సమాంతర చతుర్భుజం
ఒక చతుర్భుజం లో రెండు జతల ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటే దానిని సమాంతర చతుర్భుజం అంటారు.
లక్షణాలు
- దీనిలో నాలుగు భుజాలుంటాయి.
- నాలుగు అంతర కోణాల మొత్తము 360 డిగ్రీలు.
- ఎదుటి భుజాలు సమానంగా, సమాంతరముగా ఉంటాయి.
- ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి.
- ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీలు ఉంటుంది.
- దీనికి రెండు కర్ణాలుంటాయి. ఒక కర్ణం సమాంతర చతుర్భుజాన్ని రెండు సర్వ సమాన త్రిభుజాలుగా విభజిస్తుంది.
- కర్ణములు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి.
- సమాంతర చరుర్భుజ నిర్మాణానికి మూడు స్వతంత్ర కొలతలు కావాలి.
- సమాంతర భుజాల మధ్య గల లంబ దూరాన్ని "ఎత్తు" అంటారు.
- దిగువన గల భుజాన్ని "భూమి" అంటారు.
- సమాంతర చతుర్భుజ భూమి, ఎత్తుల లబ్ధం దాని వైశల్యమవుతుంది.
- ప్రతి చతుర్భుజం, ట్రెపీజియాలు సమాంతర చతుర్భుజ లక్షణాలతో ఉండక పోవచ్చు. కాని రాంబస్, చతురస్రం, దీర్ఘచతురస్రం లకు రెండు జతల సమాంతర భుజాలు కలిగియున్నందువల్ల అవి సమాంతర చతుర్భుజ లక్షణాలను సంతరించుకుంటాయి.
వైశాల్యము
- సమాంతర చతుర్భుజ భూమి "b", ఎత్తు "h" అయితే దాని వైశాల్యం భూమి ఎత్తుల లబ్ధానికి సమానము.
- ఒక సమాంతర చతుర్భుజమును ట్రెపీజియంగా తీసుకుంటే దాని సమాంతర భుజాలు a, b అయి, ఎత్తు "h"గా తీసుకుంటే దాని వైశాల్యం సమాంతర భుజాల పొడవుల సగటు, ఎత్తుల లబ్ధానికి సమానమవుతుంది.
ఇవి కూడా చూడండి
- చతుర్భుజం
- బహుభుజి
- సమలంబ చతుర్భుజం
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా