సైబీరియా

సైబీరియా ఉత్తర ఆసియాలో విస్తరించి ఉన్న విస్తృతమైన భౌగోళిక ప్రాంతం. 16 వ శతాబ్దం రెండో సగం నుండి ఇది ఆధునిక రష్యాలో భాగంగా ఉంది.[1]

సైబీరియా
Сибирь
భౌగోళిక ప్రాంతం
        సైబీరియన్ ఫెడరల్ డిస్ట్రిక్ట్         రష్యన్ సైబీరియా భౌగోళిక ప్రాంతం         సైబీరియాలో సింహభాగం ఉత్తర ఆసియా

        సైబీరియన్ ఫెడరల్ డిస్ట్రిక్ట్
        రష్యన్ సైబీరియా భౌగోళిక ప్రాంతం
        సైబీరియాలో సింహభాగం ఉత్తర ఆసియా

Coordinates: 60°0′N 105°0′E / 60.000°N 105.000°E / 60.000; 105.000
దేశంరష్యా
ప్రాంతంఉత్తర ఆసియా
Partsపశ్చిమ సైబీరియా సమతలం
మధ్య సైబీరియా పీఠభూమి
ఇతరాలు...
Area
 • Total1,31,00,000 km2 (51,00,000 sq mi)
Population
 (2017)
 • Total3,37,65,005
 • Density2.6/km2 (6.7/sq mi)
సైబీరియా కోట్ ఆఫ్ ఆర్మ్స్, ఇది 1917 వరకు రష్యన్ ఇంపీరియల్ కోట్ ఆఫ్ ఆర్మ్స్లో భాగం

సైబీరియా భూభాగం ఉరల్ పర్వతాల నుండి పసిఫిక్, ఆర్కిటిక్ పారుదల బేసిన్ల మధ్య వాటర్‌షెడ్ వరకు తూర్పువైపు విస్తరించి ఉంది. యెనిసే నది సైబీరియాను పశ్చిమ, తూర్పు అని రెండు భాగాలుగా విభజిస్తుంది. సైబీరియా ఆర్కిటిక్ మహాసముద్రం నుండి ఉత్తర-మధ్య కజకిస్తాన్ కొండల వరకు, ఇంకా మంగోలియా, చైనా జాతీయ సరిహద్దుల వరకు విస్తరించి ఉంది. రష్యా తూర్పు భాగాన్ని సైబీరియాగా పరిగణించరు. సైబీరియా పక్కన ఉన్న రష్యా యొక్క తూర్పు ప్రాంతాన్ని చారిత్రాత్మకంగా యూరప్, రష్యాలో ఫార్ ఈస్ట్ (దూర ప్రాచ్యం) అని పిలుస్తారు.[2] దూర ప్రాచ్యం యొక్క స్థానిక జనాభా తమను సైబీరియన్లుగా భావించుకోరు.

మూలాలు