&&017475415.&&&&&01,74,75,41541,543 km2
(16,040 sq mi)
29EUR
పోలాండ్వార్సా200405010లోపం: సమయం సరిగ్గా లేదు1 మే 2004&&&&&&&037840001.&&&&&03,78,40,001312,685 km2
(120,728 sq mi)
52PLN
పోర్చుగల్లిస్బన్198601010లోపం: సమయం సరిగ్గా లేదు1 జనవరి 1986&&&&&&&010298252.&&&&&01,02,98,25292,390 km2
(35,670 sq mi)
21EUR
రొమానియాబుకారెస్ట్200701010లోపం: సమయం సరిగ్గా లేదు1 జనవరి 2007&&&&&&&019186201.&&&&&01,91,86,201238,391 km2
(92,043 sq mi)
33RON
స్లొవేకియాబ్రాటిస్లావా200405010లోపం: సమయం సరిగ్గా లేదు1 మే 2004&&&&&&&&05459781.&&&&&054,59,78149,035 km2
(18,933 sq mi)
14EUR
స్లొవేనియాల్యుబ్‌ల్యానా200405010లోపం: సమయం సరిగ్గా లేదు1 మే 2004&&&&&&&&02108977.&&&&&021,08,97720,273 km2
(7,827 sq mi)
8EUR
స్పెయిన్మాడ్రిడ్198601010లోపం: సమయం సరిగ్గా లేదు1 జనవరి 1986&&&&&&&047394223.&&&&&04,73,94,223504,030 km2
(194,610 sq mi)
59EUR
స్వీడన్స్టాక్‌హోమ్199501010లోపం: సమయం సరిగ్గా లేదు1 జనవరి 1995&&&&&&&010379295.&&&&&01,03,79,295449,964 km2
(173,732 sq mi)
21SEK
మొత్తం 27&&&&&&0447007596.&&&&&044,70,07,5964,233,262 km2
(1,634,472 sq mi)

705

భౌగోళికం

ఇయు సభ్య దేశాల మొత్తం విస్తీర్ణం 4,233,262 చ.కి.మీ.[n] ఇయు లో అత్యంత ఎత్తైన శిఖరం, ఆల్ప్స్ లోని 4,810.45 మీటర్ల ఎత్తైన మోంట్ బ్లాంక్.[94] ఇయు లో నేలపై అత్యంత లోతైన పాయింట్లు Lammefjorden, డెన్మార్క్ లోని లమ్మెయోర్డెన్, నెదర్లాండ్స్ లోనిజ్విడ్‌ప్లాస్‌పోల్డర్. ఈ రెండూ సందురమట్టం నుండి 7 మీటర్ల దిగువన ఉంటాయి. ఇయు యొక్క ప్రకృతి దృశ్యం, వాతావరణం, ఆర్థిక వ్యవస్థలపై దాని తీరప్రాంత ప్రభావం చాలా ఉంటుంది. దీని తీరరేఖ పొడవు 65,993 కిలోమీటర్లు

ఫ్రాన్స్‌తో పాటు ఇయు లో సభ్యత్వం పొందిన దాని విదేశీ భూభాగాలు కొన్ని ఐరోపా బయట ఉన్నాయి. ఆ విదేశీ భూభాగాలతో సహా, ఇయు లో ఆర్కిటిక్ (ఈశాన్య ఐరోపా) నుండి ఉష్ణమండల (ఫ్రెంచ్ గయానా) వరకు చాలా రకాల శీతోష్ణస్థితులు ఉన్నాయి. ఈ కారణంగా ఇయు లో శీతోష్ణస్థితి సగటుల గురించి మాట్లాడడం అర్థరహితం. జనాభాలో ఎక్కువ మంది సమశీతోష్ణ సముద్ర వాతావరణం (వాయవ్య ఐరోపా, మధ్య ఐరోపా), మధ్యధరా వాతావరణం (దక్షిణ ఐరోపా) లేదా వెచ్చని వేసవి ఖండాంతర లేదా హెమిబోరియల్ వాతావరణం (ఉత్తర బాల్కన్స్, మధ్య ఐరోపా) ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు.[95]

ఇయు జనాభాలో చాలా అధికంగా పట్టణీకరణ చెందింది. 2006 నాటికి 75% నివాసులు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. నగరాలు ఎక్కువగా ఇయు అంతటా ఉండగా, బెనెలక్స్ చుట్టుపక్కల పెద్ద సమూహంగా విస్తరించి ఉన్నాయి.[96]

