వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (వ్యక్తులు)

వికీపీడియాలో వ్యాసం ఉండాలా లేదా అనేది నిర్ణయించేందుకు చేసే పరీక్షే విషయ ప్రాముఖ్యత. వ్యక్తుల విషయంలోనైతే, వారి జీవితచరిత్ర వ్యాసం రాయాలంటే వారు వికీపీడియాలో రాసేందుకు "అర్హత కలిగి ఉండాలి" లేదా "గమనించదగ్గ స్థాయిలో ఉండాలి" అంటే "విశిష్టత ఉండాలి" లేదా వారు "ముఖ్యమైన, ఆసక్తికరమైన లేదా ప్రత్యేకంగా పరిశీలించాల్సినంత అసాధారణమైన" వారై ఉండాలి. "విషయ ప్రాముఖ్యత"కు సంబంధించినంత వరకూ ప్రసిద్ధమైనది లేదా జనాదరణ పొందినది అనే అర్థానిది ద్వితీయస్థానమే. అయితే అది మరీ పట్టించుకోరానిదేమీ కాదు.

జీవిత చరిత్ర వ్యాసాల విషయ ప్రాముఖ్యత కోసం ఏర్పరచుకున్న ఈ మార్గదర్శకం [1] ఇంగ్లీషు వికీపీడియాలో చర్చల ద్వారా చేరుకున్న ఏకాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక వ్యక్తి గురించి వ్యాసం రాయాలా, విలీనం చేయాలా, తొలగించాలా లేదా మరింత అభివృద్ధి చెయాలా అనే దాన్ని నిర్ణయించడానికి దారి చూపిస్తుంది. జీవితచరిత్ర కథనాలను ఎలా రాయాలో సలహా కోసం , వికీపీడియా: శైలి, వికీపీడియా: జీవన వ్యక్తుల జీవిత చరిత్రలు చూడండి.

వ్యాసం శీర్షిక వ్యాసం దేని గురించి రాసారో నిర్వచించాలి. ఒక వ్యక్తి గురించి చెప్పేందుకు సరిపడా సముచితమైన సమాచారం ఉంటే, ఆ వ్యాసానికి ఆ వ్యక్తి పేరే పెట్టవచ్చు. ఉదాహరాణ: శ్రీశ్రీ అయితే, వ్యక్తికి సంబంధించి ఒక ముఖ్యమైన సంఘటన గురించి మాత్రమే తగినంత సమాచారం ఉంటే, ఆ వ్యాసానికి ఆ సంఘటన పేరే పెట్టాలి. ఉదాహరణకు గొల్ల హంపన్న హత్య. కొన్నిసార్లు ఒక ప్రసిద్ధ వ్యక్తి మరణించినప్పుడు, వారి మరణం లేదా హత్య గురించే ఒక వ్యాసానికి తగినంత సమాచారం ఉండవచ్చు. ఉదాహరణకు రాజీవ్ గాంధీ హత్య. ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించిన ప్రధాన వ్యాసంలో వారి రచనలు గానీ, సినిమాలు గానీ, ఇతర అంశాలు గానీ.. చేర్చలేనన్ని ఎక్కువ ఉంటే వాటన్నిటినీ ప్రత్యేక వ్యాసంగా చేయవచ్చు. ఉదాహరణకు శ్రీశ్రీ రచనల జాబితా. ఒక ప్రముఖ వ్యక్తి వృత్తికి సంబంధించిన విశేషాలు జీవిత చరిత్ర వ్యాసంలో చేర్చలేనంతగా ఉంటే దాన్ని ప్రత్యేక వ్యాసంగా రాయవచ్చు. ఉదాహరణకు జవాహర్‌లాల్ నెహ్రూ రాజకీయ జీవితం, 1945-1947.

