సృష్టివాదం

సృష్టివాదం (Creationism), మానవజాతిని, జీవాన్ని, సమస్త చరాచర జగత్తును, విశ్వాన్నంతటినీ ప్రస్తుతము ఉన్న స్థితిలో దేవుడు సృష్టించాడనే ఒక మత విశ్వాసము. సాధారణంగా ఆ దేవుడు అబ్రాహాం మతాలలో ప్రస్తావించిన దేవునిగా భావిస్తారు.[1]

క్రైస్తవ విశ్వాసాల ప్రకారం ఆదాము సృష్టి

ఈ వాదం శాస్త్రీయంగా నిరూపించలేనిది. ఈ వాదాన్ని డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.మత గ్రంథాలలో సృష్టి గురించి చెప్పిన వివరణకు విరుద్ధంగా ఏదైనా శాస్త్రీయ పరిశోధనా ఫలితాలు వెలువడినప్పుడు, కఠోర సృష్టివాదులు ఆ ఫలితాలను తిరస్కరించటం గానీ, [2] వాటి వెనుక ఉన్న శాస్త్రీయ సిద్ధాంతాలను, [3], /లేదా వాటి నిర్వహణా పద్ధతులను తప్పుపట్టడం కానీ చేస్తుంటారు[4] ఈ కారణాల వల్ల, సృష్టివాద విజ్ఞానాన్ని, ఇంటెలిజెంట్ డిజైన్ సిద్ధాంతాన్ని ప్రధానస్రవంతిలోని శాస్త్రీయ సముదాయం మిథ్యా విజ్ఞానముగా ముద్రవేస్తున్నది.[5]

హిందూ సృష్టివాదం

హిందూ సృష్టివాదం ప్రకారం బ్రాహ్మణులు బ్రహ్మదేవుని నోటి నుంచి పుట్టారు, క్షత్రియులు బ్రహ్మ భుజాల నుంచి పుట్టారు, వైశ్యులు బ్రహ్మ పొట్ట\నడుము భాగం నుంచి పుట్టారు, శూద్రులు బ్రహ్మ పాదాలు నుంచి పుట్టారు.

యూదా క్రైస్తవ ఇస్లాం మతాల సృష్టివాదం

క్రైస్తవ సృష్టివాదం ప్రకారం దేవుడు మొదట ఆదమ్, హవ్వాలను సృష్టించాడు. ప్రపంచంలోని మానవులందరూ వీరి సంతానం.

వివాదాలు

అమెరికాలో కొన్ని క్రైస్తవ సంస్థలు స్కూళ్ళలో మరల సృష్టివాద పాఠాలను బోధించడం ప్రారంభించాలని కోరుతూ కోర్టులో కేసులు వేసి ఓడిపోయాయి. ఇప్పుడు కూడా కొన్ని క్రైస్తవ సంస్థలు ఈ వాదాన్ని ముందుకు తీసుకెల్లడానికి ప్రయత్నిస్తున్నాయి. పాకిస్తాన్ లో చాలా కాలంగా స్కూళ్ళలో సృష్టివాద పాఠాలను బోధిస్తున్నారు. అక్కడ డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం బోధన పైన దాదాపు నిషిధ్ధ పరిస్థితులే ఉన్నాయి. ఇప్పుడు తక్కువ స్థాయిలోనే అక్కడ డార్వినిజాన్ని స్కూల్ పాఠాలలో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మూలాలు