రాజకీయాలు

యూనియన్ లోని ఏడు సంస్థలతో కూడిన రాజకీయ వ్యవస్థ ఆర్గానోగ్రామ్

ఇయు అధిజాతీయ (సుప్రానేషనల్), అంతర్ - ప్రభుత్వాల హైబ్రిడ్ నిర్ణాయక వ్యవస్థ ద్వారా పనిచేస్తుంది.[97][98] కాన్ఫరల్ సూత్రాల ప్రకారం (ఇది ఒప్పందాల ద్వారా ఇచ్చిన యోగ్యతల పరిమితుల్లో మాత్రమే పనిచేయాలని చెబుతుంది), అనుబంధ సంస్థ (సభ్య దేశాలు విడిగా చెయ్యలేని చోట మాత్రమే ఇది పనిచేయాలని చెబుతుంది) పద్ధతిలోనూ పనిచేస్తుంది. ఇయు సంస్థలు తయారుచేసిన చట్టాలు వివిధ రూపాల్లో ఆమోదించబడతాయి.[99] సాధారణంగా, వాటిని రెండు గ్రూపులుగా వర్గీకరించవచ్చు: వివిధ సభ్య దేశాలు అమలు కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేనివి కొన్ని (నిబంధనలు), ప్రత్యేకంగా జాతీయంగా అమలు చెయ్యాల్సిన చర్యలు అవసరమయ్యేవి (ఆదేశాలు).[100]

బెల్జియంలోని యూరోపియన్ క్వార్టర్ ఆఫ్ బ్రస్సెల్స్ లోని బెర్లేమాంట్ భవనం యూరోపియన్ కమిషన్ ప్రధాన కార్యాలయం

యూరపియన్ యూనియన్లో 7 ముఖ్యమైన విధాన నిర్ణాయక వ్యవస్థలున్నాయి: యూరపియన్ పార్లమెంటు, యూరపియన్ కౌన్సిల్, కౌన్సిల్ ఆఫ్ ది ఆఫ్ ది యూరపియన్ యూనియన్, యూరపియన్ కమిషన్, కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ ది యూరపియన్ యూనియన్, యూరపియన్ సెంట్రల్ బ్యాంక్, యూరపియన్ కోర్ట్ ఆఫ్ ఆడిటర్స్. వీటిలో రెండింటి - యూరపియన్ కౌన్సిల్, కౌన్సిల్ ఆఫ్ ది ఆఫ్ ది యూరపియన్ యూనియన్ - పేర్లు దగ్గరగా ఉన్నప్పటికీ అవి రెండూ వేరువేరు బాధ్యతలు, అధికారాలు కలిగిన వేరువేరు వ్యవస్థలను గమనించాలి.