ప్రాథమిక ప్రమాణాలు

ఒక వ్యక్తి గురించి ఒకదానికొకటి మేధోపరంగా సంబంధం లేని, ఆ వ్యక్తికి కూడా సంబంధం లేని, అనేక ద్వితీయ స్థాయి ప్రచురణల్లో, గణనీయంగా ప్రచురితమై ఉంటే ఆ వ్యక్తికి విషయ ప్రాముఖ్యత ఉన్నట్లే. [2] [3]

  • ఏ ఒక్క వనరులో కూడా సరిపడినంత లోతుగా కవరేజి లేకపోతే, కొన్ని స్వతంత్ర వనరులలో వచ్చిన కవరేజీని కలిపి ప్రాముఖ్యత లభిస్తుందేమో చూడవచ్చు; ద్వితీయ స్థాయి వనరుల్లో ఆ వ్యక్తి గురించి ఏదో స్వల్ప ప్రస్తావన ఉంటే విషయ ప్రాముఖ్యతకు అది సరిపోదు. [4]
  • ఒక వ్యాసంలోని కంటెంటుకు మద్దతుగా ప్రాథమిక వనరులు పనికొస్తాయి. కాని అవి ఆ వ్యక్తి ప్రాముఖ్యతను రుజువు చేయడానికి పనికిరావు.

ఈ ప్రాథమిక ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వ్యక్తులకు నేరుగా విషయ ప్రాముఖ్యత ఉన్నట్లే. వారు దిగువ చూపిన అదనపు ప్రమాణాలను అందుకోనక్కర్లేదు. కానీ మినహాయింపు ప్రమాణాల క్రిందకు వస్తే మాత్రం - అంటే, ఉదాహరణకు ఒకే సంఘటనకు సంబంధించి మాత్రమే ప్రాముఖ్యత ఉన్నవారు, లేదా వికీపీడియా:ఏది వికీపీడియా కాదు కీందికి వచ్చే అంశాలు - వారికి పేజీ సృష్టించరాదు.

అదనపు ప్రమాణాలు

కింది ప్రమాణాలలో దేనికైనా అనుగుణంగా ఉన్న వ్యక్తులకు ప్రాముఖ్యత ఉండే అవకాశం ఉంది. ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేనట్లైతే ఇక దానికి ప్రాముఖ్యత లేనట్లే ననే నిశ్చయానికి రాలేం; అలాగే ఈ ప్రమాణాల్లో ఒకటో అంతకంటే ఎక్కువో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తికి పేజీ ఉండవచ్చని నిర్ధారించినట్లేమీ కాదు

ఈ అదనపు ప్రమాణాలకు అనుగుణంగా లేనప్పటికీ ఆ వ్యక్తికి వికీపీడియా:విషయ ప్రాముఖ్యత ఉండవచ్చు. ఈ ప్రమాణాలను అనుసరించి వాడుకరులు అదనపు ఉల్లేఖనలు చూపమని ట్యాగు పెట్టవచ్చు, లేదా తొలగింపు చర్చను ప్రారంభించాలా అనే నిర్ణయం తిసుకోవచ్చు.

ఏ జీవిత చరిత్ర కైనా

  1. ఆ వ్యక్తికి ఏదైనా సుప్రసిద్ధమైన, ముఖ్యమైన పురస్కారం లేదా గౌరవం లభించి ఉంటే, లేదా అలాంటి పురస్కారానికి అనేకసార్లు నామినేట్ అయి ఉంటే.
  2. ఆ వ్యక్తి ఒక నిర్దుష్టమైన రంగానికి చెందిన చారిత్రక రికార్డులో శాశ్వతంగా నిలిచిపోయేంతటి గుర్తింపు పొందిన కృషి చేసి ఉంటే. [5]
  3. ఆ వ్యక్తి ఏదైనా దేశపు ప్రామాణిక జాతీయ జీవితచరిత్ర నిఘంటువులో చీటు లభించి ఉంటే (ఉదా. డిక్షనరీ ఆఫ్ నేషనల్ బయోగ్రఫీ ).

విద్యావేత్తలు

చాలామంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు, తత్వవేత్తలు, ఇతర పండితులు ( సౌలభ్యం కోసం అందరినీ కలిపి "విద్యావేత్తలు " అనవచ్చు) వారి ఆలోచన లు, దార్శనికత కారణంగా ప్రాముఖ్యత సంపాదించుకుని ఉంటారు. అలాంటి వారి జీవిత చరిత్రలు ద్వితీయ మూలాల్లో ప్రచురితం కాకున్నా, వారికి విషయ ప్రాముఖ్యత ఉన్నట్లుగా భావించవచ్చు.

సృజనాత్మక నిపుణులు

రచయితలు, సంపాదకులు, జర్నలిస్టులు, చిత్రనిర్మాతలు, ఫోటోగ్రాఫర్లు, కళాకారులు, వాస్తుశిల్పులు, ఇతర సృజనాత్మక నిపుణులు:

  1. ఆ వ్యక్తి ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడి ఉండాలి. లేదా తోటివారు లేదా వారసులు విస్తృతంగా వారిని ఉల్లేఖించి ఉండాలి.
  2. ఆ వ్యక్తి ఒక ముఖ్యమైన కొత్త భావన, సిద్ధాంతం లేదా సాంకేతికతను సృజించి ఉండాలి.
  3. ఒక ముఖ్యమైన లేదా ప్రసిద్ధమైన పనిని లేదా సమిష్టి పనిని సృష్టించడంలో ఆ వ్యక్తి ప్రధానమైన పాత్ర పోషించి ఉండాలి. అంతే కాకుండా, వారు చేసిన కృషి స్వతంత్ర, గుర్తించదగిన కృతి యొక్క ప్రాధమిక అంశం గానీ (ఉదాహరణకు, ఒక పుస్తకం, చలనచిత్రం లేదా టెలివిజన్ ధారావాహిక. కానీ సాధారణంగా టెలివిజన్ ధారావాహికలో ఒక్క ఎపిసోడ్ అయి ఉండకూడదు) లేదా బహుళ స్వతంత్ర పత్రికా కథనాలు లేదా సమీక్షలు అయి ఉండాలి
  4. వ్యక్తి చేసిన కృతి (లేదా కృతులు): (ఎ) ఒక ముఖ్యమైన స్మారక చిహ్నంగా మారింది, (బి) ఒక ముఖ్యమైన ప్రదర్శనలో గణనీయమైన భాగంగా ఉంది, (సి) గణనీయమైన పరిశీలనాత్మక విమర్శలు పొందింది లేదా (డి) గ్యాలరీలు లేదా మ్యూజియంలు వంటి అనేక ముఖ్యమైన శాశ్వత సేకరణలలో భాగంగా ఉంది

నేరస్థులు, నేర బాధితులు

ఒక నేర సంఘటనకు లేదా నేర విచారణకు సంబంధించి మాత్రమే ఓ వ్యక్తి గుర్తింపు పొంది ఉంటే, ఆ సమాచారాన్ని చేర్చేందుకు తగిన వ్యాసం ఈసరికే వికీపీడియాలో ఉంటే, ఇక ఆ వ్యక్తికి ప్రత్యేకంగా వ్యాసాన్ని సృష్టించనవసరం లేదు.

ఒకవేళ అలాంటి వ్యాసం లేనట్లయితే, కింది వాటిలో ఏదో ఒకటి వర్తించిన పక్షంలో మాత్రమే ఆ నేరస్థుడు లేదా బాధితుడికి వికీపీడియా వ్యాసం సృష్టించవచ్చు:

బాధితులు, చేయని తప్పుకు నిందితులైనవారు లేదా చేయని తప్పుకు శిక్ష పడినవారి విషయంలో

  1. వారు వికీపీడియా:జీవించి ఉన్నవారి జీవిత చరిత్రలు లో చూపినట్లుగా ఒక సంఘటనలో మాత్రమే గుర్తింపు పొందిన వారైతే, ప్రచురణల్లో వివరంగా చిత్రించబడిన చారిత్రిక సంఘటనలో వారి ప్రసక్తి ప్రముఖంగా ఉండాలి. విశ్వసనీయ ద్వితీయ వనరులలో ఆ సంఘటనకు వచ్చిన నిరంతర కవరేజిలో ఆ వ్యక్తి పాత్ర గణనీయంగా ఉండడం ద్వారా చారిత్రిక ప్రాముఖ్యత సూచించబడుతుంది.

నేరస్థుల విషయంలో

  1. ఈ నేరంలో బాధితుడు ప్రసిద్ధ వ్యక్తి అయిన పక్షంలో
  2. నేరానికి ప్రేరణ లేదా నేరం చేసిన పద్ధతి అసాధారణమైనదైతే, చక్కగా నమోదు చేయబడిన చారిత్రిక సంఘటన అయితే. సాధారణంగా, విశ్వసనీయ ద్వితీయ వనరులలో ఆ సంఘటనకు వచ్చిన నిరంతర కవరేజిలో ఆ వ్యక్తి పాత్ర గణనీయంగా ఉండడం ద్వారా చారిత్రిక ప్రాముఖ్యత సూచించబడుతుంది.

గమనిక: ఒక న్యాయస్థానం తన తీఊర్పు ద్వారా నిర్ణయించచే వరకు, నేరారోపణ చేయబడ్డ వ్యక్తి నేరస్థుడు కాదనే భావించాలి. తీర్పు వెలువడక ముందే, నేరారోపణ చేయబడ్డ వ్యక్తికి వ్యాసం సృష్టించడంలో వాడుకరులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.

వినోదాన్ని అందించేవారు

నటులు, డబ్బింగు కళాకారులు, హాస్య కళాకారులు, అభిప్రాయ సేకర్తలు, అశ్లీల చిత్రాల నటులు, మోడల్ కళాకారులు, ప్రముఖులు:

  1. బహుళ సంఖ్యలో చిత్రాలు, టెలివిజన్ కార్యక్రమాలు, రంగస్థల ప్రదర్శనలు తదితర నిర్మాణాలలో ముఖ్యమైన పాత్రలు పోషించి ఉండాలి.
  2. పెద్ద సంఖ్యలో అభిమానులుండ్లి, లేదా గణనీయమైన సంఖ్యలో "కల్ట్" ఫాలోయింగ్ ఉండాలి.
  3. వినోద రంగంలో ఏదైనా విశిష్టమైన, ఫలప్రదమైన లేదా వినూత్నమైన కృషి చేసి ఉండాలి.

రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు

  1. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఏదైనా పదవిని నిర్వహించి ఉండాలి, లేదా ఈ స్థాయిల్లో శాసనసభల సభ్యులై ఉండాలి. [13] అటువంటి పదవికి ఎన్నికై, ఇంకా ప్రమాణ స్వీకారం చెయ్యనివాళ్ళకు కూడా పేజీ ఉండవచ్చు.
  2. గణనీయమైన స్థాయిలో పత్రికల్లో కవరేజీ వచ్చిన రాజకీయ ప్రముఖులు. [8]
  3. స్థానికంగా ఏదైనా పదవికి ఎన్నికైన అధికారి లేదా రాజకీయ పదవికి ఇంకా ఎన్నిక కాని అభ్యర్థులకూ విషయ ప్రాముఖ్యత ఉండదు. కానీ సాధారణ విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటే వారికి విషయ ప్రాముఖ్యత ఉన్నట్లే.

క్రీడా ప్రముఖులు

క్రీడాకారులు ఏదైనా ప్రధాన ఔత్సాహిక లేదా వృత్తిపరమైన పోటీలో చురుకుగా పాల్గొన్నట్లయితే లేదా ఒక ముఖ్యమైన గౌరవాన్ని గెలుచుకున్నట్లయితే, ఆ విషయమై వారికి స్వతంత్రమైన, విశ్వసనీయమైన, ద్వితీయ స్థాయి వనరులలో గణనీయమైన కవరేజి లభించే అవకాశం ఉంది. అలాంటి క్రీడాకారులకు విషయ ప్రాముఖ్యత ఉన్నట్లుగా భావించాలి.

చెల్లని ప్రమాణాలు

  • ఒక వ్యక్తి (క అని అనుకుందాం) మరో ప్రసిద్ధ వ్యక్తి (గ అని అనుకుందాం) జీవిత భాగస్వామి లేదా సంతానం అయినంత మాత్రాన ఆ వ్యక్తికి విషయ ప్రాముఖ్యత చేకూరదు. (ఆ ప్రముఖ్య వ్యక్తికి చెందిన వాసంలో వీరికి గణనీయమైన కవరేజీ ఉంటే తప్ప); చుట్టరికాలు విషయ ప్రాముఖ్యతను చేకూర్చవు. అయితే, గ కు చెందిన వ్యాసంలో క ను చేర్చవచ్చు.
  • సెర్చ్ ఇంజన్ గణాంకాల ఆధారంగా ప్రమాణాలను నిర్ధారించరాదు (ఉదాహరణకు, గూగుల్ హిట్స్ లేదా అలెక్సా ర్యాంకింగ్) లేదా ఆన్‌లైన్‌లో ప్రచురించబడిన వ్యక్తి ఫోటోల సంఖ్యను బట్టి ప్రాముఖ్యతను కొలవరాదు. కొన్ని అనుచితమైన పద్ధతుల ద్వారా సెర్చి ఇంజను ర్యాంకులను ప్రభావితం చేయవచ్చు. [6] చాలా సందర్భాల్లో శోధించేటపుడు ఈ ఇంజన్లు ఉపయోగకరమైన వనరులకు కేవలం పాఠ్యం సరిపోలడానికీ మధ్య తేడాను కనిపెట్టలేవు. ఉదాహరణకు, అలెక్సా టూల్‌బార్ ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, అది ఎంతవరకు పనికొస్తుందనేది దాని వాడుకరుల సంఖ్యలు వారి సుముఖతలపై ఆధారపడి ఉంటుంది. డేటా ఎంత తక్కువగా ఉంటే దోష పరిధి అంతగా పెరుగుతుంది. ఒక అంశం యొక్క విశిష్టతను స్థాపించడంలో సహాయపడటానికి శోధన ఇంజిన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, లింకుల నాణ్యతను లెక్కించాలి, సంఖ్యను కాదు

అన్ని ప్రమాణాలలోనూ విఫలమైతే

ప్రత్యేకంగా వ్యాసం ఉండేందుకు గానీ, మరింత సాధారణమైన వ్యాసంలో చేర్చడం కోసం గానీ ప్రమాణాలు చాలకపోతే, పైగా వ్యాసంలో మెరుగుదలలు ఏమీ సాధ్యం కాకపోయినా లేదా చేసినవి సరిపొకపోయినా కింది మూడు తొలగింపు పద్ధతులను పరిగణించవచ్చు: [7]

  • వేగవంతమైన తొలగింపు ప్రమాణం A7 వర్తిస్తే, వేగవంతమైన తొలగింపు {{db-person}} ట్యాగ్‌ను నియోగించాలి.
  • వేగవంతమైన తొలగింపు ప్రమాణాలకు అనుగుణంగా లేనివి, కాని వివాదాస్పద తొలగింపు అభ్యర్థులు అయిన వాటికి {{subst:prod}} ట్యాగును నియోగించాలి. ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే ఏడు రోజుల తరువాత వ్యాసాన్ని తొలగించవచ్చు (వికీపీడియా: ప్రతిపాదిత తొలగింపు చూడండి ).
  • తొలగింపు చెయ్యాలో లేది ఇదమిత్థంగా తెలియకపోయినా, లేదా ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేస్తారేమోనని అనుకున్న సందర్భాల్లో, తొలగింపు ప్రక్రియ కోసం వ్యాసాల కోసం వ్యాసాన్ని నామినేట్ చేయండి, ఇక్కడ ఈ ప్రతిపాదనపై చర్చ 7 రోజుల పాటు జరిగాక, నిర్ణయం తీసుకుంటారు.

ప్రత్యేక సందర్భాలు

ప్రాథమిక ప్రమాణాల్లో విఫలమయ్యారు కానీ అదనపు ప్రమాణాలకు సరిపోతున్నారు

ప్రత్యేకంగా వ్యాసం రాసేందుకు తగునంత సంతృప్తికరమైన వివరణ గాని, లేదా ఆ స్థాయిలో మూలాలు గానీ లభించలేదు. కానీ అదనపు ప్రమాణాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటికి ఆ వ్యక్తి అనుగుణంగా ఉన్నారు. అలాంటి సందర్భంలో:

  • మరింత విస్తారంగా, సందర్భోచితంగా ఉన్న వ్యాసంలో విలీనం చెయ్యాలి.
  • పేజీలో {{విలీనం అక్కడ}} అనే మూసను పెట్టాలి. ఏ వ్యాసంలో విలీనం చెయ్యాలో ఆ వ్యాసం పేరును పరామితిగా ఇవ్వాలి.
  • విలీనం చేసేందుకు సరిపడే వ్యాసం ప్రస్తుతం లేనట్లయితే, ఆ వ్యాసాన్ని మీరే సృష్టించవచ్చు లేదా ఆ వ్యాసాన్ని అభ్యర్థించవచ్చు.

విషయ ప్రాముఖ్యతను వివరించడంలో వైఫల్యం

ఒక వ్యాసం దాని విషయ ప్రాముఖ్యతను వివరించ లేకపోతే, [8] దీనిని మెరుగుపరచడానికి కింది విధాల్లో ప్రయత్నించండి:

  • {{cleanup biography}} మూసను చేర్చండి. పుట్టిన తేదీ, చారిత్రక ప్రాముఖ్యత మొదలైనవాటిని చేర్చమని ఈ మూస అభ్యర్థిస్తుంది.
  • అవసరమైన సమాచారాన్ని మీరే చేర్చండి
  • వ్యాసంలో దిద్దుబాట్లు చేసిన వాడుకరులను సలహా అడగండి.

తగినన్ని మూలాలు లేకపోవడం

ఒక వ్యాసం తగినన్ని మూలాలను ఉదహరించకపోతే:

  • మూలాల కోసం మీరే వెతకండి
  • మూలాల కోసం ఎక్కడ చూడాలనే దానిపై వ్యాసంలో పనిచేసిన వాడుకరులను అడగండి.
  • ఇతర వాడుకరులకు తెలియజేయడానికి వ్యాసంలో పైన {{notability|biographies}} అనే మూసను చేర్చండి.
  • వ్యాసం ఒక ప్రత్యేక రంగం గురించి అయితే, ఆ రంగం గురించి పరిజ్ఞానం ఉన్న సంపాదకులను ఆకర్షించడానికి, ఆ రంగానికి చెందిన వికీప్రాజెక్టు వాడుకరుల దృష్టికి తీసుకెళ్ళేందుకు {{expert needed}} అనే మూసను చేర్చండి. ఆన్‌లైనులో లభించని మూలాలు వారికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ఒక సంఘటనలో మాత్రమే ప్రసిద్ధి చెందిన వ్యక్తులు

ఒక వ్యక్తి ఒకే ఒక్క సంఘటనలో మాత్రమే ప్రసిద్ధి గాంచినపుడు ఆ వ్యక్తికి వ్యాసం రాయాలా, లేక ఆ సంఘటనకు వ్యాసం రాయాలా లేక రెండింటికీ రాయాలా అనేది అస్పష్టంగా ఉండే అవకాశం ఉంది. విడివిడిగా వ్యాసాలను సృష్టించాలా వద్దా అనేది, ఆ సంఘటన ప్రాముఖ్యతను, దానిలో ఆ వ్యక్తి పాత్రను రెండింటినీ పరిగణించి నిర్ణయించాలి. సాధారణ నియమం ఏంటంటే.. వ్యాసం రాయాల్సింది సంఘటనకు, ఆ వ్యక్తికి కాదు. అయితే, సంఘటనకు, అందులో వ్యక్తి పాత్రకు రెండింటికీ మీడియా కవరేజి బాగా ఉంటే, విడివిడిగా పేజీలు పెట్టడమే సమర్థనీయం కావచ్చు. [9]

సంఘటన చాలా ముఖ్యమైనది అయ్యి, దానిలోని వ్యక్తి పాత్ర కూడా పెద్దది అయితే, విడీవిడి వ్యాసాలు రాయవచ్చు. బియాంత్ సింగ్ వంటి రాజకీయ నాయకుల హంతకులు ఈ వర్గానికి సరిపోతారు. ఈ సంఘటనకు నమ్మదగిన వనరులలో వచ్చిన విస్తృతమైన కవరేజిలో ఈ వ్యక్తి పాత్రపై గణనీయమైన కవరేజీ వచ్చింది.

