సోడియం అసిటేట్

సోడియం అసిటేట్ అనునది ఒక రసాయనిక సమ్మేళన పదార్థం.సోడియం, అసెటిక్ ఆమ్ల చర్య ఫలితంగా ఏర్పడిన సోడియం లవణం.ఈ సోడియం సమ్మేళనాన్ని సోడియం ఈథనోయేట్ అని కూడా అంటారు.ఈ సమ్మేళనం యొక్క ఎంపిరికల్ ఫార్ములా CH3COONa, సక్షింప్తంగా NaOAc.

సోడియం అసిటేట్
Skeletal formula of sodium acetate
Sodium acetate
పేర్లు
IUPAC నామము
Sodium acetate
Systematic IUPAC name
Sodium ethanoate
ఇతర పేర్లు
Hot ice (Sodium acetate trihydrate)
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య[127‑09‑3]
పబ్ కెమ్517045
యూరోపియన్ కమిషన్ సంఖ్య204-823-8
సి.హెచ్.ఇ.బి.ఐCHEBI:32954
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య AJ4300010 (anhydrous)
AJ4580000
ATC codeB05XA08
SMILES[Na+].[O-]C(=O)C
  • InChI=1/C2H4O2.Na/c1-2(3)4;/h1H3,(H,3,4);/q;+1/p-1

ధర్మములు
C2H3NaO2
మోలార్ ద్రవ్యరాశి82.03 g·mol−1
స్వరూపంWhite deliquescent powder
వాసనVinegar
సాంద్రత1.528 g/cm3 (20 °C, anhydrous)
1.45 g/cm3 (20 °C, trihydrate)[1]
ద్రవీభవన స్థానం 324 °C (615 °F; 597 K)
బాష్పీభవన స్థానం 881.4 °C (1,618.5 °F; 1,154.5 K)
నీటిలో ద్రావణీయత
Anhydrous:
119 g/100 mL (0 °C)
123.3 g/100 mL (20 °C)
125.5 g/100 mL (30 °C)
137.2 g/100 mL (60 °C)
162.9 g/100 mL (100 °C)
Trihydrate:
32.9 g/100 mL (-10 °C)
36.2 g/100 mL (0 °C)
46.4 g/100 mL (20 °C)
82 g/100 mL (50 °C)[2]
ద్రావణీయతSoluble in alcohol, hydrazine, SO2[3]
ద్రావణీయత in methanol16 g/100 g (15 °C)
16.55 g/100 g (67.7 °C)[3]
ద్రావణీయత in ethanolTrihydrate:
5.3 g/100 mL
ద్రావణీయత in acetone0.5 g/kg (15 °C)[3]
ఆమ్లత్వం (pKa)24 (20 °C)[3]
4.76 in CH3COOH
Basicity (pKb)9.25
వక్రీభవన గుణకం (nD)1.464
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Monoclinic
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-709.32 kJ/mol (anhydrous)[3]
-1604 kJ/mol (trihydrate)[1]
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
138.1 J/mol·K (anhydrous)
262 J/mol·K (trihydrate)[1]
విశిష్టోష్ణ సామర్థ్యం, C100.83 J/mol·K (anhydrous)
229 J/mol·K (trihydrate)
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలుIrritant
జ్వలన స్థానం{{{value}}}
స్వయం జ్వలన
ఉష్ణోగ్రత
600 °C (1,112 °F; 873 K)
Lethal dose or concentration (LD, LC):
LD50 (median dose)
3530 mg/kg (oral, rat)
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు{{{value}}}
ఇతర కాటయాన్లు
Potassium acetate
Calcium acetate
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

భౌతిక ధర్మాలు

ఇది రంగు లేని ఒక సోడియం సమ్మేళనం. ఈ సమ్మేళనం పలుఉపయోగాలు కలిగిఉన్నది. నీరు, ఆల్కహాల్, హైడ్రోజన్, సల్పర్ డై ఆక్సైడ్‌లలో సోడియం అసిటేట్ కరుగుతుంది.15 °C వద్ద మిథనాల్‌లో 100 గ్రాముల ఆల్కహాల్‌లో 16 గ్రాముల సోడియం అసిటేట్ కరుగుతుంది.అలాగే ఇథనాల్ లో15 °C వద్ద 5.3 గ్రాములు, అసిటోన్‌లో 0.5 గ్రాములు కరుగుతుంది.వినెగర్ వాసన కలిగియున్నది.అణుఫార్ములా:C2H3NaO2.అణుభారం:83.033గ్రాం/మోల్.[5]

రసాయనిక చర్యలు.