  • యూరోపియన్ కౌన్సిల్, దాని సభ్య దేశాల దేశ / ప్రభుత్వ అధినేతలను సమీకరించడం ద్వారా యూనియన్ యొక్క సాధారణ రాజకీయ దిశలను, ప్రాధాన్యతలను నిర్దేశిస్తుంది. దాని శిఖరాగ్ర సమావేశాల తీర్మానాలను (కనీసం త్రైమాసికంలో ఒక్కసారైనా జరుగుతాయి) ఏకాభిప్రాయం ద్వారా స్వీకరిస్తారు.
  • చట్టాలను ప్రతిపాదించడానికి అధికారం కలిగిన ఏకైక సంస్థ, యూరోపియన్ కమిషన్. ఇది "ఒప్పందాల సంరక్షకుడు"గా పనిచేస్తుంది. ఇందులో పరోక్షంగా ఎన్నికైన అధ్యక్షుడి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వ అధికారుల కార్యనిర్వాహక వర్గం ఉంటుంది. ఈ కమిషనర్లు కమిషన్ యొక్క శాశ్వత కార్యనిర్వహణ చేస్తారు. ఇది యూరోపియన్ కౌన్సిల్ యొక్క ఏకాభిప్రాయ ఉద్దేశాలను శాసన ప్రతిపాదనలుగా మారుస్తుంది.
  • కౌన్సిల్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ లో సభ్య దేశాల ప్రభుత్వాల మంత్రులు సభ్యులుగా ఉంటారు. వివిధ సభ్య దేశాల ప్రభుత్వాలు దీనిద్వారానే ఇయు లో నేరుగా ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ ర్పతిపాదనైనా చట్ట రూపం దాల్చాలంటే దానికి ఈ కౌన్సిల్ అనుమతి అవసరం.
  • యూరోపియన్ పార్లమెంటులో 705 మంది ప్రత్యక్షంగా ఎన్నికైన ప్రతినిధులు ఉంటారు. ఇయు చట్టంలోని చాలా అంశాల్లో కమిషన్ ప్రతిపాదనలను సవరించడానికి, ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి దీనికి కౌన్సిల్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ తో సమానమైన అధికారం ఉంటుంది. సభ్య దేశాల సార్వభౌమత్వాన్ని ప్రాథమ్యంగా ఉండే రక్షణ వంటి రంగాల్లో దీని అధికారాలు పరిమితం. ఇది కమిషన్ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది, కాలేజ్ ఆఫ్ కమిషనర్లను ఆమోదించాలి. వారందరినీ సమష్టిగా కార్యాలయం నుండి తొలగించడానికి ఓటు వేయవచ్చు.
  • కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ ది యూరపియన్ యూనియన్, ఇయు చట్టం ఏకరీతిగా అమలయ్యేలా చూస్తుంది. ఇయు సంస్థలకు, సభ్య దేశాలకూ మధ్య వచ్చే వివాదాలనూ, వ్యక్తుల నుండి ఇయు సంస్థలకు వ్యతిరేకంగా వచ్చే కేసులనూ పరిష్కరిస్తుంది.
  • సభ్య దేశాలలో ద్రవ్య స్థిరత్వానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ బాధ్యత వహిస్తుంది.
  • యూరోపియన్ కోర్ట్ ఆఫ్ ఆడిటర్స్ ఇయు సంస్థలలోను, దాని సభ్య దేశాలకు అందించిన ఇయు నిధుల విషయం లోనూ ఆర్థిక నిర్వహణపై దర్యాప్తు చేస్తుంది. పర్యవేక్షణ, సలహాలను అందించడంతో పాటు, ఏవైనా అవకతవకలపై మధ్యవర్తిత్వం వహిస్తుంది. పరిష్కరించని సమస్యలను యూరోపియన్ న్యాయస్థానానికి తీసుకెళ్తుంది.

యూరోపియన్ పార్లమెంట్

యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షురాలు రోబెర్టా మెట్సోలా

యూరోపియన్ పార్లమెంటు ఇయు యొక్క మూడు శాసన వ్యవస్థలలో ఒకటి. ఇది యూరోపియన్ యూనియన్ కౌన్సిల్‌తో కలిసి కమిషన్ ప్రతిపాదనలను సవరించడం, ఆమోదించడం చేస్తుంది. యూరోపియన్ పార్లమెంటు (ఎంఇపి) లోని 705 మంది సభ్యులను అనుపాత ప్రాతినిధ్యం ఆధారంగా ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఇయు పౌరులు ఎన్నుకుంటారు . ఎంఇపిలు జాతీయ ప్రాతిపదికన ఎన్నుకోబడతారు. వారు తమ జాతీయత కంటే రాజకీయ సమూహాల ప్రకారం కూర్చుంటారు. ప్రతి దేశానికి నిర్ణీత సంఖ్యలో సీట్లు ఉన్నాయి. ఇది ఉప-జాతీయ నియోజకవర్గాలుగా విభజించబడింది. ఇక్కడ ఇది ఓటింగ్ వ్యవస్థ యొక్క దామాషా స్వభావాన్ని ప్రభావితం చేయదు.[101]

సాధారణ శాసన విధానంలో, యూరోపియన్ కమిషన్ చట్టాన్ని ప్రతిపాదిస్తుంది, దీనికి యూరోపియన్ పార్లమెంటు, యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ల సంయుక్త ఆమోదం అవసరం. ఈ ప్రక్రియ ఇయు బడ్జెట్‌తో సహా దాదాపు అన్ని అంశాలకూ వర్తిస్తుంది. కమిషనులో కొత్త సభ్యత్వ ప్రతిపాదనలను సభ్యత్వాన్ని ఆమోదించడం, తిరస్కరించడాల్లో పార్లమెంటుదే తుది నిర్ణయం. కమిషన్‌ను అభిశంసించేందుకు పార్లమెంటు న్యాయస్థానానికి అప్పీల్ చేయవచ్చు. యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు పార్లమెంటులో స్పీకర్ పాత్రను నిర్వహిస్తారు. బయటి ప్రపంచానికి దానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఎంఇపిలు అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు.[102]