సంఘటనలో వ్యక్తి పోషించిన పాత్ర ప్రాముఖ్యత తక్కువగా ఉన్నపుడు, ప్రత్యేకంగా వ్యాసం అవసరం ఉండకపోవచ్చు. దాని బదులు దారిమార్పు పేజీ సరిపోవచ్చు. మరోవైపు, ఒక సంఘటనకు తగినంత ప్రాముఖ్యత ఉంటే, అందులో పాల్గిన్నవారి పాత్ర సాపేక్షంగా స్వల్పంగా ఉన్నప్పటికీ కూడా వారికి ప్రత్యేకంగా పేజీలు అవసరం కావచ్చు.

ఒక చిన్న సంఘటనలో ఒక వ్యక్తి ప్రధాన పాత్ర పోషించిన సందర్భంలో మరొక సమస్య తలెత్తుతుంది. ఈ సందర్భంలో, వ్యక్తికి, సంఘటనకూ కూడా ప్రత్యేక పేజీలు ఉండటం సాధారణంగా సముచితం కాదు. సాధారణంగా ఈ సందర్భంలో, ప్రత్యేకించి ఆ సంఘటనకు సంబంధించి మాత్రమే ఆ వ్యక్తికి గుర్తింపు ఉంటే, వ్యక్తి పేరు నుండి సంఘటనపై వచ్చిన వ్యాసంణ్ పేజీకి దారిమార్పు చెయ్యాలి. అయితే, కొన్ని సందర్భాల్లో, ఒక సంఘటనకు మాత్రమే ప్రసిద్ధి పొందిన వ్యక్తి, ఈ సంఘటనను మించి ప్రసిద్ది చెందవచ్చు. ఇటువంటి సందర్భాల్లో, సంఘటన గురించిన వ్యాసాన్ని ఆ వ్యక్తి పేరిటనే పెట్టడం సముచితంగా ఉంటుంది.

వాడుకరులు సమస్యల గురించి తెలుసుకుని, అనవసరమైన మిథ్యా జీవిత చరిత్రలు, ముఖ్యంగా జీవించి ఉన్నవారి జీవిత చరిత్రల పేజీలను సృష్టించడాన్ని నివారించాలి.

"విషయ ప్రాముఖ్యత" అనేది "ప్రసిద్ధి"కి పర్యాయపదం కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఒకరు ఒక సంఘటన కారణంగా ప్రసిద్ధి చెందవచ్చు, అయితే ఒకటి కంటే ఎక్కువ సంఘటనలకు సంబంధించి విషయ ప్రాముఖ్యత ఉండవచ్చు. దీనికి విరుద్ధంగా, ఒక వ్యక్తి సాధారణంగా ప్రసిద్ధుడు కావచ్చు, కానీ ముఖ్యమైన కవరేజి మాత్రం ఆ వ్యక్తి పాల్గొన్న ఒకే ఒక సంఘటనపై కేంద్రీకృతమై ఉండవచ్చు.

వికీపీడియన్లపై వ్యాసాలు

కొంతమంది వికీపీడియా వాడుకరులకు వికీపీడియాలో వ్యాసాలు ఉండవచ్చు ( చూడండి: వ్యాసాలున్న వికీపీడియన్లు); అయితే, వికీపీడియాలో కృషి చేస్తున్న సంపాదకులు అనే హోదా, వారి విషయ ప్రాముఖ్యతను ఏ విధంగానూ ప్రభావితం చెయ్యదు. [10] (తమ వాసాలను తామే సృష్టించుకోవడం, తమ వ్యాసాల్లో తామే మార్పుచేర్పులు చెయ్యరాదు. అలా చెయ్యడం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ (అన్యథా ఆసక్తి) మార్గదర్శకానికి లోబడి ఉంటుంది.) ఆ వ్యాసాలన్నీ కూడా ఈ మార్గదర్శకానికి, వికీపీడియా: జీవించి ఉన్నవారి జీవిత చరిత్రలు, వికీపీడియా: మౌలిక పరిశోధనలు నిషిద్ధం, వికీపీడియా:నిర్ధారత్వం వంటి కంటెంటు మార్గదర్శకాలకు లోబడి ఉండాలి.

ఇవి కూడా చూడండి

నోట్స్