బ్రోమోఈథేన్ వంటి ఆల్కైల్ హేలినాయిడులతో సోడియం అసిటేట్‌ను చర్య చెందించి ఎస్టరులను ఏర్పరచ వచ్చును. ఈ చర్యను వేగవంతం చెయ్యుటకుసీసియం లవణాలను ఉత్పేరకాలుగా ఉపయోగిస్తారు.

CH3COONa + BrCH2CH3 → CH3COOCH2CH3 + NaBr

ఉత్పత్తి

పారిశ్రామికంగా గ్లాసియల్ అసిటిక్ ఆమ్లం, సోడియం హైడ్రోక్సైడ్‌లనుండి సోడియం అసిటేట్‌ను ఉత్పత్తి చెయ్యుదురు .

CH3COOH + NaOH → CH3COONa + H2O

వినియోగం

పరిశ్రమలలో
సోడియం అసిటేట్‌ను జౌళి /వస్త్ర పరిశ్రమలలో, ఉత్పత్తిఅగు వ్యర్ధనీటిలోని సల్ఫ్యురిక్ ఆమ్లాన్ని తటస్థికరించుటకు ఉపయోగిస్తారు.అనిలిన్ రంగులను ఉపయోగించునప్పుడు ప్రకాశంనిరోధించు కారకంగా ఉపయోగిస్తారు. అలాగే ఉరగాయలు, చెడి పోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచుటకై తయారీలోఉపయోగిస్తారు. తోళ్ళను పదును చెయ్యుటలో కూడా ఉపయోగిస్తారు. క్లోరో ప్రేన్, సింతేటిక్ రాబ్బరులను వల్కనైజింగు చెయ్యుటకు వినియోగిస్తారు. డిస్పోజల్ కాటన్ ప్యాడ్ ఉపయోగించు కాటన్ ప్రాసెస్^లో ఉపయోగిస్తారు. స్థిర విద్యుతు ఏర్పడకుండా చెయ్యుటకు ఉపయోగిస్తారు.[6]
కాంక్రీట్ నిర్మాణంలలో
కాంక్రిట్ నిర్మాణాలలో కాంక్రీట్ రంధ్రాలనుండి నీరు బయటకు లేదా లోపలి చొచ్చుకొని పోకుండా కాంక్రీటు లేపనంగా నిరోధిస్తుంది.
ఆహార పదార్థాలలో
ఆహార పదార్థాలలో మసాలా రూపంలో వాడెదరు. కొన్నిసందర్భాలలో సోడియం ది అసిటేట్ గా (1:1 నిష్పత్తిలో సోడియం అసిటేట్, అసిటిక్ ఆమ్లాలను మిశ్రమం చేసి ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. పొటాటో చిప్స్‌కు ఉప్పు, వెనిగర్ రుచిరావటానికి ఉపయోగిస్తారు.[7]
బఫర్ ద్రావనాలలో
ద్రవాల pH ని స్థిరంగా ఉంచుటకై సోడియం అసిటేట్, అసిటిక్ ఆమ్లాల మిశ్రమాన్ని బఫ్ఫర్ ద్రావణంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా జీవరసాయనాల వినియోగ సమయంలో ఉపయోగిస్తారు .
హిటింగు ప్యాడ్
సోడియం అసిటేట్ ని హిటింగ్ ప్యాడ్‌లలో, చేతులను వెచ్చగా ఉంచు పరికరాలలో, హాట్ అయిస్‌లో ఉపయోగిస్తారు.[8]

మూలాలు