యూరోపియన్ కౌన్సిల్

యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిచెల్

యూరోపియన్ కౌన్సిల్ ఇయుకి రాజకీయ దిశానిర్దేశం చేస్తుంది. ఇది కనీసం నాలుగు సార్లు ఒక సంవత్సరం సమావేశమవుతుంది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు (ప్రస్తుతం చార్లెస్ మిచెల్), యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు, ప్రతి సభ్యదేశానికి ఒక ప్రతినిధి (దాని దేశాధినేతగా లేదా ప్రభుత్వాధినేత) దీనిలో సభ్యులుగా ఉంటారు. యూనియన్ ఫర్ ఫారిన్ అఫైర్స్ అండ్ సెక్యూరిటీ పాలసీ (ప్రస్తుతం ఫెడెరికా మొఘేరిని) యొక్క ప్రతినిధి కూడా దాని సమావేశాలలో పాల్గొంటారు. దీనిని యూనియన్ యొక్క "సుప్రీం రాజకీయ అధికారం" అని కొందరు అభివర్ణించారు.[103] ఇది ఒప్పందంలో చెయ్యదలచిన మార్పుల చర్చలలో చురుకుగా పాల్గొంటుంది. ఇయు విధాన ఎజెండాను, వ్యూహాలనూ నిర్వచిస్తుంది.

సభ్య దేశాలు, సంస్థల మధ్య వివాదాలను పరిష్కరించడానికి, వివాదాస్పద సమస్యలు, విధానాలపై రాజకీయ సంక్షోభాలను విభేదాలనూ పరిష్కరించడానికీ యూరోపియన్ కౌన్సిల్ తన నాయకత్వ పాత్రను ఉపయోగిస్తుంది. బయటివారికి ఇది " సామూహిక దేశాధినేత "గా పనిచేస్తుంది. ముఖ్యమైన పత్రాలను ఆమోదిస్తుంది (ఉదాహరణకు, అంతర్జాతీయ ఒప్పందాలు ఒడంబడికలు).[104]

యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడి విధులు: ఇయుకు ప్రాతినిధ్యం వహించడం,[105] ఏకాభిప్రాయాన్ని సాధించడం, సభ్య దేశాల మధ్య విభేదాలను పరిష్కరించడం - యూరోపియన్ కౌన్సిల్ సమావేశాలు జరిగేటపుడూ, వాటి మధ్య కాలాల్లోనూ.

స్ట్రాస్‌బోర్గ్‌లోని ఉన్నస్వతంత్ర అంతర్జాతీయ సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ ఐరోపా‌కు యూరపియన్ యూనియన్‌కూ ఏ సంబంధమూ లేదు. దాన్ని యూరోపియన్ కౌన్సిల్ అని అనుకోవడం పొరపాటు.

యురోపియన్ కమీషన్

యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్

యూరోపియన్ కమిషన్ ఇయు కార్యనిర్వాహక శాఖ. ఇయు రోజువారీ నిర్వహణకు ఇది బాధ్యత వహిస్తుంది. చర్చకు చట్టాలను ప్రతిపాదించి, చర్చకు తీసుకువచ్చే బాధ్యత, అధికారం కలిగిన ఏకైన శక్తి.[106][107][108] కమిషన్ 'ఒప్పందాల సంరక్షణకు', వాటిని సమర్థవంతంగా అమలు పరచడానికి, అమలును పర్యవేక్షించడానికీ బాధ్యత వహిస్తుంది.[109] వివిధ విధాన రంగాల కోసం 27 మంది కమిషనర్లతో (ఒక్కో సభ్య దేశం నుండి ఒకరు) ఇది క్యాబినెట్ ప్రభుత్వం లాగా పనిచేస్తుంది. కమిషనర్లు తమ సొంత దేశ ప్రయోజనాలను కాకుండా మొత్తం ఇయు ప్రయోజనాలకు అనుగుణంగా పనిచెయ్యాలి

ఈ 27 మందిలో ఒకరు యూరోపియన్ కమిషన్‌కు అధ్యక్షుడౌతారు. అధ్యక్షుడిని పర్లమెంటు అనుమతితో యూరోపియన్ కౌన్సిల్ నియమిస్తుంది.,యూనియన్ ఫర్ ఫారిన్ అఫైర్స్ అండ్ సెక్యూరిటీ పాలసీ యొక్క హై రిప్రజెంటేటివ్, అధ్యక్షుడి తరువాతి స్థానంలో ఉండే ప్రముఖ కమిషనరు. ఇతనే కమిషన్‌కు ఎక్స్-అఫిషియో ఉపాధ్యక్షుడు. ఇతన్ని కూడా యూరోపియన్ కౌన్సిల్ ఎన్నుకుంటుంది.[110] మిగతా 26 మంది కమిషనర్లను నామినేటెడ్ అధ్యక్షుడి సమ్మతితో కౌన్సిల్ ఆఫ్‌ ది యూరోపియన్ యూనియన్ నియమిస్తుంది. మొత్తం 27 మంది కమిషనర్లు ఒకే సంస్థగా యూరోపియన్ పార్లమెంట్ ఓటు ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుంది.

కౌన్సిల్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్

కౌన్సిల్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ (దీనిని "కౌన్సిల్"[111] అనీ, "కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్" అనే దీని పాత పేరుతోటీ కూడా పిలుస్తారు)[112] ఇయు యొక్క శాసనవ్యవస్థలో ఇదొక సగం. ఒక్కో సభ్య దేశం నుండి ఒక ప్రభుత్వ మంత్రి ఇందులో ఉంటారు. విభిన్న ఆకృతీకరణలు ఉన్నప్పటికీ, ఇది ఒకే శరీరంగా పరిగణించబడుతుంది.[113] కౌన్సిల్ దాని శాసన విధులతో పాటు, ఉమ్మడి విదేశీ, భద్రతా విధానాలకు సంబంధించిన కార్యనిర్వాహక విధులను కూడా నిర్వహిస్తుంది.

కొన్ని విధానాలలో, యూనియన్‌లోని ఇతర సభ్యులతో వ్యూహాత్మక పొత్తులు పెట్టుకునే అనేక సభ్య దేశాలు ఉన్నాయి. అటువంటి పొత్తులకు ఉదాహరణలు వైసెగ్రాడ్ గ్రూప్, బెనెలక్స్, బాల్టిక్ అసెంబ్లీ, న్యూ హన్సేటిక్ లీగ్, క్రైయోవా గ్రూప్ .

బడ్జెట్

యూరోపియన్ యూనియన్ 2014-2020 బహువార్షిక ఆర్థిక ముసాయిదా[114]

2007 సంవత్సరానికి ఇయు అంగీకరించిన బడ్జెట్ € 120.7 బిలియన్లు. 2007–2013 కాలానికి €864.3 బిలియన్లు. ఈ బడ్జెట్లు, పై కాలావధులకు చెందిన EU-27 యొక్క స్థూల జాతీయాదాయం అంచనాల్లో 1.10%, 1.05% ఉంటాయి. 1960 లో, అప్పటి యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ బడ్జెట్ జిడిపిలో 0.03% ఉండేది.[115]

2010 బడ్జెట్‌ €141.5 బిలియన్లలో, అతిపెద్ద బడ్జెట్ వ్యయం "సమన్వయం & పోటీతత్వం" పై పెట్టారు. ఇది మొత్తం బడ్జెట్‌లో 45%.[116] తరువాత స్థానంలో 31%తో " వ్యవసాయం " వస్తుంది.[116] "గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, మత్స్య సంపద"కు సుమారు 11% కేటాయించారు.[116] "పరిపాలన" సుమారు 6%,[116] " గ్లోబల్ పార్టనర్‌గా ఇయు ", " పౌరసత్వం, స్వేచ్ఛ, భద్రత, న్యాయం" 6%, 1%తో చివర్లో వస్తాయి.[116]

"ఖాతాల విశ్వసనీయత గురించి, అంతర్లీన లావాదేవీల చట్టబద్ధత, క్రమబద్ధతల గురించి హామీ ప్రకటన"ను పార్లమెంటుకు, కౌన్సిల్‌కు (ప్రత్యేకించి ఆర్థిక, విత్త వ్యవహారాల మండలి) ఇవ్వాల్సిన చట్టబద్ధ బాధ్యత కోర్ట్ ఆఫ్ ఆడిటర్స్ ది.[117] ఆర్థిక చట్టం పైన, మోసం నిరోధక చర్యలపైన కోర్టు తన అభిప్రాయాలు, ప్రతిపాదనలు ఇస్తుంది.[118] కమిషన్ బడ్జెట్ నిర్వహణను ఆమోదించాలా వద్దా అని నిర్ణయించడానికి పార్లమెంట్ దీనిని ఉపయోగించుకుంటుంది.

యూరోపియన్ కోర్ట్ ఆఫ్ ఆడిటర్స్ 2007 నుండి ప్రతి సంవత్సరం యూరోపియన్ యూనియన్ ఖాతాలపై సంతకం చేస్తూ వచ్చింది. యూరోపియన్ కమిషన్‌ చెయ్యాల్సినది చాలానే ఉందని స్పష్టం చేస్తూనే, చాలా లోపాలు జాతీయ స్థాయిలో జరుగుతున్నాయని హైలైట్ చేసింది.[119][120] 2009 లో తమ నివేదికలో ఆడిటర్లు యూనియన్ వ్యయం, వ్యవసాయం, సమన్వయ నిడులలోని ఐదు రంగాలు లోపంతో భౌతికంగా ప్రభావితమయ్యాయని కనుగొన్నారు.[121] 2009 లో అవకతవకల ఆర్థిక ప్రభావం €1,863 మిలియన్లు ఉంటుందని యూరోపియన్ కమిషన్ అంచనా వేసింది.[122]

యోగ్యతలు

యూరోపియన్ యూనియన్‌కు స్పష్టంగా ఇవ్వని అధికారాలన్నీ ఇయు సభ్య దేశాల వద్దే ఉంటాయి. కొన్ని అంశాల్లో ఇయు తనకే ప్రత్యేకించిన యోగ్యత పొందుతుంది. ఈ అంశాలకు సంబంధించి చట్టాన్ని రూపొందించే తమ యోగ్యతను వదులుకున్నాయి. ఇతర అంశాలలో EU, దాని సభ్య దేశాలూ చట్టం చేసే యోగ్యతను పంచుకుంటాయి. రెండూ చట్టం చేయగలిగినప్పటికీ, ఇయు చెయ్యని పరిధిలో మాత్రమే సభ్యదేశాలు చెయ్యగలవు. ఇతర విధాన రంగాలలో, ఇయు సభ్య దేశాల చర్యలను సమన్వయం చేయగలదు, మద్దతు ఇవ్వగలదు, అంతే. చట్టాన్ని రూపొందించదు.[123]

అంతర్గత వ్యవహారాలు, వలస వ్యవహారాలు

1993 లో ఇయు ఏర్పడినప్పటి నుండి, ఇది న్యాయ, అంతర్గత వ్యవహారాల విషయంలో దాని సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంది - మొదట ఇంటర్ గవర్నమెంటల్ స్థాయిలో, ఆ తరువాత అధిజాతీయవాదం ద్వారా. దీని ప్రకారం, నేరస్థుల అప్పగించడం,[124] కుటుంబ చట్టం,[125] ఆశ్రయం చట్టం,[126] నేర న్యాయం వంటి రంగాలలో యూనియన్ చట్టాన్ని రూపొందించింది.[127] లైంగిక, జాతీయ వివక్షకు వ్యతిరేకంగా నిషేధాలు చాలాకాలంగా ఒప్పందాలలో భాగంగా ఉన్నాయి.[o] ఇటీవలి సంవత్సరాలలో, జాతి, మతం, వైకల్యం, వయస్సు, లైంగిక ధోరణి ఆధారంగా వివక్షకు వ్యతిరేకంగా చట్టాన్ని రూపొందించే అధికారాలు కూడా వీటికి తోడయ్యాయి.[p] ఈ అధికారాల వల్లనే, కార్యాలయంలో లైంగిక వివక్షత, వయస్సు వివక్ష, జాతి వివక్షలపై ఇయు, చట్టాలు చేసింది.[q]

సభ్య దేశాలలో పోలీసు, ప్రాసిక్యూటరీ, ఇమ్మిగ్రేషన్ నియంత్రణలను సమన్వయం చేయడానికి యూరపియన్ యూనియన్, ఏజెన్సీలను ఏర్పాటు చేసింది: పోలీసు బలగాల సహకారం కోసం యూరోపోల్,[128] ప్రాసిక్యూటర్ల మధ్య సహకారం కోసం యూరోజస్ట్,[129] సరిహద్దు నియంత్రణ అధికారుల మధ్య సహకారం కోసం ఫ్రంటెక్స్ లను నెలకొల్పింది.[130] ఇయు షెన్‌జెన్ ఇన్ఫర్మేషన్ సిస్టాన్ని[15] కూడా నిర్వహిస్తుంది, ఇది పోలీసు, ఇమ్మిగ్రేషన్ అధికారులకు కామన్ డేటాబేసును అందిస్తుంది. ముఖ్యంగా షెన్‌జెన్ ఒప్పందంతో వచ్చిన నిర్నిరోధ సరిహద్దులు, తద్వారా సరిహద్దులు దాటిన నేరాల కారణంగా ఈ సహకారాన్ని అభివృద్ధి చెయ్యాల్సి వచ్చింది.

విదేశీ సంబంధాలు

G8, G20 సమావేశాలన్నిటిలో ఇయు పాల్గొంటుంది. (చైనాలోని హాంగ్‌జౌలో జి 20 శిఖరాగ్ర సమావేశం).

సభ్య దేశాల మధ్య విదేశాంగ విధాన సహకారం 1957 లో సంఘం స్థాపించబడినప్పటి నుండి, సభ్య దేశాలు ఇయు యొక్క సాధారణ వాణిజ్య విధానం ప్రకారం అంతర్జాతీయ వాణిజ్య చర్చలలో ఒక కూటమిగా చర్చలు జరిపాయి.[131] విదేశీ సంబంధాలలో మరింత విస్తృతమైన సమన్వయం కోసం 1970 లో యూరోపియన్ రాజకీయ సహకారాన్ని (ఇపిసి) స్థాపించారు. దీంతో కామన్ విదేశీ విధానాలను రూపొందించే లక్ష్యంతో సభ్య దేశాల మధ్య అనధికారిక సంప్రదింపుల ప్రక్రియ మొదలైంది. 1987 లో సింగిల్ యూరోపియన్ చట్టం ద్వారా, యూరోపియన్ రాజకీయ సహకారాన్ని (ఇపిసి) అధికారికంగా ప్రవేశపెట్టారు. మాస్ట్రిక్ట్ ఒప్పందం ద్వారా ఇపిసిని కామన్ ఫారిన్ అండ్ సెక్యూరిటీ పాలసీ (CFSP) గా మార్చారు.[132]

అంతర్జాతీయ సహకారం, మానవ హక్కుల పట్ల గౌరవం, ప్రజాస్వామ్యం చట్ట పాలనతో సహా ఇయు యొక్క సొంత ప్రయోజనాలనూ మొత్తం అంతర్జాతీయ సమాజ ప్రయోజనాలనూ ప్రోత్సహించడం CFSP లక్ష్యాలు.[133] ఏదైనా నిర్దిష్ట సమస్యపై అనుసరించాల్సిన విధానంపై సిఎఫ్‌ఎస్‌పి, సభ్య దేశాలలో ఏకాభిప్రాయం సాధించాలి. CFSP వ్యవహరించే కొన్ని క్లిష్టసమస్యల్లో కొన్ని (ఇరాక్ యుద్ధం లాంటి సమస్యలు) విభేదాలకు దారితీస్తాయి.[134]

ఐరోపా సమాఖ్య (యూరోపియన్ యూనియన్) ఐరోపాలో ఉన్న 28 సభ్యదేశాల రాజకీయ, ఆర్థిక సమాఖ్య. ప్రాంతీయ సమైక్యతకు కట్టుబడిన ఐరోపా సమాఖ్య 1993 నాటి మాస్ట్రిచ్ ఒడంబడిక ఆధారంగా, అప్పటికే పనిచేస్తున్న ఐరోపా ఆర్థిక సముదాయము (యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ) పునాదిగా స్థాపించబడింది. 50 కోట్ల జనాభా పైబడి కలిగిన ఐరోపా సమాఖ్య, స్థూల ప్రపంచ ఉత్పత్తిలో 30% వాటా కలిగి ఉంది. ఐరోపా సమాఖ్యలోని పదహారు సభ్యదేశాల అధికారిక మారక ద్రవ్యం యూరో. వీటిని సంయుక్తంగా యూరోజోన్ అని సంబోధిస్తారు.

ఇవి కూడ చుడండి

సారా పీటర్

గమనికలు

మూలాలు